Homeఅంతర్జాతీయంఅంతరిక్షయానంలో తొలి భారత మహిళా కల్పనా చావ్లా..!!

అంతరిక్షయానంలో తొలి భారత మహిళా కల్పనా చావ్లా..!!

అది 2003 ఫిబ్రవరి 1..ప్రపంచం అంతా అంతరిక్షం నుంచి రావాలసిన కొలంబియా స్పేస్ షఠిల్ రాక కోసం ఎదురుచూస్తోంది. భూమికి తిరిగి వస్తున్న బ్రుందంలో మన భారత సంతతికి చెందిన మహిళా వ్యోమగామి కల్పనా చావ్లా ఉన్నారు. వారు లోవర్ ఆర్బిట్ నుంచి భూ కక్షలోకి ప్రవేశించేందుకు అనుమతి లభించింది. 16 రోజులపాటు అంతరిక్షంలో గడిపాక 2003 ఫిబ్రవరి 1న కొలంబియా స్పేస్ క్రాఫ్ట్‌లో మళ్లీ భూమికి ప్రయాణమయ్యింది కల్పనా చావ్లా బృందం. బయలుదేరే ముందు స్పేస్ క్రాఫ్ట్‌కు సంబంధించి ఆస్ట్రోనాట్స్ చేసిన భద్రతా పరీక్షల్లో అంతా సవ్యంగానే కనిపించింది. కొలంబియా స్పేస్ షఠిల్ లోకి ఏడుగురు వ్యోమగాములు తమ తమ సీట్లలో కూర్చున్నారు.

ఒక్క బటన్ ప్రెస్ తో వారు తమ ప్రయాణాన్ని నేరుగా భూమి వైపుకు కదిలారు. భూమికి సుమారు 282 కిలోమీటర్ల ఎత్తులో గంటకు 28 వేల కిలోమీటర్ల వేగంతో బయలుదేరింది కొలంబియా స్పేస్ క్రాఫ్ట్. భూకక్షలోకి ప్రవేశించాక వారి వేగం దారుణంగా ఉంటుంది. భూమి గురుత్వాకర్షణ శక్తి దానిపై పనిచేస్తుంటుంది. అంత వేగానికి షఠిల్ ఉపరితలం భయంకరమైన రాపిడికి గురవుతుంది. అపారంగా వేడెక్కిపోతుంది. అయితే ఉపరితలంపై అమర్చిన హీట్ షీల్డ్స్ కారణంగా దగ్దం కాకుండా తట్టుకుంటుంది.

అయితే అప్పటికే పలు స్పేస్ షఠిల్ ప్రయాణాలు జరిగాయి. అందుకే వారు మామూలుగానే ఉన్నారు. వారు మరి కొద్ద నిముషాలలో మామూలు విమానంలా భూమిపై ల్యాండింగ్ చేయాలి.. భారత కాలమానం ప్రకారం అప్పుడు సమయం సాయింత్రం 6 గం.ల 40 నిముషాలు కావస్తోంది. సరిగ్గా భూమి నుంచి 120 కిలోమీటర్ల ఎత్తుకు.. అంటే భూమి వాతావరణంలోకి ప్రవేశించింది స్పేస్ క్రాఫ్ట్. ఇంత వరకు ప్రయాణం బాగానే సాగింది. కానీ ఆ తరువాత కొలంబియా స్పేస్ క్రాఫ్ట్‌ నుంచి అబ్‌నార్మల్ రీడింగ్స్ నాసా మిషన్ కంట్రోల్ రూమ్‌కు రావడం మొదలైంది.

స్పేస్ క్రాప్ట్ ఎడమ రెక్కలో ఉండే టెంపరేచర్ సెన్సార్ల నుంచి సమాచార ప్రసారం నిలిచి పోయింది. స్పేస్ క్రాఫ్ట్ టైర్ల ప్రెషర్‌కు సంబంధించిన డేటా కూడా కనిపించకుండా పోయింది. దాంతో కొలంబియా స్పేస్ క్రాఫ్ట్‌ సిబ్బందితో కమ్యూనికేట్ అయ్యేందుకు ప్రయత్నించింది మిషన్ కంట్రోల్ రూం. 7 గంటల 29 నిమిషాల ప్రాంతంలో కొలంబియా స్పేస్ క్రాఫ్ట్‌లోని మిషన్ కమాండర్, రిక్ హజ్‌బెండ్ నుంచి రెస్సాన్స్ వచ్చింది. కానీ అది ‘రోజర్’ అనే ఒక్క పదంతో మధ్యలోనే ఆగిపోయింది. ఆ తరువాత కొద్ది సెకన్లకు మిషన్ గ్రౌండ్ కంట్రోల్ రూంతో కొలంబియాకు పూర్తి సంబంధాలు తెగిపోయాయి. ఎంత ప్రయత్నించినా తిరిగి కమ్యూనికేట్ కాలేక పోయారు.

చివరకుసాయంత్రం 7 గంటల 32 నిమిషాల ప్రాంతంలో అమెరికా మీద సుమారు 61 కిలోమీటర్ల ఎత్తులో కాలి పోయి ముక్కలుగా విడిపోయింది కొలంబియా స్పేస్ క్రాఫ్ట్. ఆకాశంలో కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ ముక్కలుగా విడిపోవడాన్ని చూశామని, ఆ సమయంలో తమకు పెద్ద పెద్ద శబ్దాలు వినిపించాయని టెక్సస్ రాష్ట్రంలోని కొందరు ప్రజలు చెప్పారు. అమెరికాలోని టెక్సస్, లూజియానా, ఆర్కాన్సా రాష్ట్రాలలో కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ శకలాలు పడ్డాయి. వెంటనే శకలాలను గుర్తించేందుకు సెర్చ్ టీమ్స్‌ను పంపించింది నాసా.

ఆ ప్రమాదంలో ఆస్ట్రోనాట్స్ అందరూ చనిపోయినట్లు మరుసటి రోజు ప్రకటించింది నాసా. అది అంతరిక్షయాన చరిత్రలో అత్యంత ఘోరమైన ప్రమాదం చోటు చేసుకున్న రోజు. అంతరిక్షం నుంచి తిరిగి భూమికి చేరుకునే క్రమంలో గాలిలోనే కాలిపోయింది కొలంబియా స్పేస్ క్రాఫ్ట్. భారత్‌కు చెందిన కల్పనా చావ్లాతో సహా ఏడుగురు ఆస్ట్రోనాట్స్ ఆ ప్రమాదంలో చనిపోయారు. అయితే ఈ ప్రమాదం గురించి జరిపిన దర్యాప్తులో అనేక విషయాలు అనుమానాస్పదంగానే ఉన్నాయంటారు. కొలంబియా భూమి నుంచి అంతరిక్షానికి ప్రయాణం జరిపినప్పుడు దాని ముక్కభాగంలో ఉండే హీట్ షీల్డ్ తొలగిపోయింది. అయితే పైకి వెళ్లేప్పుడు అదో సమస్యగా ఎవరికీ అనిపించలేదు.

కానీ అలా ఓ హీట్ షీల్డ్ తొలగిపోవడం కొలంబియా సీసీ ఫుటేజ్ స్పష్టంగా రికార్డు చేసింది. ప్రొటోకాల్ ప్రకారం దానిని అంతరిక్షంలోనే స్పేస్ వాక్ చేసి సరిచేయాలి. ఆ పని వారు అక్కడున్న 16 రోజులలో ఎప్పుడైనా చేయవచ్చు. అదో లోపంగా నాసా గానీ, వ్యోమగాములు గానీ భావించలేదు. దాంతో పెద్ద సమస్యలేం రావని అనుకున్నారు. కానీ ఒక్క హీట్ షీల్డ్ పొర తొలగిపోతే పక్కనుండే షీల్డ్స్ పై గాలి ప్రభావం ఉంటుంది. గంటకు 30 వేల కి.మీల వేగంతో చిన్న అవరోదం కూడా పెను ప్రమాదాలకు కారణమవుతుంది. అది నాసాకు బాగా తెలుసు. అయినా ఎందుకు నిర్లక్ష్యం వహించిందన్న విషయంపై వచ్చిన సమాధానం సంత్రుప్తికరంగా లేదు.

అంటే కొలంబియాకు ప్రమాదం జరుగుతుందని నాసాకు ముందే తెలుసా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే హాలివుడ్ నుంచి పలు డాక్యుమెంటరీలు విడుదలయ్యాయి. కాన్ స్పియరీ థీయరీలను శాస్త్రవేత్తలు కొట్టిపడేశారు. అలా జరిగి ఉండే అవకాశమే లేదన్నారు. అయితే కొలంబియాలో ఉన్న వ్యోమగాములకు తమ స్పేస్ క్రాఫ్ట్ ప్రమాదానికి లోనుకానుందని ముందే తెలుసా అన్న కోణంలోనూ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే అలా జరిగి ఉండే అవకాశం లేదంటున్నారు నాసా అధికారులు.

ఎందుకంటే వారు రీ ఎంట్రీ సమయంలో చాలా హ్యాపీగా మాట్లాడారు. కొన్న నిముషాల అనంతరం మొదటి అలారం మోగడంతో ఆందోళన మొదలైంది. ఎడమవైపు ఉండే రెక్క కాలిపోవడం వారికి అనుమానాలు కలిగించాయి. చూస్తుండగానే ఆకాశంలో కనిపించే తారల మధ్య ఓ భీకరమైన మెరుపు వేగంగా భూమి వైపుకు దూసుకు వస్తున్న మెరుపులు కనిపించాయి. వాటి సంఖ్య మొత్తంగా చూస్తే 84 వేలు. తరువాత అది ప్రమాదానికి గురైన స్థలంలో లభ్యమైన శకలాలను నాసా సేకరించింది. కొలంబియా స్పేస్ క్రాఫ్ట్‌లో 40శాతం శకలాలను నాసా రికవరీ చేయగలిగింది.

అయితే నాసా వివరించిన దాన్ని బట్టి చూస్తే..అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించడంలో భాగంగా చేపట్టిన మిషన్ కోసం 2003 జనవరి 16న అంతరిక్షంలోకి వెళ్లింది కొలంబియా స్పేస్ క్రాఫ్ట్. అది దానికి 28వ ప్రయాణం. ఫ్లోరిడాలోని కేప్ కనేవరల్ నుంచి నింగిలోకి దూసుకు పోయేటప్పుడు స్పేస్ క్రాఫ్ట్‌కు ఒక ప్రమాదం జరిగింది.వాతావరణంలోని ఒత్తిడి, ఘర్షణ వల్ల ఇంధన ట్యాంక్‌కు సమస్యలు తలెత్తకుండా దానిపై ‘ఫోం ఇన్సులేషన్‌’ అప్లై చేసింది నాసా. రాకెట్ లాంచ్ చేసేటప్పుడు ఫ్యూయల్ ట్యాంక్ చుట్టూ ఉండే ఫోం ఇన్సులేషన్‌లో కొంత భాగం ఊడిపోయింది.

ఒక సూటు కేసు సైజులో ఉన్న ఆ ముక్క, స్పేస్ షటిల్ ఎడమ రెక్కకు డ్యామేజ్‌ చేసింది. దాంతో అత్యంత వేడి నుంచి రెక్కలను కాపాడే హీట్ రెసిస్టెంట్ టైల్స్‌లో చిన్న పగుళ్లు ఏర్పడ్డాయి. చిన్న రంధ్రం కూడా పడింది. దాంతో వెళ్లేటప్పుడు అంతా బాగానే ఉన్నా తిరిగి భూమి మీదకు వచ్చేటప్పుడు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థూలంగా జరిగింది ఇదీ అంటూ వివరించారు నాసా ప్రతినిధి. అంతరిక్షం నుంచి అమిత వేగంతో భూమి వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు రకరకాల వాయువులతో స్పేస్ క్రాఫ్ట్‌కు కలిగే ఘర్షణ వల్ల విపరీతమైన వేడి పుట్టుకొస్తుంది.

ఆ సమయంలో ఉష్ణోగ్రత సుమారు 1,300, 1,400 సెల్సియస్ డిగ్రీలు ఉంటుంది. అంత వేడిని తట్టుకునేలా స్పేస్ క్రాఫ్ట్‌ను డిజైన్ చేస్తారు. అందులో హీట్ రెసిస్టెంట్ టైల్స్‌దే కీలక పాత్ర. 1,650 డిగ్రీల వరకు వేడిని తట్టుకునేలా వాటిని డిజైన్ చేసింది నాసా. కానీ ఇంతకు ముందు చెప్పినట్లు, లాంచింగ్ అప్పుడు జరిగిన ప్రమాదం వల్ల హీట్ రెసిస్టెంట్ టైల్స్‌లో తలెత్తిన పగుళ్ల కారణంగా వాతావరణంలోని వేడిని, ఘర్షణను తట్టుకోలేక పోయింది కొలంబియా స్పేస్ క్రాఫ్ట్.

అంతరిక్షం నుంచి బయలుదేరిన తరువాత భూవాతావరణంలోకి ప్రవేశించగానే అత్యంత వేడిగా ఉండే వాయువులు, ఎడమ రెక్కలోని చిన్న రంధ్రం గుండా స్పేస్‌ క్రాఫ్ట్‌లోకి ప్రవేశించాయి. ఫలితంగా కొలంబియా స్పేస్ క్రాఫ్ట్‌లోని కీలక వ్యవస్థలు పని చేయకుండా పోయి చివరకు ముక్కలుగా విడిపోయి కాలిపోయింది.ఎన్నో సార్లు ఎంతో మందిని సురక్షితంగా అంతరిక్షం నుంచి తీసుకొచ్చిన కొలంబియా స్పేస్ క్రాఫ్ట్, కల్పనా చావ్లా బృందంలో విషయంలో దారుణంగా విఫలమైంది.

Must Read

spot_img