పార్టీ మారతారంటూ ఆ మాజీ మంత్రిపై వార్తలు ఓ రేంజ్ లో వినిపించాయి. అయితే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు క్లారిటీ ఇచ్చినట్లేనా..? అందుకే లోకేష్ తో గంటా భేటీ అయ్యారా..? అన్న చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫ్యూచర్ ఏంటి.? వైసీపీలో చేరుతున్నారా..? వైసీపీలో చేరడానికి ముహూర్తం ఖరారైందా..? జనసేనలో చేరాలి అనుకున్నారా..? బీజేపీలో చేరే ఆప్షన్ కూడా ఉంచుకున్నారా..? గత కొన్ని రోజులుగా గంటా పై జరిగిన ప్రచారం ఇది.. సోషల్ మీడియాలో అయితే మరో అడుగు ముందుకు వేసి.. గంటా వైసీపీలో చేరిపోతున్నారని.. జనవరిలోనే ఆయన వైసీపీ కండువా కప్పుకుంటున్నారని కథనాలు వినిపించాయి. అయితే ఆ వార్తలకు బ్రేక్ వేశారు గంటా.. ఇటీవల నారా లోకేష్ తో .. హైదరాబాద్ లో గంటా శ్రీనివసరావు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అయినా ఆయన పార్టీ మారుతున్నారనే రూమర్లకు మాత్రం బ్రేక్ పడలేదు.. కానీ తాజాగా విశాఖలో ఆయన వ్యాఖ్యలతో పూర్తి క్లారిటీ వచ్చేసింది.
రాష్ట్రంలో ఎన్నికల వేడి పెరగడంతో గంటా కూడా యాక్టివ్ అయ్యారు. అందులోనే భాగంగానే నారా లోకేష్ పాద యాత్రపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నో టీడీపీ కార్యాలయంలో.. ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన నారా లోకేష్ ప్రారంభిస్తున్న యువగళం పాదయాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ పాద యాత్ర ఈ నెల 27 నుంచి ప్రారంభం అవుతుంది. 400 రోజులు.. 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు. మొత్తం 175 నియోజక వర్గాల్లో అన్ని ఏర్పాటు జరుగుతున్నాయి. అయితే లోకేష్ చేపడుతున్న యువగళం పాదయాత్ర సెన్సేషనల్ హిట్ అవుతుందని గంటా జో’స్యం చెప్పారు. ప్రస్తుతం దేశానికి యువత వెన్నుముక అని.. అలాంటి యువత రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు పడుతోందని, అందుకే లోకేష్ పాదయాత్ర విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇలా పాద యాత్రపై కామెంట్స్ చేయడమే కాదు.. ఉత్తరాంధ్రతో సహా.. కీలక నియోజకవర్గాల్లో లోకేష్ పాద యాత్ర ఏర్పాట్లు మొత్తం గంటానే చూసుకోనున్నారని సమాచారం. ఇటీవల లోకేష్ తో సమావేశం సయయంలోనే.. దీనిపై గంటా సానుకూలంగా స్పందించినట్టు టాక్. లోకేష్ పాద యాత్ర సక్సెస్ చేసే బాద్యతను తనపై వేసుకున్నారని టీడీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అందుకు తగ్గట్టే ఉన్నాయి ఆయన వ్యాఖ్యలు.. గంటా మనస్ఫూర్తిగా లోకేష్ వెంట నడిస్తే.. కచ్చితంగా సభ సక్సెస్ అవుతుందిన్నది టీడీపీ వర్గాల ధీమా.. ఏదీ ఏమైనా ఇక తాను మాత్రం టీడీపీతోనే ఉంటున్నట్టు క్లారిటీ ఇచ్చేశారు గంటా.. ఇక ఆయన పార్టీ మార్పు వార్తలకు బ్రేక్ పడినట్టేనని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఆయన యూటర్న్ తీసుకోడానికి కారణాలు లేకపోలేదన్నది రాజకీయ విశ్లేషకులు మాట.. జనసేన-టీడీపీ పొత్తు ఉంటే ఆయన పార్టీ మారకూడదని ముందే ఫిక్స్ అయ్యారు. అందుకు తగ్గట్టే ఆయన బ్యాక్ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నట్టు తెలుస్తోంది.
అటు పవన్ నుంచి ఇటు లోకేష్ నుంచి కొత్త నియోజకవర్గంపై హామీ కూడా తీసుకున్నారని సమాచారం.. అలాగే ఆయన తనకు తెలిసిన వారి ద్వారా చేయించుకున్న సర్వేల్లో టీడీపీ -జనసేన కలిసి పోటీ చేస్తే.. వచ్చే ఎన్నికల్లో అధికారం వచ్చే అవకాశం ఉందని ఆయనకు నివేదికలు అందినట్టు ప్రచారం జరుగుతోంది. చంద్రబాబుది నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ చరిత్ర. పైగా వయసులోనూ ఆయన పెద్దవారు. సీనియర్ పొలిటీషియన్. ఆయన విషయంలో పార్టీలో సీనియర్ నేతలు ఎన్ని అనుకున్నా గౌరవం ఇస్తూంటారు.
బాబు ఒక మాట అన్నా ఓకే అనుకుంటారు. కానీ బాబు గారి సోలో వారసుడిగా వచ్చి పార్టీలో తాను పుట్టకముందు నుంచి ఉన్న పెద్దల మీద లోకేష్ పెత్తనం చేస్తున్నారు అని తెలుగుదేశంలో సీనియర్లు మధనం చెందుతూ ఉంటారని ప్రచారంలో ఉన్న మాట. సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు కూడా చంద్రబాబు అంటే తనకు గౌరవం అని చెబుతూ ఉంటారు. అలాంటి ఆయనకు లోకేష్ జూనియర్ అన్న భావన ఉంటూండేది అని ప్రచారంలో ఉన్న మాట. అలాంటి లోకేష్ ని ఇటీవల కలసి గంటా అందరినీ ఆశ్చర్యపరచారు. లోకేష్ ప్రాధాన్యత పార్టీలో అమాంతం పెరిగిపోతోంది.

ఇక అనివార్యమైన నేపధ్యంలో గంటా కలిశారు అని అంతా అనుకున్నారు. అయితే గంటా చినబాబుని కలవడంలో ఆంతర్యం ఏమీ లేదు అని చెప్పుకున్నారు. ఇన్నాళ్లూ తాను పార్టీలో యాక్టివ్ గా ఉండలేకపోవడానికి కారణం కోవిడ్ తప్ప నేరం తనది కాదు అని చెబుతున్న గంటా ఇక మీదట గంట గణగణ మోగించేస్తాను అంటున్నారు. ఈ విషయాలు ఎలా ఉన్నా లోకేష్ పెద్దరికాన్ని గంటా ఎట్టకేలకు అంగీకరించడమే అసలైన విశేషం అని పార్టీలోని ఆయన ప్రత్యర్ధుల నుంచి వినిపిస్తున్న మాట. దీంతో లోకేష్ బాబు ఏది చెబితే అది చేయడానికి గంటా తయారుగా ఉన్నారనే అనుకోవాలి.
విశాఖ జిల్లాలో లోకేష్ ని ఇప్పటికే మరో మంత్రి అయ్యన్నపాత్రుడు భుజానకెత్తుకున్నారు. ఇపుడు గంటా తోడు అయ్యారు. దీంతో వీరిద్దరిలో చినబాబు ఎవరికి ఓటేస్తారో, ఎవరికి ప్రాధాన్యత ఇస్తారో అన్నది సొంతపార్టీలో చర్చనీయాంశంగా మారింది. గంటా శ్రీనివాసరావు చాలా కాలంగా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అసెంబ్లీ సమావేశాలకూ హాజరు కావడం లేదు. ఈ కారణంగా పలుమార్లు ఆయన పార్టీ మారుతారన్న ప్రచారం జరిగింది. అయితే ఇటీవల టీడీపీ నేత నారా లోకేష్ తో భేటీ అయ్యారు. ఈ ఇద్దరు సుమారు 40 నిమిషాల పాటు చర్చించుకున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు రావాలని అధిష్టానం కోరిన ఆయన హాజరుకాలేదు. పార్టీ సభ్యత్వ విషయంతో పాటూ కమిటీల ఏర్పాటుపై గంటా శ్రద్ధ పెట్టలేదనే విమర్శలు ఉన్నాయి.
తాజాగా లోకేష్ తో జరిగిన సమావేశంలో తాను ఎందుకు పార్టీకి దూరంగా ఉండాల్సి వచ్చింది… తదితర అంశాలను కు వివరించినట్లు సమాచారం. దీంతో గంటాపై టీడీపీ అధిష్టానం వైఖరి ఎలా ఉంటుంది. ఆయన భవిష్యత్తు కార్యాచరణపై ఏమిటనేది కూడా తేలాల్సి ఉంది. తాజా సమావేశంలో కొంత స్పష్టత వచ్చిందని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఇక నుంచి పార్టీ కార్యక్రమాల్లో గంటా పాల్గొంటారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. 2019లో భీమిలి నియోజకవర్గాన్ని వీడి విశాఖ నార్త్ నుంచి పోటీ చేసి గెలిచారు.
ఎన్నికల ఫలితాలు వెల్లడైన నాటి నుంచి ఆయన టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే పదవికి గంటా రాజీనామా చేశారు. అటు తర్వాత ఆయన దారెటు అంటూ వార్తలు ఓ రేంజ్ లో వెల్లువెత్తాయి. తాజాగా గంటా శ్రీనివాసరావు తన రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చారు. తాను టీడీపీలోనే ఉన్నానని.. రెండేళ్లు కోవిడ్, తర్వాత తన అనారోగ్య కారణాల వల్లే పార్టీలో యాక్టివ్‌గా ఉండలేకపోయానని చెప్పారు. మధ్యలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని.. ఇప్పటి నుంచి యాక్టివ్‌గా ఉంటానని చెప్పారు.
ఈ భేటీ తర్వాత గంటా శ్రీనివాసరావు వైఖరిలో మార్పు వచ్చిందనే ప్రచారం కూడా టీడీపీ శ్రేణుల్లో సాగుతుంది. అయితే ఇటీవల చంద్రబాబు-పవన్ కల్యాణ్ భేటీతో రాష్ట్రంలో రాజకీయ పరిణామాల్లో మార్పు వస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే గంటా శ్రీనివాసరావు వెళ్లి లోకేష్‌ను కలవడంపై పలు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీ రాజకీయ పరిణామాలు మారుతున్న నేపథ్యంలో టీడీపీ అధిష్టానానికి దగ్గరయ్యేందుకు గంటా శ్రీనివాసరావు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం కూడా సాగుతుంది. ఆయన అధికార వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారనే ప్రచారం కూడా సాగింది. అయితే ఆ దిశగా మాత్రం గంటా
అడుగులు వేయలేదు. మరోవైపు ఒకటి, రెండు సందర్భాల్లో చంద్రబాబును కలిసి గంటా శ్రీనివాసరావు.. పార్టీలో ఉన్నాననే సంకేతాలు పంపారు.
కానీ టీడీపీ నేతలు మాత్రం ఆయన వ్యవహార శైలిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా టీడీపీ నిర్వహించిన కార్యక్రమాల్లోనైతే గంటా శ్రీనివాస్ పాల్గొనలేదు. పార్టీ లైన్‌కు మద్దతుగా కూడా ఆయన ఎలాంటి కామెంట్స్ చేయలేదు. పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకుంటే తానే ప్రకటిస్తానని చెప్పారు. మరోవైపు కాపులు నిర్వహించిన ఓ సమావేశంలో కూడా గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఆ తర్వాత కాపునాడు సభకు మాత్రం హాజరుకాలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో లోకేష్‌తో గంటా శ్రీనివాసరావు భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.
మరి గంటా .. లోకేష్ భేటీ తర్వాతి కథేంటన్నదే ఆసక్తిని రేకెత్తిస్తోంది.