Homeసినిమాఆస్కార్ కోసం కన్నడ సూపర్ హిట్ మూవీ కాంతార కూడా ప్రయత్నాలు మొదలుపెట్టిందా…?

ఆస్కార్ కోసం కన్నడ సూపర్ హిట్ మూవీ కాంతార కూడా ప్రయత్నాలు మొదలుపెట్టిందా…?

ప్రస్తతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుంది. సౌత్ సినిమాలు హాలీవుడ్ రేంజ్ కు వెళ్తున్నాయి. ఈక్రమంలోనే ఆస్కార్ రేసులో కూడా సత్తా చాటాలనిచూస్తున్నాయి. రీసెంట్ గా ఆస్కార్ కోసం కన్నడ సూపర్ హిట్ మూవీ కాంతార కూడా ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీంతో పాటు ఇంకో అప్డేట్ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతుంది.

కన్నడంలో రూపొందిన చిన్న బడ్జెట్ చిత్రం కాంతార. ఈ ఏడాది మేటి చిత్రాల జాబితాలో నిలిచింది. భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమాలు కూడా వంద కోట్లు వసూళ్లు రాబట్టేందుకు కిందామీదా పడుతున్నాయి. ఇలాంటి ఈ సమయంలో కాంతార సినిమా కనీసం పాతిక కోట్లు కూడా ఖర్చు కాకుండా రూపొంది ఏకంగా నాలుగు వందల కోట్ల వసూళ్లు సాధించింది. కాంతార సినిమా లోని కాన్సెప్ట్ యూనివర్శిల్ అన్నట్లుగా ప్రేక్షకులను మెప్పించింది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా కాంతార సినిమా ను దర్శకుడు రిషబ్ శెట్టి రూపొందించాడు.

రిషబ్ శెట్టి నటుడిగా కూడా మంచి పేరును సొంతం చేసుకున్నాడు. కేజీఎఫ్ సిరీస్ ను నిర్మించిన హంబులే వారు ఈ సినిమాను నిర్మించారు. ఇటివల కన్నడ మీడియాలో కాంతార సినిమా యొక్క సీక్వెల్ గురించి ప్రచారం జరుగుతోంది. కాంతార సినిమా ముగిసిన తీరు చూస్తూ ఉంటే సీక్వెల్ కు ఛాన్స్ ఉందని అంతా భావిస్తున్నారు. తాజాగా మేకర్స్ నుండి కాంతార సినిమా యొక్క సీక్వెల్ కు కన్ఫర్మేషన్ దక్కింది.

కాంతార సినిమా ను ఆస్కార్ తో పాటు పలు అవార్డుల వేడుకలకు పంపించామని.. నామినేషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారని.. ఆ హడావుడి ముగిసిన తర్వాత కాంతార సినిమా యొక్క సీక్వెల్ ను మొదలు పెట్టబోతున్నట్లుగా మేకర్స్ పేర్కొన్నారు. రిషబ్ శెట్టి కాంతార తర్వాత హాలీడే లో ఉన్నాడు. త్వరలోనే ఆయన వెనక్కి వచ్చి స్క్రిప్ట్ వర్క్ మొదలు పెడతాడని మేకర్స్ చెబుతున్నారు.

Must Read

spot_img