ప్టో కరెన్సీ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అంటున్నారు. క్రిప్టో కరెన్సీ వల్లే ఆర్థిక సంక్షోభం తలెత్తే ముప్పు ఉందని ఆయన స్పష్టం చేస్తున్నారు. దీనిపై ఆయన చెబుతున్నది .. ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
దేశ ఆర్థిక వ్యవస్థలో క్రిప్టో కరెన్సీ ప్రమాదకరమైందని.. దీనికన్నా .. డిజిటల్ రూపీ మరింత మెరుగైందని ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత దాస్ ..
అంటున్నారు.. అయితే దీనిపై ఆయన వెల్లడించిన అభిప్రాయాలు .. ఆర్థిక నిపుణుల్లో చర్చను రేకెత్తిస్తున్నాయి.
క్రిప్టో కరెన్సీపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రిప్టో కరెన్సీలపై నిషేధం విధించాలన్న తన
అభిప్రాయాన్ని మరోసారి ఆయన సమర్ధించుకున్నారు. క్రిప్టో కరెన్సీని ఆర్‌బీఐ మొదటినుంచి వ్యతిరేకిస్తోంది. ఈ కరెన్సీకి ప్రత్యామ్నాయంగా డిజిటల్
రూపీని ఇటీవలనే ప్రభుత్వం ప్రవేశపెట్టింది. క్రిప్టోలకు సరైన విలువ లేదని, ఆర్థిక స్థిరత్వానికి ఇవి ప్రమాదకరమన్నారు. భవిష్యత్ ఆర్థిక సంక్షోభం
వస్తే గిస్తే అది ముమ్మాటికీ ప్రైవేట్ క్రిప్టో కరెన్సీలతోనే అని ఆయన కుండ బద్దలు కొట్టారు. మన దేశంలో అంతర్లీన ఆర్థిక కార్యకలాపాలు పటిష్టంగా
కొనసాగుతున్నాయని, అయితే బాహ్య కారకాలు ఆర్థిక వ్యవస్థకు కొంత నష్టం కలిగిస్తాయని దాస్ చెప్పారు. ఈ ఏడాది క్రిప్టో కరెన్సీ విలువ 40
బిలియన్ డాలర్లు తగ్గిందని శక్తికాంత్ దాస్ తెలిపారు. క్రిప్టో కరెన్సీ విలువ ఇప్పుడు 140 బిలియన్ డాలర్లుగా ఉన్నదని చెప్పారు.
క్రిప్టోలపై ఇంకా నమ్మదగిన వాదన ఏదీ లేదని ఆయన పేర్కొన్నారు. రిటైల్ ఈ-రూపాయిని భవిష్యత్ కరెన్సీగా అభివర్ణించారు. సీబీడీసీలో దేశాల మధ్య తక్షణ నగదు బదిలీ జరుగుతుందని తెలిపారు. ఇది ఈ శతాబ్దంలో డిజిటల్ కరెన్సీలో మన దేశాన్ని ముందంజలో ఉంచుతుందని అన్నారు. బిట్‌కాయిన్ తదితర క్రిప్టో సాధనాల్ని నిషేధించాల్సిన అవసరం ఉందని శక్తికాంత్ దాస్ నొక్కిచెప్పారు. ఇటువంటి స్పెక్యులేటివ్ సాధనాల్ని ఎదగనిస్తే తదుపరి ఆర్థిక సంక్షోభం ప్రైవేటు క్రిప్టోకరెన్సీ ద్వారానే తలెత్తుతుందని ఆయన హెచ్చరించారు. క్రిప్టో కరెన్సీలను దాస్ తొలినుంచీ వ్యతిరేకిస్తున్న తెలిసిందే. ఇప్పటికే ఆర్థిక మాంద్యం ఆవరించి వ్యాపారాలను అతలాకుతలం చేస్తోంది. అయితే ఇప్పుడు అందరి భయం రాబోయే ఆర్థిక సంక్షోభంపైనే ఉంది. దీనిపై ఇప్పటికే చాలా కాలంగా అనేక దేశాలు, నిపుణులు చర్చిస్తున్నాయి.
ఈ క్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ క్రిప్టోకరెన్సీ పెట్టుబడుల విషయంలో తన హెచ్చరికను పునరుద్ఘాటించారు.
క్రిప్టోలు ప్రపంచంలో మరో ఆర్థిక సంక్షోభానికి కారణంగా నిలుస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఎలాంటి ప్రభుత్వ నియంత్రణ, రూల్స్ లేని క్రిప్టోలను నిషేధించాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చాలా మంది సరైన అవగహన లేనప్పటికీ అనేక క్రిప్టో కాయిన్స్ లలో పెట్టుబడులు పెట్టి నష్టాలపాలు కావటం పెద్ద సమస్యగా మారుతోంది. అందుకే తర్వాతి ఆర్థిక సంక్షోభం ప్రైవేట్ క్రిప్టోకరెన్సీల నుంచి వస్తుందని, తన మాటలను పెడచెవిన పెట్టొద్దని నొక్కి చెప్పారు. క్రిప్టో కరెన్సీలు సెంట్రల్ బ్యాంకుల నియంత్రిత ప్రపంచాన్ని విశ్వసించరని.. వాటిని ఓడించాలనే కాంక్షతో ముందుకు సాగుతున్నాయని చెప్పారు.
అమెరికాలోని అతిపెద్ద క్రిప్టో ఎక్స్ఛేంజ్ FTX క్రాష్‌ను రాబోయే ఆర్థిక ముప్పుకు రుజువుగా దాస్పే ర్కొన్నారు. నవంబర్‌లో దివాళా తీయడానికి ముందు FTX 32 బిలియన్ డాలర్లు విలువైన క్రిప్టోకరెన్సీ క్రిప్టో ఎక్స్ఛేంజ్ గా ఉంది. దీనికి తోడు ప్రైవేట్ క్రిప్టోకరెన్సీల వాల్యుయేషన్ 190 బిలియన్ డాలర్ల నుంచి 140 బిలియన్ డాలర్లకు తగ్గిపోయింది. గత సంవత్సరం ఒకానొక సమయంలో బిట్‌కాయిన్ అత్యధికంగా 60వేల డాలర్లకు చేరుకుంది. అయితే నవంబర్ 2021లో ఇది భారీ పతనాన్ని చూసింది. దీని ప్రపంచం మార్కెట్విలువ గరిష్ఠ స్థాయి అయిన 3 ట్రిలియన్ డాలర్ల నుంచి 2 ట్రిలియన్ డాలర్లకు తగ్గి ఇన్వెస్టర్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. పైగా ప్రైవేటు క్రిప్టో ఎక్స్ఛేంజీలకు ఆస్తులు లేకపోవటం చాలా ప్రమాదకరమని దాస్ అభిప్రాయపడ్డారు. దాదాపుగా దశాబ్ధకాలం కిందట క్రిప్టోలు భారత్ లోకి ప్రవేశించినప్పటికీ వాటి పనితీరును రిజర్వు బ్యాంక్ తో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా పరిశీలిస్తూనే ఉన్నాయి.
ఇటీవల క్రిప్టోలను నియంత్రించాలని కేంద్రం నిర్ణయించటంతో వాటి ట్రాన్సాక్షన్లపై ఉక్కుపాదం మోపుతోంది.
అధిక పన్నులతో పాటు ఇతర ఛార్జీలను విధిస్తోంది. ప్రైవేట్ కరెన్సీల ట్రేడింగ్ నుండి వచ్చే లాభాలపై 30% పన్ను ఈ సంవత్సరం ప్రవేశపెట్టబడింది. దీంతో ఇండియాలో ఇన్వెస్టర్లు చాలా వరకు క్రిప్టోలకు దూరంగా జరుగుతున్నారు. 2018లో ఆర్బీఐ నిషేధం విధించగా 2020లో సుప్రీం కోర్టు ఆంక్షలను ఎత్తివేయటంతో అప్పట్లో చాలా మంది ఇన్వెస్ట్ చేసి నష్టాలను మూటకట్టుకున్నారు. తాజాగా క్రిప్టోకరెన్సీ ఎక్సేంజ్ ఎఫ్‌టీఎక్స్ దివాళా తీయడం అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక మోసంగా దాస్ అభివర్ణించారు. క్రిప్టో సాధనాలు ఎంత ప్రమాదకరమో ఈ ఉదంతం తెలియపరుస్తున్నదన్నారు.
ప్రైవేటు క్రిప్టోకరెన్సీల విలువ 190 బిలియన్ డాలర్ల నుంచి 140 బిలియన్ డాలర్లకు పడిపోయిందని, వీటి మార్కెట్ ఆధారిత ధరకు అంతర్లీన
విలువ ఏదీ లేదన్నారు. ఇది 100 శాతం స్పెక్యులేటివ్ యాక్టివిటీ, దీనిని నిషేధించాలన్నదే నా అభిప్రాయం, వీటిని నియంత్రణ పరిధిలోకి
తీసుకొచ్చి, ఎదగనిస్తే, క్రిప్టోలతో ఆర్థిక సంక్షోభం తప్పదని హెచ్చరించారు. క్రిప్టోకరెన్సీలు వ్యవస్థను అంతరాయం కలిగించడానికి, వ్యవస్థను
విచ్ఛిన్నం చేయడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. క్రిప్టో కరెన్సీలకు నియంత్రణ ఉండదని, అలాగే, ఇది ఏ మంచి ప్రజా ప్రయోజనానికి
ఉపయోగపడదని, ఇది 100 శాతం ఊహాజనితమైనదని, క్రిప్టోకరెన్సీలను నిషేధించాలన్నారు. ఈ డిజిటల్ ఆస్తులు ద్రవ్య విధానాన్ని నిర్ణయించే
సెంట్రల్ బ్యాంక్ సామర్థ్యం పరంగా గణనీయమైన ఆర్థిక అస్థిరతకు కారణమవుతాయని కూడా ఆయన అన్నారు. ఇదిలా ఉంటే, UPI అనేది
చెల్లింపు వ్యవస్థ, కానీ CBDC ఒక కరెన్సీ. UPI అనేది బ్యాంకుల మధ్యవర్తిత్వాన్ని కలిగి ఉంటుంది, అయితే CBDC అనేది లావాదేవీల
మధ్య స్థిరపడ్డ పేపర్ కరెన్సీ లాంటిది.
డిజిటల్ రూపీ ఆటోమేటిక్ స్వీప్-ఇన్ స్వీప్-అవుట్ సదుపాయాన్ని కలిగి ఉంటుంది. డిజిటల్ రూపాయి వల్ల పేపర్ కరెన్సీల ప్రింటింగ్ ఖర్చు కూడా
ఆదా అవుతుందని, వేగంగా బదిలీలు జరుగుతాయని దాస్ తెలిపారు. ఈ నెల ప్రారంభంలో, RBI భారతదేశ డిజిటల్ కరెన్సీని ప్రయోగాత్మకంగా
ప్రారంభించింది. CBDC అనేది సెంట్రల్ బ్యాంక్ జారీ చేసే కరెన్సీ డిజిటల్ రూపం. అందువల్ల, డిజిటల్ కరెన్సీ సావరిన్ కరెన్సీ లాంటిది ప్రస్తుత
కరెన్సీతో సమానంగా మార్పిడి చేసుకోవచ్చు. మరోవైపు, క్రిప్టోకరెన్సీ అనేది కరెన్సీ ఒక రూపం, దాని స్వంత విలువను కలిగి ఉంటుంది
లావాదేవీలను సురక్షితంగా ఉంచడానికి క్రిప్టోగ్రఫీని ఉపయోగిస్తుంది.
భారత్‌లో అంతర్గత ఆర్థిక కార్యకలాపాలు పటిష్టంగా కొనసాగుతున్నాయి. అయితే.. బాహ్య కారకాలు ఆర్థిక వ్యవస్థకు కొంత నష్టం కలిగిస్తున్నాయి. నియంత్రణా వ్యవస్థలపై విశ్వాసం లేనివారే వీటిని సష్టించారు. ఇది ప్రజలకు ఎలాంటి ప్రయోజనాన్ని చేకూర్చుతుందో తెలుసుకోవాల్సి ఉందని దాస్ అన్నారు. డిజిటల్ ఇ- రూపాయిని భవిష్యత్ కరెన్సీగా అభివర్ణించిన ఆయన ఈ శతాబ్దంలో డిజిటల్ కరెన్సీలో భారత్‌ను ముందంజలో ఉంచుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభ సమయంలో చాలా మంది రుణాలు తీసుకోలేకపోవడంతో డిపాజిట్లు భారీగా నమోదయ్యాయన్నారు. క్రితం ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం డిసెంబరు వరకు రుణాల్లో భారీ వద్ధి చోటు చేసుకోగా.. డిపాజిట్లలో క్షీణత నమోదయ్యిందన్నారు. దేశంలో ఈ ఏడాది తొలి నెలల్లో ద్రవ్యోల్బణం పెరుగుదలకు సరఫరాల సంబంధ సమస్యలే ప్రధాన కారణమని ఆర్‌బిఐ విడుదల చేసిన ఓ బులిటెన్‌లో పేర్కొంది. ఇటీవల తగ్గిన ద్రవ్యోల్బణం తీవ్రతతో ఆర్థిక వ్యవస్థలో డిమాండ్, వ్యయాలు భారీగా పెరుగుతున్నాయని అంచనా వేసింది.
దేశ ఆర్థిక వ్యవస్థలో క్రిప్టో కరెన్సీలు .. పెద్ద సంక్షోభాన్ని తీసుకువస్తాయని శక్తికాంత దాస్ చెబుతున్నారు. దీని స్థానంలో డిజిటల్ ఈ రూపీకి చట్ట
బద్ధత ఉందని అంటున్నారు. ఇదీ ఇవాల్టి ఫోకస్.. రేపటి ఫోకస్ లో మళ్లీ కలుద్దాం..