HomePoliticsజనసేన ప్రకటన మరింత హీట్ పెంచుతోందా..?

జనసేన ప్రకటన మరింత హీట్ పెంచుతోందా..?

ఎన్నికల హీట్ వేళ జనసేన ప్రకటన మరింత హీట్ పెంచుతోందా..? పొత్తు అనివార్యమన్న జనసేన .. త్వరలో దీనిపై క్లారిటీ ఇస్తామని ప్రకటించిందా..? ఇంతకీ టీడీపీతోనా.. బీజేపీతోనా అన్నదే చర్చనీయాంశంగా మారింది.

జనసేన ఎన్నికల ట్రాక్ లోకి వస్తోంది. తెలంగాణలో ఏడాది మాత్రమే ఎన్నికలకు సమయం ఉంది. ఏపీలో ఏడాదిన్నర ఉంది. అందుకే రెండు రాష్ట్రాలపై ఫోకస్ చేసింది. వైసీపీని ఓడించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ తాజాగా చేసిన కామెంట్స్ సంచలనమయ్యాయి. పరోక్షంగా తమ విధానంపై నాదెండ్ల క్లారిటీ ఇవ్వడం విశేషం. ఎన్నికలకు సంబందించిన పొత్తులతో సహా అన్ని అంశాలపై నాదెండ్ల మనోహర్ సంచలన కామెంట్స్ చేశారు.

ఏపీలో జరుగుతున్న పొత్తుల వ్యవహారంపై స్పష్టతనిచ్చారు. జనసేన అధినేత పవన్ చెబుతూ వచ్చిన వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అన్న నినాదాన్ని నాదెండ్ల మనోహర్ వినిపించడం ప్రాధాన్యత సంతకరించుకుంది. ఇప్పటికీ ఇదే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని నాదెండ్ల స్పష్టం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా బాధ్యత తీసుకోవాలని, అందుకు తమ వంతు సహకారం అందిస్తామని చెప్పిన విషయాన్ని మనోహర్ ప్రస్తావించారు. పార్టీ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్నాక.. ఎన్నికలకు ఎలా సిద్ధం కానున్నామనే విషయాన్ని పారదర్శకంగా వెల్లడిస్తామని మనోహర్ తెలిపారు. నాదెండ్ల మాటలను బట్టి చూస్తే ఖచ్చితంగా ఏపీలో వైసీపీని ఓడించేందుకు.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చకుండా ఉండేందుకు పొత్తులు పెట్టుకుంటామని పరోక్షంగా సంకేతాలిచ్చారు. టీడీపీ, జనసేన కలిసే పోటీచేస్తాయనే అంచనాలు ఈ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. ప్రధాని మోడీ జనసేన అధినేత పవన్క ళ్యాణ్ భేటి తర్వాత టీడీపీతో కలవడంపై సందిగ్ధత ఏర్పడింది.

పవన్ ఒంటరిగా రాజకీయాలు చేయాలని డిసైడ్ అయినట్టు సంకేతాలు పంపారు. టీడీపీతో పవన్ వెళ్లరని.. బీజేపీతోనే ఉంటారని అంతా భావించారు. అయితే జనసేన-బీజేపీ కలిసి మాత్రం కార్యాచరణ నిర్ణయించలేదు. వైసీపీ మాత్రం ఎన్నికల సమాయానికి టీడీపీ-జనసేన పొత్తు ఖాయమని చెబుతోంది. వచ్చే వేసవిలో పవన్ బస్సు యాత్ర మొదలు కానుంది. ఈ క్రమంలోనే అప్పటికే పొత్తులపై క్లారిటీ ఇవ్వవచ్చని చెబుతున్నారు. నాదెండ్ల మాటలను బట్టి పొత్తులపై పవన్ వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటామన్నారంటే ఖచ్చితంగా ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా పొత్తులు ఉంటాయని చెప్పినట్టైంది.

బీజేపీతో పొత్తుతో ఉన్న జనసేన చేయబోయే ప్రకటన ఏంటి? బీజేపీ స్నేహం వీడి టీడీపీతో జత కడుతుందా?

ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలిపోనివ్వను అన్న పవన్తీ సుకోబోయే ఆ నిర్ణయం ఏంటి? అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో జోరుగా డిస్కషన్ కొనసాగుతోంది. ఇన్నాళ్లు ఒక లెక్కా ఇప్పటి నుంచి మరో లెక్క… జనసేన వచ్చిందని జగన్‌కు చెప్పండీ… అన్న స్టైల్‌లో చాలా రోజుల క్రితం పవన్ కల్యాణ్‌ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దెనెక్కించే ప్రసక్తి లేదని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా గట్టిగానే ప్రయత్నాలు చేస్తామని అన్నారు. అప్పటి నుంచి పవన్ కల్యాణ్ వేసే ప్రతి అడుగుపై అందరి దృష్టి పడింది. ఇప్పుడు ఆ పార్టీ నుంచి వచ్చే మరో ప్రకటన కూడా సస్పెన్స్‌ క్రియేట్ చేస్తోంది. ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ చేసిన ప్రకటన రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. పొత్తులపై త్వరలోనే కీలక ప్రకటన ఉంటుందని శ్రీకాకుళం జిల్లాలో ఆయన చేసిన కామెంట్‌ కాక పుట్టిస్తోంది. ఇప్పటికే బీజేపీతో కలిసి ప్రయాణిస్తున్న జనసేన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే చర్చ నడుస్తోంది. 2019 ఎన్నికలు పూర్తైన కొన్ని నెలల్లోనే జసేనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. కలిసి నడవాలని నిర్ణయం తీసుకున్నాయి. పేరుకే ఈ రెండు పార్టీలు పొత్తులో ఉన్నా… ఏ ఒక్క అంశంలోనూ కలిసి నడిచింది లేదు. వివిధ అంశాలపై రెండు పార్టీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసినా కలిసి చేసింది మాత్రం చాలా చాలా తక్కువ. ఆ కార్యక్రమాలు ఏవీ అంటే ఆ పార్టీలు కూడా చెప్పలేవేమో అన్నంతలా ఉంటాయి. బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఉందా లేదా అన్న సందేహాలు కలుగుతున్న వేళ… పవన్ చేసిన కామెంట్స్ కూడా చాలా అనుమానాలకు తావిచ్చాయి. రోడ్‌ మ్యాప్‌ తనకు ఇవ్వలేదని పవన్ ప్రకటన చేయడం… తర్వాత తామెప్పుడో రోడ్‌ మ్యాప్‌ ఇచ్చామని సోమువీర్రాజు లాంటి వాళ్లు కౌంటర్ ఇవ్వడం కాకరేపింది.

. దీంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలపై పెద్ద ఎత్తున ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. పవన్ ఒక సమయంలో పొత్తులు అంటారు.. మళ్లీ పొత్తుల సంగతి పక్కన పెట్టేసి.. అధికారమే లక్ష్యమని ప్రకటనలు చేస్తారు. ఇలా పరస్పర విరుద్ధప్రకటనలతో తనలోని కన్ఫ్యూజన్ ను పార్టీ శ్రేణులకూ, జనాలకు కూడా పంచుతారు. కొంత కాలం కిందట రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వననీ, ఇందు కోసం అవసరమైతే బీజేపీతో మాట్లాడతాననీ ప్రకటించి.. తొందరపడి ఒక కోయిలా ముందే కూసింది అన్న చందంగా పొత్తు పొడుపులపై చర్చకు తెరలేపారు. ఇప్పుడు మళ్లీ పొత్తుల గురించిన ప్రస్తావనతో
క్షేత్ర స్థాయిలో జనసేన క్యాడర్ అసలు తామేం చేయాలి, ఎలా మెలగాలి అన్న దిశానిర్దేశం లేక నిస్తేజంగా మారిపోయే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా జనసేనాని క్యాడర్ కు దిశా నిర్దేశం చేయడంలో క్లారిటీగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంతో పొత్తులపై ఎంత త్వరగా క్లారిటీ వస్తే, అంత బెటరన్న టాక్ వెల్లువెత్తుతోంది.

మరి పవన్ వేసే ఆ పొత్తుల ఎత్తు ఏంటో మరి కొన్ని రోజుల్లో తేలిపోనుంది.

Must Read

spot_img