Homeఆంధ్ర ప్రదేశ్సోము వీర్రాజుపై ఆసక్తికర చర్చ..

సోము వీర్రాజుపై ఆసక్తికర చర్చ..

  • ఏపీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.
  • పవన్ అంత డైరెక్టుగా చెప్పినా..సోము ఎందుకిలా వ్యాఖ్యానిస్తున్నారన్నదే హాట్ టాపిక్ గా మారిందట.
  • ఇంతకీ పవన్ ఏమన్నారు..?
  • దీనిపై సోము కామెంట్స్ ఏమిటో..?

పవన్ ఆవిర్భావ సభలో చేసిన వ్యాఖ్యలపై సోము కామెంట్స్ .. అందరినీ డైలమాలో పడేస్తున్నాయి. జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ అధికారికంగా త‌మ‌కు విడాకులు ఎప్పుడిస్తారా? అని ఏపీ బీజేపీ ఎదురు చూస్తోంది. అయితే విడాకుల‌కు బీజేపీనే కార‌ణ‌మ‌నే నింద‌ను వేయ‌డానికి ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ్మూహాత్మ‌కంగా పావులు క‌దుపుతున్నారు. అందుకు త‌గ్గ‌ట్టుగా బ‌ల‌మైన వాద‌న తెర ముందుకు తెచ్చేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్నార‌ని రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ నేత‌లు అంటున్నారు. తెలంగాణ‌లో జ‌న‌సేన పోటీ చేస్తానంటే ఆంధ్రా నేత‌న‌ని త‌న‌ను అక్క‌డి బీజేపీ నేత‌లు అంటున్నార‌ని మ‌చిలీప‌ట్నం బ‌హిరంగ స‌భా వేదిక‌పై నుంచి ప‌వ‌న్ అన్నారు. అలాగే ఏపీలో అధికారికంగా బీజేపీ, జ‌న‌సేన మ‌ధ్య పొత్తు ఉన్న‌ప్ప‌టికీ, ఇంత వ‌ర‌కూ ఎప్పుడూ క‌లిసి కార్య‌క్ర‌మాలు చేసిన దాఖ‌లాలు లేవు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌గానే త‌న‌కు తానుగా బీజేపీతో ప‌వ‌న్‌క‌ల్యాణ్ పొత్తు కుదుర్చుకున్న సంగ‌తి తెలిసిందే. ఎక్క‌డైనా ఎన్నిక‌ల ముందు రాజ‌కీయ పార్టీల మ‌ధ్య పొత్తు కుద‌ర‌డం చూశాం. అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాత్రం అందుకు విరుద్ధంగా బీజేపీతో జ‌న‌సేనాని పొత్తుకు త‌హ‌త‌హ‌లాడారు. చివ‌రికి తాను అనుకున్న‌ట్టుగానే వారితో బంధాన్ని ఏర్ప‌ర‌చుకున్నారు. తాజాగా ఏపీ బీజేపీ తీరుపై అస‌హ‌నం వ్య‌క్తం చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. రాష్ట్ర‌స్థాయిలో క‌లిసి కార్య‌క్ర‌మాలు చేయ‌డానికి ఏపీ బీజేపీ నేత‌లెవ‌రూ ముందుకు రావ‌డం లేద‌ని ప‌వ‌న్ ఆరోపించారు.

బీజేపీ, తాము క‌లిసి అనుకున్న ప్ర‌ణాళిక‌ను అమ‌లు చేసి వుంటే ఇప్పుడు టీడీపీతో అవ‌స‌రం లేని స్థాయికి ఎదిగే వాళ్ల‌మ‌ని బంద‌రు స‌భా వేదిక మీద నుంచి ప‌వ‌న్ సీరియ‌స్ కామెంట్స్ చేశారు. అమ‌రావ‌తి రాజ‌ధానికి కేంద్ర బీజేపీ ఓకే చెప్పిన సంగ‌తిని గుర్తు చేశారు. అలాగే అమ‌రావ‌తి కోసం లాంగ్‌మార్చ్ చేద్దామ‌ని అనుకున్నామ‌ని, ఆ త‌ర్వాత బీజేపీ నాయ‌కులు వాయిదా వేశార‌ని అన్నారు. అమ్మా పెట్ట‌దు, అడుక్కు తిన‌నివ్వ‌ద‌నే సామెత చందాన ఏపీ బీజేపీ తీరు వుంద‌ని ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. దీంతో బీజేపీ వైఖ‌రి వ‌ల్లే తాను టీడీపీ వైపు చూడాల్సి వ‌చ్చింద‌ని ఆయ‌న నేరుగానే చెప్పారు.

ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పందించారు. జ‌న‌సేన‌, టీడీపీ పొత్తుపై ఎక్కువ‌గా మాట్లాడ‌ని విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. కేవ‌లం బీజేపీతో పొత్తుపైన్నే ప‌వ‌న్ మాట్లాడార‌న్నారు. టీడీపీతో పొత్తుపై జ‌న‌సేన క్లారిటీ ఇచ్చిన త‌ర్వాత భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తామ‌న్నారు. టీడీపీతో ప‌వ‌న్ వెళ్ల‌డం ఖాయ‌మ‌ని ఏపీ బీజేపీ నేత‌లు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చారు. అదేదో త్వ‌ర‌గా చెబితే, మా ప‌నేదో మేం చూసుకుంటామ‌న్న‌ట్టుగా సోము వీర్రాజు అభిప్రాయ‌ప‌డ్డారు. జ‌న‌సేనాని వ్య‌వ‌హార‌శైలిపై కేంద్ర బీజేపీ కూడా ఏపీ బీజేపీకి క్లారిటీ ఇచ్చిన‌ట్టు తెలిసింది. ఇక ప‌వ‌న్‌ను ప‌ట్టించుకోవ‌ద్ద‌ని, ఒంట‌రిగా బ‌ల‌ప‌డేందుకు కృషి చేయాల‌ని ఏపీ బీజేపీ నేత‌ల‌కు అధిష్టానం స్ప‌ష్ట‌మైన మార్గ‌నిర్దేశం చేసిన‌ట్టు స‌మాచారం. త‌మ‌ను కాద‌ని టీడీపీతో జ‌త క‌ట్టే ప‌వ‌న్‌ను బీజేపీ ఏం చేస్తుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

బీజేపీతో మనకు వర్కవుట్ కాలేదు, కలసి కార్యక్రమాలు చేద్దామన్నా వారు సహకరించడంలేదు, తెలంగాణలో పోటీ చేస్తానంటే నువ్వు నాన్ లోకల్ అంటూ నన్ను అవమానించారు. అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు..జనసేన 10వ ఆవిర్భావ సభలో వపన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఈ మాటలు వింటే ఎవరికైనా ఏమనిపిస్తుంది. మాకింక మీ పొత్తు వద్దు బాబోయ్ అంటూ పవన్ కల్యాణ్ మొత్తుకున్నట్టు తేటతెల్లమవుతుంది. మరి ఈ విషయం సోము వీర్రాజుకి ఎందుకు అర్థం కాలేదో తెలియడంలేదు. జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సోము వీర్రాజు స్పందించారు. పొత్తులపై పవన్ తేల్చేశారు కదా అంటూ మీడియా అడిగిన ప్రశ్నలకు వీర్రాజు బదులిచ్చారు. జనసేన, తెలుగుదేశం పొత్తుపై పవన్ ఎక్కడా మాట్లాడలేదని అన్నారు వీర్రాజు.

పవన్‌ బీజేపీతో పొత్తుపైనే మాట్లాడారని చెప్పారు. టీడీపీతో కూటమి కడతామంటూ జనసేన పార్టీ క్లారిటీ ఇచ్చిన తర్వాత.. తమ భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని చెప్పారు వీర్రాజు. ఏపీ బీజేపీకి వీర్రాజు అధ్యక్షుడే అయినా జనసేన విషయంలో నిర్ణయం తీసుకునేంత సీన్ ఆయనకు లేదనే విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ ఏం మాట్లాడినా, ఎలా మాట్లాడినా.. అవన్నీ అధిష్టానానికి చేరవేసి, వారి నిర్ణయం ప్రకారమే వీర్రాజు నడుచుకోవాలి. అందుకే ఆయన పవన్ మాట్లాడిన మాటలకు అర్థం తెలియనట్టే వివరణ ఇచ్చారు. టీడీపీ పొత్తుపై పవన్ మాట్లాడితే అప్పుడు ఆలోచిస్తామని చెప్పారు. దీంతో అసలు సోము వ్యూహం ఏమిటన్నదే ఇప్పుడు రాష్ట్రవ్యాప్త చర్చకు దారితీస్తోంది.

  • సోము ..ఎందుకు ఇలా కామెంట్స్ చేస్తున్నారన్నదే..?

ఇప్పటికే చాలాసార్లు పవన్ కల్యాణ్.. బీజేపీ పొత్తు విషయంలో క్లారిటీ ఇచ్చారు. ఇటీవల రెండు పార్టీలు ఎక్కడా కలసి పనిచేయలేదు, కలసి నిరసనల్లో కూడా పాల్గొనలేదు. అలాంటిది ఇంకా పొత్తులోనే ఉన్నామంటూ బీజేపీ చెప్పుకుంటోంది, జనసేన మాత్రం టీడీపీ వైపు చూస్తోంది. రాష్ట్ర ప్రజలకు క్లారిటీ ఉన్నా జనసేన పొత్తు విషయంలో వీర్రాజు మాత్రం పవన్ కల్యాణ్ నుంచి ఇంకా ఏదో పెద్ద స్టేట్ మెంట్ ఆశిస్తున్నట్టున్నారు. మచిలీపట్నం సభలో పవన్ కల్యాణ్ ఏపీ బీజేపీ నేతలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు ఎదగలేకపోవడానికి ఆ పార్టీనే కారణం అని నిందించారు.

అమరావతి మెదలుగొని, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీని బలోపేతం చేసే విషయం వరకు కాషాయ దళం తీరు పై పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీలో తనను ముందుగా పిలిచింది నరేంద్ర మోడీ అని, ఆయన అంటే తనకు గౌరవం ఉందని అన్నారు. కానీ రాష్ట్ర నేతలపై మాత్రం విరుచుకుపడ్డారు. కేంద్రంలోని నాయకత్వంతో సంప్రదింపులు చేసిన తరువాత ఆంద్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ నాయకులు కలసి పని చేసేందుకు ముందుకు రాకపోవటం వలనే రాష్ట్రంలో తెలుగు దేశం బలపడగలిగిందని పవన్ కళ్యాణ్ మరింత ఘాటుగా వ్యాఖ్యానించారు.

వైసీపీతో కుమ్మక్కయి మొత్తానికి నాశనం చేశారన్న అర్థంలో మాట్లాడారు. అయితే సోము వీర్రాజు మాత్రం అన్నీదులిపేసుకున్నారు. ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ టీడీపీతో కలిసి వెళ్తామని ప్రకటించలేదన్నారు. స్పీచ్‌లో ఎక్కడా పవన్ టీడీపీ ప్రస్తావన తీసుకు రాలేదని.. బీజేపీతోనే పొత్తులో ఉన్నామని చెప్పుకొచ్చారు. ముస్లింల విషయంలో పవన్ కల్యాణ్ ఎవరో ప్రస్తాన విషయం చెప్పారు కానీ.. బీజేపీని నిందించలేదన్నారు. తాను బీజేపీతో ఉంటే జనసేనకు ముస్లింలు దూరమవుతారని కొందరు అంటున్నారని, ముస్లింలకు ఇష్టంలేకపోతే బీజేపీకి తాను దూరమవుతానని చెప్పారు. ఒకవేళ బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడు వారిపై ఎక్కడైనా దాడి జరిగితే పొత్తు నుంచి బయటకు వస్తానని తెలిపారు.

అయితే సోము వీర్రాజు మాత్రం పవన్ తో పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు. పవన్ సీరియస్ కామెంట్స్ చేసినా సోము వీర్రాజు మాత్రం బీజేపీని ఏమీ అనలేదని.. పొత్తు కొనసాగుతుందని ప్రకటనలు చేశారు. సొంత పార్టీలో నేతలు విమర్శిస్తే్ బయటకు పంపడానికి సోము వీర్రాజు రాజకీయం అంతా చేస్తారు. కానీ పవన్ విమర్శిస్తే మాత్రం.. దులిపేసుకుంటున్నారు. దీంతో సోము కావాలనే ఈ విధంగా వ్యాఖ్యానించారన్న టాక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మరి సోము ..ఎందుకు ఇలా కామెంట్స్ చేస్తున్నారన్నదే ఆసక్తికరంగా మారింది..

Must Read

spot_img