చిరంజీవి.. తెలుగు రాష్ట్ర్రాల్లో అశేష జనవాహినికి .. ఓ ఐకాన్.. ఇప్పుడా ఐకాన్ చుట్టూ రాజకీయం తిరుగుతోందట. ఏపీలో బలపడాలంటే, పట్టున్న నేతలు తప్పనిసరి. అందుకే కేంద్ర పెద్దలు చిరంజీవిపై కన్నేసారని ఓ టాక్ వెల్లువెత్తుతోంది. ఇప్పటికే పలుసార్లు కలిసినా, మళ్లీ తాజాగా అనురాగ్ ఠాకూర్ భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.
ఇండస్ట్రీలో పెద్ద దిక్కు పదవి నాకు వద్దు, అవసరం ఉన్నప్పుడు ఒక సినీ కార్మికుడిగా నా వంతు సహాయం నేను చేస్తూనే ఉంటా అంటూ చిరంజీవి చెప్పుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తనకి అవకాశం కలిగిన ప్రతిసారి సినీ పరిశ్రమ సమస్యల పై పోరాడుతూనే ఉంటున్నారు. తాజాగా ఇదే విషయం పై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్‌తో భేటీ అయ్యారు చిరంజీవి. ఈ సమావేశంలో హీరో నాగార్జున, నిర్మాత అల్లు అరవింద్ కూడా పాల్గొన్నారు. ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ చిరంజీవి ట్వీట్ చేశారు. ఫిబ్రవరి 26న హైదరాబాద్ వచ్చిన కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, చిరు ఇంటికి అతిథిగా వచ్చారు.
అనురాగ్ ఠాకూర్‌ని సన్మానించిన చిరంజీవి, నాగార్జున.. సినీ పరిశ్రమలోని సమస్యలు, దాని పురోగతి గురించి అనురాగ్ ఠాకూర్‌కి వివరించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా చిరు షేర్ చేశారు. కాగా ప్రస్తుతం చిరు భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ తమిళ హిట్ మూవీ వేదాళంకి రీమేక్ గా వస్తుంది. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లిగా నటిస్తుంది. మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక నాగార్జున సినిమాలు విషయానికి వస్తే.. చివరిగా ది ఘోస్ట్ మూవీతో ఆడియన్స్ముందుకు వచ్చారు.

ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ఈ మూవీ రిలీజ్ అయ్యి నాలుగు నెలలు గడుస్తున్నా నాగార్జున మాత్రం మరో మూవీ ప్రకటించలేదు.
అయితే ఫిలిం వర్గాల్లో నాగార్జున.. తన నెక్ట్స్ మూవీని ధమాకా రైటర్ ప్రసన్న కుమార్ డైరెక్షన్‌లో చేసేందుకు రెడీ అవుతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే, తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో నిత్యం అనేక ఊహాగానాలకు ఊతమిచ్చేలా ఏదో ఒక డెవలప్మెంట్ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా కేంద్రంలోని బీజేపీ పెద్దలు మోదీ మంత్రులు తెలుగు రాష్ట్రాలకు వచ్చినప్పుడంతా ఇక్కడి ప్రముఖులను పబ్లిక్గా కలవడమో రహస్యంగా కలవడమో చేస్తుండడంతో ఎవరు ఎప్పుడు బీజేపీలో చేరుతారో… ఎవరు ఆ పార్టీకి దగ్గరవుతారో అనే చర్చతో లెక్కల్లో పడుతున్నాయి ఇక్కడి ప్రాంతీయ పార్టీలు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ రావడం.. చిరంజీవి నాగార్జునలతో ఆయన చర్చలు జరపడం కొత్త ఊహాగానాలకు ఊపిరిపోసింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో లేదో తెలియనట్లుగా ఉన్న చిరంజీవిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో మంత్రి కలవడం చర్చనీయంగా మారింది. ఈ భేటీ యథాలాపమా.. రాజకీయ కోణం ఉందా? చిరంజీవిని కలిసేందుకు మంత్రి ఆసక్తి చూపించారా? లేదంటే చిరంజీవే కేంద్ర మంత్రిని తన ఇంటికి ఆహ్వానించారా? వారిద్దరి భేటీలో నాగార్జున ఎందుకు ఉన్నారు వంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. చిరంజీవి చేసిన ట్వీట్ ప్రకారం చూస్తే సినీ పరిశ్రమ గురించే వారి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అనురాగ్ ఠాకూర్ కూడా తన ట్వీట్లో అదే విషయం రాసుకొచ్చారు. అయితే అనురాగ్ ఠాకూర్ ఇప్పుడేమీ వినోద పరిశ్రమకు సంబంధించిన మంత్రి కాదు.
సమాచార ప్రసార శాఖ క్రీడలు యువజన వ్యవహారాల మంత్రిగా ఉన్నారు. ఇంతకుముందు అమిత్ షా తన హైదరాబాద్ పర్యటనలో జూనియర్ ఎన్టీఆర్తో ఓసారి నితిన్తో మరోసారి భేటీ కావడం తెలిసిందే. అలాగే నరేంద్ర మోదీ తన విశాఖ పర్యటనలో పవన్ కల్యాణ్తో భేటీ అయ్యారు. అదేసమయంలో బాహుబలి ఆర్ఆర్ఆర్ వంటి గొప్ప చిత్రాలకు కథ సమకూర్చిన విజయేంద్ర ప్రసాద్ను కూడా బీజేపీ రాజ్యసభకు పంపించింది. తెలుగు చిత్ర సీమకు చెందిన కీరవాణికి ఇటీవల పద్మశ్రీ కూడా ప్రకటించింది. వీటన్నిటి నేపథ్యంలో బీజేపీ తెలుగు సినీ ప్రముఖులపై ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్న విషయం స్పష్టమవుతోంది.
మరోవైపు చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీ జనసేనకు బీజేపీకి చాలాకాలంగా పొత్తు కొనసాగుతోంది. ఇటీవల ఏపీ తెలంగాణల్లో రాజకీయ పరిణామాలు మారుతున్నప్పటికీ బీజేపీ జనసేన పొత్తు మాత్రం అలాగే కొనసాగుతోంది. వీటన్నిటి నేపథ్యంలో చిరంజీవి అనురాగ్ ఠాకూర్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మెగాస్టార్ చిరంజీవితో భేటీ అయ్యారు. అనురాగ్ ఠాకూర్ తో దిగిన ఫోటోలను చిరంజీవి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.. తన వద్దకు వచ్చి కాసేపు గడిపినందుకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు చిరంజీవి. భారతీయ చలన చిత్ర పరిశ్రమ, వేగవంతమైన పురోగతి గురించి తన సోదరుడు నాగార్జునతో కలిసి మనం జరిపిన ఆహ్లాదకరమైన చర్చ నచ్చిందని చిరంజీవి అన్నారు. ప్రస్తుతం ఈ భేటీ తాలూకు ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సీనియర్ హీరోగా టాలీవుడ్ లో సత్తా చాటుతున్న మెగాస్టార్ చిరంజీవి.. సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. ఎప్పటికప్పుడు సమాజంలో జరుగుతున్న విషయాలతో పాటు తన సినిమాలు, వ్యక్తిగత విషయాలు అభిమానులతో పంచుకుంటున్నారు. బీజేపీ అగ్రనేతలు, కేంద్ర మంత్రులు తరచూ సినీ ప్రముఖులతో భేటీ అవుతుండటం చర్చనీయాంశంగా మారింది. గతంలో హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హీరో నితిన్, క్రికెట్ స్టార్ మిథాలీ రాజ్‌ను కలిశారు.

రానున్నది ఎన్నికల కాలం కావడంతో తాజాగా చిరంజీవి, నాగార్జునతో కేంద్ర మంత్రి అనురాగ్ఠాగూర్ భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.. ఈ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని … మెగా కాంపౌండ్ చెబుతోంది. అయితే ఇటీవల బీజేపీ.. చిరంజీవిని దువ్వడానికి తన వంతు ప్రయత్నం చేస్తుందన్నది అందరికీ తెలిసిన విషయమే. ఆ టాస్క్ అనురాగ్ ఠాకూర్ తీసుకున్నారని భావిస్తున్నారు. చిరంజీవిని బీజేపీ ఇటీవలి కాలంలో ప్రత్యేకంగా చూసేందుకు ప్రయత్నిస్తోంది. భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు చిరంజీవిని ఆహ్వానించారు. ఆ కార్యక్రమంలో మోదీ..చిరంజీవి తనకు ఎంతో ఆప్తమిత్రుడన్నట్లుగా సంభాషించారు.
తర్వాత కూడా ఈ పాజిటివ్ ఫీలింగ్ ఉండేలా చూసుకుంటున్నారు. ఇప్పుడు అది ఇంకాస్తముందుకెళ్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. ఇటీవల చిరంజీవికి ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022’అవార్డు ఇచ్చారు. గోవాలో జరిగిన అవార్డు ప్రదానోత్సవ సభలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినట్లే.. రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తారా అని అడిగేశారు. సినిమాల్లోకి వచ్చి హిట్ అయినట్లే.. రెండో సారి రాజకీయాల్లోకి వస్తే సూపర్ హిట్ అవుతారనే ఉద్దేశంలో ఆయన వేదికపైనే అడిగారు. అయితే చిరంజీవి మాత్రం తాను మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ప్రశ్నే లేదని తేల్చేశారు.
తాను ఇక సినిమాలకే అంకితమని స్పష్టం చేశారు. చిరంజీవి తన సోదరుడికి మద్దతుగా మాట్లాడుతున్నారు. జనసేన పార్టీ ఉన్నత స్థానానికి వెళ్తుందని చెబుతున్నారు. అందుకే.. ఇటీవలి కాలంలో వైసీపీ నేతలు కూడా ఆయనను దూరం పెడుతున్నారు. అయినా సరే చిరంజీవి ఏ మాత్రం తగ్గడం లేదు. ఆయన బీజేపీలోకి వస్తే ఏపీలో ఓ బలమైన ఫోర్స్‌గా మారవచ్చని బీజేపీ అనుకుంటోంది. ఆయనసోదరుడు బీజేపీతో పొత్తులో ఉన్నప్పటికీ.. మిత్రపక్షాన్ని బలపర్చడం బీజేపీకి ఇష్టం ఉండదు. ఆ పార్టీని విలీనం చేయాలని కోరుతున్నా.. పవన్ నిరాకరిస్తున్నారు. చిరంజీవి మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారో రారో కానీ.. బీజేపీ మాత్రం గట్టి ప్రయత్నాలు చేస్తోందని అనురాగ్ ఠాకూర్ చిరంజీవి ఇంటికి వెళ్లడంతో భావించవచ్చని విశ్లేషకులు అంటున్నారు.
మరి చిరుపై బీజేపీ కన్నేసిందా అన్నదే హాట్ టాపిక్ గా మారింది..