Homeఅంతర్జాతీయంఅమెరికాలో భారతీయుల అవస్థలు .. భారీగా ఉద్యోగాల కోత

అమెరికాలో భారతీయుల అవస్థలు .. భారీగా ఉద్యోగాల కోత

ఉద్యోగం కోల్పోయి, 60 డేస్ టార్గెట్ తో .. టెన్షన్ పడుతోన్న విదేశీ ఉద్యోగులకు .. వీసా మార్పులు .. వరంగా మారుతున్నాయి. హెచ్ 1బీ వీసా నుంచి హెచ్4, లేదా .. ఎఫ్ 1 వీసాలకు మారే అవకాశం ఉండడం .. కాస్తంత ఊరటను కలిగిస్తోంది. దీంతో వీరంతా .. సరికొత్త ఆశలతో కొత్త ఉద్యోగాల దిశగా పయనమయ్యే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

అమెరికాలో ఐటీ సంస్థలు పెద్దసంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నా హెచ్‌-1బీ వీసాదారులు ఆందోళన చెందవద్దని ఆ దేశంలో స్థిరపడ్డ ఇమిగ్రేషన్‌ అటార్నీ మధురిమ బోయపాటి అన్నారు. ఉద్యోగం నుంచి తొలగింపునకు గురైనవారు 60 రోజుల్లో మరో ఉద్యోగంలో చేరడం, లేదంటే దేశాన్ని వీడి వెళ్లడమే కాకుండా ఇతర ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయని చెప్పారు. అమెరికాలో ఉద్యోగాల తొలగింపు అక్కడ పెద్దసంఖ్యలో ఉన్న భారతీయులను కలవరపెడుతున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితి, ప్రత్నామ్నాయ అవకాశాలను ఆమె సూచిస్తున్నారు.ఉద్యోగాలు కోల్పోయిన హెచ్‌-1బీ వీసాదారులకు ప్రస్తుతం మూడు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. 60 రోజుల్లోపు మరో ఉద్యోగాన్ని వెతుక్కుని హెచ్‌-1బీని ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవడం ఒకటి కాగా, చేంజ్‌ ఆఫ్‌ స్టేటస్‌ మరొకటి, చివరిది దేశాన్ని వీడడం. అయితే నిర్దిష్ట సమయంలో చేంజ్‌ ఆఫ్‌ స్టేటస్‌ సాధ్యమేనా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ విధానంలో తలెత్తే సమస్యలపైనా మధురిమ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుత స్టేటస్‌ నుంచి ఇంకో స్టేట్‌సకు మారాల్సి ఉంటుంది.

ఉదాహరణకు.. హెచ్‌-1బీ స్టేటస్‌ ఉన్నవారు చదువుకోవాలంటే ఎఫ్‌-1కి మారవచ్చు.భార్యాభర్తలిద్దరికీ హెచ్‌-1బీ వీసా ఉండి.. ఒకరి ఉద్యోగం పోతే మరొకరు డిపెండెంట్‌గా హెచ్‌-4 వీసాకు మారవచ్చు. ఇవే కాకుండా బిజినెస్‌ కోసం బీ-1, వైద్యపరమైన సమస్యలు ఉంటే విజిటర్‌గా బీ-2 వీసాకు మార్చుకోవచ్చు. అయితే ఇందులో హెచ్‌-4, కాలేజీలో ప్రవేశం పొందితే ఎఫ్‌-1 వీసా పొందడంలో ఎలాంటి సమస్యలు ఉండవు. కానీ, బీ-1, బీ-2 పొందడం సులభం కాదు. దీనికోసం సరైన కారణాలు, ఆధారాలు చూపాల్సి ఉంటుంది.

దీంతో ఎవరైతే, 60 డేస్ సమస్యను ఎదుర్కోనున్నారో .. వారంతా .. ఈ విధంగా వీసాలు మార్చుకునేందుకు ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు. అదే సమయంలో కనీసం నెల రోజులైనా గడువు ఇవ్వకుండా.. ఒకేసారి వేలాది మంది ఉద్యోగులను కంపెనీలు అకస్మాత్తుగా తొలగించడంపై .. అమెరికాలో ఉద్యోగుల హక్కులకు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో చట్టాలు వేర్వేరుగా ఉంటాయి. ఇందులో చెప్పుకోవాల్సిన ప్రధాన అంశం.. నియామక సమయంలో కంపెనీతో ఉద్యోగి కుదుర్చుకునే ఒప్పందం. ఎట్‌ విల్‌ రిస్క్‌ అని నియామక ఒప్పందంలోనే స్పష్టంగా పేర్కొంటారు.అంటే ఎలాంటి కారణాలు లేకుండానే ఉద్యోగిని తొలగించే హక్కు కంపెనీలకు ఉంటుంది.

ఈ నిబంధన ధైర్యంతోనే కంపెనీలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే, భారతీయ హెచ్1బీ వీసాదారులకు ఉద్యోగ భద్రత, చట్టపరమైన రక్షణ వర్తించడంపైనా పలు అనుమానాలు నెలకొన్నాయి. అయితే హెచ్‌-1బీ అంటేనే నాన్‌ ఇమిగ్రెంట్‌ వీసా.. తాత్కాలిక వీసా. శాశ్వత పౌరసత్వం గ్రీన్‌కార్డ్‌ కలిగినవారికి ఉండే హక్కులు వీరికి ఉండవు. పనిచేసేందుకు వచ్చినందున పని కోల్పోతే వెళ్లాల్సిందే. అయితే ఇలాంటి పరిస్థితి వస్తుందన్న ఆలోచనతో ఉద్యోగులు ముందుగా కంపెనీ ఒప్పందాన్ని చూసుకోవాలి.

తొలగిస్తే నోటీస్‌ పీరియడ్‌ ఉందా? ఎన్ని రోజుల వేతనాన్ని నష్టపరిహారంగా ఇస్తారు? అన్న విషయాలనూ తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. హెచ్‌-1బీ నిబంధనలు యూఎస్‌ ఇమిగ్రేషన్‌ చట్టాలకు లోబడి ఉంటాయి. ఏ దేశం నుంచి వచ్చినా అందరికీ ఒకే నిబంధనలు ఉంటాయి. ఎవరైనా సరే 60 రోజులే అవకాశం ఉంటుంది. అయితే వీటిని భారత్‌, చైనా ఎక్కువగా వినియోగిస్తున్నందున.. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభావం కూడా ఈ రెండు దేశాల పౌరులపైనే ఎక్కువగా పడుతోంది.

యూరోపియన్‌, దక్షిణ అమెరికా దేశాలు, కెనడా, మెక్సికో నుంచి వచ్చినవారికి మాత్రం భారత పౌరులతో పోలిస్తే ఉద్యోగం కోల్పోయాక వెసులుబాట్లు
ఎక్కువగా ఉన్నాయి. ఈ దేశాలకు అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు ఎక్కువగా ఉన్నందున.. అక్కడి పౌరులకు 60 రోజుల గడువులో ఇతర ప్రత్యామ్నాయాలు అదనంగా ఉన్నాయి. వీరు వాణిజ్య దేశానికి చెందిన పౌరులుగా వాణిజ్య వ్యాపార వీసా ఈ-1, వాణిజ్య పెట్టుబడుదారీ వీసా ఈ-2 పొందవచ్చు. అలాగే కెనడా, మెక్సికో పౌరులు అమెరికాలో హెచ్‌-1బీ వీసాపై వచ్చి ఉద్యోగం కోల్పోతే టీఎన్‌ నాఫ్తా అంటే నార్త్‌ అమెరికన్‌ ఫ్రీ ట్రేడ్‌ అగ్రిమెంట్ వీసాలు కూడా పొందవచ్చు.

2008లో ఆర్థిమాంద్యం చాలా తీవ్రంగా ఉంది. ఈసారి అంత తీవ్రంగా లేకపోయినా ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దీనిపై ఎక్కువ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఓవైపు ఉద్యోగాలు పోతున్నా కొత్త ఉద్యోగాల కోసం కంపెనీలు సిద్ధమవుతున్నాయి. మార్చి 1-17 వరకు హెచ్‌-1బీ కొత్త లాటరీ విధానం జరగనుంది. దీంతో కొత్త ఉద్యోగాలు రానున్నాయి. ఉద్యోగం కోల్పోయినవారు స్వదేశానికి వెళ్లిపోయి మళ్లీ ప్రయత్నించుకోవచ్చు ఒకసారి హెచ్‌-1బీకి ఎంపికైతే ఆరేళ్ల గడువు ఉంటుంది.

స్వదేశానికి వెళ్లి మళ్లీ లాటరీ అవసరం లేకుండానే ఉద్యోగం వెతుక్కుని అమెరికా రావచ్చని నిపుణులు అంటున్నారు. ఆర్థిక మాంద్యం ముప్పు ముంచుకొస్తుందంటూ టెక్ దిగ్గ‌జాలు, ఇత‌ర కార్పొరేట్‌, మ‌ల్టీ నేష‌న‌ల్ కంపెనీలు ఉద్యోగుల‌కు ఉద్వాస‌న ప‌లుకుతున్నాయి. కానీ అమెరికా సిటిజ‌న్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేష‌న్ స‌ర్వీసెస్ మాత్రం స్కిల్డ్ ప్రొఫెష‌న‌ల్స్ కోసం 2024 హెచ్‌-1 బీ వీసా ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్ర‌యి ప్ర‌క‌టించింది. మార్చి ఒక‌టో తేదీ నుంచి 17 వ‌ర‌కు
ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తామ‌ని తెలిపింది.

మరోవైపు మాంద్యం ముంచుకొస్తోందంటూ అమెరికాలోని బడా టెక్ సంస్థలు ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. వేల సంఖ్యలో ఉద్యోగులను అకస్మాత్తుగా తీసేస్తున్నాయి. ఇలా సడెన్‌గా ఉపాధి కోల్పోయిన వారిలో విదేశీ వీసాదారులు కూడా ఉన్నారు. హెచ్-1బీ వీసా లాంటి వర్క్ వీసాలతో ఉపాధి పొందుతున్న వారు తాజా పరిణామాల నేపథ్యంలో టెన్షన్ పడుతున్నారు. 60 రోజుల్లో హెచ్-1బీ వీసాదారులు కొత్త ఉద్యోగం పొందాలన్న నిబంధనే వారి ఆందోళనకు కారణం. అయితే.. ఈ పరిస్థితి నుంచి గట్టేందుకు నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు.

కొత్త కంపెనీల్లో ఇంటర్వ్యూల కోసం విస్తృతంగా ప్రయత్నించాలి. స్టార్టప్ సంస్థల్లోనూ ఉద్యోగాలకు ట్రై చేయాలి. ఇందుకోసం ఎంజిల్ లిస్ట్ సాయం తీసుకోవచ్చు. శాలరీ ఎంత అనేది పట్టించుకోకుండా..మరో ఉద్యోగం సంపాదించడమే లక్ష్యంగా ప్రయత్నాలు చేయాలి. చిన్న సంస్థలను లేఖల ద్వారా సంప్రదించి తమ పరిస్థితిని వివరించాలి. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. కొత్తగా ఉద్యోగంలో చేరిన పది రోజులలోపే కంపెనీ.. ఉద్యోగి తరపున ఎల్‌సీఏ, హెచ్-1బీ దరఖాస్తు చేయాలి. అంతేకాకుండా.. ప్రీమియం ప్రాసెసింగ్ దరఖాస్తు చేయగలిగితే, వీసా వచ్చిందీ రానిదీ 15 రోజుల్లోపే తేలిపోతుంది.

ఇక అధికారులకు వీసాదరఖాస్తు దారుల ఐ-129 పారం 60 రోజుల్లోపు అందాలన్న విషయం మర్చిపోకూడదు. కాబట్టి.. ఈ అంశాలన్నీ దృష్టిలోపెట్టుకుని
ఉద్యోగప్రయత్నాలు చేయాలి. జాబ్ లభించని పక్షంలో అమెరికా వీడాల్సిన పరిస్థితి తప్పదు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇలాంటి
వారికి మరోసారి అమెరికా ఉద్యోగం సులభంగానే దొరికే అవకాశం ఉంది. ఇక ప్రత్యేకనైపుణ్యాలున్న వారికి ఇచ్చే ఓ-1కు కూడా దరఖాస్తు చేయవచ్చు.

Must Read

spot_img