HomePoliticsఆ మాజీ ఎమ్మెల్యేకు ఈసారి టికెట్ డౌటేనా.. ?

ఆ మాజీ ఎమ్మెల్యేకు ఈసారి టికెట్ డౌటేనా.. ?

  • హై కమాండ్ నిబంధనే అందుకు కారణమా ? మరి నిజంగా ఆ నిబంధన అమలైతే ఆ మాజీ పరిస్థితేంటి ?
  • అక్కడ ఆల్టర్నెట్ నేత ఎవరైనా ఉన్నారా ?
  • ఇక ఇదే సందన్నట్లుగా ఆ సీనియర్ ను కాదని రేవంత్ తన అనుచర వర్గానికి టికెట్ ఇప్పించే దైర్యం చేస్తారా ?
  • మరింతకీ ఏంటా సెగ్మెంట్ ? చిక్కుల్లో పడ్డ ఆ ఎక్స్ ఎమ్మెల్యే ఎవరో చూద్దామా..

ఇప్పటి దాకా మనం చెప్పుకుంది నల్లమాద పద్మావతి గురించే. మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి ఈమె. ఉత్తమ్ దంపతులకు కోదాడలో మంచి పట్టుంది. 2014 ఎన్నికల్లో ఉత్తమ్ హుజూర్ నగర్ లో ఘన విజయం సాధిస్తే, అదే సమయంలో ఆయన సతీమణి పద్మావతి కోదాడలో బంపర్ మెజార్టీతో గెలిచింది. ఆ తర్వాత జరిగిన 2018 ఎన్నికల్లో ఉత్తమ్ అదే సెగ్మెంట్ నుంచి విజయం సాధించగా, పద్మావతి మాత్రం కోదాడ లో స్వల్ప తేడాతో ఓటమి పాలైంది.

ఇక ఆ ఎన్నికల తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తమ్ నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొంది హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేశారు. ఆ ఉప ఎన్నికల బరిలో పద్మావతి దిగితే ఆమెకు భంగ పాటు ఎదురైంది. టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి చేతిలో చిత్తు చిత్తుగా ఓడింది. ఈ పరిణామాల నేపథ్యంలో మళ్ళీ పాత సెగ్మెంట్ పైనే దృష్టి పెట్టింది పద్మావతి. పోగొట్టుకున్న చోటే రాబట్టుకోవాలనే ఫిలాసఫీని ఫాలో అయ్యే ప్రయత్నాలు షురూ చేసింది.

ఇక ఎలాగూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తమ్ హుజూర్ నగర్ నుంచి బరిలో దిగేందుకు సిద్దమవుతున్నారు కాబట్టి కోదాడ టికెట్ లైన్ క్లియర్ అయ్యిందనే భావనలో ఉన్నారు పద్మావతి. కానీ ఇంతలోనే హై కమాండ్ చేదు వార్త ఒకటి కోదాడకు మోసుకొచ్చింది. కుటుంబంలో ఇద్దరికి టికెట్ అంటే కష్టమని బ్యాడ్ న్యూస్ చెప్పింది. దాంతో పద్మావతి ఇప్పుడు డైలమాలో పడి పోయింది.

ఈ నేపథ్యంలో కోదాడ నుంచి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎవరు పోటీ చేస్తారన్నదే ఆసక్తికరంగా మారిపోయింది. పార్టీలో ఉదయ్ పూర్ డిక్లరేషన్ ప్రకారం తీసుకొచ్చిన కొత్త నిబంధన పద్మావతిని కలవరానికి గురి చేస్తోందట. ఒకే కుటుంబానికి రెండు సీట్లు ఇవ్వద్దన్న నిబంధన ఇప్పుడు ఆమె ఆశలపై నీళ్లు జల్లిందని స్థానికంగా టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి ఈ నిబంధన పార్టీలో కొత్తదేమీ కాదు.

గత ఎన్నికల్లో నిబంధన అడ్డు రానప్పుడు…ఇప్పుడెందుకు ఆందోళన అన్న చర్చ సొంత కేడర్ లో వ్యక్తమవుతోంది. అయితే .. ఇక్కడే అసలు కథ ఉందన్న వాదన విశ్లేషకుల్లో వినిపిస్తోంది. గతంలో పద్మావతి భర్త ఉత్తమ్ కుమార్ రెడ్డి .. పీసీసీ ఛీఫ్ గా ఉన్నారు కాబట్టి .. పప్పు బెల్లాల్లా .. టిక్కెట్లు పంచుకోగలిగారు.. కానీ ఇప్పుడు మాజీ అయినా, పట్టు ఉన్నా .. నిబంధన వర్తిస్తుందని అంచనాలు వెల్లువెత్తుతున్నాయి.

  • ఉత్తమ్ హై కమాండ్ దగ్గర ఎంత చెబితే అంత..ఇప్పుడు సీన్ రివర్స్ అయింది..!

    ఇంకొక విషయమేమిటంటే, కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ చాలా సీనియర్. చాలా కాలం పాటు పీసీసీ చీఫ్ గా పనిచేశారు. హై కమాండ్ దగ్గర ఈయన ఎంత చెబితే అంత. అయితే ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. మరీ ముఖ్యంగా ప్రస్తుత పీసీసీ చీఫ్ రేవంత్ తో ఉత్తమ్ కు అస్సలు పొసగడం లేదు. అందుకే రూల్ పక్కాగా అమలు అవుతుందనే ఆందోళన ఉత్తమ్ దంపతులకు ఉందని టాక్.

    ఇదే జరిగితే పద్మావతి టికెట్ కు ఎసరు అన్నటాక్ కోదాడలో ఓ రేంజ్ లో వెల్లువెత్తుతోంది. కాగా తన భర్తకు పీసీసీ పదవి పోవడం, అదే సమయంలో పార్టీలో రేవంత్ ప్రభావం పెరిగిపోవడం పద్మావతిని సైతం టెన్షన్ పెట్టిస్తోంది. మరోవైపు పార్టీ ఇప్పుడు రెండు వర్గాలుగా చీలిపోయింది. రేవంత్ తీరును నిరసిస్తూ సీనియర్లంతా ఒక జట్టుగా ఏర్పడ్డారు. రేవంత్ వ్యతిరేక వర్గానికి ఉత్తమ్ నాయకత్వం వహిస్తున్నారు.

    రేవంత్ ఆధిపత్యాన్ని దెబ్బ కొట్టేందుకు ఆయన అండర్ గ్రౌండ్ ఆపరేషన్ మొదలెట్టారట కూడా. ఈ క్రమంలోనే గత కొంతకాలంగా రేవంత్‌, ఉత్తమ్‌కు గ్యాప్ భాగా పెరిగిపోయిందని పార్టీ వర్గాల్లో టాక్. దీంతో ఉత్తమ్ కు చెక్‌ పెట్టడం ద్వారా పార్టీలో తనకు ఎదురు లేదని నిరూపించుకునేందుకు రేవంత్ తీవ్రంగా ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

    అదేసమయంలో రేవంత్ ఒక కుటుంబానికి ఒకటే టిక్కెట్ అనే ఆయుధాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ రేవంత్ ఆ ఆయుధాన్ని బయటకు తీస్తే గనుక, పద్మావతి పరిస్థితి ఏంటనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మిగిలింది. అయితే ఇక ఆమె స్థానంలో ఆలర్ట్నేటివ్ దిశగా కూడా రేవంత్ పావులు కదుపుతున్నారని అంచనాలు వినిపిస్తున్నాయి.

    దీంతో రేవంత్‌ వ్యూహాత్మకంగానే కోదాడలో ఓ కొత్త నేతను ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. పద్మావతికి చెక్ పెట్టే పనిలో భాగంగా, పందిరి నాగిరెడ్డి అనే కొత్త వ్యక్తిని తెరపైకి తీసుకొచ్చారని సమాచారం. కాగా రేవంత్ మద్ధతుతో నాగిరెడ్డి కొంతకాలంగా ఉత్తమ్ వర్గాన్ని కాదని సొంతంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పద్మావతికి సమాంతరంగా పార్టీ కార్యక్రమాలు చేపడుతూ, తన కంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు.

    వచ్చే ఎన్నికల్లో పార్టీ ఆదేశిస్తే, పోటీకి సైతం సిద్ధం అంటున్నారట. ఇది ఉత్తమ్ వర్గానికి మింగుడు పడటం లేదని తెలుస్తోంది. కావాలనే రేవంత్ చోటా మోటా నేతల్ని ప్రోత్సహిస్తూ, వర్గ రాజకీయాలకు తెరలేపుతున్నారని ఉత్తమ్ అండ్‌ కో ఆగ్రహంగా ఉన్నట్లు కేడర్‌ నుంచి వినిపిస్తున్న మాట.

    అయితే ఉత్తమ్ కు చెక్ పెట్టేందుకు ఒకవేళ పద్మావతికి టికెట్ నిరాకరించి, కొత్త నేతకు టికెట్ ఇస్తే పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువ అనే వాదన కూడా తెరపైకి వస్తోంది. ఎందుకంటే 1999 నుంచి ఉత్తమ్ కోదాడలో రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. మంచి పట్టు సాధించారు కూడా.అ ది ఎంతలా అంటే కోదాడ కాంగ్రెస్ అంటే ఉత్తమ్, ఉత్తమ్ అంటే కోదాడ కాంగ్రెస్ .. అనే రేంజ్ లో ఉంది.

    ఈ నేపథ్యంలో ఉత్తమ్ దంపతులను కాదని కొత్త నేతకు టికెట్ ఇచ్చే సాహసం రేవంత్ చేస్తారా అనేది కూడా చర్చగా మిగిలింది. ఒకవేళ ఉత్తమ్ ను దెబ్బతీసేందుకు కొత్త నేతకు టికెట్ ఇచ్చినా ఆయన వర్గం సహకరిస్తారా లేదా అనేది కూడా అనుమానమే. దీంతో కోదాడ సెగ్మెంట్ పై రేవంత్ ఆలోచన లు ఎలా ఉండనున్నాయన్నదే ఆసక్తికరంగా మారింది.

    పద్మావతికి టికెట్ వస్తుందా ? లేక పంతానికి పోయి రేవంత్ కొత్త నేతకే అవకాశం ఇస్తారా ?ఒకవేళ తన సతీమణికి టికెట్ ఇప్పించుకోకపోతే, ఉత్తమ్ కు పరువుకు సంబంధించిన విషయం కాబట్టి, ఆయన ఏం చేస్తారన్నది కూడా ఆసక్తి కరంగా మారింది. ఇక ప్రస్తుతం పార్టీలో రేవంత్ హవానే నడుస్తుంది కాబట్టి, ఉత్తమ్ తన సతీమణి కోసం మెట్టు దిగి రేవంత్ తో దోస్తీ చేస్తారా అనేది కూడా చర్చనీయాంశం గా మారింది.

    మొత్తానికీ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ వర్సెస్ సీనియర్స్ ఎపిసోడ్.. ఎక్స్ ఎమ్మెల్యే పద్మావతికి గుబులు రేపుతోంది. ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్లుగా..సీనియర్ల లొల్లి తన టిక్కెట్టుకు ఎసరు పెడుతోందన్న ఆవేదనలో పద్మావతి ఉన్నారట. దీంతో ఈ వార్ చివరి వరకు కంటిన్యూ అయితే మాత్రం, దంపతుల్లో ఎవరో ఒకరు సర్ధుకోవాల్సిందేనని రేవంత్ వర్గం సెటైర్లు వేయడం మొదలెట్టారట.

    దీంతో కోదాడలో .. కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరు బరిలోకి దిగుతారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ పద్మావతికే టిక్కెట్ లభిస్తే, ఉత్తమ్ పట్టు బిగించినట్లేనని, కొత్త అభ్యర్థి గనుక పోటీకి దిగితే, కోదాడలో సైతం రేవంత్ తన మార్క్చూ పించినట్లేనని టాక్ వెల్లువెత్తుతోంది. ఇప్పటికే సీనియర్ల లొల్లితో ఓ రేంజ్ లో ఫైరవుతోన్న రేవంత్ .. ఈ ఛాన్స్ వదులుకోరని పార్టీలో అంతర్గతంగా చర్చ వినిపిస్తోంది.

    ఇప్పుడు సీనియర్లకు లీడర్ గా మారిన ఉత్తమ్ కు చెక్ పెట్టడం రేవంత్ కు అత్యవసరమన్న అంచనాలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో కోదాడ .. అభ్యర్థిత్వం ఎవరికి అన్నది .. జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.

    మరి చూడాలి ముందు ముందు ఏం జరుగుతుందో..

    Must Read

    spot_img