టాలీవుడ్‌లోని స్టార్ హీరోల్లో పవన్ కల్యాణ్ ఒకరు. పవన్‌కు యూత్‌లోను మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందువల్ల పవర్ స్టార్ నుంచి సినిమా వస్తుందంటే చాలు అభిమానులందరు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతం పవన్ ‘హరి హర వీరమల్లు’నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ 60శాతానికి పైగా పూర్తయింది. తాజాగా పవన్‌కు సంబంధించిన ఓ రూమర్ ఫిల్మ్ నగర్‌లో షికార్లు కొడుతుంది.
హరిహర వీరమల్లు నుంచి అప్డేట్స్ ల వర్షం రాబోతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మొదటి సారి పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో విప్లవయోధుడుగా పీరియాడిక్ జోనర్ కథాంశంలో కనిపించబోతున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి అప్డేట్స్ కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. కనీసం ఒక్క అప్డేట్ అయినా ఇవ్వాలని కోరుతున్నారు.
గత ఏడాది ఎప్పుడో మూవీకి సంబందించిన ఫస్ట్ లుక్ టీజర్ వదిలారు. తరువాత ఇప్పటి వరకు మళ్ళీ ఎలాంటి అప్డేట్ లేదు. ఇదిలా ఉంటే శివరాత్రి సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేసే ప్లాన్ లో చిత్ర యూనిట్ ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది. అది కూడా పవన్ కళ్యాణ్ ఎలివేషన్ సాంగ్ గా అని టాక్. ఇదిలా ఉంటే గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకోవడంతో పాటు ఆస్కార్ ఫైనల్ నామినేషన్స్ కి వెళ్ళిన వ్యక్తి ఎంఎం కీరవాణి.
అతని నుంచి ఆర్ఆర్ఆర్ తరువాత వస్తున్న మూవీగా హరిహర వీరమల్లు ఉంది. ఆయన మ్యూజిక్ అందిస్తూ ఉండటంతో పాన్ ఇండియా వైజ్ గా ఆ ఇమేజ్ కూడా కొంత హెల్ప్ అవుతుంది అనే మాట వినిపిస్తుంది. ఇక శివరాత్రి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ సాంగ్ తో ఎంఎం కీరవాణి మరోసారి మాయ చేయాలని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు.
ఆర్ఆర్ఆర్ లెవల్ లో సాంగ్స్ ని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఇక క్రిష్ శైలి కాస్తా క్లాసిక్ గా ఉంటుంది. అతని హీరో ఎలివేషన్ కూడా రాజమౌళి కంటే భిన్నంగా ఉంటుంది అనే సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో కీరవాణి నుంచి రాబోతున్న హరిహరవీరమల్లు ఫస్ట్ సాంగ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి శివరాత్రి సందర్భంగా వస్తుందని టాక్ ఉన్న ఈ సాంగ్ ఏ రేంజ్ లో మెప్పిస్తుంది అనేది చూడాలి.