Homeఆంధ్ర ప్రదేశ్సీఎం జగన్ .. ఢిల్లీ టూర్ ..

సీఎం జగన్ .. ఢిల్లీ టూర్ ..

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈనెల 31న ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ విచారిస్తున్ననేపథ్యంలో జగన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట‌్‌లో పాల్గొనడానికే సీఎం జగన్ ఢిల్లీకి వస్తున్నట్లు సమాచారం. అయితే ఈ పర్యటన ఒక సాకని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో పాల్గొననని, అధికారులచేతనే కానిచ్చేయాలని సీఎంవో నుంచి సమాచారం ముందుగానే వచ్చింది. అయితే వైఎస్ వివేకా హత్య కేసులో కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ విచారిస్తున్న నేపధ్యంలో సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. అవినాశ్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

దీనికి సంబంధించిన సాక్ష్యాలను సీబీఐ అధికారులు సేకరించారు. ప్రస్తుతం విచారణ జరిపి ఒకటి, రెండు రోజుల్లో అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ప్రధాని మోదీ, అమిత్ షాల అపాయింట్ మెంట్ కూడా సీఎం జగన్ కోరినట్లుగా తెలుస్తోంది. అయితే అపాయింట్‌మెంట్లు ఇంకా ఖరారు కాలేదు. ఈ నేపథ్యంలో జగన్ ఢిల్లీ టూర్ చర్చనీయాంశంగా మారుతోంది. కాగా 31న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. అదే రోజు సాయంత్రం 3.30 గంటలకు ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు ఉంది. వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో వైసీపీలో టెన్షన్ నెలకొంది. ఇదే మొదటిసారి కావడం. .ప్రశ్నిస్తున్నది కూడా ముఖ్యమంత్రి జగన్‌కు వరుసకు సోదరుడు అవినాష్ రెడ్డి కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ నెల 24నే విచారణకు రావాలని అందుకుముందురోజు సీబీఐ అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. అయితే ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల కారణంగా ఐదు రోజుల తర్వాత విచారణకు రాగలనని ఎంపీ బదులిచ్చారు. దీంతో ఈ నెల 25న పులివెందులకు వచ్చిన సీబీఐ అధికారులు విచారణకు రావాలని మళ్లీ నోటీసు ఇచ్చారు. ఈ కేసులో అవినాష్ ప్రమేయంపై సీబీఐ పలు అనుమానాలు వ్యక్తం చేసింది. ఇవాళ అవినాష్‌ను అనుమానితుడిగానే ప్రశ్నించే అవకాశం ఉంది. అటు జగన్‌కు.. ఇటు భారతికి రెండు వైపుల నుంచి అవినాష్ రెడ్డి బంధువే. భారతి సొంత మేనమామ వైఎస్ భాస్కర్ రెడ్డి కొడుకే అవినాష్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి ఉన్నంతకాలం పులివెందులలో అవినాష్ రెడ్డి కుటుంబానికి ప్రాధాన్యం లేదు.

వైఎస్ వివేకానందరెడ్డే జిల్లా రాజకీయాలు చూసుకునేవారు. పులివెందులలో కూడా అవినాష్ కుటుంబానికి రాజకీయంగా పెద్ద పరపతి ఉండేదికాదు. అప్పట్లో కేవలం మున్సిపల్ రాజకీయాలకే పరిమితమయ్యేవారు. వైఎస్ మరణానంతరం జగన్ హయాంలో అవినాష్ రెడ్డికి ప్రాధాన్యం పెరిగింది. ఈ నేపథ్యంలోనే వైఎస్ వివేకా హత్యకేసు చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు వేగవంతం అవుతున్న వేళ.. వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ ఎదుట హాజరైన నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఉంటుందన్నఅంచనాలు నిజం అయినట్లేనని చెబుతున్నారు.

వివేకా హత్య కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేస్తున్న నేపథ్యంలో.. సీఎం జగన్ ఢిల్లీకి టూర్ పెట్టుకోవటం ఆసక్తికరంగా మారింది. షెడ్యూల్ లో భాగంగా ఆయన పర్యటించాల్సిన విశాఖ.. పొన్నూరు.. హైదరాబాద్ కార్యక్రమాల్ని రద్దు చేసుకున్న ఆయన తాజాగా ఢిల్లీకి వెళ్లేందుకు సిద్దమైనట్లుగా చెబుతున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే సోమవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్న జగన్.. మంగళవారం జీ20 సన్నాహక సదస్సులో పాల్గొంటారని చెబుతున్నారు. ఒకవేళ.. అలాంటిదే ఉండి ఉంటే.. ఇప్పటివరకు బయటపెట్టకుండా.. హటాత్తుగా ఈ కార్యక్రమాల్ని తెర మీదకు తీసుకురావటం ఏమిటి? అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు ముమ్మరం అయిన నేపథ్యంలో తన ఆత్మబంధువు.. సోదరుడు వరుసైన అవినాశ్ విషయంలో ఏమైనా చేసేందుకు వీలు ఉంటుందా? అన్న కోణంలోనే ఢిల్లీ పర్యటన ఉందని చెబుతున్నారు. ఈ టూర్ లో ప్రధాని నరేంద్ర మోడీని.. హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యేందుకు తెగ ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. ఇందుకోసం ఆయన ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లుగా రాజకీయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. అయితే.. ఢిల్లీకి వస్తున్న సీఎం జగన్ కు మోడీషాలు అపాయింట్ మెంట్ ఇస్తారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ కు అపాయింట్ మెంట్ ఇవ్వటం ద్వారా తాము ఇరుకునపడే అవకాశం ఉందని.. అనవసరమైన విమర్శలకు అవకాశం ఇవ్వకుండా ఉండాలన్నట్లుగా వ్యవహరిస్తారా? లేదంటే.. తమకు అన్ని విధాలుగా తోడ్పాటు అందించే జగన్ పరిస్థితిని అర్థం చేసుకొని అపాయింట్
మెంట్ ఇస్తారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఒకవేళ అపాయింట్ మెంట్ కుదిరితే, చర్చించే అవకాశాలు ఏమిటి అన్నదే హాట్ టాపిక్ గా మారింది.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ ని సడెన్ గా పెట్టుకున్నారు. నిజానికి జగన్ ఢిల్లీ ఇపుడు వెళ్లాల్సిన అవసరం లేదని అంటున్నారు. అయితే ఢిల్లీలో గ్లోబల్ సమ్మిట్ కర్టెన్ రైజర్ ఈవెంట్ కి ఆయన హాజరవుతారని, అది ఈ నెల 31న ఉందని అంటున్నారు. అయితే ఇది చాలా రోజుల క్రితమే షెడ్యూల్ అయింది. అప్పటి సమాచారం మేరకు ఏపీ నుంచి అధికారులే హాజరవుతారని అనుకున్నారట. కానీ జగన్ తాను ఆ మీటింగ్ కి అటెండ్ అయ్యేందుకు రెడీ అయ్యారు. జగన్ ఢిల్లీ టూర్ లో కేవలం ఈ ఈవెంట్ మాత్రమే ఉందా లేక ఏవైనా ఇతర ప్రోగ్రామ్స్ ఉన్నాయా అన్న చర్చ సాగుతోంది. జగన్ ఢిల్లీ టూర్ లో ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తారు అని అంటున్నారు.

ఈ మేరకు ఆయన అపాయింట్మెంట్ కోరారని చెబుతున్నారు. అలాగే కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోనూ భేటీ అవుతారు అని అంటున్నారు. ఇక జగన్ ఈ నెల 27, 28 తేదేల నుంచి ఢిల్లీ వెళ్ళేందుకు అన్ని ఇతర ప్రోగ్రామ్స్ ను రద్దు చేసుకున్నారని అంటున్నారు. విశాఖలో శారదాపీఠంలో జరిగే రాజశ్యామల కార్యక్రమానికి ఆయన హాజరు కావాల్సి ఉంది. అయితే చివరి నిముషంలో క్యాన్సిల్ అయింది. ఢిల్లీ అపాయింట్మెంట్ల విషయంలో తేలకపోవడం వల్లనే ఇలా జరిగింది అంటున్నారు.

ఇక కేంద్ర బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న వేళ ప్రధానిని కలసి పోలవరం నిధులతో పాటు ఏపీకి ఆర్ధికంగా భరోసా ఇచ్చే ప్రాజెక్టుల మీద కూడా చర్చిస్తారు అంటున్నారు. వీటితో పాటు ఏపీలో మారుతున్న రాజకీయం నేపధ్యంలో పొత్తులు ఎత్తుల గురించి బీజేపీ కేంద్ర పెద్దల మనసులో ఏముందో ఆయన తెలుసుకుంటారని అంటున్నారు. వీటితో పాటు ఒకవేళ కలసి వస్తే ముందస్తు ఎన్నికలకు వెళ్ళే విషయం కూడా కేంద్ర పెద్దల వద్ద ప్రస్తావిస్తారని అంటున్నారు. మొత్తానికి చూస్తే జగన్ చాలా పనులు పెట్టుకుని ఢిల్లీ వెళ్తున్నారు.

అదే విధంగా ఏపీలో కొత్త పాత్తులు..మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ టూర్ రాజకీయంగా – పాలనా పరంగా కీలకంగా మారనుంది. జగన్ ఢిల్లీ టూర్ అన్నది చివరి నిముషం వరకూ బయటకు రాలేదు. ఒక రోజు ముందు మాత్రమే అది అందరికీ తెలిసింది. అంత గోప్యంగా జగన్ ఢిల్లీ టూర్ న్యూస్ ని ఉంచారు. సరే జగన్ ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోడీని కలిసారు ఇతర కేంద్ర మంత్రులను కూడా మీట్ అయ్యారు. మరి జగన్అర్జంటుగా ఢిల్లీ వెళ్లడానికి కారణం ఏంటి అంటే విపక్షాలు ఎవరికి వారు రకరకాలైన ఊహాగానాలు వినిపిస్తున్నారు.

Must Read

spot_img