Homeఅంతర్జాతీయంఉక్రెయిన్‌లో అమెరికా అధ్యక్షుడి ఆకస్మిక పర్యటన..

ఉక్రెయిన్‌లో అమెరికా అధ్యక్షుడి ఆకస్మిక పర్యటన..

అమెరికా అధ్యక్షుడు ఉక్రెయిన్ ను సందర్శించి జెలెన్ స్కీని ఆశ్చర్యంలో ముంచెత్తారు. అంతకన్నా ముందు ఆయనో సీక్రెట్ జర్నీ కూడా చేసారు. అది మాత్రం అచ్చం హలివుడ్ సినిమాను తలపించేలా జరిగింది. ఫోన్లు కూడా పనిచేయని మార్గంలో పది గంటలపాటు రైలులో బైడెన్ రహస్య ప్రయాణం చేసారు. అయితే నేటి 21వ శతాబ్దకాలంలో ఓ విషయాన్ని ఇంత సీక్రెట్ గా ఎలా ఉంచారు..?

ఉక్రెయిన్‌లో బైడెన్ రహస్య ప్రయాణం అందుకేనా ?

ఫోన్లు కూడా లేకుండా 10 గంటల పాటు రైలులో రహస్య ప్రయాణం చేసారు పెద్దాయన జో బైడెన్..అఫ్ కోర్స్ ఆయన ఉక్రెయిన్ పర్యటన ఆద్యంతమూ ఆయన వయసును తెలియనీయకుండా మేకప్ చేసారు. అచ్చం జేమ్స్ బాండ్ లాగా నల్ల కల్లద్దాలు సూటు బూటుతో అడ్వంచర్ చేసారు జో బైడెన్. చాలా యంగ్ గా కనిపిస్తూ ఉక్రెయిన్ అధ్యక్షుడిని కలుసుకుని ఫోటో షూట్ లోనూ పాల్గొన్నారు. పోలాండ్ నుంచి కీయెవ్‌కు వెళ్లడం కోసం సదరు రైలుకు 10 గంటలు పట్టింది. నిజానికి ఇది ఒక సంచలన పర్యటన. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ఒకరు ఇలాంటి పర్యటన చేస్తారని దాదాపు ఎవరూ విని ఉండరు. ఇలా రైలు ప్రయాణాలు చేయడంలో ఒక స్పెషలిస్టు ఉన్నారు. ఆయన మరెవరో కాదు..ఉత్తర కొరియా చిచ్చరపిడుగు కిమ్ జాంగ్ ఉన్..ఆయన కూడా ఇలాగే రైలులోనే దూరాలకు ప్రయాణిస్తుంటారు.

ప్రస్తుతానికి వస్తే..అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం అకస్మాత్తుగా యుక్రెయిన్ రాజధాని కీవ్‌లో ప్రత్యక్షం అయ్యారు. ఈ ఆకస్మిక పర్యటననను ”ఆధునిక కాలంలో అపూర్వమైనది”గా వైట్ హౌస్ అధికారులు వర్ణించారు. యుద్ధ క్షేత్రాలైన ఇరాక్, అఫ్గానిస్తాన్‌లలో గతంలో అమెరికా అధ్యక్ష పర్యటనలు, భారీ మిలిటరీ సమక్షంలో జరిగాయని వారు చెప్పారు. పోలాండ్ నుంచి బైడెన్, యుక్రెయిన్‌కు వెళ్లేందుకు ప్లాన్ చేస్తుండొచ్చని మీడియా వర్గాల్లో చాలా ఊహాగానాలు వచ్చాయి. అయినప్పటికీ, ఆయన ఆకస్మిక పర్యటన అందరినీ పూర్తిగా ఆశ్చర్యానికి గురి చేసింది. కీయెవ్ నడిబొడ్డున, వైమానిక దాడుల సైరన్ల శబ్ధాల నడుమ యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమీర్ జెలియన్‌స్కీతో కనిపించిన బైడెన్, ప్రపంచానికి తన ఉద్దేశాన్ని చాటి చెప్పారు.

”అది చాలా సాహసోపేతమైనది. జో బైడెన్ తన నిబద్ధతను చాటుకున్నారు” అని వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ కేట్ బెడింగ్‌ఫీల్డ్ అన్నారు. మొత్తానికి అమెరికాలో దిగజారిపోతున్న జో బైడెన్ గ్రాఫ్ ను సరిదిద్దే ప్రయత్నం బాగానే జరిగింది. ఎక్కడా తడబడకుండా కిందపడిపోకుండా బైడెన్ కూడా జాగ్రత్తగా నడుచుకున్నారు. నిజానికి రెండు రోజుల పర్యటన కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, సోమవారం సాయంత్రం అమెరికా నుంచి వార్సాకు వెళ్లాల్సి ఉంది. ఈ మేరకు షెడ్యూల్ సిద్ధం అయింది. అయితే, ఆ పర్యటన షెడ్యూల్‌లో రెండు సుదీర్ఘ ఖాళీ సమయాలు కనిపించాయి. ఈ ఖాళీ సమయాల్లోనే బైడెన్, యుక్రెయిన్‌కు వెళ్తారేమో అని ఇప్పుడు అందరూ భావిస్తున్నారు. రోజూవారీ వైట్ హౌస్ ప్రెస్ బ్రీఫింగ్స్‌లో కూడా రిపోర్టర్లు పదే పదే ఇదే ప్రశ్నను అక్కడి అధికారులను అడిగారు.

జెలెన్ స్కీతో బైడెన్ సమావేశం లేదని, ఇప్పటికైతే వార్సా అవతల బైడెన్ ఎక్కడ ఆగబోరని విలేఖరులకు వైట్ హౌస్ వర్గాలు చెప్పాయి. భద్రత నడుమ యుక్రెయిన్‌కు వెళ్లాలని కొన్ని నెలలుగా ప్లాన్లు చేసినప్పటికీ, కీయెవ్ పర్యటనపై తుది నిర్ణయం శుక్రవారమే తీసుకున్నారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 7 గంటలకు అమెరికా అధ్యక్షుడు వార్సా బయలుదేరుతారని వైట్ హౌస్ వర్గాలు ఆదివారం షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఇప్పటికీ అదే షెడ్యూల్ కనిపిస్తుంది. కానీ, ఆయన ప్రయాణించే ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం ఆదివారం ఉదయమే బయల్దేరింది. వైద్య బృందం, భద్రతా అధికారులు, అత్యంత సన్నిహితులతో కూడిన చిన్నటీమ్ మాత్రమే ఆయనతో పాటు ఉక్రెయిన్ వెళ్లింది. అయితే అధ్యక్షునితో ప్రయాణించడానికి కేవలం ఇద్దరు విలేఖరులను మాత్రమే అనుమతించారు.

ముందే వారి ఫోన్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు పర్యటన గురించి పూర్తిగా గోప్యత పాటించాలని వారిని ఆదేశించారు. బైడెన్, కీయెవ్‌కు చేరుకునేంతవరకు వారిని ఈ సందర్శన గురించి నివేదించడానికి అనుమతించలేదు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివాన్ ప్రకారం, బైడెన్ నిష్క్రమణకు కొద్ది గంటల ముందు రష్యాకు దీని గురించి సమాచారం అందించారు. ”సమన్వయ లోపం తలెత్తకూడదనే ఉద్దేశంతో మేం వారికి ఈ విషయాన్ని చెప్పాం. ఈ విషయం తెలిశాక వారు ఎలా స్పందించారో, మా సందేశాన్ని ఎలా తీసుకున్నారో నాకు తెలియదు. కానీ, వారికి మేం దీని గురించి సమాచారం ఇచ్చామని నేను ధ్రువీకరిస్తున్నా” అని జేక్ సల్లివాన్ అన్నారు. అయితే కీయెవ్‌కు చేరుకోవడానికి బైడెన్ పది గంటల పాటు రైలులో కూడా ప్రయాణించారు.

Must Read

spot_img