రాయచోటి అసెంబ్లీ టిక్కెట్ ఓ రేంజ్ లో హీట్ రేకెత్తిస్తోంది. అధికార పార్టీ తరఫున శ్రీకాంత్ రెడ్డి మరోసారి పోటీకి సై అంటున్నారు. ఇక ప్రతిపక్షమైన టీడీపీలో ఏం జరుగుతోందన్నదే ఆసక్తికరంగా మారింది. దీంతో పసుపుదండులో రాజకీయాలు .. కాక రేపుతున్నాయి.
మొన్నటిదాకా ప్రశాంతంగా ఉన్న రాయచోటి నియోజకవర్గం.. నేడు నూతన జిల్లా కేంద్రంగా అవతరించడంతో టీడీపీలో టిక్కెట్ రేసు ఓ లెక్కన సాగుతోంది. ఈ పార్టీ తరఫున మండిపల్లి పోటీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడీ టిక్కెట్ రేసులోకి మరో నేత ఎంట్రీ ఇవ్వడమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనికి కారణం .. ఆ నేత ..మాజీ కావడమే కాక .. ఆయన వెనుకున్న మద్ధతేనని టాక్ వెల్లువెత్తుతోంది. దీంతో ఈ టగ్ ఆఫ్ వార్ మరో మలుపు తీసుకుందని సర్వత్రా చర్చోపచర్చలు సాగుతున్నాయి.
ఇప్పటికే సీఎం సొంత జిల్లాలో పాగా వేయాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోన్న బాబు .. రాయచోటిపై కన్నేశారు. స్థానికంగా పట్టున్న మండిపల్లిని పార్టీలోకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. దీంతో ఆయనకు టిక్కెట్ కన్ఫర్మ్ అన్న టాక్ సైతం వినిపించింది. అయితే తాజాగా మరో నేత పేరు తెరపైకి రావడం .. సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీంతో ఇప్పటివరకు సాఫీగా సాగిన రాజకీయాలు మరో రచ్చకు కారణమవుతున్నాయన్న చర్చ స్థానిక నేతల్లో వెల్లడవుతోంది. దీనికి కారణం .. ఇప్పుడు తెరపైకి వచ్చిన నేత .. 1994 ఎన్నికల్లో లక్కిరెడ్డిపల్లి అసెంబ్లీ సిటు నుంచి మొదటి ప్రయత్నంలో విజయాన్ని సొంతం చేసుకున్న ధ్వారకానాథ్ రెడ్డి కావడమేనని తెలుస్తోంది.
ప్రస్తుతం మాజీగా మారి, సైలెంట్ గా ఉన్న ఆయన ఒక్కసారిగా మళ్లీ రీఎంట్రీకి ప్రయత్నించడం చర్చనీయాంశమవుతోంది. తొలి ప్రయత్నంతోనే విజయం సాధించిన ఆయన .. అటు తర్వాత కాంగ్రెస్ లోకి, ఇక అటు నుంచి వైసీపీలోకి జంప్ చేశారు. అనంతరం అధికార పార్టీ తరఫున బరిలోకి దిగాలని ఉత్సాహపడ్డ ఆయన ఆశలపై శ్రీకాంత్ రెడ్డి నీళ్లు చల్లారు. దీంతో ఆయన రాజకీయాల్లో సైలెంట్ అయ్యారని టాక్ వినిపించింది. ఇక అప్పటి నుంచి శ్రీకాంత్ రెడ్డి సెగ్మెంట్లో పట్టు బిగించడంతో ఆయనకు ఎటువంటి అవకాశాలు లభించలేదు. అయితే ఇప్పుడు రీ ఎంట్రీ వెనుక .. ఆయన రాజకీయ భవిష్యత్ కన్నా .. పెద్ వ్యూహమే ఉందన్న వాదన ఇప్పుడు సెగ్మెంట్లోనే కాక జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.అయితే ఇప్పుడు మళ్లీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకోవడమే చర్చనీయాంశంగా మారింది. అంతేగాక .. ఆయన రీ ఎంట్రీకి తనకు తొలి అవకాశమిచ్చిన టీడీపీ దిశగా పయనిస్తుండడం మరింత చర్చను రేకెత్తిస్తోంది. ప్రస్తుతం .. అధికార పార్టీలో ప్రజా వ్యతిరేకత గుబులు రేపుతోంది. దీంతో చాలా మంది నేతలు పక్క చూపులు చూస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ద్వారకానాథ్ రెడ్డి వ్యూహాత్మకంగా ఎంట్రీ ఇస్తున్నారన్న చర్చ స్థానికంగా వెల్లువెత్తుతోంది. అయితే ఆయన వెనుక .. ఇప్పటివరకు పార్టీలో, ప్రభుత్వంలో చక్రం తిప్పిన ఓ ఎంపీ ప్రమేయం ఉందన్న టాక్ సెగ్మెంట్లో ఆసక్తికర చర్చకు తెర తీస్తోంది.
అందుకే ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న ఆయన ఒక్కసారిగా పార్టీ మారి, ఏకంగా పోటీకి రెడీ అవుతున్నారన్న వాదన వెల్లువెత్తుతోంది. అదే సమయంలో .. చక్రం తిప్పే స్టేజ్ లో ఉన్న ఎంపీ .. ఈయనకు ఎందుకు ఛాన్సివ్వలేకపోతున్నారన్న చర్చ సైతం సాగుతోంది. అంతేగాక .. తన పవర్ తో .. ఈయనకు సొంత పార్టీలోనే అవకాశం ఇవ్వచ్చు కదా.. అన్న సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో అసలు కథ వేరే ఉందన్న వాదనలు వెల్లువెత్తుతున్నాయి.
ఓవైపు ప్రజా వ్యతిరేక ఓటు బలంగా ఉండే అవకాశముంది. మరోవైపు విపక్షాలు కూటమి కడతాయని తెలుస్తోంది. ఈ తరుణంలో ఓటమి ఎదురైతే, భవిష్యత్ రాజకీయం ప్రశ్నార్థకమవుతుందని ఆ ఎంపీ యోచిస్తున్నట్లుగా అంచనాలు వెల్లువెత్తుతున్నాయి. అంతేగాక .. విపక్ష పార్టీ నుంచి గెలిస్తే, ఆ తర్వాత తమ పార్టీలోకి జంప్ చేయించుకుని, దెబ్బ కొట్టే వ్యూహం కూడా ఉండి ఉండొచ్చని .. విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో కీడెంచి మేలెంచాలన్న వ్యూహంతో ఎంపీ, మాజీ ఎమ్మెల్యే యోచిస్తున్నారని అంచనా వినిపిస్తోంది. అందుకే ముందుగానే ఈ ప్లాన్ వేశారని, దీనికోసం .. కోట్లాది రూపాయలు ఫండింగ్ చేసేందుకు కూడా వెనుకాడడం లేదని తెలుస్తోంది. అంతేగాక .. ఇది సీఎం సొంత జిల్లా కావడంతో, ఇక్కడ గెలిచి, మళ్లీ పార్టీలోకి అనధికారికంగా చేర్పించి, మరింత పట్టు పెంచుకోవాలన్న వ్యూహం కూడా ఉండవచ్చని అంచనాలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో బాబును దెబ్బ కొట్టే అవకాశముండడంతో పాటు .. పార్టీ మళ్లీ చక్రం తిప్పే అవకాశం ఉందని .. టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వ్యూహం వెనుక .. ఎంపీ హస్తముందన్న వాదనే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీంతో సెగ్మెంట్లో రాజకీయాలు .. జిల్లావ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాబు ఏ నిర్ణయం తీసుకోనున్నారన్న చర్చ సర్వత్రా వెల్లువెత్తుతోంది.
అందుకే ఏకంగా ప్రతిపక్ష పార్టీ టిడిపి తలుపులు తట్టారని సోషల్ మీడియాలో వైరల్ కావడం రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. స్థానిక టీడీపీ నేతల్లోనూ, కేడర్ లోనూ చర్చోపచర్చలకు దారి తీస్తోంది. అధికార పార్టీలో కీ రోల్ గా వ్యవహరిస్తోన్న ఓ నేతకు స్వయంగా బంధువైన ద్వారకానాథ్ .. టీడీపీ దిశగా పయనించడం చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో గెలుపు టీడీపీకి అనివార్యమన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే గెలుపు కోసం తీవ్రంగా కష్టపడుతోన్న బాబు .. స్థానికంగా పట్టు, ప్రజాభిమానం మెండుగా ఉన్న యువనేతలకే టిక్కెట్లని గతంలోనే ప్రకటించారు. దీంతో ఈ సెగ్మెంట్లో టిక్కెట్ రేసులో ఆది నుంచి ముందున్న మండిపల్లికి .. కేడర్ సైతం మద్ధతు పలుకుతోంది. ఈ తరుణంలో ఆకస్మికంగా ద్వారకానాథ్ ఎంట్రీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఓవైపు ప్రతిపక్షాన్ని దెబ్బ తీసే యోచనలో వైసీపీ ఉందన్న టాక్ సైతం వెల్లువెత్తుతోంది. సీఎం జిల్లాలో పసుపుజెం