దేశంలో మహిళలు హిజాబ్ సరిగా ధరించకపోవడం వల్ల వర్షాలు కురియడం లేదని ఆ దేశం మత గురువు కనిపెట్టారు. ఆయన వ్యాఖ్యలపై దేశంలో మరోమారు దుమారం రేగింది. వర్షాలకు, హిజాబ్‌కు లంకె ఏంటంటూ జనం మండిపడుతున్నారు ఈ వ్యాఖ్యలు చేసిన గురువు సాక్షాత్తూ ఇరాన్ సుప్రీం లీడర్ ఖొమైనీకి మతగురువు అత్యంత సన్నిహితుడు..ఓ రిపోర్ట్..
ఇరాన్ లోని ఓ మతగురువు మహ్మద్ మెహదీ హుస్సేనీ బోడిగుండుకు, మోకాలుకు ముడిపెట్టారు. దేశంలోని మహిళల్లో కొందరు హిజాబ్ ధరించకపోవడం వల్లే వర్షాలు కురవడం లేదన్నారు. జరిగే సంఘటనలకు, మాట్లాడే దానికి సంబంధం లేకపోతేనే ఈ సామెతను వాడుతుంటారు. ఇపుడు ఇరాన్ మత గురువు మహ్మద్ మెహదీ హుస్సేనీ హమేదాని కూడా ఇపుడు ఇదే తరహా వ్యాఖ్యలు చేసారు. హిజాబ్‌ను సరిగా ధరించలేదన్న కారణంతో 22 ఏళ్ల కుర్దిష్ యువతి మహ్సా అమినిని నైతిక విభాగం పోలీసులు అదుపులోకి తీసుకున్నతర్వాత ఆమె వారి కస్టడీలోనే మృతి చెందింది. అమిని మరణం దేశ్యవ్యాప్తంగా సంచలనం కలిగించింది. దీనితో హిజాబ్ వద్దంటూ మహిళలు రోడ్డుపైకి వచ్చారు.
ఆందోళనలు చేస్తే.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తే.. దేవుడికి శత్రువేనని ఇరాన్ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది.
హిజాబ్ ఆందోళనల్లో పాల్గొన్న నిరసనకారులపై విరుచుకుపడింది. ప్రభుత్వ భవనానికి నిప్పు పెట్టిన ఓ నిరసనకారుడికి అక్కడి న్యాయస్థానం మరణ శిక్షను విధించింది. మరో ఐదుగురికి 10 ఏళ్ల జైళ్లు శిక్షను విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. అయితే దోషులుగా ఉన్నవారు తమ శిక్షపై అప్పీలు చేసుకోవచ్చని మాత్రం కాస్తా ఊరటనిచ్చింది. తాజాగా ఆ వివరాలను ఇరాన్ న్యాయ వ్యవస్థకు చెందిన మిజాన్ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో వెల్లడించారు. ప్రజా శాంతికి భంగం కలిగించి.. జాతీయ భద్రతకు ముప్పు కల్పించినట్టు నిరసనకారులపై ఆరోపణలు గుప్పించింది. ఆమేరకు నిరసనకారులను నేరస్థులుగా గుర్తించి… టెహ్రాన్ కోర్టు వారికి శిక్షలను విధించింది.
గత మూడు నెలలుగా హిజాబ్‌కు, పోలీసులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలు నిరసనలు తెలుపుతున్నారు. అందులో భాగంగా మహిళలు తమ జట్టును కత్తిరించుకుంటున్నారు. అమిని మృతికి కారణమైన హిజాబ్‌ను వ్యతిరేకిస్తూ కాల్చేస్తున్నారు. అమినిని అరెస్టు చేసి హింసించిన మొరాలిటీ పోలీసులకు శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆందోళనల్లో ఇప్పటివరకు వందల మందికి పైగా నిరసనకారులు చనిపోయారు. అమిని మృతి, ఆందోళనలపై ఐక్యరాజ్య సమితి స్పందించింది. అమిని మృతిని ఖండించింది. ఈ ఘటనపై వెంటనే స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని యూఎన్ డిమాండ్ చేసింది. ఆందోళనకారులపై దాడులను యూఎన్ మానవ హక్కుల విభాగం ఖండించింది. అంత జరిగినా.. ఇరాన్ ప్రభుత్వం మాత్రం స్పందించలేదు.
హింసాత్మక ఘటనల్లో పాల్గొనేవారికి తీవ్ర శిక్షలు ఉంటాయని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఇటీవలే హెచ్చరించారు.
పైగా నిరసనలను అణచివేసేందుకు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. హింసాత్మక ఘటనల్లో పాల్గొనేవారికి తీవ్ర శిక్షలు ఉంటాయని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఇటీవలే హెచ్చరించారు. అయితే దేశమంతా పాకిన ఈ అల్లర్లతో దిగి వచ్చిన ఇరాన్ ప్రభుత్వం మొరాలిటీ పోలీసింగ్ ను సైతం రద్దు చేసింది. అయితే నిరసనల సమయంలో ఆందోళనకారులతో పాటు భద్రతా సిబ్బంది కూడా మరణించారు. దీన్ని ప్రభుత్వం అల్లర్లుగా అభివర్ణిస్తోంది. నిరసనల్లో పాల్గొన్న వారిపై తీవ్రమైన కేసులు నమోదు చేస్తోంది. ప్రధానంగా మూడు ప్రావిన్సుల్లో ఏకంగా 750 మందిపై కేసులు నమోదైనట్టు నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటివరకు నిరసనల్లో పాల్గొన్నట్టు ఆరోపిస్తూ 2వేల మందిపై కేసులు నమోదు చేశారు.
వారిలో సగానికి పైగా రాజధాని ట్రెహ్రాన్‌లో ఉన్నవారే అంటున్నారు ఉద్యమకారులు. దక్షిణ ప్రావిన్స్ హోర్మోజ్‌గాన్‌లో 164 మందిపై అల్లర్ల కేసులను నమోదు చేసినట్టు మిజాన్ ఆన్‌లైన్ వెల్లడించింది. ఇక హత్యకు ప్రేమించడం, భద్రతా దళాలకు హని కలగించడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేయడం వంటి చర్యలకు పాల్పడిన వారు దేవుడికి వ్యతిరేకులుగా ఇరాన్ ప్రభుత్వం చెబుతోంది. ఇరాన్ సెంట్రల్‌లోని మర్కాజీ ప్రావిన్స్‌లో 276 మందిపై, ఇస్ఫాహాన్ ప్రావిన్స్‌లో 316 కేసులు నమోదయ్యాయి. ఆందోళనల్లో మొత్తం 15వేల మందిని అదుపులోకి తీసుకున్నట్టు విదేశాలకు చెందిన మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఇరాన్ మాత్రం ఆ సంఘాల వాదనలను ఖండిస్తున్నాయి.