ఆ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ ఎమ్మెల్యేతో డీ అంటే డీ అంటున్నారట. నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా ఎమ్మెల్యే కంటే ముందే వెళ్ళి ప్రారంభోత్సవాలు కానిచ్చేస్తున్నారట. ఒకవేళ ఎమ్మెల్యే ముందే వెళితే, ఆ కార్యక్రమానికే డుమ్మా కొడుతున్నారట.. ఇంతకీ ఎవరా .. జెడ్పీ ఛైర్ పర్సన్.. ఏమా కథ ..
జోగులాంబ గద్వాల జిల్లా టీఆర్ఎస్ లో వర్గ పోరు పీక్ స్థాయికి చేరింది. స్థానిక ఎమ్మెల్యేతో .. జెడ్పీ ఛైర్ పర్సన్ వివాదాస్పద తీరు .. హాట్ టాపిక్ గా మారింది. అధికార పార్టీకి చెందిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి, జడ్పీ చైర్ పర్సన్ సరిత కు మధ్య చాలా కాలంగా కోల్డ్ వార్ కొనసాగుతుంది. జడ్పీ చైర్ పర్సన్ సరితా, ఆమె భర్త తిరుపతయ్య .. ఇద్దరూ మంత్రి నిరంజన్ రెడ్డీ అండదండలతో జిల్లాలో ఆధిపత్యం ప్రదర్శించాలని చూస్తున్నారట. ఇందులో బాగంగానే ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్నారన్న టాక్ గద్వాల జిల్లాలో వెల్లువెత్తుతోంది.
కొద్దిగా ఆలస్యంగా వచ్చిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అదికారులపై కొంత ఆగ్రహానికి లోను కావల్సి వచ్చింది. జోగులాంబ గద్వాల జిల్లాలో జడ్పీ చైర్ పర్సన్ సరిత.. మంత్రి అండదండలతో ఒంటెద్దు పోకడ పోతుందన్న టాక్ నడుస్తుంది. ఎన్నో ఏళ్ళుగా ఆమె గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో డీ అంటే ఢీ అన్నట్టు వ్యవహిరిస్తున్నారట.
గద్వాల నియోజకవర్గంలో ఏ అదికారిక కార్యక్రమం జరిగినా. ప్రోటోకాల్ రగడ జరగడం ఖామన్న భావనతో అదికారులు తలలు పట్టుకుంటున్నారట. ఏదైనా కార్యక్రమం జరిగిందటే చాలు జడ్పీ చైర్ పర్సన్ ఎమ్మెల్యే కంటే ముందుగానే వెళ్ళి రిబ్బెన్ కటింగ్ చేసి వెల్లిపోతున్నారట. దీంతో వెనకాల వచ్చిన ఎమ్మెల్యే అదికారులపై ఆగ్రహం వ్యక్తం చెయ్యడం ఎమ్మెల్యే వంతౌతుందట.
దీంతో గద్వాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్ జడ్పీ చైర్ పర్సన్ అన్నట్టు పరిస్థితులు మారాయి. వీరిద్దరి రచ్చతో సెగ్మెంట్లో వర్గపోరు .. పీక్ స్టేజ్ లో ఉందన్న టాక్ చర్చనీయాంశంగా మారింది. జెడ్పీ ఛైర్ పర్సన్ .. ఏకంగా ఎమ్మెల్యేకే చుక్కలు చూపిస్తుండడంతో సెగ్మెంట్లో రాజకీయాలపై సర్వత్రా ఆసక్తి వెల్లువెత్తుతోంది.
గద్వాల ఎమ్మెల్యేను మాత్రమే టార్గెట్ చేస్తున్నారట. ఇందుకు కారణం ఆమె గద్వాల టిక్కెట్టు ఆశించిడమేనని తెలుస్తోంది.
ఐతే మొదట్లో అలంపూర్ , గద్వాల ఎమ్మెల్యేలను టార్గెట్ చేసిన జడ్పీ చైర్ పర్సన్ సరిత దంపతులు… ఇప్పుడు గద్వాల ఎమ్మెల్యేను మాత్రమే టార్గెట్ చేస్తున్నారట. ఇందుకు కారణం ఆమె గద్వాల టిక్కెట్టు ఆశించిడమేనని తెలుస్తోంది. ఇక్కడి నుంచి పోటీ చెయ్యాలని భావిస్తున్న సరిత .. ఎమ్మెల్యే అనుచరగణాన్ని తనవైపు లాగేసుకునే కార్యక్రమంలో బీజీగా ఉన్నారట.
ఇటీవల కొంత మంది కౌన్సిలర్లను, ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితులను పర్సనల్ గా కలవాలని ఆహ్వానిస్తున్నారట. దీంతో వెళ్ళాలా వద్దా అనేది తేల్చుకోలేక ఆ నేతలు తలలు పట్టుకుంటున్నారట. ఇదిలా ఉండగానే సరితా తిరుపయ్యల వర్గం .. వచ్చే ఎన్నికల్లో గద్వాల టికెట్టు సరితకేనని విస్త్రుతంగా ప్రచారం చేస్తున్నారట. మంత్రి నిరంజన్ రెడ్డి అండదండలు ఉండటంతో, జడ్పీ చైర్ పర్సన్ దంపతుల చర్యలను ఏవిధంగా ఎదుర్కోవాలో అన్నదానిపై ఎమ్మెల్యే వర్గం సమాలోచనలో పడ్డారట.
తొలుత అటు అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం, ఇటు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డీలను ఇరకాటంలో పెట్టడమే టార్గెట్ గా పెట్టుకున్నట్టు టాక్
వినిపించింది. అందులో భాగంగా అలంపూర్, గద్వాల నియోజకవర్గంలో జరిగే అధికారిక కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కొంచెం ఆలస్యమైనా జడ్పీ చైర్పర్సన్ సరిత వారి కోసం క్షణమైన వేచి చూడకుండా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసేసి, వెల్లిపొతున్నారు.
ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా సందర్భాల్లో ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయి. రెండేళ్ళ క్రితం అలంపూర్ నియోజకవర్గంలోని మానవపాడు స్మశాన వాటిక ప్రారంబోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీ చైర్ పర్సన్ సరిత ఎమ్మెల్యే అభ్రహం రాకముందే ప్రారంబోత్సవం చేసి వెళ్ళారు. తర్వాత వచ్చిన
ఎమ్మెల్యే మరో మారు ప్రారంభోత్సవం చేసుకోవాల్సి వచ్చింది.
అయితే .. ఇప్పుడు గద్వాల నుంచి బరిలోకి దిగాలని నిర్ణయించుకోవడంతో, స్థానిక ఎమ్మెల్యే బండ్లకు చెక్ పెట్టాలనే వ్యూహంలో జెడ్పీ ఛైర్ పర్సన్ ఉన్నారన్న టాక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అదేసమయంలో .. ఈ దఫా సిట్టింగులకే టిక్కెట్ అని కేసీఆర్ ప్రకటించినా, వీరిద్దరూ మాత్రం తమ ప్రయత్నాలను ఆపడం లేదు. మంత్రి నిరంజన్ రెడ్డి ద్వారా టిక్కెట్ తెచ్చుకునే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. అదేసమయంలో కేసీఆర్ సిట్టింగులకే టిక్కెట్లని ప్రకటించినా, వీరి దూకుడు తగ్గకపోవడం సెగ్మెంట్లో హాట్ టాపిక్ గా మారింది.
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సరిత మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో అంతర్గత వైరం
అంతేగాక ఒకవేళ కారుపార్టీలో టిక్కెట్ దక్కకపోతే, కాంగ్రెస్ నుంచి అయినా బరిలోకి దిగాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దీంతో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సరిత మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో అంతర్గత వైరం సాగుతోంది. జడ్పీ చైర్ పర్సన్ ఎన్నిక సందర్భంగా ప్రారంభమైన వైరం, జడ్పీ సీఈఓల బదిలీలతో తారాస్థాయికి చేరింది.
ఇందులో జడ్పీ చైర్ పర్సన్ సరితకు మంత్రి నిరంజన్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం అండదండలు ఉండటంతో, ఆమె గద్వాల ఎమ్మెల్యేతో సై అంటే సై అన్నట్టు దూసుకుపోతున్నారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అలంపూర్ నియోజకవర్గం, మానవపాడు మండలం జడ్పిటిసిగా ఎన్నికయ్యారు సరిత. అయితే, హైకమాండ్ నుంచి తనకు ఎలాంటి సమాచారం లేకుండా మంత్రి నిరంజన్ రెడ్డి అండదండలతో, సరితకు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి వరించిందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నారు.
అదే ఇరువురి నడుమ వైరానికి కారణమైంది. ఎలాగైనా తన వర్గీయులనే జడ్డీ పీఠంపై కూర్చోబెట్టాలని చివరి వరకూ ప్రయత్నించినా ఫలించలేదని, దీంతో సరితపై బండ్ల వ్యవహారశైలి .. ఈ రచ్చకు ఆద్యం పోసింది. గద్వాల ప్రాంతంలో డి.ఆర్.డి.ఏపి.డిగా పనిచేస్తున్న జ్యోతిని జడ్పీ సీఈఓగా నియమించాలని ఎమ్మెల్యే విశ్వప్రయత్నాలు చేశారు.
కానీ ఇది కూడా నెరవేరలేదు. దీంతో రగిలిపోయిన బండ్ల, ఇందుకు నిరసనగా, గన్‌మెన్లను గవర్నమెంట్‌కు సరెండర్ చేసి సంచలనం రేపారు. ఈ పరిణామాల తర్వాత ఎమ్మెల్యే మద్దతు తెలిపిన జ్యోతినే జడ్పీ సీఈఓగా నియమిస్తున్నట్టు రాత్రికి రాత్రే ఉత్తర్వులు వెలువడ్డాయి. నాటి నుంచి నేటి వరకు ఇద్దరి మధ్య వైరం అంతకంతకూ పెరుగుతూనే వుంది. తాజాగా పరిణామాలు ఇద్దరి మధ్య విభేదాల ఏ స్థాయిలో ఉందనే విషయాన్ని మరోసారి తేటతెల్లం చేశాయనే చర్చ జరుగుతోంది.
ఇప్పటికే ముందస్తు టాక్ వెల్లువెత్తుతున్న వేళ .. నియోజకవర్గంలో .. వీరిద్దరి రచ్చ .. పార్టీకి కష్టకాలాన్ని తీసుకురానుందని కేడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. అయితే ఈ వర్గపోరుపై గులాబీ బాస్ ఏం చేస్తారోనన్న చర్చ కూడా వెల్లువెత్తుతోంది.
కేసీఆర్ చెప్పినట్లు బండ్లకే టిక్కెట్ ఇస్తే, సరిత కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగే అవకాశం ఉందని, ప్రస్తుతం సెగ్మెంట్ లో బలం పెంచుకున్న సరిత .. పోటీకి దిగితే, టగ్ ఆఫ్ వార్ తప్పదని అంచనాలు వినిపిస్తున్నాయి. తాజా పరిణామాలతో నడిగడ్డ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. దీంతో సెగ్మెంట్లో ఏం జరుగుతుందోనన్న చర్చ స్థానికంగా వెల్లువెత్తుతోంది.
మరి హైకమాండ్ ఏవిధంగా వర్గపోరుకు చెక్ పెడుతుందన్నదే ఆసక్తికరంగా మారింది.