Homeసినిమాచిరంజీవి రాకతో ఆ దర్శకుడి రాత మారబోతుందా…?

చిరంజీవి రాకతో ఆ దర్శకుడి రాత మారబోతుందా…?

20ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్న బ్లాక్ బస్టర్ కల నేరవెరుతుందా..?. మెగాస్టార్ ఆశీర్వాదంలో క్రియేటివ్ డైరక్టర్ తన క్రియేటివిటిని చూపిస్తారా…? ఒకే ఒక్క చిరు షాయరీతో రంగమార్తాండ ఇప్పుడు ఫిల్మ్ సర్కీల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

కృష్ణ వంశీ పరిచయం అక్కర్లేని పేరు. ఆయనో డైరెక్టర్. వెండితెరపై అద్భుతాలు చేస్తుంటారు. కాలంతో కలిసిపోయే సినిమాలు కావు ఆయనవి. ఎప్పుటికీ చెక్కుచెదరణి ఆణిముత్యాలు. పాత్రలను అతను తీర్చిదిద్దే విధానం.. సినిమాలో కనిపించే అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగుదనం.. కుటుంబ విలువలు.. రొమాన్స్‌ను కూడా ఎబ్బెట్టు లేకుండా అందంగా చూపించే నేర్పరతనం ఆయన సొంతం. ఇలాంటి డైరెక్టర్ కి ఖడ్గం సినిమా తర్వాత చెప్పుకొదగ్గ విజయం లేదు. సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు రంగమార్తాండ సినిమాతో ప్రేక్షకకుల ముందుకు వస్తున్నాడు.

ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మనందం, రాహుల్ సిప్లిగంజ్ ప్రధాన పాత్రల్లో ఈ చిత్రం తెరకెక్కింది. గత కొంత కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఎట్టకేలకు చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ మూవీ ప్రకటించి.. షూటింగ్ మొదలు పెట్టిన దగ్గరి నుంచి ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అని ప్రేక్షకులు, కృష్ణవంశీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మన తల్లిదండ్రుల కథ అంటూ కృష్ణవంశీ ప్రచారం చేస్తున్న ఈ మూవీకి మెగాస్టార్ చిరంజీవి పలుకు అందించారు. మెగాస్టార్ ఈ సినిమా కోసం చెప్పిన షాయరీ ఇటివల విడుదలైంది.

నేనొక నటుడ్ని’ అంటూ సాగే ఈ కవితను మెగాస్టార్ చిరంజీవి తనదైన స్టైల్లో ప్రేక్షక హృదయాలకు హత్తుకునేలా చెప్పడం విశేషం. ఈ షాయరీని రచయిత లక్ష్మీ భూపాలందించగా మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా నేపథ్య సంగీతం అందించారు. ఓ నటుడు పడే అవేదనకు అక్షర రూపం ఇచ్చి మెగాస్టార్ తో చెప్పించిన తీరు హార్ట్ టచింగ్ గా వుంది. గత కొన్ని నెలలుగా కృష్ణవంశీ ఓ తపస్సులా చేస్తూ వస్తున్న ‘రంగమార్తాండ’కు చిరు నోట పలికిన షాయరీ ప్రాణం పోయడమే కాకుండా ఈ చిత్ర కథకు అద్దంపడుంది.

Must Read

spot_img