ఫోర్లు, సిక్సర్ల వర్షంతో పాటు టీమ్ ఓనర్లు, ఆటగాళ్లకు బీసీసీఐ నుంచి కాసుల వర్షం కురిపించనుంది. 2008లో మొదటి సీజన్ నుంచి IPL ప్రజాదరణ, ఆదాయాలు రెండూ నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి.
ఐపీఎల్ అంటే పరుగుల వరదే కాదు.. కాసుల గలగలలు .. అన్నది అందరికీ తెలిసిందే. మరి అసలు IPL వ్యాపార నమూనా ఏమిటి… ? ఐపీఎల్‌తో బీసీసీఐ భారీ లాభాలను ఎలా పొందుతుంది.? బ్రాడ్ కాస్టింగ్ తోనే .. వేల కోట్ల ఆదాయం ఎలా లభిస్తుంది..?
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకటే హవా. అదే ఇండియన్ ప్రీమియర్ లీగ్.అసలు ఐపీఎల్ ద్వారా డబ్బులు ఎలా వస్తాయి? ఎవరికి వస్తాయి? క్రికెటర్లకు ఎంత చెల్లిస్తారు? ఇవన్నీ ఎప్పుడైనా అనుకున్నారా? ఎప్పుడో ఒకసారి అయినా అనుకునే ఉంటారు. ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేది టీ20 క్రికెట్ లీగ్. దీనిని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా నిర్వహిస్తుంది. ఇది 2008లో 8 జట్లతో ప్రారంభమైంది.
ఐపీఎల్ 2023 త్వరలో ప్రారంభం కానుండడంతో మరో రెండు నెలలపాటు క్రికెట్ ప్రేమికుల ఆనందాలకు అవధులు లేకుండా పోనున్నాయి. ఫోర్లు, సిక్సర్ల వర్షంతో పాటు టీమ్ ఓనర్లు, ఆటగాళ్లకు బీసీసీఐ నుంచి కాసుల వర్షం కురిపించే టోర్నీగా ఐపీఎల్ మారింది. 2008లో మొదటి సీజన్ నుంచి IPL ప్రజాదరణ, ఆదాయాలు రెండూ నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ఐపీఎల్ టోర్నీ మొదలైనప్పుడల్లా .. అసలు IPL వ్యాపారం ఎలా చేస్తుంటారు..? దీన్నుంచి అంత లాభాలు ఎలా సాధ్యం అన్నదే చర్చనీయాంశంగా మారుతుంది.
IPL ప్రారంభమైనప్పటి నుంచి అత్యంత ముఖ్యమైన సంపాదన సాధనంగా మీడియా ప్రసార హక్కులు కూడా చేరాయి. ప్రసార హక్కులు పొందితే, ఆ పొందిన ఛానెల్ కు మాత్రమే IPL మ్యాచ్‌లను దాని హక్కులను కలిగి ఉన్నట్లు లెక్క. అంటే ఈ ఐపీఎల్ మ్యాచులన్నింటినీ ఆ ఛానెల్ మాత్రమే చూపించగలదు.
ఐపీఎల్ ప్రారంభం నుంచి అంటే 2008 నుంచి వచ్చే 10 సంవత్సరాల వరకు అంటే 2017 వరకు దీని ప్రసార హక్కులు సోనీ వద్ద ఉన్నాయి. దీని కోసం బీసీసీఐకి రూ. 8వేల 200 కోట్లు ఇచ్చింది. 2018లో ప్రసార హక్కులు మరోసారి వేలం వేశారు. ఈసారి స్టార్ స్పోర్ట్స్ మీడియా హక్కులను గెలుచుకుంది.
2018 నుంచి 2022 వరకు 5 సంవత్సరాల పాటు IPL ప్రసార హక్కులను రూ.16వేల 347 కోట్లకు స్టార్ కొనుగోలు చేసింది. ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన చారిత్రాత్మక వేలంలో డిస్నీ స్టార్ 2023 నుంచి 27 వరకు భారత ఉపఖండంలో పురుషుల IPL ప్రసార హక్కులను 23 వేల575 కోట్లకు కొనుగోలు చేసింది. వయాకామ్ 18 .. లీగ్ డిజిటల్ హక్కులను 20వేల 500 కోట్లకు వేలంతో చేజిక్కించుకుంది.
ఇది ఒక్క ఎత్తు అయితే 2023 సీజన్ కు సంబంధించి మినీ వేలం కొచ్చిలో అట్టహాసంగా జరిగింది. ఈ వేలాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసే బ్రాడ్‌కాస్టర్లు భారీగా డబ్బు సంపాదించడానికి సిద్ధంగా ఉన్నారు. IPL అధికారిక బ్రాడ్‌కాస్టర్, స్టార్ స్పోర్ట్స్, డిజిటల్ స్ట్రీమింగ్ భాగస్వామి, జియో సినిమా, ప్రీమియం ధరలకు యాడ్ ఇన్వెంటరీని విక్రయిస్తున్నాయి. వారు ప్రత్యక్ష ప్రసారం కోసం కొంతమంది స్పాన్సర్‌లను కూడా చేర్చుకున్నారు.
స్పాన్సర్‌ల జాబితాలో అంతర్జాతీయ బ్యాంకు కూడా ఉంది. బ్రాడ్‌కాస్టర్ వేలం రోజు కోసం 12 నుంచి 18 లక్షల మధ్య వివిధ ప్యాకేజీలను కూడా అందిస్తున్నారు. జియో సినిమా సహ ప్రెజెంటింగ్ స్పాన్సర్ కోసం 20 లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కో మ్యాచ్‌కు 12 మిలియన్లతో, IPL ప్రపంచంలోనే 2వ అత్యంత లాభదాయకమైన స్పోర్ట్స్ లీగ్‌గా ఉంది.
ఈ మెగా లీగ్ ఐదేళ్ల బ్రాడ్‌కాస్టింగ్ హక్కుల కోసం కంపెనీలు రూ.50 వేల కోట్ల వరకూ వెచ్చించనున్నాయని అంచనాలు వెల్లువెత్తాయి. అంతేకాదు ఈ హక్కుల కోసం అమెజాన్, రిలయెన్స్‌లాంటి కంపెనీలు కూడా కొత్తగా పోటీలోకి వచ్చాయి. ఇప్పటికే సోనీ గ్రూప్, వాల్ట్ డిస్నీ సంస్థలు ఈ రేసులో ఉన్నాయి. అన్నీ బడా కంపెనీలు కావడంతో ఈసారి ఐపీఎల్ బ్రాడ్‌కాస్టింగ్ హక్కుల విలువ ఆకాశాన్ని తాకింది.
గత సీజన్‌లో ఐపీఎల్ ఫస్ట్ హాఫ్ చూసిన వారి సంఖ్యే 35 కోట్లుగా ఉండటం విశేషం.
ప్రస్తుతం డిస్నీ ఓనర్‌గా ఉన్న స్టార్ ఇండియా ఐపీఎల్ బ్రాడ్‌కాస్టింగ్ హక్కులు దక్కించుకుంది. అయితే ప్రతి ఏటా ఐపీఎల్ వ్యూయర్ల సంఖ్య భారీగా పెరిగిపోతుండటంతో ఈసారి బ్రాడ్‌కాస్టింగ్ హక్కులు దక్కించుకోవడానికి కంపెనీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. గత సీజన్‌లో ఐపీఎల్ ఫస్ట్ హాఫ్ చూసిన వారి సంఖ్యే 35 కోట్లుగా ఉండటం విశేషం. ప్రతిసారీ ఈ హక్కుల కోసం సాంప్రదాయ మీడియా సంస్థలే పోటీ పడేవి.
అంటే సోనీ, స్టార్‌లాంటివి. కానీ ఈసారి మాత్రం వాటికి రిలయెన్స్, అమెజాన్‌లాంటి సంస్థల నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఈ రెండు సంస్థల మధ్య ఇప్పటికే ఫ్యూచర్ గ్రూప్ కొనుగోలు విషయంలో హోరాహోరీ నడిచిన విషయం తెలిసిందే. అయితే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై తమ భవిష్యత్తును వెతుక్కుంటున్న రిలయెన్స్.. అందులో భాగంగా ఐపీఎల్ బ్రాడ్‌కాస్టింగ్ హక్కుల కోసం ప్రయత్నించింది.
తమ బ్రాడ్‌కాస్టింగ్ జాయింట్ వెంచర్ అయిన Viacom18 కోసం రిలయెన్స్ 160 కోట్ల డాలర్ల పెట్టుబడులను సమీకరించనుండటం కూడా ఇందులో భాగమే. మరోవైపు అమెజాన్ తమ ప్రైమ్‌వీడియో ప్లాట్‌ఫామ్ ద్వారా క్రికెట్ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. ఇండియా, న్యూజిలాండ్ మహిళల క్రికెట్ సిరీస్ లైవ్ ప్రైమ్‌వీడియోలోనే వస్తోంది. ఇక ఇప్పుడు ఐపీఎల్‌లాంటి మెగా లీగ్ హక్కుల కోసం ఆ సంస్థ ప్రయత్నిస్తోంది.
అయితే ఈ సంస్థకు సొంతంగా టీవీ ప్లాట్‌ఫామ్ అంటూ ఏదీ లేదు. దీంతో ఐపీఎల్ హక్కుల కోసం ఓ టీవీ పార్ట్‌నర్‌ను వెతుక్కోవడమో లేదంటే కేవలం డిజిటల్ హక్కుల కోసం ప్రయత్నించడమో చేయాల్సి ఉంటుందని సమాచారం. ఇదిలా ఉంటే, ఐపీఎల్ కు ఉండే వీవర్ షిప్ కు అనుగుణంగా స్టార్ స్పోర్ట్స్ భారీ మొత్తంలో యాడ్ ల కోసం వసూలు చేస్తోంది.
క్రికెట్ మ్యాచ్ ల కారణంగా దేశంలో మొత్తం యాడ్ రెవెన్యూలో స్పోర్ట్స్ వాటా 20 శాతానికి చేరింది.
ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతున్నప్పుడు ఒక్క సెకను యాడ్ కనిపించాలంటే ఏకంగా లక్షా 40 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. పది సెకన్లకు అయితే అక్షరాల 14 లక్షల రూపాయలు. ఐపీఎల్, క్రికెట్ మ్యాచ్ ల కారణంగా దేశంలో మొత్తం యాడ్ రెవెన్యూలో స్పోర్ట్స్ వాటా 20 శాతానికి చేరింది. ఐపీఎల్ 13వ సీజన్ లో యాడ్ టారిప్ దుమ్ము రేగిపోతోంది.
మ్యాచ్‌ల సందర్భంగా 10 సెకన్ల యాడ్‌కు గాను రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు స్టార్ స్పోర్ట్స్ వసూలు చేసిన విషయం తెలిసిందే. గతేడాది మ్యాచ్‌లకు గాను స్టార్ స్పోర్ట్స్ రు. 3 వేల కోట్ల ఆదాయం ఆర్జించింది. ఇప్పుడు అంతకు మించి రాబట్టాలని చూస్తున్నా అది సాధ్యమవుతుందా ? అన్న సందేహాలు అయితే ఉన్నాయి. గత ఐపీఎల్ మ్యాచ్‌లకు 424 మిలియన్ల వ్యూయర్‌షిప్ వచ్చింది.
టీవీ ప్రేక్షకుల్లో 51 శాతం మంది ఐపీఎల్ మ్యాచ్‌లను చూశారు. ఈ సారి ఐపీఎల్ ప్రసార హక్కులను రెండు కంపెనీలు దక్కించుకున్నాయి. టీవీ, బ్రాడ్‌కాస్టింగ్ హక్కులను స్టార్ స్పోర్ట్స్ ఇండియా తీసుకుంది. డిజిటల్ లైవ్ బ్రాడ్‌కాస్టింగ్ హక్కులను వయాకామ్18-రిలయన్స్ కైవసం చేసుకుంది. జియో యూజర్లు, జియో సినిమా యూజర్లు ఉచితంగానే ఐపీఎల్ మిని వేలాన్ని చూడొచ్చు. గతానికి భిన్నంగా 4K క్వాలిటీతో ప్రసారం ఉంటుందని సమాచారం.
ఇక టీవీలో స్టార్‌స్పోర్ట్స్‌లో వస్తుంది. ఇదిలా ఉంటే, IPL 2023 వేలం షార్ట్‌లిస్ట్‌లో భారత్ నుంచి 273 మందితో సహా 405 మంది క్రికెటర్లు ఉన్నారు. గరిష్టంగా 87 స్లాట్‌లు అందుబాటులో ఉన్నాయి. అత్యధిక రిజర్వ్ ధర 2 కోట్లు నిర్ణయించారు. ఇదిలా ఉంటే, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) విలువ 10 బిలియన్ డాలర్లను దాటిపోయింది. 2022లో ఐపీఎల్ విలువ 10.9 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు తెలిసిందే.
ఐపీఎల్ .. అంటేనే .. పరుగుల వరదే కాదు .. ఆదాయాల ప్రవాహమన్నది అందరికీ తెలిసిందే. అయితే ప్రతి ఏటా ఈ ఆదాయం .. బ్రాడ్ కాస్టింగ్ సంస్థలకు పెరిగిపోతుండడంతో, ప్రసార హక్కుల కోసం .. పోటీ ఏర్పడుతోంది.