Homeఅంతర్జాతీయంబీటీఎస్ మెంబర్ అయిన జిన్ మిలిటరీలోకి వెళుతున్నారా…?

బీటీఎస్ మెంబర్ అయిన జిన్ మిలిటరీలోకి వెళుతున్నారా…?

దక్షిణ కొరియాకు చెందిన కే పాప్ బ్యాండ్ బీటీఎస్ టీంకి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభించింది.. వారికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు.. అయితే.. దక్షిణ కొరియా ప్రభుత్వ నిబంధన ఆందోళనకు గురిచేస్తోంది.. ఇంతకూ ఆ నిబంధనలు ఏంటి…?

సమర్థులైన దక్షిణ కొరియా పురుషులు తప్పనిసరి మిలటరీ సేవ చేయాల్సిందేనా..? బీటీఎస్ మెంబర్లలో సీనియర్ అయిన కిమ్ సియోక్ – జిన్ మిలిటరీలోకి వెళుతున్నారా…? జిన్ సోషల్ మీడియా పోస్ట్ ఏం తేలియజేస్తోంది..?

దక్షిణ కొరియాకు చెందిన కే పాప్ బ్యాండ్ బీటీఎస్ టీంకి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు.అయితే ఇపుడు వాళ్లను దక్షిణ కొరియా ప్రభుత్వ నిబంధన ఆందోళనకు గురిచేస్తోంది. అదే సమర్థులైన దక్షిణ కొరియా పురుషులు తప్పనిసరి మిలటరీ సేవ చేయడం. ప్రభుత్వ నిబంధన ప్రకారం ఇపుడు బీటీఎస్ మెంబర్లలో సీనియర్ అయిన కిమ్ సియోక్-జిన్ మిలటరీలోకి వెళుతున్నారు.ఈ బ్యాండ్ నుంచి సైనిక విభాగంలో సేవలందించడానికి వెళుతున్న మొదటి వ్యక్తి జిన్.

30 ఏళ్ల జిన్ మిలటరీ హెయిర్ కట్‌తో సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. ”నేను ఊహించిన దాని కన్నా, బాగుంది” అని ఆయన పోస్టులో రాసుకొచ్చారు. దక్షిణ కొరియా ఇప్పటికే సాంకేతికంగా పొరుగు దేశమైన ఉత్తర కొరియాతో యుద్ధం చేస్తోంది.

అందుకే సమర్థులైన పురుషులందరూ సైన్యంలో తప్పక పనిచేయవలసి ఉంటుంది.. ఉత్తర కొరియా సరిహద్దు సమీపంలోని బూట్ క్యాంపులో జిన్ ఐదు వారాల శిక్షణను ప్రారంభించారు. అనంతరం జిన్ ఒక ఫ్రంట్ లైన్ యూనిట్‌లో పనిచేయనున్నారు.

కాగా, ఈవార్త కొట్లాది మంది జిన్ అభిమానులను ఉద్వేగానికి గురిచేసింది..జిన్ నమోదు చేసుకున్న యోన్ చెయిన్ బూట్‌క్యాంప్‌లో 30 మంది వ్యక్తులు ఉంటారు. వారు నేలపై చాప మీదనే నిద్రించవలసి వస్తుంది.

యుద్ధ సంబంధిత చర్యలకు ముందు వారికి ఆయుధాలు, ఇతర మందుగుండు సామగ్రిని ఎలా ఉపయోగించాలో నేర్పిస్తారు. గ్యాస్ చాంబర్‌లో సీల్ చేయడం, సీఎస్ గ్యాస్ ప్రభావాలను అనుభవించడం, లైవ్ గ్రేనెడ్‌లను పేల్చడం అత్యంత సవాలుతో కూడుకున్నవని అక్కడి క్యాడెట్ల అభిప్రాయం..

మొదట గ్రెనైడ్ పట్టుకోవడానికి చాలా భయపడిన వారు సైతం అది ఎంత శక్తి వంతమైందో తెలుసుకుని ఆశ్చర్యపోవడం వారి వంతవుతుంది.. ఇది శారీరర శ్రమతో కూడుకున్నది, కానీ మానసికంగా పర్వాలేదు. కోచింగ్ సిబ్బంది స్నేహపూర్వకంగా ఉంటారు.. ఈ శిక్షణ తర్వాత జిన్ ఉత్తర కొరియా సరిహద్దుకు సమీపంలోని ఒక ఫ్రంట్‌లైన్ యూనిట్‌లో పనిచేయనున్నారు.

ఉత్తర, దక్షిణ కొరియాలను 4 కి.మీ వెడల్పు గల భూ భాగం ద్వారా వేరు చేశారు.

ఇది ఆ దేశాల సరిహద్దు పొడవునా వెళుతుంది. దీనిని డీ మిలిటరైజ్డ్ జోన్ అని పిలుస్తారు.

రెండు వైపులా ముళ్ల తీగతో కంచె వేసి అక్కడ భారీగా ఆయుధాలు అమర్చారు. యాంగ్ డీ మిలిటరైజ్డ్ జోన్‌లోని 5వ పదాతిదళ విభాగంలో పని చేశారు. ఇది అత్యంత ముఖ్యమైన ఫ్రంట్‌లైన్ స్థానాల్లో ఒకటి.

ఆయన థర్మల్ ఇమేజింగ్ పరికరాల సాయంతో గస్తీ కాసేవారు. అంతేకాకుండా ఉత్తర కొరియా సైనికులను నిరంతరం సర్వే చేస్తూ రాత్రంతా నిఘాలోనే ఉండేవారు. కొన్ని సార్లు ఉత్తర కొరియా సైనికులను కొట్టడం, వంటివి చేయాల్సి ఉంటుంది..వారి వద్ద అధునాతన పరికరాలు లేనందున వారికి సహాయం చేసుకోవడానికి కష్టమయ్యేది.

ఉత్తర కొరియా సైనికులతో పోలిస్తే తమ పరిస్థితి బాగానే ఉందని దక్షిణ కొరియా సైనికులు భావిస్తున్నారు. కానీ, శీతాకాలం సమీపించడంతో బీటీఎస్ జిన్ చల్లని వాతావరణంతో పోరాడవలసి ఉంటుంది..

20 సెల్సియస్కం టే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, గడ్డ మంచులో గడిపిన రోజుల్ని గుర్తుచేసుకున్నారు అక్కడ పనిచేసిన సైనికులు… మేం బయటికి వెళ్ళినప్పుడు, మా రెప్పలు గడ్డకట్టేవి” అని వారు చెబుతున్నారు.. అయితే కొందరు సైనికులు తమ యూనిట్ విధానాన్ని ప్రశంసించారు.

“మేం మందుగుండు సామగ్రితో నిండిన తుపాకులను తీసుకువెళ్లాం కాబట్టి ప్రశాంతంగా ఉన్నాం. అందుకే వేధింపులు, కొట్టడం లాంటివి జరగలేదు” అని అన్నారు. ఫ్రంట్‌లైన్ గార్డ్‌గా పనిచేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు కొందరు..

ఎందుకంటే ఈ స్థానంలో ప్రోత్సాహకాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు బేస్‌‌లో ఎక్కువ సమయం ఉండవలసి వస్తుంది. 26 ఏళ్ల హియో సంగ్ యంగ్ 2018 నుంచి 2020 వరకు 6వ కార్ప్స్ కమాండ్ సెంటర్‌లో పనిచేశారు. ఆయన మాదిరే జిన్ కూడా అదే డీఎంజెడ్ స్థావరంలో పనిచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఆయన మొదటి ఆరు నెలలు కమాండ్ సెంటర్‌లో గార్డుగా డ్యూటీ చేశారు. అది చాలా సదూరమైంది, బోరింగ్ కూడా. ఆకాశం వైపు చూడటం తప్ప ఏం చేయలేకపోయా” అని హియో వ్యాఖ్యానించారు.

అక్కడ నుంచి యాంగ్ లాజిస్టిక్స్ బృందానికి వెళ్లారు. అక్కడ టిష్యూలు, సాక్స్ ఆర్డర్ చేసే బాధ్యత నిర్వర్తించారు. దక్షిణ కొరియా నిర్బంధ సైనిక సేవ చాలా మంది యువకులను మనోవేదనకు గురి చేస్తోంది.

వారు తమ చదువులు, పని, స్నేహితుల నుంచి వారిని దూరం చేసినందుకు బాధతో వేడుకుంటున్నారు. అయితే బీటీఎస్ సభ్యులకు మిలటరీ డ్యూటీ నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇస్తుందని చాలా రోజులుగా వార్తలు వచ్చాయి. బిలియన్ల డాలర్లను సంపాదించి పెట్టడం ద్వారా వారు తమ దేశానికి ఇప్పటికే సేవలందించారు. వారిని అలాగే కొనసాగిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని అందరూ భావించారు.

అయితే మిలటరీలో చేరేందుకు తమ టీం సభ్యులు ప్రణాళికలు వేసుకుంటున్నట్లు అక్టోబర్‌లో బీటీఎస్ ప్రకటించింది.

ముందుగా సీనియర్ అయిన జిన్ వెళుతున్నట్లు చెప్పింది. అయినప్పటికీ జిన్‌కు ఫ్రంట్ లైన్ విభాగంలో డ్యూటీ వేస్తారని తెలిసి కొంతమంది అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఆయనకు తక్కువ రిస్క్ ఉన్న స్థానం కేటాయిస్తారని భావించారు.

అప్పట్లో సెలబ్రిటీల కోసం ఒక ప్రత్యేక యూనిట్ ఉండేది. అక్కడ వారు ఎంటర్‌టైనర్‌ గా కొనసాగేవారు, వారికి ప్రత్యేకాధికారాలు కూడా ఉండేవి. అయితే కొందరు అనుమతించిన దానికంటే ఎక్కువసార్లు తమ బ్యారక్‌లను వదిలి వెళ్లడంతో చర్చకు దారి తీసింది. సిస్టంను దుర్వినియోగం చేస్తున్నారని ప్రజలు నిరసన తెలిపారు.దీంతో 2013లో ఆ వ్యవస్థను రద్దు చేశారు.

“టైం వేస్ట్ అనిపించదని చెప్పానంటే, నేను అబద్ధం చెప్పినట్లే” అని గార్డ్ పోస్ట్ వద్ద డ్యూటీ చేసిన హియో చెప్పారు.

“నాకు మళ్లీ అవకాశం వస్తే, నేనైతే రాను. ఇక్కడ ఈ 18 నెలల్లో చాలా ఎక్కువ నేర్చుకున్నాను. జిన్‌కి నా సలహా ఏంటంటే.. ఆయన సమయాన్ని గడపాలి,
అది త్వరగా గడిచిపోవాలని ప్రార్థించాలి” అని అన్నారు. కానీ.. లాజిస్టిక్స్ బృందంలో పనిచేయడంతో హియోకు మంచి జ్ఞాపకాలు మిగిలాయి. ”మొదట్లో నేను ఇక్కడ ఎందుకుండాలని, 20 ఏళ్ల యువకులు ప్రశ్నించినట్లుగానే ప్రశ్నించేవాడిని” అన్నారు హియో.

కానీ, చివర్లో చాలా విలువైన పాఠాలు నేర్చుకున్నానని ఆయన స్పష్టం చేశారు. “పాఠశాలలో ఒక బ్యాక్‌గ్రౌండ్‌కు చెందిన వాళ్లతో మాత్రమే కలిసిపోయా. కానీ సైన్యంలో ప్రతి ఒక్కరూ చాలా భిన్నంగా ఉంటారు.

ప్రపంచం ఎంత పెద్దది, ఎంత వైవిధ్యంగా ఉందో గ్రహించాను” అన్నారు హియో.

ఈ ప్రయాణాన్ని ఆస్వాదించాలని జిన్‌కి సలహా ఇచ్చారు హియో.

“టాప్ స్టార్‌గా ఆయనకు సాధారణ వ్యక్తులను కలిసే అవకాశం ఉండదు. ఇది ఆయనకు మంచిదని నేను భావిస్తున్నాను” అని చెప్పారు. ఇక ఆన్ లైన్ లో జిన్ కు వేలాది మంది అభిమానులు సలహాలు ఇచ్చారు. వారంతా ఎంత మిస్ అవుతారో సందేశాల రూపంలో తెలియజేశారు.

సమర్థులైన దక్షిణ కొరియా పురుషులు మిలటరీ సేవ చేయడం తప్పనిసరి… ప్రభుత్వ నిబంధన ప్రకారం ఇపుడు బీటీఎస్ మెంబర్లలో సీనియర్ అయిన కిమ్ సియోక్-జిన్ మిలటరీలోకి వెళుతున్నారు. ఈ బ్యాండ్ నుంచి సైనిక విభాగంలో సేవలందించడానికి వెళుతున్న మొదటి వ్యక్తి జిన్.
…………………………………….

Must Read

spot_img