Homeఅంతర్జాతీయంతమ దేశంలో కరోనా విస్పోటనాన్ని చైనా దాస్తోందా?

తమ దేశంలో కరోనా విస్పోటనాన్ని చైనా దాస్తోందా?

చైనాలో కరోనా విలయతాండం చేస్తోంది.. కరోనా కేసులు భారీగా నమోదవుతుండటం ప్రపంచ దేశాలను ఆందోళనలకు గురిచేస్తోంది.. కానీ.. చైనా మాత్రం కరోనా కేసుల వివరాలను వెల్లడించడం లేదు.. ఇప్పుడు ఇదే ప్రపంచదేశాలలో ఆందోళనను రేకెత్తిస్తోంది

తమ దేశంలో కరోనా విస్పోటనాన్ని చైనా దాస్తోందా? కొవిడ్ మొదటి వేవ్​లో చేసిన తప్పునే డ్రాగన్‌ మళ్లీ చేస్తోందా? అనే అనుమానాలు ప్రపంచ దేశాలు వ్యక్తం చేస్తున్నాయి. చైనా దాపరికంతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా? అనే సందేహాలు కలుగుతున్నాయి. డ్రాగన్‌ ఇలాగే వ్యవహరిస్తే మరోసారి వినాశనం తప్పదా..

చైనాలో కరోనా కలకలం సృష్టిస్తోంది.. ఇక్కడ గత 20 రోజుల్లో, 25 కోట్ల మందిని కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. ప్రభుత్వ పత్రాల లీకేజీ తర్వాత ఈ విషయం వెల్లడైంది. సోషల్ మీడియాలో వైరల్అ వుతున్న నోటీసు పత్రాలను ఉదహరిస్తూ రేడియో ఫ్రీ ఏషియా కామెంట్ చేసింది.

జీరో-కోవిడ్ పాలసీ’లో సడలింపులు ఇచ్చిన తర్వాత..

ఈ నెల మొదటి వారంలో చైనా లో ‘జీరో-కోవిడ్ పాలసీ’లో సడలింపులు ఇచ్చిన తర్వాత పరిస్థితి ఆందోళనకరంగా మారింది. 20 రోజుల్లో, చైనా అంతటాచైనా అంతటా దాదాపు 250 మిలియన్ల మంది కోవిడ్-19 బారిన పడ్డారు. చైనా కరోనా విస్ఫోటనం ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తోంది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న కొత్త కేసులు తమ దేశంలో ఎక్కడ కల్లోల పరిస్థితులకు దారి తీస్తాయోనని ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. తమ దేశంలో కరోనా కల్లోలం
లేదని చైనా చెబుతున్నప్పటికీ.. తొలి దశ కరోనా వ్యాప్తి సమయంలోనూ డ్రాగన్‌ ఇవే మాటలు చెప్పిందని దేశాలన్నీ గుర్తు చేస్తున్నాయి. చైనా ఇప్పటికైనా తమ దేశంలో నమోదవుతున్న కరోనా గణాంకాలను ప్రపంచంతో పంచుకుంటే తప్ప కరోనా వ్యాప్తి నిరోధం సాధ్యం కాదని దేశాలు ముక్తకంఠంతో హెచ్చరిస్తున్నాయి.

చైనా తమ దేశంలో నమోదవుతున్న కేసుల విషయంలో అసలు నిజాలను దాస్తోందంటూ ప్రపంచ దేశాలు.. అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. చైనా తొలి దశలోనూ ఇలా కేసులు దాచి కరోనా మహా విస్ఫోటనానికి కారణమైందని గుర్తు చేస్తున్నాయి. చైనా కరోనా కేసులు ఇలాగే దాస్తే కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని ప్రపంచం తీవ్ర భయాందోళనలకు గురవుతోంది. కొత్త వేరియంట్ల పుట్టుక చైనాకు తెలిసినా డ్రాగన్‌ ఆ విషయాన్ని ప్రపంచంతో పంచుకోకపోవచ్చని దేశాలన్నీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

చైనాలో ఇప్పటి వరకు కొత్త వేరియంట్‌ లు వచ్చినట్లు ఎలాంటి వార్తలు లేకున్నా.. డ్రాగన్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి అది సాధ్యమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

చైనాలో కరోనా కల్లోలాన్ని అంచనా వేసేందుకు తమకు మరింత సమాచారం అవసరమని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనోమ్‌ తెలిపారు.. ఈ వ్యాఖ్యలతో చైనా ఏ సమాచారాన్ని ఎవరితో పంచుకోవట్లేదన్నది స్పష్టమైందని.. ప్రపంచ దేశాలు అనుమానిస్తున్నాయి. ఆదివారం నుంచి రోజువారీ కరోనా కేసుల ప్రకటననే చైనా నిలిపివేయడం డ్రాగన్‌ దాపరికానికి అద్దంపడుతోంది. చైనా ప్రభుత్వం కఠిన కొవిడ్‌ నిబంధనలను ఒక్కసారిగా సడలించడమే ఈ కరోనా విస్ఫోటనానికి కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనాలో ప్రస్తుత వ్యాప్తిలో ఎన్ని ప్రమాదకరమైన వేరియంట్‌లను
గుర్తించారన్న దానిపైనా స్పష్టమైన సమాచారం లేదు. చైనా కరోనా సమచారాన్ని డబ్ల్యూహెచ్​ఓ, అంతర్జాతీయ సమాజంతో బాధ్యతాయుతంగా పంచుకుంటోందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ తెలిపారు. కానీ ప్రస్తుతం ఆ విధానం కనపడడం లేదని ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నాయి. 2020లో కరోనా మూలాలపై అంతర్గత పరిశోధనలను చైనా నియంత్రించినట్లు పలు పరిశోధనల్లో వెల్లడైంది. అస్సలు కరోనా మహమ్మారి ఎలా ప్రారంభమైందనే దానిపై కీలకమైన డేటా ఇప్పటికీ లేదని డబ్ల్యూహెచ్ఓ నిపుణుల బృందం ఈ సంవత్సరం ఓ నివేదికలో తెలిపింది.

చైనాలోని షాంఘై నగరంలో కూడా కరోనా బీభత్సం కొనసాగుతోంది. ఇక్కడ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అటువంటి పరిస్థితిలో, షాంఘైలోని శ్మశాన వాటికలో రిక్రూట్‌మెంట్ డ్రైవ్ జరుగుతోంది. మృత దేహాలను మోసే వ్యక్తులను పెద్ద సంఖ్యలో భర్తీ చేసుకుంటున్నారు. అంతే కాదు.. కరోనా సోకిన వారికి ఈ రిక్రూట్మెంట్లో ప్రాధాన్యత ఇస్తున్నారు.

కరోనాతో చనిపోలేదని లిఖితపూర్వకంగా..

కరోనా మరణాల సమాచారాన్ని దాచేందుకు చైనా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. కరోనాకు సంబంధించిన మరణ గణాంకాలు ప్రపంచం ముందుకు రాకూడదని.. చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మృతుల సంబంధీకులు ఒక ఫారమ్‌పై సంతకం చేశాకే.. వారి బంధువుల మృతదేహాలను ఆసుపత్రి నుండి అందజేస్తున్నారు. ఇందులో ప్రజలు తమ బంధువులు కరోనాతో చనిపోలేదని లిఖితపూర్వకంగా రాసి ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దరఖాస్తులో ఏదైనా తప్పు దావా ఉంటే.. దానికి తానే బాధ్యత వహిస్తానని సంతకం చేసే వ్యక్తి పూచీకత్తు ఇవ్వాల్సి వస్తోంది.

కరోనా సంక్రమణకు సంబంధించిన డేటాను నేషనల్ హెల్త్ కమిషన్ ఆఫ్ చైనా సమావేశంలో సమర్పించారు. కేవలం 20 నిమిషాల పాటు మాత్రమే జరిగిన ఈ భేటీకి సంబంధించిన పత్రాలు లీక య్యాయి. గణాంకాల ప్రకారం.. డిసెంబర్ 1 మరియు 20 మధ్య, 248 మిలియన్ల మంది కోవిడ్ -19 బారిన పడ్డారు, ఇది చైనా జనాభాలో 17.65 శాతం.చైనాలో కరోనా విధ్వంసం సృష్టించిన నేపథ్యంలో, అనేక షాకింగ్ నిర్ణయాలు తీసుకున్నారు. జనవరి 8 నుంచి విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు క్వారంటైన్‌ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు చైనా ప్రకటించింది. ఇది మాత్రమే కాదు, చైనా తన
అంతర్జాతీయ సరిహద్దులను కూడా తెరవబోతోంది. 2020 నుండి సుమారు 3 సంవత్సరాల తర్వాత చైనా అంతర్జాతీయ నిర్బంధ నిబంధనల నుండిమినహాయించబడుతుంది. గతంలో డిసెంబర్‌లోనే వివాదాస్పద కోవిడ్ విధానాన్ని ఉపసంహరించుకుంటామని చైనా ప్రకటించింది. దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. చైనాలో కోవిడ్ పాలసీని ఉపసంహరించుకున్న తర్వాత కేసులు వేగంగా పెరిగాయి.

చైనాలో కరోనా కేసులు కోట్లలో పాజిటివ్ గా నమోదు కావడంతో.. ప్రపంచ దేశాలు సైతం ఆందోళన చెందుతున్నాయి.. చైనా కరోనా కేసులు ఇలాగే దాస్తే కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని ప్రపంచం తీవ్ర భయాందోళనలకు గురవుతోంది.

Must Read

spot_img