వారానికి నాలుగు రోజులే పని..వినడానికి భలే హాయిగా ఉంది కదూ..ఈ టైంలో..యూఎస్ లో గానీ, యూకేలో గానీ ఉంటే..బాగుండు..అనుకుంటున్నారా..మరీ అంత ఫీల్ కాకండి.. అతి త్వరలోనే ఈ విధానం భారత్ లోనూ అమలు కానుందట.. ఈ మేరకు దేశ కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే..దీనిపై ఉద్యోగులు ఏమంటారన్నదే ఆసక్తిని రేకెత్తిస్తోంది.
పొద్దున్న లేచింది మొదలు..రాత్రి పడుకునే వరకు..ఒకటే పని..అని బోర్ ఫీలవుతున్నారా…ఇక ఈ బాధ పోయే రోజులు..దగ్గర్లోనే ఉందట.. వారం రోజుల పాటు పనిచేసే అవసరం లేకుండా కేవలం..4 రోజులు పనిచేసేలా కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. అయితే ఇందులో ఓ చిన్న తిరకాసు ఉందని నిపుణులు అంటున్నారు..అదేంటంటే, నాలుగు రోజులు పని దినాలు కావాలంటే, అందుకు రోజుకు 12 గంటలు పని చేయాలట.
కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకురావడానికి రెడీ అవుతోంది. కొత్త కార్మిక చట్టాలను అమలు చేయడానికి సిద్ధమౌతోంది. కొత్త కార్మిక చట్టాలు అమలులోకి వస్తే వారానికి 4 రోజులు మాత్రమే పని దినాలు ఉండనున్నాయి. అంతేకాకుండా ఉచిత మెడికల్ చెకప్స్ కూడా ఉంటాయి. వారానికి 4 పని దినాలే అయినా కూడా ఉద్యోగులుకు ఒక వారంలో 48 గంటలు పని చేయాల్సి ఉంటుంది. అంటే 4 రోజులు పని చేయాల్సి వస్తే.. రోజు 12 గంటలు పని చేయాల్సి ఉంటుంది. అయితే ఇది కంపెనీలు, ఉద్యోగుల ఇష్టం. కేంద్రంఎవ్వరి మీద ఒత్తిడి తీసుకురాదు. కంపెనీలకు, ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం రెండు ఆప్షన్లు అందిస్తుంది.
వారంలో నాలుగు రోజులు పని చేయాలా? లేదంటే వారంలో ఆరు రోజులు పని చేయాలా? అనేది పూర్తిగా ఉద్యోగులు, కంపెనీల ఇష్టం. వారు ఏ ఆప్షన్ అయినా ఎంచుకోవచ్చు. అయితే కంపెనీలు, ఉద్యోగులు కచ్చితంగా ఒక ఆప్షన్ ఎంచుకోవలసి ఉంటుంది. రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త కార్మిక చట్టాలను అమలు చేయనుంది. కొత్త రూల్ అమలులోకి వచ్చిన తర్వాత కంపెనీలు 4 రోజుల, 5 రోజుల పని దినాల కోసం ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. మన దేశంలో ఇంకా వారంలో ఐదు రోజుల పని కోసం పోరాడుతూ ఉంటే.. చాలా దేశాల్లో వారంలో నాలుగు రోజులే పనిదినాలు అమల్లోకి వస్తున్నాయి.
వారంలో నాలుగు రోజులు పనిచేస్తే.. మూడు రోజులు సెలవు తీసుకునే ప్రక్రియను ఉద్యోగులకు అమలు చేస్తున్నాయి కొన్ని దేశాల్లోని కంపెనీలు. బ్రిటన్ సైతం పూర్తి వేతనంతో నాలుగు రోజుల వర్క్‌వీక్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ప్రస్తుతం ఈ విధానంలో వివిధ రంగాలకు చెందిన 70 కంపెనీల ఉద్యోగులు ట్రయల్ బేసిస్‌లో పనిచేస్తున్నారు. ఈ వర్క్‌వీక్ విధానంలో ఉద్యోగుల ఉత్పాదకత, సంక్షేమం ఏ విధంగా ఉండనుందో కంపెనీలు పరిశీలించనున్నాయి. 4 రోజుల పని విధానాన్ని అమలు చేస్తోన్న వాటిల్లో ఆక్స్‌ఫర్ట్, కేంబ్రిడ్జ్ వంటి యూనివర్సిటీలు కూడా ఉన్నాయి. పాశ్చాత్య దేశాల్లో ఉద్యోగులు వారానికి ఐదు రోజులు మాత్రమే పని చేయడం ఎప్పటి నుంచో కొనసాగుతోంది.
మన దేశంలో ఐటీ కంపెనీలు సహా పలు ఇతర కంపెనీలు కూడా ఈ ఫార్ములాను ఫాలో అవుతున్నాయి. అయితే వారానికి కేవలం నాలుగు రోజులు మాత్రమే పని దినాలు ఉండాలనే కొత్త ప్రతిపాదన కొద్దిరోజుల క్రితం నుంచి వినిపిస్తోంది. నాలుగు వారాల పైలట్ ప్రాజెక్ట్ జూన్ 1 నుండి బ్రిటన్‌లో ప్రారంభించబడుతోంది. దేశంలోని 60 అతిపెద్ద కంపెనీలు దీన్ని అమలు చేస్తున్నాయి. దాదాపు ఆరు నెలల పాటు సాగే ఈ ప్రయోగంలో కంపెనీలు వారానికి నాలుగు రోజులు గరిష్టంగా 32 గంటల పాటు పని చేయాలని చెబుతున్నాయి. అంటే ఉద్యోగులకు ప్రతి వారం మూడు రోజుల సెలవులు లభిస్తాయి. ఇందులో దేశంలోని 60 అతిపెద్ద కంపెనీల నుండి 3000 మంది ఉద్యోగులు ఉన్నారు.
ఈ కాలంలో ఉద్యోగుల జీతంలో ఎలాంటి మార్పు ఉండదు. ఉత్పాదకతను ఎలా కొలవడం అనేది పెద్ద సవాలు అని కార్మిక ఆర్థికవేత్త జోనాథన్ బోయ్స్ అన్నారు. ఉద్యోగులు నాలుగు రోజుల్లో ఐదు రోజుల పని చేయాల్సి ఉంటుంది. దీనికి ముందు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వ సంస్థలకు వారానికి పని దినాలను జనవరి 2022 నుండి ఐదున్నర సంవత్సరాలకు తగ్గించింది. ఇదే అంశంపై పలు దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. అదే బాటలో నడిచేలా .. కంపెనీలకు సూచనలు చేశాయి. దీంతో ఆయా కంపెనీలు సైతం వీటిపై సానుకూలంగా స్పందిస్తున్నాయి.
- నాలుగు రోజుల పని వారాన్ని ప్రారంభించమని కంపెనీలను కోరింది..
పని, జీవిత సమతుల్యతను మెరుగుపరచడానికి, జూన్ 2021లో జపాన్ ప్రభుత్వం కూడా ఇదే విధమైన చొరవ తీసుకుంది. నాలుగు రోజుల పని వారాన్ని ప్రారంభించమని కంపెనీలను కోరింది. ఈ నియమాన్ని అమలు చేసిన మొదటి జపాన్ కంపెనీ పానాసోనిక్. యునిలీవర్ న్యూజిలాండ్, బహుళజాతి వినియోగ వస్తువుల కంపెనీ, డిసెంబర్ 2020లో తన ఉద్యోగులకు వేతనం లేకుండా ఒక సంవత్సరం, నాలుగు రోజుల పని వారాన్ని ప్రవేశపెట్టింది. బెల్జియం తన ఉద్యోగులకు వారానికి నాలుగు రోజులు పని చేసే అవకాశాన్ని కల్పించే దేశాల జాబితాలోకి చేరింది. గత సంవత్సరం, స్పెయిన్ ప్రభుత్వం ఉద్యోగుల వేతనాన్ని తగ్గించకుండా 32 గంటల పనివారాన్ని ప్రకటించింది.
అధికార పార్టీ ప్రచారంలో వాగ్దానం చేసినట్లుగా స్కాట్లాండ్ ఆచరణాత్మకంగా నాలుగు రోజుల పని వారాన్ని ప్రారంభిస్తోంది. అదే సమయంలో ఉద్యోగి పని గంటలు 20% తగ్గించబడ్డాయి. జనవరి 2022లో ఐర్లాండ్‌లో నాలుగు రోజుల పని వారం ప్రారంభమైంది. కొత్త నిబంధన ప్రకారం ఉద్యోగుల జీతాల్లో ఎలాంటి నష్టం ఉండదు. తాజాగా భారత్ సైతం పనిచేసే రోజుల సంఖ్యను తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. కార్మిక చట్టాల సంస్కరణ కింద ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఇది వర్తింపజేస్తే ఉద్యోగులు తప్పనిసరిగా కనీసం 48 పని గంటలు పని చేయాలి.
నాలుగు రోజుల నిబంధన వర్తింపజేస్తే ఉద్యోగులు రోజుకు 12 గంటలు పనిచేసిన తర్వాత మూడు రోజులు సెలవు తీసుకోవచ్చు. కరోనా తర్వాత చాలా వరకు పరిస్థితులు మారిపోయాయి. పని విధానాల్లో వెసులుబాట్లు వచ్చాయి. కొన్ని కంపెనీలు ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్‌నే అమల్లోకి చేస్తున్నాయి. కొన్ని కంపెనీలు ప్రత్యామ్నాయ రోజుల్లో వర్క్ ఫ్రమ్ ఆఫీసును అమలు చేస్తున్నాయి. అయితే కొన్ని దేశాలు నాలుగు రోజుల పని విధానాన్ని అమల్లోకి తేవాలని చూస్తున్నాయి. త్వరలో దేశంలోని కోట్లాది మంది ఉద్యోగుల పని విధానంలో కీలక మార్పులు చోటు చేసుకోవచ్చు.
ఉద్యోగుల ప్రయోజనాల చేకూరేలా వారి పని సంస్కృతి, సౌలభ్యం ప్రకారం ఈ మార్పులు ఉండనున్నాయి. కొత్త కార్మిక చట్టం ప్రకారం ఉద్యోగులకు ఎక్కువ సెలవులు లభించే అవకాశం ఉంది. వారి పని వేళలలో కూడా భారీగా మార్పులు ఉండవచ్చు. ఈ కొత్త కార్మిక చట్టంలోని ప్రత్యేక అంశం ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని దేశవ్యాప్తంగా ఏకకాలంలో అమలు చేయనుంది.
దీంతో అన్ని రాష్ట్రాలు కొత్త కార్మిక చట్టాలకు అణుగుణంగా మార్పులు చేయాల్సి వస్తుంది. ఈ చట్టాలు అమల్లోకి వస్తే ఉద్యోగుల జీతం, PF కాంట్రిబ్యూషన్, పని సమయం, వారంతం సెలవుల్లో పలు మార్పులు రానున్నాయి. అయితే యూకే ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టగా, చక్కటి ఫలితాలను అందించింది. దీంతో ఈ పని పద్ధతిని విస్తరించేందుకు పలు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. దాదాపు 91 శాతం కంపెనీలు 3 రోజుల ఆఫ్ ఫార్ములాపై పాజిటివ్ గా ఉన్నాయని, దీనిని మంచి చొరవగా పేర్కొన్నాయి.
ఈ ఫార్ములాను ప్రయత్నించడం వల్ల కంపెనీల ఆదాయం పెరిగిందని కంపెనీలు కూడా అంగీకరించాయి. అదనంగా, ఇతర కంపెనీలు కూడా ఉద్యోగులకు నాలుగు పని దినాలు, వారానికి మూడు రోజులు సెలవు ఇవ్వడం ద్వారా వారి ఆరోగ్య సమస్యలు సైతం తగ్గాయి. కొత్త కార్మిక చట్టంలో లేబర్ కోడ్ వేతనాలు, సామాజిక భద్రత, పారిశ్రామిక సంబంధాలు, వృత్తిపరమైన భద్రతకు సంబంధించిన 4 కొత్త కోడ్‌లు ఉంటాయి. వీటన్నింటికీ వేర్వేరు నియమాలు,నిబంధనలు ఉంటాయి. ముఖ్యంగా, 3 రోజుల సెలవులకు సంబంధించిన అంశాన్ని కోడ్‌లో ముఖ్యంగా చేర్చనున్నారు. అంటే ఉద్యోగులకు వారంలో 3 రోజులు సెలవు లభించనున్నాయి. దీంతో రోజువారీ పని సమయం 12 గంటలకు పెరగనుంది.
వీక్లీ .. 4 డేస్ వర్క్ .. అని తెగ సంతోష పడుతున్నారా..? అయితే ఈ విధానంలో .. పని గంటలు ఎక్కువగా ఉండడమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందట. మరి పని గంలు పెరిగితే, ఎంతమంది ఈ విధానానికి మద్ధతు పలుకుతారన్నదే చర్చనీయాంశమవుతోంది.