HomePoliticsఎన్నికలే టార్గెట్ గా మోడీ, షా ద్వయం పావులు కదుపుతోందా..?

ఎన్నికలే టార్గెట్ గా మోడీ, షా ద్వయం పావులు కదుపుతోందా..?

రాష్ట్రాల ఎన్నికలే టార్గెట్ గా మోడీ, షా ద్వయం పావులు కదుపుతోందా..? అందుకే మరోసారి కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు సిద్ధమవుతోందా.? ఈ
దఫా రీషఫిల్ లో ఎవరెవరికి ఛాన్స్ లభించనుంది..?

వచ్చే ఏడాదిలో ఎన్నికల నగారా మ్రోగనున్న రాష్ట్రాలపై బీజేపీ కేంద్ర నాయకత్వం దృష్టి సారిస్తోంది. తెలంగాణలోనూ ఎన్నికలు జరగనున్న
నేపథ్యంలో కొత్త కేబినెట్లో ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం లభించనుందని అంచనాలు వినిపిస్తున్నాయి.

మకర సంక్రాంతి తర్వాత కేంద్ర కేబినెట్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. 2023లో తెలంగాణ సహా 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు
జరగనుండటంతో.. ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి రాజకీయ లబ్ధి కలిగేలా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉండనుందని తెలుస్తోంది. గుజరాత్‌లో బీజేపీ ఘన
విజయం సాధించిన నేపథ్యంలో ఆ రాష్ట్రం నుంచి ఒకరు లేదా ఇద్దరికి కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉంది. కేబినెట్ నుంచి కీలక వ్యక్తులను
తప్పించి వారికి పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలోనే కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ ఉండనుందనే ప్రచారం
జరుగుతోంది. జనవరి 14న మకర సంకాంత్రి తర్వాత.. బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని
తెలుస్తోంది. బీజేపీలో వ్యవస్థాగత మార్పులతో సంబంధం ఉండేలా.. 2023లో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో పార్టీ రాజకీయ అవసరాలకు
అనుగుణంగా కేబినెట్ ప్రక్షాళన ఉంటుందని తెలుస్తోంది.

2024లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో కేంద్ర కేబినెట్లో మార్పులు చేర్పులకు మోదీ సర్కారుకు ఇదే చివరి అవకాశంగా భావించొచ్చు. 2023లో కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ తదితర 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి రాజకీయంగా లబ్ధి చేకూర్చే విధంగా మంత్రివర్గంలో మార్పులు ఉండే అవకాశం ఉంది. మంత్రుల పనితీరును బట్టే కాకుండా.. అర్హులైన ఎంపీలకు మంత్రివర్గంలో చోటు కల్పించడానికి.. మంత్రి వర్గం నుంచి బయటకొచ్చిన వారిని పార్టీ సంస్థాగత పని కోసం వాడుకోవడాన్ని బట్టి కూడా కేబినెట్ ప్రక్షాళన ఉండనుందని రాజకీయ వర్గాలు, విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మోదీ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చాక ఒక్కసారి మాత్రమే మంత్రివర్గంలో మార్పులు చోటు చేసుకున్నాయి.

2022 జూన్ 8న ముఖ్యమైన నేతలుగా పేరొందిన వారితో సహా 12 మంది మంత్రులను మార్చారు. ఈసారి కూడా కేబినెట్లో మార్పులు అదే తరహాలో ఉంటాయనే అంచనాలున్నాయి. లోక్ సభ ఎంపీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు కీలక బాధ్యతలను కూడా కట్టబెడతారని భావిస్తున్నారు. గుజరాత్అ సెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన దృష్ట్యా ఆ రాష్ట్రానికి చెందిన ఎంపీలకు మంత్రి వర్గ మార్పు సమయంలో ప్రతిఫలం దక్కే ఛాన్స్ఉం ది. ఇప్పటికే ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా ఆ రాష్ట్రం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ పార్టీకి ఘనవిజయం లభించిన నేపథ్యంలో ఆ రాష్ట్రం నుంచి మరికొందరిని కేబినెట్‌లోకి తీసుకోవడానికి ఇదేమీ ఆటంకం కాకపోవచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ విషయమై రాష్ట్రాల నాయకులు, పార్టీ కీలక నేతలతో పార్టీ అధినాయకత్వం ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపిందని
తెలుస్తోంది.

ఎంత మంది మహిళలకు, రిజర్వ్డ్ కేటగిరీలకు చెందిన వారికి కేబినెట్లో అవకాశం కల్పించాలనే విషయాన్ని కూడా చర్చించారని
తెలుస్తోంది. ఎవరెవర్ని కేబినెట్లోకి తీసుకోవాలనే విషయమై ఇప్పటికే అగ్ర నేతలు ఓ నిర్ణయానికి వచ్చారని సమాచారం. ఇదిలా ఉంటే, 2023లో
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో.. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో రాష్ట్రానికి కూడా ప్రాధాన్యం దక్కే అవకాశం ఉంది. బీజేపీకి తెలంగాణ
నుంచి నలుగురు ఎంపీలు ఉండగా.. ఇప్పటికే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా పని చేస్తున్నారు. కరీంనగర్ ఎంపీ అయిన బండి సంజయ్ రాష్ట్ర బీజేపీ
చీఫ్‌‌గా వ్యవహరిస్తున్నారు.

దీంతో కాపు సామాజికవర్గానికి చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, ఆదివాసీ ఎంపీ సోయం బాపూరావుల్లో ఒకరికి కేంద్ర మంత్రి పదవి
దక్కే ఛాన్స్ లేకపోలేదు. మరోవైపు మోడీ కేబినెట్ లో ఖాళీలు ఉన్నాయి. రాజ్యసభ పదవి కాలం ముగియడంతో ఇంతకాలం కేబినెట్ మంత్రులుగా
పని చేసిన ముక్తార్ అబ్బాస్ నక్వీ, ఆర్ సీపీ సింగ్ లు ఇటీవలే పదవులకు రాజీనామా చేసారు. మోడీ మంత్రివర్గంలో ముక్తార్ అబ్బాస్ నక్వీ
మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేయగా.. ఆర్ సీపీ సింగ్ ఉక్కు శాఖ మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం ఆ శాఖలను స్మృతి ఇరానీ,
జ్యోతిరాదిత్య సింధియాలకు అదనపు బాధ్యతలుగా అప్పగించారు. ఈ రెండు శాఖలు కీలకమైనవే కాబట్టి త్వరలోనే భర్తీ చేయాలని ప్రధాని మోడీ
భావిస్తున్నారని తెలుస్తోంది.

అంతేకాదు పని తీరు బాగాలేని కొందరు మంత్రులను తప్పిస్తారనే ప్రచారం సాగుతోంది.

రాష్ట్రపతి ఎన్నిక అనంత‌రం కేంద్ర‌ మంత్రివర్గాన్ని విస్తరిస్తారనే టాక్ ఢిల్లీ బీజేపీ వర్గాల నుంచి వస్తోంది. కేబినెట్ విస్తరణలో గుజరాత్, కర్ణాటకతో పాటు తెలంగాణలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో గుజరాత్, కర్ణాటకలో బీజేపీనే అధికారంలో ఉంది. అయితే ఈసారి కర్ణాటకలో బీజేపీకి కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. దక్షిణాదిలో పాగా వేసేందుకు తెలంగాణపై బీజేపీ హైకమాండ్ స్పెషల్ ఫోకస్ చేసింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం సాధించి తీరుతామని బీజేపీ హైకమాండ్ చెబుతోంది. దీంతో కేబినెట్ విస్తరణలో తెలంగాణకు చోటు దక్కడం
ఖాయమంటున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. మరో 15 నెలల సమయం మాత్రమే ఉంది. అయితే, ఒకవైపు
బీజేపీలోనూ, మరోవైపు ప్రభుత్వంలోనూ మార్పులు చేర్పులు చేసేందుకు మోదీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే, తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది. తెలంగాణలో పార్టీ విస్తరణ.. వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా బీజేపీ అధినాయకత్వం ఫోకస్
చేసింది. ప్రధాని మోదీ- హోం మంత్రి అమిత్ షా ఆపరేషన్ తెలంగాణ మొదలు పెట్టారు. ఆపరేషన్ ఆకర్ష్ కు పార్టీ తెర తీస్తోంది. కాంగ్రెస్ అసంతృప్త
నేతలకు గాలం వేస్తోంది. తెలంగాణ బీజేపీ నుంచి మరొకరికి కేంద్ర కేబినెట్ లోకి తీసుకోవాలని నిర్ణయించారు.

ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా.. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడుగా ఉన్న లక్ష్మణ్ పేరు ప్రచారంలో ఉంది. బండి సంజయ్పే రు తెర మీదకు వచ్చినా.. పార్టీ విస్తరణ – ఎన్నికల సంసిద్దతలో భాగంగా బండి సంజయ్ కు పార్టీ వ్యవహారాల్లోనే కొనసాగిస్తారనేది మరో వాదన.పార్టీలో ఇప్పుడు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న మరో బీసీ నేత పేరు ప్రచారంలోకి వచ్చింది. ఇదే సమయంలో ఒక ఎంపీ పేరు ఢిల్లీ సర్కిల్స్ లో
ప్రచారంలో ఉంది. బండి సంజయ్‌ పాదయాత్ర రాష్ట్రంలో బీజేపీకి అనుకూలంగా బలమైన వాతావరణం ఉందని.. తోడుగా ఇతర నాయకులను కూడా
రంగంలోకి దించి కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని సునీల్‌ బన్సల్‌, భూపేంద్ర యాదవ్‌ పార్టీ నాయకత్వానికి నివేదించారు. రాష్ట్రంలో
ప్రధాన బీసీ వర్గాలతోపాటు రెడ్డి సామాజికవర్గాన్ని కూడా బీజేసీ విశ్వాసంలోకి తీసుకోవాలని సూచించారు. రెడ్డి వర్గం నుంచి మంత్రిగా
ఉండటంతో..బీసీ వర్గానికి ఈ సారి అవకాశం దక్కనుంది.

కేంద్ర మంత్రివర్గ విస్తరణలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ లేదా రాజ్య సభ ఎంపీ లక్ష్మణ్ లలో ఒకరికి బెర్త్ ఖరారైనట్లు తెలుస్తోంది. నిజానికి, ఈ ఇద్దరితోనూ ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా విడివిడిగా చర్చలు జరిపారు. దీంతో ఇద్దరిలో ఒకరికి మంత్రి పదవి ఖాయమనే ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే బీజేపీ తెలంగాణ మిషన్ ఆరంభించింది. దీనిలో భాగంగా .. తెలంగాణకు కేంద్ర కేబినెట్ లో స్థానం కల్పించాలని మోడీ, షా ద్వయం
భావిస్తోంది. ఇదీ ఇవాల్టి ఫోకస్.. రేపటి ఫోకస్ లో మళ్లీ కలుద్దాం..

Must Read

spot_img