Homeసినిమాక్రేజీ ప్రాజెక్టుల తో లైన్లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్..!

క్రేజీ ప్రాజెక్టుల తో లైన్లో ఉన్న జూనియర్ ఎన్టీఆర్..!

ఆర్ఆర్ఆర్ సక్సెస్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. అయితే తాజాగా ఈ మూవీపై ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ వినపడుతోంది. ఆ వివరాలు మీకోసం..

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందబోతున్నాడు. కేజీఎఫ్ 2 కు ముందు వరకు ఈ సినిమాపై ఓ అంచనాలు ఉన్నాయి. కాని కేజీఎఫ్ 2 విడుదల అయ్యి వెయ్యి కోట్లకు పైగా నే వసూళ్లు చేసిన తర్వాత ఎన్టీఆర్‌ 31 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఎన్టీఆర్ 31 కి ప్రశాంత్ నీల్ దర్శకుడు అంటూ ఎప్పుడో క్లారిటీ వచ్చింది. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సినిమా టీం పోస్టర్ రిలీజ్ చేసింది.

ఇప్పుడు ఈ సినిమా మల్టీస్టారర్ అని టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో ఓ సీనియర్ హీరోకి సెట్ అయ్యే క్యారెక్టర్ ఉందని టాక్ వినిపిస్తోంది. ఆ పాత్రలో ఓ బాలీవుడ్ స్టార్ ను నటింపజేయాలని, ముఖ్యంగా అమీర్ ఖాన్ లాంటి నటుడు అయితే, ఆ పాత్రకు పూర్తి న్యాయం జరుగుతుందని ప్రశాంత్ నీల్ ఫీల్ అవుతున్నాడు.

ఆ దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించేందుకు నీల్ ప్లాన్ చేస్తున్నాడని సమాచారం.అందుకే ఈ సినిమా పై తారక్ ఫాన్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ సినిమా పై ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది.

మరోవైపు ఈ సినిమా కోసం హీరోయిన్ వేట కూడా కొనసాగుతోంది. ఇంతవరకు హీరోయిన్ ఎవరన్న విషయం ఇంకా క్లారిటీ రాలేదు. ఎన్టీఆర్ మరోవైపు కొరటాలతో కూడా ఓ సినిమా తీస్తున్నాడు. దీనికి సంబంధించిన ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి ఫారిన ట్రిప్‌కు వెళ్లాడు. అక్కడ కొన్నాళ్ల పాటు ఎంజాయ్ చేసి తిరిగొచ్చాక… తన ఫ్యూచర్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టనున్నాడు. ఇక ఎన్టీఆర్ కొత్త సినిమాలన్నీ వచ్చే ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ఇది చూడండి :- ఆర్ఆర్ఆర్ సినిమా కు సీక్వెల్..రాజమౌళి హింట్..!

Must Read

spot_img