Homeఅంతర్జాతీయంమనదేశానికి సమర్థవంతమైన నాయకత్వం అందుబాటులోకి వచ్చిందా..?

మనదేశానికి సమర్థవంతమైన నాయకత్వం అందుబాటులోకి వచ్చిందా..?

సరిగ్గా మనదేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్దాల తరువాత సరైన దౌత్యనీతి సమర్థవంతమైన నాయకత్వం అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడే ప్రపంచానికి అసలైన భారత్ అంటే ఏంటో స్పష్టంగా గోచరిస్తోంది. ఇందుకు చక్కని ఉదాహరణ అఫ్టనిస్తాన్ దేశాన్ని తీసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. అవతల సమస్య ఏదైనా సరే అది మనకు అనుకూలంగా మార్చుకోవడం అన్నది ఇప్పుడు జరుగుతోంది.

అంటే వెతికి చూస్తే ప్రతీ సమస్యకు ఏదో మూల నుంచి పరిష్కారం ఉంటుంది..అది మనకు లాభం కలిగించేదిగా మార్చుకోవడంలోనే మన వివేకం బయటకు వస్తుంది. మీకు తెలుసా తాలిబన్ల విషయంలో మన దేశం అనుసరించిన అత్యున్నత దౌత్య పరమైన వ్యూహం పెద్దగా శ్రమ లేకుండా చైనా పాకిస్తాన్ లని ఆఫ్ఘనిస్తాన్ నుంచి దూరం పెట్టింది. నిజానికి మూర్కులను ఏ విధంగానూ రంజింపజేయలేము.. పైగా మూర్కుడు రాజుకన్నా మొండివాడుగా ఉంటాడు.

వాడి నుంచి దూరంగా ఉండమని చాణక్యనీతి చెబుతుంది. నిజానికి తెలివితేటలు, కండబలం ఎంత ఉన్నా మూర్కుడు మొండివాడి ముందు ఎలాంటి ప్రభావం చూపించలేవు. అయితే వాడన్నా చస్తాడు లేదంటే మనల్ని చంపేస్తాడు తప్పితే చెప్పే మాటల్ని వినడు. అది మూర్కుడి నైజం. గతం వారం రోజుల్లో జరిగిన రెండు ప్రధాన సంఘటనలు భారత్ దౌత్యనీతిని చక్కగా చూపించాయి.

నిజానికి ఆఫ్గన్ ను పాలిస్తున్న తాలిబన్లను అంతపెద్ద అమెరికా దేశం కూడా తనకు అనుకూలంగా మార్చుకోలేకపోయింది. అలాంటిది భారత్ నేర్పుగా ఆ పని చేసి చూపించింది. అదేంటో ఇప్పుడు చూద్దాం.. చైనాని ఆఫ్గన్ తాలిబన్లు చాలా కఠినంగా దూరం పెట్టారు. తాను సాయం అందిస్తానని ముందుకు వచ్చినా తాలిబన్లు నమ్మలేదు. కాబూల్ లోని ఓ హోటల్ పైన డిసెంబర్ 12న ఉగ్రవాద దాడి జరిగింది.

దాడి చేసింది తాలిబన్లు కాదు..ఆఫ్గన్ ను ఆశ్రయం చేసుకున్న ఐసీస్ కొరాసన్ టెర్రర్ గ్రూప్ ఉగ్రవాదులు ఈ పనికి తెగబడ్డారు. ఆ ఘటనలో అయిదుగురు చైనీయులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో చైనా ఆఫ్గన్ సంబంధాలు క్షీణించాయి.

అయితే ఈ విషయంపై చైనా ఆఫ్గన్ ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేసింది. తమ పౌరులకు రక్షన కలిగించాలని భద్రత పెంచాలని కోరింది. సాయం అందిస్తామని ముందుకు వచ్చిన చైనాకు ఈ ఘటన షాక్ కు గురి చేసింది. చిన్న చిన్న సాయాలు చేస్తూ ఆఫ్గన్ నుంచి అరుదైన ఖనిజాలను దోచుకుపోయే దురాలోచన చేసిన చైనాకు ఇది మింగుడు పడలేదు.

తాలిబన్ల మాటలను నమ్మలేక తమ పౌరులను, ఇంజినీర్లను తిరిగి చైనాకు తిరిగి వచ్చేయాలని ఆదేశించారు. ఆఫ్టనిస్తాన్ లోనే కాదు..పాకిస్తాన్ లో తమ ప్రాజెక్లులపై పనిచేస్తున్న చైనీయులను లక్ష్యం గా చేసుకుని పాకిస్తాన్ టీటీపీ టెర్రర్ గ్రూప్ వరుస దాడులు చేస్తోంది. దాంతో ఆఫ్గనిస్తాన్ లో భారీ మొత్తంలో పెట్టుబడడులు పెట్టి స్థాపించాలనుకున్ పెద్ద పెద్ద ప్రాజెక్టుల విషయంలో పునరాలోచన చేస్తోంది చైనా.

ప్రపంచవ్యాప్తంగా ఈవీల వినియోగం పెరుగుతున్న సమయంలో చైనా వివిధ ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల తయారీకి కావలసిన లిథియం అయాన్ ఖనిజం ఆఫ్గన్ లో విరివిగా దొరుకుతుంది. దీని కోసం తవ్వకాలు జరపడానికి గనుల తవ్వకాల కోసం ఇప్పటికే ఆఫ్గనిస్తాన్ తో సూచనప్రాయంగా ఒప్పందం కూడా చేసుకుంది చైనా.. కానీ కాబూల్ దాడి తరువాత అది రద్దు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.

ఇక రెండో సంఘటన చూస్తే ఆఫ్టనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న ఖైబర్ పఖ్తున్క్వా ప్రావిన్స్ లోని ఓ జైలుపై ఉగ్రవాదులు దాడి చేసి ఆ జైలును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ జైలులోని తమ సహచరులను విడిపించుకున్నారు సదరు ఉగ్రవాదులు. అంతేకాదు..తమను ఆఫ్గనిస్తాన్ కు సేఫ్ గా వెళ్లిపోయేందుకు ఓ హెలికాప్టర్ ను అమర్చాలని పాకిస్తాన్ ను డిమాండ్ చేసారు.

నిజానికి వారు లొంగదీసుకుని తమ బందీలుగా చేసుకున్నవారు పాకిస్తాన్ ను కొన్ని రోజులుగా దాడులతో కలవరపెడుతున్న టీటీపీ టెర్రర్ గ్రూప్ సభ్యులేనని తేలిపోయింది. నేరుగా కేపీ ప్రావిన్స్ పోలీస్ స్టేషన్లపై దాడులు చేస్తూ ఆయుధాలను తస్కరిస్తున్నారు.

కేపీ పరిస్తితి ఎలా ఉందంటే..!

కేపీ ప్రాంతంలో తమ ఆధిపత్యం కోసం వారిపై దాడికి పాకిస్తాన్ పెద్ద ఎత్తున యుధ్దం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడైతే అల్ ఖైదాన చీఫ్ అల్ జవహరినీ పాకిస్తాన్ ఐఎస్ఐ అమెరికాకు అప్పజెప్పిందో అప్పటి నుంచి అల్ ఖైదా కూడా, ఐసీస్ ఖొరాసాన్, తెహిరిక్ ఏ తాలిబన్, లు జతకట్టాయని వార్తలు వస్తున్నాయి. వాటి బలం అపారంగా పెరిగింది కాబట్టే నేరుగా పోలీస్ స్టేషన్లపైనే దాడులు చేస్తున్నాయి.

ఇది పాకిస్తాన్ పై తిరుగుబాటుకు మొదటి మెట్టు అంటున్నారు నిపుణులు. ప్రస్తుతం పాకిస్తాన్ అఫ్ఘనిస్తాన్ దేశాలను విడదీస్తున్న డ్యూరాండ్ లైన్ చిచ్చు రగులుకుంటోంది. అది చివరకు తాలిబన్లు ఖైబర్ ఫఖ్తూన్క్వాను హస్తగతం చేసుకునే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో ఆ ప్రాంతంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న చైనాకు పాకిస్తాన్ నుంచి ఎటువంటి సహకారం లభించే అవకాశాలు లేవు.

అక్కడే బిలియన్ల కొద్దీ డాలర్ల పెట్టుబడులు పెట్టింది చైనా. నిజానికి బలోచిస్తాన్ ప్రావిన్స్ లో చైనా అంటే భగ్గుమనే పరిస్థితి ఉంది. అలాగే గ్వాడర్ పోర్టుపై తరచూ బలోచ్ రెబెల్స్ దాడులు చేస్తూనే ఉంది. ఇప్పుడు వారు కానీ తాలిబన్లతో చేతులు కలిపితే అది చైనా పాకిస్తాన్ దేశాలకు అతిపెద్ద సవాల్ గా మారుతుంది. అయితే అది నిజమ్యే అవకాశాలే ఎక్కువని అంటున్నారు నిపుణులు.

మొన్న మొన్నటిదాకా రష్యా చైనా ఇరాన్ పాకిస్తాన్ లు ఆఫ్గనిస్తాన్ కు నమ్మదగిన మిత్రులుగా అంతర్జాతీయ పత్రికల్లో వార్తలు వచ్చాయి. దక్షిణాసియా రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే విషయాన్ని గట్టిగా చెబుతూ వచ్చారు. కానీ వారి ఆలోచనలను తలక్రిందులు చేసింది భారత్.

సంవత్సరం క్రితం ఆఫ్గనిస్తాన్ శరణార్తులకు భారత్ ఆశ్రయం ఇవ్వడం, ఆపై అఫ్గన్లకు గోధుమలు పంపించడం తాలిబన్లను దగ్గర చేసింది. మన దేశం అడక్కుండానే మానవతా ద్రుక్పదంతో అత్యవసర మందులు, కోవిడ్ టీకాలను కూడా ఆఫ్గనిస్తాన్ దేశానికి పంపించింది.

దాంతో తాలిబన్లు సహజంగానే తమ దేశంలో పెట్టుబడులు పెట్టమని అడగడం మొదలుపెట్టింది. ఇది దౌత్యపరంగా చైనా పాకిస్తాన్ దేశాల మీద భారత్ పైచేయి సాధించిన విషయంగా చెబుతున్నారు. కేవలం ఒక్క సంవత్సరంలోనే భారత్ ఆఫ్గన్ పాలకుల విశ్వాసాన్ని పొందగలిగిందంటే మాటలు కాదు. చాలా జాగ్రత్తగా అడుగులు వేయడం వల్లే అది సాధ్యపడింది. ఇంతా చేస్తే తాలిబన్ల ఆఫ్గనిస్తాన్ ను మన దేశం గుర్తించనే లేదు.

అయినా మన దేశం మీద తాలిబన్లకు విశ్వాసం కలిగింది. తటస్థ వైఖరి వల్ల ఉక్రెయిన్ రష్యా యుధ్దం తరువాత మన దేశానికి లభించిన మరో విజయంగా చెప్పుకోవచ్చు. భారత గూఢచార సంస్థ ‘రా’, విదేశాంగశాఖ అధికారుల సమన్వయం ముందు చూపుతోనే ఇది సాధ్యపడింది. ప్రస్తుతం ఆఫ్గనిస్తాన్ తాలిబన్ ప్రభుత్వాన్ని వేదిస్తున్న సమస్య ఆహారం, మందుల సరఫరా..ఈ రెండింటినీ పూర్తిగా నెరవేరుస్తోంది భారత్.

అందుకు బదులుగా ఏ ఉపకారాన్ని భారత్ ఆశించలేదు. పైగా ఆఫ్గనిస్తాన్ తో దశాబ్దాలుగా సాగిస్తున్న సహకారాన్నే ఇప్పుడూ కొనసాగిస్తోంది. అది అక్కడి తాలిబన్లతో సహా ప్రజలందరికీ తెలుసు. ప్రజలు ఇష్టపడిన భారత్ నే తాలిబన్లు అంగీకరిస్తారు. అసలు ప్రజలే లేనట్టైతే తాలిబన్లు ఆఫ్గినస్తాన్ ను ఏం చేసుకుంటారన్నది ప్రశ్న. ప్రజలలో భారత్ పట్ల ఉన్న అభిమానాన్ని తాలిబన్లు అంగీకరిస్తున్నారు.

పైగా పాకిస్తాన్ లాగా తమ అంతర్గత విషయాలలో ఎక్కడా భారత్ జోక్యం చేసుకోకపోవడం వారిని భారత్ కు దగ్గరయ్యేలా చేసింది. ఇప్పుడు తాలిబన్లకు అభివ్రుద్ది కావాలి. అది జిత్తులమారి చైనా వల్ల సాధ్యం కాదని తెలుసు, పాకిస్తాన్ ను అసలే నమ్మలేని స్థితిలో ఉన్నారు. పైగా డ్యురాండ్ లైన్ విషయంలో తమకు పాకిస్తాన్ తో ఘర్షణ జరిగితే చైనా తటస్థంగా ఉండటం తాలిబన్లకు అస్సలు నచ్చలేదు.

అదే భారత్ అయితే అండగా ఉంటుందని ఘాఢంగా నమ్ముతున్నారు. సో..ఖైబర్ ఫక్త్యూన్క్వా ను తాలిబన్లు ఆక్రమించుకునే ప్లాన్ లో భారత్ ను నమ్మదగిన మిత్రుడిగా తాలిబన్లు చూస్తున్నారు. అంతేకాదు. రేపు మనం పీఓకేను భారత్ లో కలిపేసుకుంటే తాలిబన్లు భారత్ కు అనుకూలంగా వ్యవహరిస్తారని కూడా సమాచారం. దీంతో ఇక్కడ మనం పాటించిన దౌత్యనీతి చైనాను పాకిస్తాన్ ను కట్టడి చేయడంతో పాటు తాలిబన్లను ఆకట్టుకోవడం, రేపు ఆఫ్గనిస్తాన్ లో రేర్ మినరల్స్ ప్రాజెక్లులలో భాగస్వామ్యం కలగడం తధ్యం అంటున్నారు విశ్లేషకులు.

Must Read

spot_img