Homeఅంతర్జాతీయంభారతదేశంతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో దాయాది దేశానికి స్పష్టంగా తెలుస్తోంది.

భారతదేశంతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో దాయాది దేశానికి స్పష్టంగా తెలుస్తోంది.

ప్రస్తుతం అక్కడి ఆర్థిక పరిస్తితి ఏ క్షణమైనా దివాలా తీసేందుకు రెడీగా ఉంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్త జనానికి అత్యవసరమైన గోధుమ పిండి కంటనీరు పెట్టిస్తోంది. 20 కిలోల బ్యాగు 2 వేల 5 వందలు ధర పలుకుతోంది. దీంతో సామాన్యుల గుండెలు గుభేలుమంటున్నాయి. పిల్లలకు రెండు పూటలు తిండి పెట్టలేని స్థితికి చేరుకుంది పాకిస్తాన్.

సంక్షోభం దిశగా వేగంగా వెళ్తోంది పాకిస్తాన్. దివాళా అంచుకు చేరుకుంటోంది. ఇప్పటికే ఈ ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఉద్యోగుల జీతాల్లో కూడా కోత పెట్టింది. అనేక రకాలుగా పొదుపు చర్యలు చేపట్టింది. అయితే ఇవన్నీ చేతులు కాలినాక ఆకులు పట్టుకున్న చందంగా మగిలిపోతోంది. అనవసర ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నాలు చాలా ఆలస్యం మొదలుపెట్టింది. ఇదిలా ఉంటే అక్కడ నానాటికి నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. ఎంతలా అంటే రాబోయే రోజుల్లో తిండి కోసం ప్రజలు మధ్య యుధ్దాలు తలెత్తే విధంగా పరిస్థితులు ఉన్నాయి. మరో శ్రీలంకను తలపించేలా.. అన్నింటి రేట్లు పెరుగుతున్నాయి. కనీసం ప్రభుత్వం నడపటానికి కూడా డబ్బులు లేని పరిస్థితి నెలకొంది.

కశ్మీరులో ఆర్టికల్ 370, 35ఏ రద్దు అనంతరం పాకిస్తాన్ మనదేశంతో అన్ని సంబంధాలను తెంచుకుంది.

దీంతో ఆ ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తోంది. మన పంజాబ్ లో కిలో గోధుమ పిండి 30 రూ.లుగా ఉంటే.. పాకిస్తాన్ పంజాబ్ లో కిలో గోధుమపిండి ధర మాత్రం 100 రూ.లను దాటేసింది. భారత్ నుంచి ఆహార ధాన్యాలు, కూరగాయల దిగుమతిని ఆపేసినందుకు ఇప్పుడు పాకిస్తాన్ అనుభవిస్తోంది. తాజాగా అక్కడ గోధుమ పిండి ధర అక్కడ ప్రజలకు కన్నీళ్లు తెప్పిస్తోంది. దీంతో దేశంలో పలు చోట్ల గోధుమ పిండి కోసం తొక్కిసలాట, గందరగోళ పరిస్థితి నెలకొంది. సగటు ఆదాయాన్ని పొందే వ్యక్తి గోధుమ పిండిని కూడా కొనలేని పరిస్థితి ఉంది. టొమాటేలో 300 రూ.లకు ఎప్పుడో చేరిపోయాయి. నూనె నెయ్యి సంగత చెప్పనవసరం లేదు.

పాక్ లోని పిండి మిల్లుల యజమానులు గోధుమ పిండి ధరను అకస్మాత్తుగా పెంచేశారు. ఏకంగా గతంలో కన్నా 11 రూ.లు పెంచారు. దీంతో పంజాబ్, సింధ్ ప్రావిన్సుల్లో కిలో గోధుమ పిండి ధర 115 పాకిస్తాన్ రూ.లకు చేరుకుంది. ఇదిలా ఉంటే ఇక మధ్యలో ఉన్న దళారులు ఆదివారం రోజు మరో 10 రూ.లు పెంచారు. దీంతో కిలో పిండి ధర ఇప్పుడు 125 రూ.లకు చేరుకుంది. నిజానికి ఇదే పిండి భారత్ లో అయితే 10 కేజీల సంచీకి 340 రూ.లు మించదు. ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలు 10 కిలోల గోధుమ పిండిని కొనుగోలు చేయాలంటే 1250 పాకిస్తాన్ రూ.లు వెచ్చించాల్సిందే. ఈ పరిణామాల నేపథ్యంలో పాక్ లోని సింధ్ ప్రభుత్వం ఈ సీజన్ లో 1.4 మెట్రిక్ టన్నుల గోధుమలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది.

రైతుల నుంచి ఒక మెట్రిక్ టన్ను, పాకిస్తాన్ అగ్రికల్చర్ స్టోరేజ్ సర్వీస్ కార్పొరేషన్ నుంచి 4 లక్షల టన్నులు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. అయితే ఇది ఎన్ని రోజుల పాటు ప్రజల ఆకలి తీరుస్తుందో చెప్పలేని పరిస్థితి. పెరిగిన ధరలు ఇప్పుడు తగ్గే పరిస్థితి లేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. నిజానికి పాక్ విదేశీ మారక ద్రవ్యం నిల్వలు గణనీయంగా పడిపోయాయి. ప్రస్తుతం కేవలం మరో మూడు వారాలపాటు జరిగే దిగుమతులకు చెల్లించగల నిల్వలే ఉన్నాయి. దీంతో దేశానికి నిధులు అత్యవసరమయ్యాయి. ఆర్థిక సాయం కోసం పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ బుట్టో అమెరికాకు వెళ్లారు. వారం రోజులు ప్రయత్నించినా అక్కడి విదేశాంగ మంత్రి అంటోనీ బ్లింకన్ ని కలవలేకపోయారు.

దాంతో ఉత్తచేతులతో పాకిస్తాన్ తిరిగి వచ్చారు. గతంలో ఇలాగే తక్కువ ధరకు చమురు కోసం ఓ డెలిగేషన్ రష్యాకు వెళ్లింది. భారత దేశానికి సరఫరా చేస్తున్నట్టుగానే తమకు కూడా చమురు సరఫరా చేయాలని కోరారు. కానీ రష్యా ఏమాత్రం సంశయం లేకుండా నో చెప్పేసింది. దాంతో స్వదేశంలో చెప్పుకునేందుకు ఏదైనా చేయాలనుకున్న బ్రుందం కనీసం రష్యా పేద దేశాలకు సరఫరా చేస్తోన్న గోధుమలనైనా పాకిస్తాన్ కు పంపించాలని కోరింది. అయితే ఆ చవక రకం గోధుమలను తాము అమ్మడం లేదనీ, ఉచితంగానే ఇస్తున్నామనీ, ట్రాన్స్ పోర్టింగ్ చేసుకోవడానికి కార్గో నౌకలను ఎవరికి వారే తెచ్చుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దాంతో ఆ సామర్థ్యం కూడా లేని పాకిస్తాన్ బ్రుందం అక్కడి నుంచి కూడా ఉత్త చేతులతోనే వెనక్కు మళ్లింది.

Must Read

spot_img