Homeఅంతర్జాతీయంఉక్రెయిన్ కు పాక్ ఆయుధాల సాయం వెనుక భారీ కుట్ర?

ఉక్రెయిన్ కు పాక్ ఆయుధాల సాయం వెనుక భారీ కుట్ర?

ఉక్రెయిన్ కు పాకిస్తాన్ ఆయుధ సాయం అందించనుందని సమాచారం. దాయాది దేశానికి మింగ మెతుకు లేకున్నా పౌరుషానికేం తక్కువ లేదు. ఓవైపు ఆర్థిక కల్లోలం, ప్రక్రుతి వైపరీత్యాలు మరోవైపు ఉగ్రవాద దాడులతో సతమతమవుతూనే కరాచీ పోర్టు నుంచి ఉక్రెయిన్ కు రాకెట్ లాంచర్స్, మోర్టార్లను పంపించనుంది. అయితే ఇలా చేయడం కేవలం రష్యా భారత్ స్నేహం కారణంగానే అనుకుంటే పొరబాటే..దానికి బదులుగా ఉక్రెయిన్ నుంచి సాయం పొందనుంది.

శత్రువుకు శత్రువు మిత్రుడు అని అంటారు. పాకిస్థాన్ ఇప్పుడు అదే ఆలోచన చేస్తుందా అనిపిస్తోంది. భారత్-రష్యా మధ్య స్నేహ బంధం కొనసాగటాన్ని బహుశా పాకిస్థాన్ జీర్ణించుకోలేకపోతోంది. అందుకే రష్యాకు దాని మిత్రదేశం చైనాకు కూడా భయపడకుండా యుక్రెయిన్ కు ఆయుధాల సహాయం చేయడానికి సిద్ధపడింది. ఈ విషయంపై ఎకనామిక్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది.

భారత్ రష్యాల మధ్య బంధం పెరుగుతుండడంతో పాకిస్థాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా అందులో తెలిపింది. కరాచీలోని పోర్టు నుంచి యుక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్న యూరోపియన్ దేశంలోని పోర్టుకు సముద్రమార్గం ద్వారా మోర్టార్లు, రాకెట్ లాంచర్లను పాకిస్థాన్ పంపనుందని సమాచారం. అయితే యుక్రెయిన్ పాకిస్థాన్ ల మధ్య చాలాకాలంగా మిలటరీ, వాణిజ్యాల విషయంలో మంచి లావాదేవీలు కొనసాగుతున్నాయి.

991 నుంచి 2020 వరకు దాదాపు 1.6 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన మిలటరీ ఉత్పత్తులను పాక్ యుక్రెయిన్ నుంచి కొనుగోలు చేసింది. దీంట్లో యుక్రెయిన్ తయారు చేసిన T-80 UD యుద్ధ ట్యాంకులు 320 కి పైగా ఉన్నాయి. వీటి నిర్వహణ బాధ్యతల్ని కూడా యుక్రెయినే చూసుకునేలా రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది.

దీన్ని బట్టి చూస్తే యుక్రెయిన్ పాకిస్థాన్ దేశాల మధ్య అండర్ స్టాండింగ్ బాగానే కొనసాగుతున్నట్లుగా సమాచారం. చమురు విషయంలో భారత్‌కు ఇచ్చినట్లే తమకూ డిస్కౌంట్ ఇవ్వాలని రష్యాకు ఓ డెలిగేషన్ ను పంపించింది పాకిస్తాన్. వారు అన్నీ మాట్లాడి చమురు గురించి గోధుమల గురించి మాట్లాడి చమురు గురించి అడిగారు. కానీ పాకిస్థాన్ రిక్వెస్టుకు రష్యా అంగీకరించలేదు.

ససేమిరా అంటూ నో చెప్పేసింది. ఈ నిర్ణయంతో రష్యా భారత్ పాకిస్థాన్ తమ దృష్టిలో ఒకటి కాదనే సంకేతాలిచ్చినట్లైంది. దీన్ని బహుశా పాక్ భరించలేకపోతోంది. ఓ పక్క భారత్ పై పగతో ఎప్పుడు రగిలిపోతుంటుంది పాకిస్తాన్. మరోపక్క భారత్ కు రష్యా చేస్తున్న సహాయం తమకు చేయటంలేదనే అక్కసు అసహనం వెరసి పాక్ ను కమ్మేసాయి. ఏమైతే అదయిందని నిర్ణయించుకుని రష్యాను ఎదిరించేందుకు సిద్ధపడింది పాకిస్తాన్.. యుక్రెయిన్ పై యుద్ధం ప్రకటించిన తర్వాత రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించాయి. రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను తగ్గించాయి. చాలా దేశాలు ఈ ఆంక్షలను అమలు చేస్తున్నాయి. కానీ రష్యాతో భారత్ మాత్రం ఆయిల్ కొనుగోలు విషయాలో పాశ్యాత్య దేశాల నిర్ణయాన్ని తోసిపుచ్చింది.

రష్యానుంచి చమురు కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని రష్యా కూడా భారత్ కు తక్కువ ధరకే చమురు సరఫరా చేసింది. దీంతో పాకిస్థాన్ కూడా తమ మంత్రుల్ని రష్యా పంపించి భారత్ కు ఇచ్చినట్లే చమురు అమ్మకాల్లో తక్కువ ధరకు ఇవ్వాలని కోరింది. అయితే పాకిస్తాన్ కుట్రదోరణి గురించి బాగా తెలిసిన రష్యా అందుకు ఒప్పుకోలేదు.

అయితే ఎక్కడికి వెళ్లినా తమ దేశం కష్టాలు ఏకరువు పెట్టడం సాయం కోరడం అప్పుకోసం చేయిచాచడం పాకిస్తాన్ కు అలవాటు. ఆ విషయం తెలిసిన దేశాలన్నీ పాకిస్తాన్ ను దూరం పెడుతున్నాయి. ఒకవేళ పాకిస్తాన్ విజ్నప్తిని అంగీకరించినా తక్కువ ధరకు చమురు అందించినా ఆ డబ్బు ఎప్పుడిచ్చేది గ్యారంటీ ఉండదు. అందుకే అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరమే బెస్ట్ అని అనుకుని ఉంటుంది రష్యా.

అందుకే పెద్దగా ఆశలేం పెట్టుకోకుండా ముందే నో చెప్పేసింది. దీంతో పాకిస్తాన్ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయింది. ఈ విషయం బయటకు తెలిస్తే భారత్ ముందు పరువు పోవడం ఖాయం. అందుకే నాసిరకం గోధుమల సరఫరా గురించి ఆరా తీసి తిరుగుముఖం పట్టింది సదరు డెలిగేషన్. అయితే ఆ గోధుమలను కూడా రష్యా పేద దేశాలకు ఉచితంగానే సరఫరా చేస్తోంది. ఎన్నో దేశాలకు సహాయం చేస్తున్న రష్యాకు పాకిస్తాన్ కు కూడా పంపిస్తామని అంగీకరించింది. కానీ అవి రష్యాలో పనికిరాని గోధుమలేనని చెబుతున్నారు.

నాసిరకం గోధుమలే కాబట్టి పాకిస్తాన్ కు ఉచితంగానే పంపిస్తామని చెప్పడంతో పాకిస్తాన్ చావు తప్పి కన్ను లొట్ట బోయినట్టు రష్యాకు వెళ్లిందే గోధుమల కోసం అన్నట్టుగా ప్రచారం చేసుకుని త్రుప్తి పడింది

Must Read

spot_img