Homeతెలంగాణఎన్నికల్లో పోటీ దిశగా జేడీ లక్ష్మీనారాయణ,కుమార్తె ప్రియాంక..

ఎన్నికల్లో పోటీ దిశగా జేడీ లక్ష్మీనారాయణ,కుమార్తె ప్రియాంక..

  • వచ్చే ఎన్నికల్లో పోటీ దిశగా జేడీ లక్ష్మీనారాయణ అడుగులు వేస్తోన్న సంగతి తెలిసిందే.
  • అయితే ఇప్పుడు ఆయనతోపాటు కుమార్తె ప్రియాంక సైతం పోటీకి దిగనున్నారన్నదే హాట్ టాపిక్ గా మారింది.

మంచి సమాజం కోసం పరితపించే వ్యక్తుల్లో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఒకరు. రాజకీయాలంటే అంటరానివి కాదని తరచూ చెబుతుంటారు. గత ఎన్నికల్లో తన భావజాలానికి దగ్గరగా ఉండడంతో జనసేన తరుపున విశాఖ లోక్ సభ స్థానానికి పోటీచేశారు. సరిగ్గా ఎన్నికలకు పక్షం రోజుల ముందు పార్టీలో చేరి రెండున్నర లక్షలకుపైగా ఓట్లను సొంతం చేసుకున్నారు. కానీ ఎన్నికల అనంతరం చిన్నచిన్న కారణాలు చూపుతూ ఆయన జనసేనకు, పవన్ కు దూరమయ్యారు.

అయినా స్వచ్ఛంద సేవల రూపంలో ప్రజల్లోనే తిరుగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనతో పాటు కుమార్తె సైతం విశాఖ నుంచి పోటీచేస్తారన్న ప్రచారం బలంగా జరుగుతోంది. సీబీఐ జేడీగా లక్ష్మీనారాయణ మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. తాన హోదా జేడీనే ఇంటిపేరుగా మార్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి విశాఖ నుంచే లోక్ సభకు పోటీచేస్తారన్న ప్రచారం సాగుతోంది.

టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య అలయెన్స్ కుదిరితే బీజేపీ అభ్యర్థిగా పోటీచేయాలన్నది ఆయన అభిమతంగా తెలుస్తోంది. ఇప్పటికే జనసేన నుంచి దూరం కావడంతో.. ఇప్పుడు మరోసారి ఆ పార్టీలో చేరితే ప్రజలకు తప్పుడు సంకేతం వెళుతుందని ఆయన భావిస్తున్నారు.

టీడీపీలోకి వెళదామంటే జగన్ కేసుల్లో కీలకంగా వ్యవహరించినందున విమర్శలు వస్తాయని భావిస్తున్నారు. అందుకే బీజేపీయే కరెక్ట్ అని ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అది కూడా జనసేన, టీడీపీతో కలిస్తేనే బీజేపీ అభ్యర్థిగా పోటీచేయాలని, లేకుంటే ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు జేడీ లక్ష్మీనారాయణ కుమార్తె దండి ప్రియాంకారావు సైతం రాజకీయాల్లోకి వస్తారని విశాఖ నగరంలో ప్రచారం జరగుతోంది. ఆమె స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు. చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నారు. విశాఖలోనే విద్యాబ్యాసం, స్థిర నివాసం ఏర్పాటుచేసుకున్న ఆమె రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ముఖ్యంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. అటు తండ్రి లోక్ సభ, ఇటు కుమార్తె శాసనసభకు పోటీచేస్తే ఎలా ఉంటుందోనని అనుచరులు, అభిమానులు నగరంలో ఆరా తీస్తున్నారు. ఇప్పటికే అన్ని పార్టీల్లో ఆశావహులు ఎక్కువ మంది ఉన్నారు. ఈ పరిస్థితుల్లో తమకు అనుకూలమైన పార్టీ .. అదీ గెలుపుపై నమ్మకం కుదిరే పార్టీలో చేరాలని తండ్రీ కుమార్తెలు ఆలోచిస్తున్నట్టు సమాచారం.

  • మాజీ ఐపీఎస్ అధికారి జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ కుమార్తె దండి ప్రియాంక‌రావు రాజ‌కీయాల్లో అడుగు పెట్టాల‌ని ఆస‌క్తి చూపుతున్నార‌ని స‌మాచారం..

విశాఖ నార్త్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌ని ఆమె ఉత్సాహం చూపుతున్నార‌ని తెలిసింది. సీబీఐ అధికారిగా ల‌క్ష్మీనారాయ‌ణ పాపులారిటీ సంపాదించుకున్నారు. సీబీఐలో జాయింట్ డైరెక్ట‌ర్ హోదానే ఆయ‌న ఇంటి పేరైంది. మంచి స‌మాజం కోసమంటూ ఆయ‌న త‌పిస్తుంటారు. రాజ‌కీయాలు అంట‌రానివి కావ‌నేది ఆయ‌న అభిప్రాయం. గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన త‌ర‌పున విశాఖ లోక్‌స‌భ స్థానం నుంచి జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ పోటీ చేసి ఓడిపోయారు.

అయిన‌ప్ప‌టికీ విశాఖ కేంద్రంగా అడ‌పాద‌డ‌పా ఆయ‌న స్వ‌చ్ఛంద సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తుంటారు. తండ్రిలాగే కుమార్తె కూడా స్వ‌చ్ఛంద సేవా కార్య‌క్ర‌మాల‌పై ప్ర‌త్యేక దృష్టి సారించారు. ఇదిలా వుండ‌గా జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ కూడా విశాఖ లోక్‌స‌భ స్థానం నుంచి పోటీ చేస్తాన‌ని ఇటీవ‌ల ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కూ ఫ‌లానా పార్టీ అని ఆయ‌న చెప్ప‌లేదు. ఇండిపెండెంట్ అభ్య‌ర్థిగానే బ‌రిలో దిగుతాన‌ని అంటున్నారు.

2019 ఎన్నికల ముందు మహారాష్ట్ర కేడర్లో ఐపీఎస్ అధికారిగా ఉన్న వీవీ లక్ష్మీనారాయణ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత ఆయన జనసేన పార్టీలో చేరారు. విశాఖపట్నం ఎంపీగా జనసేన నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మూడో స్థానంలో నిలిచారు. 288874 ఓట్లు సాదించారు. మొత్తం ఆయనకు 23 శాతం పైగా ఓట్లు పోలయ్యాయి.

ఎన్నికలయ్యాక పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాల్లో నటించాలని నిర్ణయించుకోవడాన్ని అంగీకరించలేక జనసేనకు లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. ఆ తర్వాత టీడీపీ, వైసీపీ, బీజేపీ ఇలా పలు పార్టీలు ఆయనకు ఆహ్వానం పలికాయని.. ఆ పార్టీల్లో చేరనున్నారని పలు వార్తలు వచ్చాయి. అయితే ఇవేమీ నిజం కాలేదు. ప్రస్తుతం లక్ష్మీనారాయణ తూర్పుగోదావరి జిల్లాలో కొంత భూమిని కౌలుకు తీసుకుని ప్రకృతి సాగు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లోనూ విశాఖపట్నం నుంచే ఎంపీగా పోటీ చేస్తానని లక్ష్మీనారాయణ తేల్చిచెప్పారు. జనసేనలోనే ఆయన చేరే అవకాశం ఉందని అంటున్నారు. లక్ష్మీనారాయణ సైతం కాపు సామాజికవర్గానికి చెందినవారే. ఇదిలా ఉంటే, వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులో జగన్ ను హైదరాబాద్లో విచారించింది జేడీ లక్ష్మీనారాయణే కావడం గమనార్హం. ఇక వచ్చే ఎన్నికల్లో పొత్తులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాను తెలుగుదేశం జనసేన మధ్య పొత్తుంటుందని ఎక్కడా చెప్పలేదన్నారు. ఈ రెండు పార్టీలు కలిస్తే వైసీపీపై ఖచ్చితంగా ప్రభావం ఉంటుందని చెప్పారు.

  • టీడీపీ–జనసేన మధ్య పొత్తు కుదిరితే సీట్ల పంపకాలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉందని జేడీ అన్నారు..

అలాగే సమీకరణాలు ఎలా మారతాయన్నది కూడా ముఖ్యమేనని అన్నారు. పరిపాలించడానికి ప్రజలు ఐదేళ్ల కాలానికి అధికారం ఇచ్చారని పాలించలేమని భావిస్తే చేతులు ఎత్తేయాలన్నారు. అంతేకానీ ముందస్తు ఎన్నికలకు వెళ్లడం సరికాదన్నారు. విశాఖపట్నం నుంచి మరోసారి తాను పోటీ చేస్తానని తెలిపారు. తన భావాలకు ఆలోచనలకు తగినట్లుగా ఉండే పార్టీని ఎంపిక చేసుకుంటానని వెల్లడించారు.

తనకు ఏ పార్టీ నచ్చకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగుతానని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ పై సినీ నటుడు అలీ పోటీ చేస్తానంటున్నారని.. ఈ వ్యాఖ్యలపై స్పందించాలని కోరగా ఇలాంటి వాటిని ప్రచారంలో పెట్టి రాష్ట్రంలో ఉన్న అసలు సమస్యలను పార్టీలు పక్కదారి పట్టిస్తున్నాయని లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితి గురించి నిరుద్యోగం గురించి ఎవరూ మాట్లాడకుండా.. వాటిని పక్కదారి పట్టించడానికి ఉద్దేశపూర్వకంగానే అలీ పోటీ చేస్తారు అంటూ ఇలాంటి వార్తలను ప్రచారంలో పెడుతున్నారని చెప్పారు. ప్రధాన విషయాలను పక్కదారి పట్టించడానికి ఇది కూడా ఒక స్ట్రాటజీ కావొచ్చన్నారు. ప్రతి పార్టీకి అనుబంధంగా బలమైన సోషల్ మీడియా విభాగాలు ఉన్నాయని లక్ష్మీనారాయణ గుర్తుచేశారు.

వీటిని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఇలాంటి అంశాలతోనే ప్రజల్ని బిజీగా ఉంచుతున్నారని హాట్ కామెంట్స్ చేశారు. అలీ పవన్ కల్యాణ్ పై పోటీచేయవచ్చని పార్టీ ఆదేశిస్తే పోటీచేస్తారని అందులో తప్పు పట్టాల్సిందేమీ లేదన్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు సరికాదని అవి చేసేవారి స్థాయిని దిగజారుస్తాయని లక్ష్మీనారాయణ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

తన పేరు ముందు ఉండే జేడీ అంటే జనతా దోస్త్ అనే అర్థం కూడా వస్తుందని వ్యాఖ్యానించారు. అదేవిధంగా తమ ఫౌండేషన్కు జాయింట్ ఫర్ డెవలప్మెంట్ అని పేరు పెట్టినట్లు తెలిపారు. ఇక నారా లోకేష్ పాదయాత్రపై జేడీ తనదైన శైలిలో స్పందించారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, జగన్, షర్మిల కూడా పాదయాత్రలు చేశారని గుర్తు చేశారు. ప్రజల సమస్యలు తెలియడం రాజకీయ నేతలకు ముఖ్యమన్నారు.

విశాఖ తూర్పు నియోజకవర్గం నుండి జేడీ ఫౌండేషన్ కన్వీనర్ ప్రియాంక శాసనసభ్యురాలిగా పోటీ చేస్తారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ పొత్తు కుదుర్చుకునే అవ‌కాశాలుంటే… బీజేపీ నుంచి తాను ఎంపీగా, కుమార్తెను ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా నిలపాల‌ని ఆయ‌న ఆలోచిస్తున్నార‌ని జేడీ సన్నిహితులు చెబుతున్నారు. విశాఖ‌లో కుమార్తెకు ఏ నియోజ‌క‌వ‌ర్గ‌మైనా ఫ‌ర్వాలేద‌ని జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ అంటున్నార‌ని తెలిసింది. చ‌ట్ట‌స‌భ‌లో అడుగు పెడితే, కొన్ని సంస్క‌ర‌ణ‌లు తీసుకురావ‌చ్చ‌నేది తండ్రీత‌న‌య‌ల అభిప్రాయం.

Must Read

spot_img