Homeఅంతర్జాతీయంఅంతర్జాతీయ తొలి స్వదేశీ విమాన వాహక నౌక..

అంతర్జాతీయ తొలి స్వదేశీ విమాన వాహక నౌక..

ఐఎన్ఎస్ విక్రాంత్.. దేశ కీర్తిపతాకను .. అంతర్జాతీయ స్థాయిలో ఎగురవేసిన తొలి స్వదేశీ విమాన వాహక నౌక.. ఇప్పుడు ఇది మరో కీలక మైలురాయిని అధిగమించింది. విమాన వాహక నౌక అయినా.. ఏకంగా ఫైటర్ జెట్ లను సైతం క్యారీ చేయగల సామర్థ్యాన్ని సొంతం చేసుకుంది. దీనిలో భాగంగానే తేజస్ యుద్ధ విమానం .. విక్రాంత్ పై విజయంతంగా ల్యాండింగ్ చేయగలిగింది.

ఓవైపు క్లిష్ట వాతావరణం, మరోవైపు సముద్రయానం.. ఈ సమయంలో .. తేజస్ వంటి యుద్ధ విమాన ల్యాండింగ్.. ఆద్యంతం .. అటు నిపుణులనే కాక .. యావత్ ప్రజానీకాన్ని .. అబ్బురపరిచింది. కేవలం .. 2.5 సెకన్లలో తన అత్యధిక వేగాన్ని జీరో చేసుకుని మరీ ల్యాండింగ్ కావడం..ల్యాండింగ్ వేళ .. విమానానికి ఎటువంటి సమస్య రాకుండా విక్రాంత్ .. నిలబడిన తీరు .. సర్వత్రా ఆకట్టుకుంటోంది.

భారతదేశం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌కు సంబంధించి మరో కీలక మైలురాయిని అధిగమించింది. ఈ నౌకపై స్వదేశీ తేలికపాటి యుద్ధ విమానం తొలిసారిగా ల్యాండ్ అయ్యింది. ఓ ఫిక్స్‌డ్ వింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ .. విక్రాంత్‌పై దిగడం కూడా ఇదే తొలిసారని భారత నౌకాదళం తెలిపింది. విమాన వాహకనౌకలు, యుద్ధ విమానాల రూపకల్పన, నిర్మాణం, నిర్వహణ పరంగా భారత్ సామర్ధ్యాన్ని తాజా ఘటన ప్రదర్శిస్తుందని వెల్లడించింది. ఇకపోతే.. దాదాపు 20 వేల కోట్లతో నిర్మించిన ఐఎన్ఎస్ విక్రాంత్‌ను గతేడాది సెప్టెంబర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేసిన సంగతి తెలిసిందే.

ఈ ప్రయోగం చాలా క్లిష్టతరమైందన్న నిపుణులు .. కచ్చితమైన ప్రదేశంలో కాకుండా విమానంలోని ఏ ఒక్క భాగామైన కానీ అధిక ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాల్సి ఉందని అన్నారు. ఆ సమయంలో జెట్‌ వేగాన్ని 130 నాట్ల వేగానికి ఉంచడానికి ప్రయత్నిస్తామని, కచ్చితంగా 90 మీటర్లలో వేగాన్ని గంటకు 240 కి.మీ నుంచి దాదాపు 2.5 సెకన్లలో సున్నాకి తీసుకురావడానికి ప్రయత్నిస్తామని వివరించారు.

ఈ సందర్భంగా పైలట్‌లు శారీరక సవాళ్లను ఎదుర్కొంటారని సైతం చెబుతున్నారు. 45వేల టన్నుల బరువున్న ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను రూ.20వేల కోట్ల వ్యయంతో నిర్మించి గతేడాది సెప్టెంబర్‌లో నావికాదళంలో ప్రవేశపెట్టారు. 262మీటర్లపొడవు, 62మీటర్ల వెడల్పు ఉన్న భారీ యుద్ధనౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను భారత్‌లో తయారుచేశారు. మిగ్ 29కె ఫైటర్ జెట్స్, హెలికాప్టర్లతోపాటు మొత్తం 30విమానాలను తీసుకువెళ్లగల సామర్థం ఐఎన్‌ఎస్ విక్రాంత్‌కు ఉంది. ఈ యుద్ధనౌకలో సుమారు 1600మంది నేవీ సిబ్బంది ప్రయాణించవచ్చు.

  • భారత దేశంలో తయారైన యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ పై అత్యంత వేగంగా దూసుకెళ్లే ఫైటర్ జెట్ విజయవంతంగా ల్యాండయింది..

ఈ ఘనత సాధించిన ఫైటర్ జెట్ తేజస్ కూడా మన దేశంలోనే తయారవడం విశేషం. తేజస్ ఫైటర్ జెట్ ను ప్రయోగాత్మకంగా ఐఎన్ఎస్ విక్రాంత్ పై ల్యాండ్ చేయడం అత్యంత టెన్షన్ తో కూడుకున్న పని అని నిపుణులు వెల్లడించారు. గతంలో యుద్ధ విమాన వాహన నౌకలపై తేజస్ ను ల్యాండ్ చేసినా, ఐఎన్ఎస్ విక్రాంత్ దేశీయంగా తయారుకావడం, దీనిపై ఏర్పాటు చేసిన రన్ వే మిగతా వాటితో పోలిస్తే చిన్నది కావడంతో అధికారవర్గాల్లో టెన్షన్ నెలకొంది.

అంతేగాక ల్యాండింగ్ సమయంలో తేజస్ జెట్ వేగం చాలా ఎక్కువగా ఉంటుందని, దానిని క్షణాల వ్యవధిలో జీరో వేగానికి తగ్గించడం అత్యంత క్లిష్టమైన పని చెబుతున్నారు. సముద్రంలో క్లిష్ట వాతావరణ పరిస్థితుల మధ్య నౌకలపై యుద్ధ విమానాలను ల్యాండ్ చేయడం సవాళ్లతో కూడుకున్న విషయమని అంటున్నారు. జెట్ ఫైటర్లు చాలా వేగంతో దూసుకెళతాయని, ల్యాండింగ్ సమయంలో వేగాన్ని తగ్గించినా..విమానం రన్ వేను తాకే సమయంలో జెట్ .. 240 కిలోమీటర్ల వేగంతో ఉందని తెలిపారు. ఈ స్థాయిలో ఉన్న వేగాన్ని క్షణాలలో పూర్తిగా తగ్గించి, జెట్ ను నిలపడం చాలా కష్టమైన విషయమని అంటున్నారు.

విమాన వాహకనౌకలు, యుద్ధ విమానాల రూపకల్పన, నిర్మాణం, నిర్వహణ పరంగా భారత్ సామర్ధ్యాన్ని తాజా ఘటన ప్రదర్శిస్తుందని వెల్లడించింది. భారత మొట్టమొదటి స్వదేశీ నిర్మిత విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఈ యుద్ధనౌకను కదిలే నగరంగా, బాహుబలి నౌకగా పిలుస్తారు. విక్రాంత్ నిర్మాణంతో దేశీయంగా విమాన వాహక నౌకను రూపొందించి, నిర్మించగల సామర్థ్యాన్ని కలిగిన యుఎస్, యుకె, రష్యా, చైనా, ఫ్రాన్స్ దేశాల సరసన భారత్‌ చేరింది.

  • ఐఎన్ఎస్ విక్రాంత్ .. మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది..

రష్యా ప్లాట్‌ఫాంపై నిర్మించిన ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య తర్వాత ఇది భారత దేశ రెండో విమాన వాహక నౌక. విక్రాంత్‌ను ప్రారంభించడంతో.. భారత్ కార్యాచరణ విమాన వాహక నౌకలను కలిగి ఉంది. ఇది దేశ సముద్ర మార్గ భద్రతను పెంచుతుంది. గతంలో ఉన్న ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను బ్రిటన్‌ నుంచి భారత్ 1961లో కొనుగోలు చేసింది. ఇది 1971 పాకిస్తాన్‌తో యుద్ధంలో కీలక పాత్ర పోషించింది. అయితే 1997లో రిటైరైంది. ఇప్పుడు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి నౌక ఐఏసీకు కూడా ఐఎన్‌ఎస్ విక్రాంత్‌గా నామకరణం చేశారు.

కేరళలోని కొచ్చి షిప్‌యార్డ్‌లో 2005లో విక్రాంత్‌ నిర్మాణాన్ని ప్రారంభించారు. నేవీ అంతర్గతసంస్థ వార్‌ షిప్‌ డిజైన్‌ బ్యూరో ఈ నౌక డిజైన్‌ను రూపొందించగా,
ప్రభుత్వ రంగ సంస్థ కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ నిర్మాణాన్ని పూర్తి చేసింది. 2009 నుంచి మొదలైన పూర్తిస్థాయి నిర్మాణం 13 ఏళ్లలో పూర్తయింది. ఈ నౌక నిర్మాణానికి అవసరమైన స్టీల్‌ను డీఆర్‌డీఎల్, ఇండియన్ నేవీ సహకారంతో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశీయంగా తయారుచేసింది. ఈ నౌక సుమారు 2,200 కంపార్ట్‌మెంట్‌లను కలిగి ఉంది. సుమారు 1,600 మంది సిబ్బంది కోసం రూపొందించబడింది.

మహిళా అధికారులు, నావికులకు ప్రత్యేక వసతి ఉంది. ఇందులో ఫిజియోథెరపీ క్లినిక్, ఐసియు, లేబొరేటరీలు, ఐసోలేషన్ వార్డుతో సహా సరికొత్త పరికరాలతో కూడిన పూర్తి స్థాయి మెడికల్ కాంప్లెక్స్ కూడా అందుబాటులో ఉంది. ఈ నౌకపై దేశీయంగా తయారు చేసిన అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్లు, లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తో పాటు MiG-29K ఫైటర్ జెట్‌లు, Kamov-31,MH-60R మల్టీ-రోల్ హెలికాప్టర్‌లతో కూడిన 30 ఎయిర్‌క్రాఫ్ట్‌లతో కూడిన ఎయిర్ వింగ్‌ను ఆపరేట్ చేయవచ్చు.

ఇందులో కిచెన్‌ కూడా అత్యాధునికమే. గంటకు ఏకంగా 3,000 చపాతీలు తయారు చేయగల యంత్రాలు ఇందులో ఉన్నాయి. ఇది ఇండో-పసిఫిక్, హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతి, సుస్థిరతను నిర్ధారించడంలో ఐఎన్‌ఎస్ విక్రాంత్ దోహదపడుతుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఐఎన్‌ఎస్ విక్రాంత్‌లో ఎయిర్‌క్రాఫ్ట్ ల్యాండింగ్ ట్రయల్స్ ప్రారంభమవుతాయని.. 2023 మధ్య నాటికి పూర్తవుతాయని తెలిపారు. మిగ్-29కె జెట్‌లు ఈ యుద్ధనౌక నుంచి మొదటి కొన్ని సంవత్సరాలు పనిచేస్తాయి. రక్షణ రంగంలో భారతదేశం స్వావలంబన దిశగా విక్రాంత్‌ను ప్రారంభించడం ఒక ముఖ్యమైన అడుగుగా నిపుణులు చెబుతున్నారు.

హిందూ మహాసముద్ర జలాల్లో చైనా ప్రాబల్యం పెరుగుతున్న నేపథ్యంలో..ఈ యుద్ధ నౌక తీర ప్రాంత రక్షణలో భారత నేవీ బలాన్ని పెంచనుంది. గ్లోబల్ నావల్ పవర్స్ ర్యాంకింగ్స్‌ లిస్ట్‌లో అమెరికా అగ్రస్థానంలో ఉండగా..చైనా రెండో స్థానంలో ఉంది. ఈ జాబితాలో భారత్ ఏడో స్థానంలో ఉంది. రక్షణ రంగంలో భారత్‌ స్వావలంబన దిశగా వేస్తున్న అడుగులకు విక్రాంత్‌ సరైన ఉదాహరణగా నిలుస్తోంది. విక్రాంత్.. భారత నైపుణ్యాలు, ప్రతిభకు విక్రాంత్‌ నిదర్శనం. ఈ నౌక ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తుతో ఐదు వేల గృహాలకు కరెంటు సరఫరా చేయవచ్చు.

ప్రస్తుత ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ కాకుండా మరొక ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్‌ ఐఎస్‌ఎస్‌ విక్రమాదిత్య మాత్రమే నేవీలో ఉంది. వాస్తవానికి మూడు ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్లు ఉండాలని నావికాదళం భావిస్తున్నది. హిందూ మహా సముద్రంలో ఒక నౌకను, బంగాళాఖాతంలో మరొకదాన్ని మోహరించగా.. మూడోదాన్ని ముందుజాగ్రత్త చర్యలో భాగంగా సిద్ధంగా ఉంచాలన్నది నేవీ ఆలోచన. అయితే, ప్రస్తుతం రెండే విమాన వాహక నౌకలు అందుబాటులో ఉన్నాయి.

ఐఎన్ఎస్ విక్రాంత్ .. మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. కేవలం యుద్ధ విమానాల ల్యాండింగ్ కు రూపొందించిన నౌకపై .. ఏకంగా ఫైటర్ జెట్ ల్యాండింగ్ కావడం.. అదీ విజయవంతం అవడం .. సర్వత్రా హర్షాతిరేకాల్ని వెలువరించింది.

Must Read

spot_img