Homeసినిమాపఠాన్ మూవీ ఫస్ట్ సాంంగ్ వలె హాట్‌గా ఉండబోతుందా?

పఠాన్ మూవీ ఫస్ట్ సాంంగ్ వలె హాట్‌గా ఉండబోతుందా?

పఠాన్ మూవీ నుంచి సెకండ్ సాంగ్ రిలీజైంది. మొదటి పాట బేషరమ్ రంగ్ సృష్టించిన వివాదాలు ఇంకా చల్లారకముందే మరో సాంగ్‌ విడుదల చేశారు మేకర్స్. అయితే ఈ సాంగ్ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచి ఇది కూడా ఫస్ట్ సాంంగ్ వలె హాట్‌గా ఉండబోతుందా? అని అభిమానుల్లో క్యూరియాసిటీ నెలకొంది. ఎట్టకేలకు తాజాగా జూమే జో పఠాన్ అంటూ సాగే పాటను షారుఖ్ ఖాన్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో షేర్ చేశారు. ఇంతకీ పాట హాట్‌గా ఉందా?

మొన్న సల్మాన్ ఖాన్ పై బాయ్ కట్.. నిన్న అమీర్ ఖాన్ పై బాయ్ కట్… ఇప్పుడు షారుఖ్ ఖాన్ పై బాయ్ కట్. ఇలా ఒక్కరు ఇద్దరు ఎందుకు బాలీవుడ్ నే బాయ్ కట్ చేస్తే.. ఓ పని అయిపోతుంది కదా…అని అంటున్నారు సినీ క్రిటిక్స్. పఠాన్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసి…బాలీవుడ్ ఆశ కిరాణం అని చెప్పుకుంటున్నారు బాలీవుడ్ మేకర్స్. అయితే ఈ సినిమాపై హైప్ ఎంత ఉందో…నెగిటివి కూడా అంతే ఉంది. ఇటివల రిలీజ్ చేసిన బేషరమ్ సాంగ్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించింది. దీపిక పదుకొనె హాట్‌నెస్, బికినీల్లో అందాల ప్రదర్శన అభిమానులకకు కిక్ ఇచ్చినా.. ఆమె ధరించిన దుస్తులపై అనేక అభ్యంతరాలు పార్లమెంట్ వరకు వెళ్లాయి.

ఇలాంటి టైమ్ లోనే రెండో సాంగ్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. దీంతో సెకండ్ సాంగ్‌ ఎలా ఉంబోతుందనే ఆసక్తి ఎక్కువైంది. అయితే ఈ పాట కూడా షారుఖ్, దీపికపైనే చిత్రీకరించినా అందాల ప్రదర్శన కాస్త తగ్గించారు. కానీ హాట్‌‌నెస్‌లో తేడా లేదు. బ్యూటిఫుల్ యూరోపియన్ లొకేషన్లలో ఈ సాంగ్ పిక్చరైజ్ చేశారు. దీపిక డ్రెస్సింగ్ స్టైల్‌తో పాటు సాంగ్ ట్యూన్ కూడా వెస్టర్న్ కల్చర్‌ను తలపించింది. ఇండియాలో నంబర్ వన్ సింగర్‌గా పేరు తెచ్చుకున్న అరిజిత్ సింగ్ పాడిన పాటలో షారుఖ్, దీపిక.. బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్లతో కలిసి డ్యాన్స్ చేస్తున్నారు. ఎప్పటిలాగే షారుఖ్ స్టిఫ్ బాడీతో రఫ్ లుక్‌లో దర్శనమివ్వగా.. దీపిక చాలా గ్లామరస్‌‌గా కనిపించింది.

ఇక ఈ సాంగ్‌ గురించి దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ పలు విషయాలు వెల్లడించాడు.

తన సినిమాల్లో మ్యూజిక్‌కు కీ రోల్ పోషిస్తుందని.. లక్కీగా ప్రతి చిత్రంలో ఫెంటాస్టిక్ మ్యూజిక్ అందించగలిగినట్లు చెప్పాడు. మ్యూజిక్ అనేది సినిమాకు స్పెషల్ ఫ్లేవర్ యాడ్ చేస్తుందని పేర్కొన్న సిద్దార్థ్.. డబ్బులు ఖర్చుపెట్టి మూవీ చూసే ప్రేక్షకుడి ప్రతి రూపాయికి న్యాయం చేయడం తమ బాధ్యతని తెలిపారు. ఇక జూమే జో పఠాన్ పాట విషయంలో చాలా గర్వంగా, నమ్మకంగా ఉన్నట్లు తెలిపాడు. ప్రేక్షకులు ఈ పాటను పెద్ద హిట్ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమా హిందీ, తమిళం, తెలుగు భాషల్లో 2023 జనవరి 25న థియేటర్లలో విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది.

Must Read

spot_img