Homeఆంధ్ర ప్రదేశ్తెలుగుదేశం పార్టీకి మాత్రం ఊపిరి పోసింది ఆ పార్టీయేనా..?

తెలుగుదేశం పార్టీకి మాత్రం ఊపిరి పోసింది ఆ పార్టీయేనా..?

  • అంతా అయిపోయింది…ఇక పోరాటం చేయలేం… అదికార పార్టీ ఆగడాలను అడ్డుకుని నిలబడలేం అనుకుంటూ ఎన్నో విధాలుగా ఆలోచనల్లో పడిన ఆపార్టీ నేతల్లో కొత్త ఉత్సాహం తొంగి చూస్తోందట..
  • ఆ జిల్లాలో మన పార్టీకి మనుగడ కష్టమే అనుకునే కార్యకర్తలకు కొండత భరోసా లబించినట్టైందట.. దీంతో ఆ పార్టీ నేతలు సంబరాల్లో మునిగిపోతున్నారు.
  • ఇంతకీ ఏమా పార్టీ.. ఏదా జిల్లా… కొత్త ఉత్సాహానికి, కొండత భరోసాకు అసలు కారణమైన ఆ అంశం ఏంటీ?..

ఒకప్పుడు విజయనగరం టీడీపీకి కంచుకోట. అన్ని నియోజకవర్గాల్లో తమకు తిరుగులేదు అనుకునేంతగా ఎదిగింది తెలుగుదేశం పార్టీ .. తరువాత క్రమంగా వెనకబడటం మొదలై, చివరకు 2019 ఎన్నికలు, జెడ్సీటీసీ ఎన్నికల్లో చతికిల పడింది. ఇక అప్పటి నుంచి నేతలు, కార్యకర్తలు అవమానాలు భరిస్తూ గడిపేస్తున్నారు. వచ్చేఎన్నికల్లో అదికార పార్టీని ఎలా ఎదుర్కోవాలో తెలియక తలలుపట్టుకున్న ఆ పార్టీ నేతలు కొన్ని కార్యక్రమాలకే పరిమితం అయ్యారు. దీంతో పోరాటపటిమ కనిపించక ఆ పార్టీలోని దీర్ఘాకాలం సేవలు అందించిన కార్యకర్తల్లో ఒకింత అసహనం, భయం తొంగి చూస్తున్నాయి.

అయితే ఎన్నికలు వేళ సమీపిస్తున్న వేళ నేతల్లో ఇప్పటికీ ఆశించిన స్తాయిలో మార్పు రాక పోవడం, ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్ల లేక పోవడంతో ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరాశలో, నేతలకే లేని బాధ మాకెందుకు అనే నిర్వేదంలో ఉన్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలో వచ్చిన ఉత్తరాంద్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో తమ వంతు ప్రయత్నంగా నేతలు పాల్గొని పనిచేశారు. కానీ ఫలితంపై మాత్రం పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. ఎందుకంటే 2019 ఎన్నికల తరువాత ఏ ఎన్నికలు వచ్చినా, అధికార వైసిపి ఎగరేసుకు పోవడం ఈ జిల్లాలో పరిపాటిగా మారింది.

అలాంటిది ఉత్తరాంధ్ర మూడు జిల్లాల ఓటర్లు ఉన్న పట్టబధ్రుల ఎన్నికపై అంతాగా ఆశించాల్సిన పనిలేదని మేధావులు సైతం బావించారట. కాని ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఇటీవల జరిగిన పట్టభ్రధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 75శాతంతో పోలింగ్ పూర్తయింది. పోలింగ్ సరళి చూపి రాజకీయ విశ్సేషకులు అదికార పార్టీకి లేదా పిడిఎఫ్ కి అనుకూలం అని బావించారట. కాని అంచనాలు తారుమారు చేస్తూ తెలుగుదేశం అభ్యర్తి తన సత్తా చాటారు.. తొలి రౌండు నుంచి చివరి వరకు తన ఆధిక్యాన్ని ప్రదర్శించి విజయాన్ని సొంతం చేసుకున్నారు.

ఇది విశాఖ జిల్లాలో ముందే ఊహించినా… విజయనగరం జిల్లాకు మాత్రం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించిందనే చెప్పాలి.. భారీ విజయాన్ని చేజిక్కించుకున్న
తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి చిరంజీవికి విజయనగరం జిల్లా పట్టబధ్రులు ఎలా పట్టం కట్టారనేది అధికార పార్టీకి మిగుడు పడటం లేదు. కాని తెలుగుదేశం పార్టీకి మాత్రం ఊపిరి పోసిందని చెప్పొచ్చని విశ్లేషకులు అంటున్నారు. పట్టబధ్రులు బయటకు ఎక్కడా ఉప్పివ్వకుండా ఓటింగ్ మొత్తం ఫలితాలు తారుమారు
చేసేలా ఓటింగ్ లో పాల్గొన్నారంటే మేదావి వర్గంలో ఉన్న అసలు ఆలోచన ఏంటి అన్నది చర్చనీయాంశంగా మారింది.

పీడిఎఫ్ అభ్యర్తినిని కూడా కాదని, అదికార పార్టీ ప్రలోబాలు, బెదిరింపులకు లోంగకుండా తమ తీర్పును వెల్లడించారంటే ఇది ఒకందుకు విజయనగరం తెలుగుదేశం పార్టీకి శుభపరిణామమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. ఉత్తరాంద్రా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ప్రభుత్వానికి రిఫరెండం కాదని తెలుగుదేశం నేతలే స్వయంగా అంగీకరిస్తున్నప్పటికీ తెలుగుదేశం విజయం మాత్రం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకేనన్న వాదనలు వెల్లువెత్తుతున్నారని అంటున్నారు. విశాఖ రాజదాని అంశంపై ప్రజలు ప్రభుత్వానికి అనుకూలంగా లేరని ఈ ఎన్నికల ద్వారా చెప్పకనే చెప్పారంటూ ప్రజల్లోకి తీసుకేళ్లేందుకు టీడీపి సిద్దం అవుతున్నట్టు కనిపిస్తోంది.

ఇక తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకత్వం ఇప్పటి నుంచి తమ ప్రయత్నాలు వేగవంతం చేస్తే ఆ పార్టీ సానుభూతిపరులకు, కార్యకర్తలకు కొంత భరోసా ఇచ్చిన వారవుతారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఇంకా తమవైపు ఉన్నారన్న బావన ఈ ఎన్నికలు కల్పించాయని ఆ పార్టీకే చెందిన పలువురు వ్యఖ్యానించడంతో మరి ఆ దిశగా విజయం సాదించేందుకు టీడీపీ జిల్లా పెద్దలు ఎంత వరకు ప్రయత్నిస్తారో చూడాలి. ఏదేమైనా పూర్తిగా నిర్వేదంలో పడిపోతున్న టీడీపీ నేతలకు, కార్యకర్తలకు ఈ ఎన్నికలు ఊపిరి ఊదిందని చెప్పక తప్పదు.

దీంతో రాబోయే రోజుల్లో టీడీపీ అధిష్టానం జిల్లాపై ఎలాంటీ ప్రణాళికలు సిద్దం చేస్తుందోనన్న చర్చ సర్వత్రా వినిపిస్తోంది. అంతేగాక ఇక టీడీపీకి భవిష్యత్ లేదు.. రాష్ట్రంలో మరో ప్రత్యామ్నాయ పార్టీ రావాల్సిందే.. చంద్రబాబుకు వయసు మీద పడుతోంది.. లోకేశ్ లో అంత సామర్థ్యం కనిపించడం లేదు. అనుకుంటున్న తరుణంలో తెలుగుదేశం పార్టీకి అనూహ్య విజయం దక్కింది. ఇక్కడ టీడీపీ గెలుపునకు వైసీపీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఓ కారణమైతే.. తెలుగుదేశం పార్టీకి.. అభ్యర్థి చాలా ప్లస్ గా మారాడన్న వాదన వినిపిస్తోంది. నిజానికి వేపాడ చిరంజీవి రావు.. తెలుగుదేశం నేత కంటే ఎకానమీ మాస్టార్ గా ఎంతో ప్రసిద్ధుడు. ఎందరో విద్యార్థులకు ఉచితంగా పాఠాలు చెప్పి.. ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది.

ఆయన దగ్గర శిక్షణ తీసుకున్న అభ్యర్థులు.. కొందరు ప్రభుత్వ ఉద్యోగులైతే .. మరికొందరు వివిధ ప్రైవేటు ఉద్యోగాల్లోనూ స్థిరపడ్డారు. వీరంతా తమ మాస్టార్ కోసం శ్రమించారు. ఇక్కడ పార్టీ, ప్రభుత్వ వ్యతిరేకత కంటే.. చిరంజీవి రావు మీదున్న అభిమానం గెలిపించిందని చర్చ జరుగుతోంది. మొత్తంగా చిరంజీవి రావు లాంటి అభ్యర్థిని ఎంపిక చేసుకోవడం టీడీపీ తొలి విజయమని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపుపై ఏమాత్రం ఆశల్లేని పరిస్ధితుల్లో అభ్యర్ధులే దొరకని టీడీపీ చివరికి ఘన విజయంతో ఈ ఎన్నికను ముగించడం ఇప్పుడు అధికార వైసీపీకి ఏమాత్రం మింగుడుపడటం లేదు.

మంత్రులు, ఎమ్మెల్యేలు, స్ధానిక ప్రజాప్రతినిధులు అన్ని విధాలా అండగా నిలిచినా వైసీపీ ఓటమిపాలవ్వడం వెనుక టీడీపీ రచించిన భారీ వ్యూహాలే ఉన్నాయి. బ్రహ్మణ సామాజికవర్గానికి చెందిన సీతంరాజు సుధాకర్ ను పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధిగా నిలబెట్టిన వైసీపీ.. ఆయన గెలుపు కోసం సర్వశక్తులొడ్డింది. ఇదే క్రమంలో కాపులతో ఓ సమావేశం కూడా పెట్టించింది. దీనికి స్ధానికంగా కీలకంగా ఉన్న కాపు నేతల్ని ఆహ్వానించలేదు. మంత్రి గుడివాడ అమర్నాథ్ తో పాటు మరికొందరు ప్రభుత్వంలో కీలకంగా ఉన్న నేతల్ని మాత్రమే దీనికి ఆహ్వానించారు. దీంతో కాపు సామాజికవర్గంలో మంటపుట్టింది. అదే
సమయంలో టీడీపీ కూడా ఈ పరిస్ధితిని సొమ్ముచేసుకునేందుకు కాపు అభ్యర్ధి చిరంజీవిరావును బరిలోకి దింపింది.

దీంతో వైసీపీ నిలబెట్టిన బ్రహ్మణ అభ్యర్ధిని కాదని టీడీపీ కాపు అభ్యర్ధికి అండగా నిలవాలని కాపులు నిర్ణయించుకున్నారు. తుదికంటా అండగా నిలిచి తమ సామాజిక వర్గ అభ్యర్ధిని వారు గెలిపించుకున్నారు. ఉత్తరాంధ్రలో బీసీ జనాభా చాలా ఎక్కువ. అలాగే గత ఎన్నికల్లో బీసీలు టీడీపీని వీడి వైసీపీకి మద్దతిచ్చారు. దీంతో ఈసారి ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గమైన నాగవంశీయులకు చెందిన గాండ్ల చిన్ని లక్ష్మీకుమారిని టీడీపీ అభ్యర్ధిగా నిలబెట్టింది. గెలుపుపై ఏమాత్రం ఆశల్లేని పరిస్ధితుల్లో అభ్యర్ధే దొరకని టీడీపీ.. చివరికి లక్ష్మీకుమారిని ఎంచుకుంది.

దీంతో లక్ష్మీకుమారి సొంత బలంపైనా గెలవాల్సిన పరిస్ధితి ఎదురైంది. ఆమె గెలుపుపై ఎవరికీ ఎలాంటి అంచనాల్లేవు. అయితే చివరి నిమిషంలో ఆమెను తప్పించి కాపు సామాజిక వర్గానికి చెందిన వేపాడ చిరంజీవిని రావుకు టీడీపీ టికెట్ ఇచ్చింది. ఇదే చివరికి టీడీపీని గెలుపు దిశగా నడిపించింది.

మరి ఈ ఎమ్మెల్సీ విజయాన్ని తమ పార్టీ భవిష్యత్ కు ఎంత వరకు అన్వయించుకుంటుందో వేచి చూడాల్సిందే…

Must Read

spot_img