ఈమధ్యనే బిస్ట్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న విజయ్… ప్రస్తుతం వారసుడు సినిమా చేస్తున్నాడు. ఒకప్పుడు హీరోగా మంచి పేరు తెచ్చుకున్న అర్జున్ సర్జా ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అక్కడక్కడా కొన్ని సినిమాలలో కనిపిస్తున్నారు. ఇప్పుడు అర్జున్ కు ఈ హీరో సినిమాలో విలన్ గా చేసే అవకాశం వచ్చింది.
కోలీవుడ్ హీరో విజయ్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారసుడు మూవీ చేస్తున్నాడు. దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన పోస్టర్‌లు సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేశాయి.
ఈ సినిమా తర్వాత విజయ్, లోకేష్ కనగరాజ్‌తో సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
విక్రమ్ తర్వాత లోకేష్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా ఈ సినిమా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతుందడటంతో ఈ సినిమాపై మరింత క్రేజ్ ఏర్పడింది. దాంతో లోకేష్ ఈ ప్రాజెక్ట్‌లో అగ్ర నటీనటులను ఎంపిక చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఓ కీలక పాత్ర కోసం హీరో అర్జున్‌ను సంప్రదించినట్లు తెలుస్తుంది.
ఇక అర్జున్ కూడా వెంటనే ఓకే చేశాడని టాక్. ఈయనతో పాటుగా లీడర్ ఫేం ప్రియా అనంద్‌ను కూడా ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.రోజు రోజుకు ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకులలో అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ సినిమా ముంబై బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుందట. బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నాడని టాక్. విక్రమ్‌తో విధ్వంసం సృష్టించిన లోకేష్ కనగరాజు..
ఈ చిత్రంతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో అని ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా త్రిష నటిస్తుంది.