Homeసినిమాగాసిప్స్ఇంగ్లీష్ లో 'కాంతార' మూవీ

ఇంగ్లీష్ లో ‘కాంతార’ మూవీ



కన్నడంలో 20 కోట్ల లోపు బడ్జెట్ తో రూపొందిన కాంతార సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కన్నడం లో విడుదల అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో హిందీ.. తమిళం మరియు తెలుగు లో కూడా డబ్ చేసి విడుదల చేయడం జరిగింది.విడుదల అయిన ప్రతి చోట కూడా భారీగా కలెక్షన్స్ నమోదు అయ్యాయి. ఇప్పుడు హాలీవుడ్ ప్రేక్షకులను పలకరించబోతుంది.

ప్రపంచ వ్యాప్తంగా కాంతార సినిమా దాదాపు 400 కోట్ల రూపాయలు రాబట్టింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ ద్వారా సౌత్ ఇండియన్ ప్రేక్షకులకు అందుబాటులో ఉన్న కాంతార సినిమాను త్వరలో హిందీలో కూడా స్ట్రీమింగ్ చేయబోతున్నారు. హిందీ వర్షన్ ను అమెజాన్ లో కాకుండా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అందుకు సంబంధించిన వార్తలు వస్తున్నాయి.

ఇదే సమయంలో కాంతార సినిమాను ఇంగ్లీష్ లో కూడా స్ట్రీమింగ్ చేసేందుకు నెట్ ఫ్లిక్స్ వారు రైట్స్ ను కొనుగోలు చేశారు అనే వార్తలు వస్తున్నాయి. జనవరి నుండి ఇంగ్లీష్ వర్షన్ లో కాంతార సినిమా ను అందుబాటులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

హిందీలో స్ట్రీమింగ్ ఎప్పుడెప్పుడు అవుతుందా అంటూ నార్త్ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కాంతార సినిమా ను హాలీవుడ్ ప్రేక్షకులు చూస్తారా అనేది అనుమానంగా ఉంది.

ఇండియన్ సినిమాలు ఇంగ్లీష్ లో డబ్ అవ్వడం చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది. యూనివర్శిల్ సబ్జెక్ట్ అవ్వడం వల్ల కాంతార సినిమా అన్ని భాషల్లో విడుదల అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కనుక ఇంగ్లీష్ లో కూడా తప్పకుండా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం ను రిషబ్ శెట్టి టీమ్ వ్యక్తం చేస్తున్నారు.

Must Read

spot_img