Homeఅంతర్జాతీయంఇండో అమెరికన్ లకు ట్రంప్ కంటే అధిక ప్రాధాన్యత..!

ఇండో అమెరికన్ లకు ట్రంప్ కంటే అధిక ప్రాధాన్యత..!

అమెరికాలో ఇండో అమెరికన్ లకు ప్రాధాన్యత పెరుగుతోంది.. ఎన్నికల సమయంలో ట్రంప్ కంటే ఎక్కువ మంది భారతీయులకు తన కార్యవర్గంలో చోటు కల్పిస్తానని చెప్పిన జో బైడెన్ తన మాటను నిలబెట్టుకున్నారు..

ఇండో అమెరికన్ లకు తాను చెప్పిన విధంగానే కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి భారత సంతతి వ్యక్తులకు కీలక పదవులు కట్టబెడుతూ వస్తున్నారు జో బైడెన్. అలా ఇప్పటి వరకు 130 మందికి పైగా ఇండో అమెరికన్లు కీలక స్థానాల్లో నియమించబడినట్లు గణాంకాలు చెబుతున్నాయి..

అగ్రరాజ్యం అమెరికాలో భారతీయుల హవా కొనసాగుతోంది. ఎన్నికల సందర్భంగా తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే ట్రంప్‌ కంటే ఎక్కువ మంది భారతీయులకు తన కార్యవర్గంలో చోటు కల్పిస్తానని చెప్పిన జో బైడెన్‌ తన మాట నిలబెట్టుకున్నారు. తన పాలనా యంత్రాంగంలో ఇప్పటివరకు 130 మందికిపైగా భారత సంతతి వ్యక్తులకు కీలక బాధ్యతలు అప్పగించారు.. అమెరికాలో భారత మూలాలున్న వ్యక్తుల వివరాలను సేకరించే ‘ఇండియా్‌సపొరా’ అనే సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది.

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి భారత సంతతి వ్యక్తులకు కీలక పదవులు కట్టబెడుతూ వస్తున్నారు జో బైడెన్. అలా ఇప్పటి వరకు 130 మందికి పైగా ఇండో అమెరికన్లు కీలక స్థానాల్లో నియమించబడినట్లు గణాంకాలు చెబుతున్నాయి.. యునైటెడ్ స్టేట్స్ జనాభాలో ఒక శాతంగా ఉన్న
భారతీయులకు దేశ పాలనలో ఈ స్థాయిలో అవకాశాలు దక్కడం నిజంగా మనం గర్వించాల్సిన విషయమే.

అమెరికాలో సుమారు 1 శాతం మంది ఉన్న ఇండో-అమెరికన్లకు అధ్యక్ష కార్యవర్గంలో ఈ స్థాయిలో ప్రాతినిధ్యం దక్కడం విశేషం. ఈ క్రమంలో బైడెన్‌ తన హామీని నెరవేర్చుకోవడమే కాదు.. గతంలో ట్రంప్‌ పేరిట ఉన్న రికార్డును కూడా బ్రేక్‌ చేశారు. అమెరికాలో రొనాల్డ్‌ రెగాన్‌.. తొలిసారిగా భారతీయులకు తన ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇవ్వగా.. ఆ తర్వాత కూడా ఈ సాంప్రదాయం కొనసాగింది.

బరాక్‌ ఒబామా అధ్యక్షుడిగా పనిచేసిన 8 ఏళ్ల కాలంలో 60 మంది భారతీయులకు స్థానం కల్పించారు. ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన కార్యవర్గంలో 80 మందికి అవకాశం ఇచ్చారు. బైడెన్‌ ప్రభుత్వంలో ఇప్పుడా సంఖ్య 130కి పెరిగింది.

ప్రస్తుతం పలు రాష్ట్రాల్లోని వివిధ చట్ట సభల్లో సుమారు 40 మంది ఇండో-అమెరికన్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారిలో అమెరికా ప్రతినిధుల సభ సభ్యులు కూడా ఉన్నారు. అలాగే సుందర్‌ పిచాయ్‌, సత్య నాదెళ్ల వంటి వారితోపాటు 20 మంది భారతీయులు అమెరికాలోని అగ్రశ్రేణి కంపెనీల్లో కీలక పదవుల్లో ఉన్నారు.

118వ కాంగ్రెస్ కొత్త సెనేటర్లు, ప్రతినిధుల సభ స్పీకర్ ఎన్నిక ప్రక్రియతో ప్రారంభమైంది…!

ఇదిలా వుండగా… మంగళవారం కనీసం అరడజను మంది భారతీయ అమెరికన్లను కీలక పరిపాలనా స్థానాలకు బైడెన్ తిరిగి నామినేట్ చేశారు. అయితే వీటికి సెనేట్ ఆమోదం లభించాల్సి ఉంది.

ఇక బైడెన్ తిరిగి నామినేట్ చేసిన వారిలో డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ రిసోర్సెస్ లో పనిచేస్తోన్న రిచర్డ్ వర్మ, డాక్టర్ వివేక్ హల్లెగెరె మూర్తి… ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ బోర్డులో అమెరికా ప్రతినిధి, అంజలి చతుర్వేది.. జనరల్ కౌన్సెల్, డిపార్ట్మెంట్ ఆఫ్ వెటరన్న్ అఫైర్స్, రవి చౌదరి… ఎయిర్ఫోర్స్ అసిస్టెంట్ సెక్రటరీ, గీతా రావు గుప్తా.. గ్లోబల్ ఉమెన్స్ ఇష్యూ రాయబారి, రాధా అయ్యంగార్ ప్లంబ్.. డిఫెన్స్ అండర్ సెక్రటరీ ఉన్నారు. వీరందరిని గత కాంగ్రెస్ సమావేశాల సందర్భంగా బైడెన్ నామినేట్ చేశారు. కానీ వీరి నియామకానికి సెనేట్ ఆమోదం లభించలేదు.

52 ఏళ్ల వర్మ ప్రస్తుతం మాస్టర్ కార్డ్ గ్లోబల్ పబ్లిక్ పాలసీకి జనరల్ కౌన్సెల్, హెడ్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ హోదాలో ఆయన అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీ చట్టం, విధాన పరమైన విధులను పర్యవేక్షిస్తారు. డెమొక్రాటిక్ పార్టీకి చెందిన రిచర్డ్ వర్మ 2014 నుంచి 2016 వరకు భారత్లో అమెరికా రాయబారిగా వ్యవహరించారు. ఈ ఏడాది ప్రారంభంలోనూ బైడెన్ తన ఇంటెలిజెన్స్ అడ్వైజరీ బోర్డులో సభ్యుడి గానూ… రిచర్డ్ వర్మను నియమించారు.. ప్రెసిడెంట్స్ ఇంటెలిజెన్స్ అడ్వైజరీ బోర్డ్ అనేది అధ్యక్షుని కార్యనిర్వాహక కార్యాలయంలో స్వతంత్ర ప్రతిపత్తి గల ఒక ఏజెన్సీ.

అటు రాధా అయ్యంగర్ గూగుల్లో ట్రస్ట్ అండ్ సేఫ్టీకి రీసెర్చ్ అండ్ ఇన్సైట్స్ డైరెక్టర్గా వ్యవహరించారు. అక్కడ బిజినెస్ అనలిటిక్స్ , డేటా సైన్స్ అండ్ టెక్నికల్ రీసెర్చ్లో క్రాస్ ఫంక్షనల్ టీమ్లకు నాయకత్వం వహించారు.

అంతేకాకుండా… ఫేస్బుక్లో పాలసీ అనాలిసిస్ గ్లోబల్ హెడ్గానూ పనిచేశారు. ఆర్ఏఎన్డీ కార్పోరేషన్లోనూ రాధ సీనియర్ ఆర్ధికవేత్తగా వ్యవహరించారు. వీటితో పాటు డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ అండ్ వైట్హౌస్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్లో సీనియర్ హోదాల్లోనూ పనిచేశారు. కెరీర్ తొలినాళ్లలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఆమె అసిస్టెంట్ ప్రొఫెసర్గా, హార్వర్డ్లో పోస్ట్ డాక్టోరల్ వర్క్ చేశారు.

ప్రిన్స్టన్ యూనివర్సిటీ నుంచి ఎకనమిక్స్లో పీహెచ్డీ, ఎంఎస్ పట్టా పొందారు. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి బీఎస్ చదివారు. ఇక రవి చౌదరి విషయానికి వస్తే ఈయన గతంలో అమెరికా రవాణా శాఖలో సీనియర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేశారు. అంతేకాకుండా ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ లోని కమర్షియల్ స్పేస్ ఆఫీస్లో డైరెక్టర్ ఆఫ్ అడ్వాన్స్డ్ అండ్ ఇన్నోవేషన్గానూ విధులు నిర్వర్తించారు.

ఈ హోదాలో ఎఫ్ఏఏ కమర్షియల్ స్పేస్ ట్రాన్స్పోర్టేషన్ మిషన్కు మద్ధతుగా అధునాతన అభివృద్ధి, పరిశోధన కార్యక్రమాల అమలును పర్యవేక్షించారు. రవాణా శాఖలో విధులు నిర్వర్తించే సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న తొమ్మిది ప్రాంతాలలో విమానయాన కార్యకలాపాల ఏకీకరణ కోసం రీజియన్స్ అండ్ సెంటర్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కూడా పనిచేశారు..

ఇండో అమెరికన్ లకు ట్రంప్ కంటే అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. తాజాగా అరడజను మంది భారతీయ అమెరికన్లను కీలక పరిపాలనా స్థానాలకు బైడెన్ తిరిగి నామినేట్ చేశారు. అయితే వీటికి సెనేట్ ఆమోదం లభించాల్సి ఉంది.

Must Read

spot_img