Homeజాతీయంఎన్నికల నగారా మ్రోగనున్న వేళ...కన్నడ నాట రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి!!!

ఎన్నికల నగారా మ్రోగనున్న వేళ…కన్నడ నాట రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి!!!

హిజాబ్ తర్వాత హలాల్ .. కర్ణాటకలో వరుస వివాదాలు తలెత్తుతున్నాయి. దీనిపై కన్నడ సర్కార్ హిందూత్వ రాజకీయాలు చేస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీంతో ఈ రచ్చ ఎక్కడివరకు వెళుతుందోనన్న ఆసక్తి చర్చనీయాంశంగా మారింది.

కర్నాటకలో మరో వివాదం రాజుకుంటోంది. కన్నడ కొత్త సంవత్సరమైన ఉగాదినాడు హలాల్ మాంసం తినొద్దని ప్రజలను హిందూ సంస్థలు అభ్యర్థిస్తున్నాయి. వారం రోజుల క్రితం వరకు కర్నాటకలో హిజాబ్ వివాదం పతాక శీర్షికల్లో నిలిచింది. ఆ తర్వాత దేవాలయాల వెలుపల వ్యాపారాలు నిర్వహించే ముస్లింలపైనా నిషేధం విధించాలనే డిమాండ్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ముస్లింలు విక్రయించే హలాల్ మాంసంపై వివాదం రాజుకుంది. దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో కొత్త సంవత్సరంనాడు మాంసంతో వేడుక చేసుకునే సంప్రదాయం ఉంది.

దీన్ని హోసాతొడకు లేదా వర్షదా తొడకు అని పిలుస్తుంటారు. కొత్త సంవత్సరం ప్రారంభం అని దీని అర్థం. కొత్త సంవత్సరంనాడు హలాల్ మాంసం తినొద్దని మేం హిందువులను అభ్యర్థిస్తున్నామని హిందూ జన జాగృతి సమితి ప్రచారం చేస్తోంది. హలాల్ మాంసాన్ని ఇస్లామిక్ పద్ధతులను అనుసరించి సిద్ధం చేస్తారని, అల్లా పేరును జపిస్తూ వారు జంతువులను బలి ఇస్తారు. ఆ సమయంలో ఖురాన్‌ కూడా పఠిస్తారు. అంటే ఆ మాంసాన్ని వారు అల్లాకు సమర్పిస్తున్నారు.

దాన్ని హిందూ దేవతలకు పెట్టకూడదు. అలా చేయడం హిందూ ధర్మానికి వ్యతిరేకమని చెబుతోంది. జన జాగృతి సమితి డిమాండ్ తర్వాత కొన్ని సంఘ్పరివార్ సంస్థలు ఈ విషయంపై కరపత్రాలు కూడా పంచుతున్నాయి. తమ షాపుల్లో హలాల్ మాంసం పేరుతో పెట్టిన బోర్డులను తొలగించాలని హిందూ దుకాణాల యజమానులను వారు కోరుతున్నారు. మొదట జంతువుల మెడ దగ్గర నరాన్ని కోసి రక్తం బయటకు వచ్చేలా చూస్తారు. ఆ రక్తం జంతువు శరీరంలోనే ఉండిపోతే, దాన్ని తినడంతో మనకు జబ్బులు వస్తాయని, రక్తం మొత్తం బయటకు వెళ్లిపోతే, ఆ మాంసాన్ని తిన్న తర్వాత మనకు ఏమీ కాదు. ఈ పద్ధతిని జబీహా అని పిలుస్తారు.

అయితే తమ ప్రచారం ముస్లింలపై కాదు.. కేవలం హలాల్ పైనే. హలాల్ అనేది రాజ్యాంగ వ్యతిరేకమని హిందూ జన జాగృతి సమితి పేర్కొంది. అయితే హలాల్ మాంసం చాలా సురక్షితమైనది. మిగతా విధానాల కంటే ఇది మంచిది. మనం ఈ విధానాన్ని సరిగా అర్థం చేసుకోవడం లేదు. ఇలా మాంసాన్ని కోస్తే, ఆహారపు సంబంధిత వ్యాధులు వచ్చే ముప్పు తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

హలాల్‌పై హిందూ సంస్థల ప్రచారం మొదలవ్వడంతోనే ఆలయాల దగ్గర ముస్లిం దుకాణాలను కూడా మూసివేయాలనే ప్రచారం ఊపందుకుంది. మరోవైపు బీజేపీలోనే కొంత మంది నాయకులు ఇలాంటి ప్రచారాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇది ఒకరకమైన సామాజిక సమస్యలా మారుతోంది. ఇదొక అమానవీయ చర్య. ఇలాంటి వాటిని అసలు ప్రోత్సహించకూడదని వీరంతా అంటున్నారు. ఇదిలా ఉంటే, మతపరంగా ఎలాంటి వివక్షా చూపకూడదని ఇదివరకు సుప్రీం కోర్టు కూడా నొక్కి చెప్పిందని పీయూసీఎల్ కర్నాటక విభాగం అధిపతి అరవింద్ నారాయన్ చెబుతున్నారు.

హలాల్ మాంసంపైనా వివాదం తలెత్తుతోంది.

రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై కొన్ని సంస్థల చేతులో కీలుబొమ్మగా మారారని మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నాయకుడు హెచ్‌డీ కుమారస్వామి వ్యాఖ్యానించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో తీసుకొచ్చిన విధానాలే కర్నాటకలోనూ వారు అమలు చేయాలని చూస్తున్నారు. అలాంటివి ఇక్కడ పనిచేయవని ఆయన అన్నారు.హలాల్ మాంసానికి వ్యతిరేకంగా వారు ప్రచారం చేపట్టాలని అనుకుంటే, మొదట మాంసం ఎగుమతులను నిలిపివేయాలి. 2015లో మోదీ పింక్ విప్లవం గురించి మాట్లాడారు. ఆ తర్వాత దేశంలో మాంసం ఎగుమతులు రెట్టింపయ్యాయి. ఆగ్రా, ఘాజియాబాద్‌ల నుంచి మాంసం ఎగుమతులు జరగకుండా అడ్డుకోవాలని బీజేపీకి కాంగ్రెస్ నేతలు సవాల్ విసిరారు.

2019-20లో భారత్ నుంచి హలాల్ మాంసం ఎగుమతులు 14.4 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఈ ఎగుమతుల్లో బ్రెజిల్ తర్వాత స్థానం భారత్‌దే. ఇదిలా ఉంటే, హలాల్ మాంసంపై నిషేధానికి సంబంధించి ప్రైవేట్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు రవికుమార్ సన్నాహాలు చేస్తున్నట్లు చెప్తున్నారు. ఈ మేరకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌కు లేఖ రాసినట్లు సమాచారం. అయితే, ఇప్పుడు దీనినే సభలో బిల్లుగా సమర్పించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం, ముఖ్యమంత్రి బస్వరాజ్‌ బొమ్మైతోపాటు బీజేపీ ఎమ్మెల్యేలు అంతా దీనికి అంగీకారం తెలిపారు. హిజాబ్ నిషేధానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కి ఉంది. ఇప్పుడు హలాల్ మాంసం నిషేధం అంశం ప్రతిపక్షాలకు తలనొప్పిగా తయారైంది.

వచ్చే ఏడాది మేలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో హిందుత్వ కార్డును ఉపయోగించి లాభపడాలని బీజేపీ యోచిస్తోంది. హలాల్ మాంసానికి సంబంధించిన ప్రైవేట్‌ బిల్లును ఆమోదించవద్దని అసెంబ్లీ స్పీకర్‌ను కలిసి అభ్యర్థిస్తామని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత బీకే హరిప్రసాద్‌ చెప్పారు. ఈ బిల్లును అసెంబ్లీలో అడ్డుకుంటామని ఆయన తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గెలిచేందుకు కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం హలాల్‌ మాంసాన్ని తురుపుముక్కగా ఎంచుకుంది. హలాల్‌ మాంసాన్ని అడ్డం పెట్టుకుని హిందువుల ఓట్లు రాబట్టేందుకు కుట్రపన్నింది. హలాల్‌ మాంసంపై నిషేధం విధించే దిశగా పావులు కదుపుతోంది. ఈ మేరకు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టేందుకు బస్వరాజ్‌ బొమ్మై ప్రభుత్వం సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో హిందుత్వ కార్డును మరోసారి ప్రయోగించి ఓట్లు రాబట్టాలని బీజేపీ చూస్తున్నదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

హలాల్ మాంసాన్ని నిషేధించే బిల్లును తీసుకొచ్చేందుకు కర్ణాటకలోని బీజేపీ సర్కార్ సిద్ధమైంది. మాంసం దుకాణాల ముందు హలాల్ బోర్డులను తీసేయాలని కొన్ని వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే హిజాబ్ అంశం ప్రకంపనలు సృష్టిస్తుండగా.. ఈ అంశం మరో వివాదానికి కారణమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. 6 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండగా.. ఈ బిల్లును కావాలనే తీసుకొస్తున్నారని, కచ్చితంగా అడ్డుకుంటామని కాంగ్రెస్ చెబుతోంది. కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా ఇంకా ప్రకంపనలు సృష్టిస్తుండగానే.. ఆ రాష్ట్రంలో మరో వివాదాస్పద అంశం తెరపైకి వచ్చింది. కర్ణాటకలో డిసెంబర్ 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.

ఈ సమావేశాల్లో హలాల్ ను నిషేధించే బిల్లును ప్రవేశపెట్టేందుకు బసవరాజ్ బొమ్మై ప్రభుత్వం సిద్ధమైంది. దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు హిందుత్వ కార్డును ప్రయోగిస్తోందని ఆరోపిస్తున్నాయి. దేశంలో FSSAI ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కాకుండా మరే ఇతర సంస్థకు ఫుడ్ సర్టిఫికేషన్ ఇచ్చేందుకు హక్కు లేకుండా చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే ఎన్. రవికుమార్ డిమాండ్ చేశారు. ఎఫ్‌ఎస్ఎస్ఏఐకి లేఖ కూడా రాశారు.

హలాల్ అంశంపై అసెంబ్లీలో ఆయనే ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. హిజాబ్ నిషేధం, తదనంతర పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఇప్పటికే వేడిగా ఉంది. ఇప్పుడు హలాల్ రూపంలో మరో అంశం తెరపైకి వచ్చింది. బీజేపీ చేస్తున్న ఈ డిమాండ్ వచ్చే ఏడాది మేలో కర్నాటకలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలతో ముడిపడి ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసమే బీజేపీ సర్కార్ .. కావాలనే హిజాబ్, హలాల్ అంశాలపై రచ్చ చేస్తోందని విపక్షాలు మండిపడుతున్నాయి. దీంతో ఇప్పటికే హిజాబ్ వివాదంతో రణరంగంగా మారిన కన్నడ నాట .. హలాల్ ఇంకెంత రచ్చ చేస్తుందన్నదే చర్చనీయాంశమవుతోంది. ఇదీ ఇవాల్టి ఫోకస్.. రేపటి ఫోకస్ లో మళ్లీ కలుద్దాం..

Must Read

spot_img