HomeTechఐటీ రంగంలో..భారత ఉద్యోగుల్ని టెన్షన్ పెడుతున్నాయి.?

ఐటీ రంగంలో..భారత ఉద్యోగుల్ని టెన్షన్ పెడుతున్నాయి.?

అయితే .. ఆందోళన కన్నా .. ఆలోచన మిన్న అని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. మరింత నైపుణ్యతలపై దృష్టి సారిస్తే, మళ్లీ పూర్వ వైభవం సాధించవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 2008 నాటి గడ్డు పరిస్థితులు మళ్లీ ఐటీ రంగంలో తలెత్తుతున్నాయి. ఇప్పటికే ఉద్యోగాల కోతతో అల్లాడిపోతున్న ఉద్యోగులు.. మరింత మెరుగైన నైపుణ్యాన్ని కూడగట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

సాఫ్ట్ వేర్ రంగంలో .. మరోసారి సంక్షోభం తలెత్తింది. 2008 తర్వాత.. దాదాపు ఆ స్థాయిలో .. మాంద్యం పరిస్థితులు మళ్లీ ఇప్పుడే తలెత్తాయి.

అగ్రరాజ్యం అమెరికా కేంద్రంగా .. కార్యకలాపాలు నిర్వహిస్తున్న దిగ్గజ ఐటీ సంస్థల ఆదాయాల్లో గతంలో ఎన్నడూ లేనంతగా తిరోగమనం ఎదురైంది. పర్యవసానంగా భారీ సంఖ్యలో కొలువుల కోతలను ప్రారంభించాయి సంస్థలు. మూడు నెలలుగా సంకేతాలు ఇస్తోన్న ఐటీ సంస్థలు తాజాగా దశల వారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ లేఆఫ్స్ ఎక్కువగా భారతీయులపై ప్రభావం చూపుతోందన్న వార్తలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఐటీ రంగంలో ఉద్యోగుల తొలగింపు, తక్షణ కర్తవ్యం ఏమిటి, భవితకు భరోసా ఇచ్చే నైపుణ్యాలపై దృష్టి పెట్టడం ఎలా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. అమెరికాలో ఆర్థిక మాంద్యం సంకేతాల ప్రభావం జాబ్ మార్కెట్లపై పడింది. నియామకాల జోరు తగ్గడంతో ఇన్నాళ్లు కోరికల కొండ ఎక్కి కూర్చున్న ఐటీ నిపుణులు ఇప్పుడు దిగివస్తున్నారు.

కొత్త ఉద్యోగంలోకి మారే సమయంలో 60 నుంచి 100% జీతం పెంపును డిమాండ్ చేసిన వారు… ఇప్పుడు 20 నుంచి 30% ఇస్తే చాలు అని అంటున్నారు. ఐటీ లో ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లిపోవడం, మున్ముందు హైరింగ్ దాదాపు స్తంభిస్తుందనే భయాలు కారణమని తెలుస్తోంది. మాంద్యం ముంపు పొంచి ఉన్న నేపథ్యంలో కంపెనీలు ముందు జాగ్రత్త పడుతున్నాయి. పలు కంపెనీలు కొలువుల్లో కోతలు పెట్టాయి. కొత్త నియామకాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.

ప్రముఖ ఐటీ కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీంతో హెచ్ 1 బీ వీసాలపై యూఎస్ లోని సంస్థల్లో పనిచేస్తోన్న మన దేశ ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. కారణం.. వాళ్లు గనుక ఉద్యోగం కోల్పోతే, మరో 60 రోజుల్లోపు కొత్త ఉద్యోగం దక్కించుకోవాలి .. అలా కాని పక్షంలో స్వదేశానికి తిరిగివచ్చేయాల్సి ఉంటుంది. ఫాంగ్ సంస్థలుగా గుర్తింపు పొందిన ఫేస్ బుక్, అమెజాన్, యాపిల్, నెట్ ఫ్లిక్స్, గూగుల్ మెదైలనసంస్థల నుంచి వందల సంఖ్యలోని స్టార్టప్ సంస్థలు వరకు ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ మొదలైంది.

ఫేస్ బుక్ లో 11 వేల, అమెజాన్ లో 10 వేలు, గూగుల్ లో 10 వేలు, అదేబాటలో నెట్ ఫ్లిక్స్ సంస్థల్లో మొత్తం ఉద్యోగులలో 4 శాతం మేరకు కొలువుల కోతుల ప్రారంభమ్యాయియి.

ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ కూడా ఇదే బాటలో నడుస్తోంది. చైనాలో కోవిడ్ ఆంక్షలతో ఐఫోన్ 14 తయారీలో ఇబ్బందులు తదితర కారణాలతో రాబడులు తగ్గడంతో యాపిల్ సంస్థ కూడా లే ఆఫ్స్ కు సిద్ధమైనట్లు బ్లూమ్ బర్గ్ నివేదిక స్పష్టంచేసింది.

లేటెస్ట్ గా ఇంటెల్ సంస్థలో రానున్న రెండేళ్లలో దశల వారీగా 20 వేల ఉద్యోగాలు, హెచ్ పీలో 6వేలు, సిస్కో లో 4 వేలమందికి పైగా తొలగించనున్నట్లు తెలుస్తోంది. ఐటీ రంగ సంస్లల్లోనే కాకుండా సర్వీసెస్ విభాగంగా పరిగణించే జొమాటో, ఉబెర్, బుకింగ్ డాట్ కామ్, బైజూస్, గ్రూప్ఆ న్ తదితర కంపెనీల్లో కూడా కోతలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఈ సంస్థలు ఉద్యోగులను తొలగించడానికి రానున్న కొద్దినెలల్లో అమెరికాలో ఆర్థిక మాంద్యం ఏర్పడుతుందనే సంకేతాలనే కారణంగా చెబుతున్నారు.

ఇది వాస్తవ పరిస్థితుల్లో ఇప్పటికే ఆయా సంస్థల ఆర్థిక రాబడుల్లో ప్రతిబింబిస్తోంది. దాదాపు అన్ని సంస్థల రెండో త్రైమాసిక ఫలితాల్లో నికర ఆదాయం తగ్గింది. దీంతో సదరు సంస్థలు వ్యయ నియంత్రణలో భాగంగా..ముందు జాగ్రత్త చర్యగా .. మానవ వనరులపై చేసే వ్యయాలను తగ్గించుకోవాలనే ఉద్దేశ్యంతో ఉద్యోగులను తొలగిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే దాదాపు లక్షన్నర మంది వరకు ఉద్యోగాలు కో్ల్పోయారు. దీంతో వీరందరికీ ఇప్పుడేం చేయాలి అనే ప్రశ్నఎదురవుతోంది. సంస్థలు సైతం పనితీరు, సామర్థ్యం ఆధారంగా తొలగిస్తున్నామని చెబుతుండడంతో, ఉద్యోగాలు కోల్పోయిన వారు .. తమ పనితీరు బాగాలేదా అనే ఆవేదనకు గురవుతున్నారు.

అదేవిధంగా కొత్త రిక్రూట్ మెంట్ లపైనా సంస్థలు కొంతకాలం నిషేధం విధించే అవకాశముంది. దీంతో తమ పరిస్థితి ఏమిటని ఉద్యోగాలు కోల్పోయిన వారు మల్లగుల్లాలు పడుతున్నాయి. అయితే వీరంతా ముందుగా స్కిల్ గ్యాప్త గ్గించుకునేందుకు ప్రయత్నం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకు అందుబాటులో ఉన్న ప్రొఫెషనల్ వర్కింగ్ సైట్లను ఆసరాగా తీసుకోవాలి.

అందులో జాబ్ లిస్టింగ్స్ లో పేర్కొన్న డిమాండింగ్ స్కిల్స్ ను పరిశీలించాలి. తమ అర్హతలకు అనుగుణంగా మెరుగుపరుచుకోవాల్సిన నైపుణ్యాలపై స్పష్టత తెచ్చుకోవాలి. ఉదాహరణకు లింక్డ్ ఇన్ జాబ్ పోస్టింగ్స్ ను పరిగణనలోకి తీసుకుంటే, మీరు పోస్ట్ చేసిన రెజ్యూమ్ ఆధారంగా మీ డొమైన్ కు సంబంధించిన కొత్త జాబ్ పోస్టింగ్ లను తెలియజేయడంతో పాటు మీరు పెంచుకోవాల్సిన స్కిల్స్ ఏమిటి.. అనే విషయాన్ని గురించి కూడా వివరించి ఉంటుంది. దీంతో మీరు ఇంకా పెంచుకోవాల్సిన స్కిల్స్ ను స్పష్టంగా తెలుసుకునే వీలు ఉంటుంది. ఇలా స్పష్టత తెచ్చుకున్న సదరు నైపుణ్యాల సాధనకు కృషి చేయాల్సి ఉంటుంది. లింక్డ్ ఇన్ తో పాటు షైన్ డాట్ కామ్, మాన్ స్టర్ ఇండియా, నౌకరీ డాట్ కాం వంటి వాటిద్వారా మీ డొమైన్, జాబ్ ఫైల్ కు అనుగుణంగా అవసరమవుతోన్న స్కిల్స్ గురించి తెలుసుకుని వాటిపై పట్టు సాధించాలి.

స్కిల్ గ్యాప్ ను తగ్గించుకుని, కొత్త ఉద్యోగాల వేటలో ముందంజలో నిలిచేందుకు వీలుగా స్పెషలైజ్డ్ నైపుణ్యాలు సొంతం చేసుకునే దిశగా అడుగులు వేయాలి. మీ అకడమిక్ డొమైన్ కు సరితూగే ప్రత్యేక స్కిల్స్ పై పట్టు సాధించాలి. ఉదాహరణకు మీరు ఐటీ రంగంలో ఉంటే, కొత్తగా ఆటోమేషన్ స్కిల్స్ ను పెంచుకోవడానికి కృషి చేయాలి. అదే ప్రస్తుత పరిస్థితుల్లో ఆయా విభాగాల్లో సర్టిఫికేషన్ పూర్తి చేయడం కూడా ఉద్యోగాన్వేషణలో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో 4.0 స్కిల్స్గా జాబ్ మార్కెట్లో డిమాండ్ ఉన్న ఏఐ,ఎంఎంఎల్, రోబోటిక్స్, ఐఓటీ, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి వాటిపై ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. వీటిని రెండు నెలల్లో పూర్తి చేసుకునే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం హాట్టాపిక్ గా మారిన 5జీ టెక్నాలజీపై దృష్టి పెడితే, అవకాశాలు మరింత విస్తృతమవుతాయి.

ముఖ్యంగా కోడింగ్, ప్రోగ్రామింగ్, ఇండస్ట్రీ 4.0 వంటి ఐటీ స్కిల్స్ పై ఐబీఎంఎం, గూగుల్, హెచ్ పీ, ఏడబ్ల్యూబ్ల్యూఎస్, సిస్కో, వీఎంఎంఆర్, ఒరాకిల్ వంటి పలు సాఫ్ట్ వేర్ సంస్థలు నేరుగానే ఆన్ లైన్విధానంలో సర్టిఫికేషన్ కోర్సులు అందిస్తున్నాయి. ప్రస్తుత తరుణంలో ఉద్యోగం కోల్పోయినవాళ్లు .. ఎక్కువ రోజులు ఖాళీగా ఉండడం సరికాదు.

తమ అర్హతలకు సరితూగే ఫ్రీలాన్సింగ్, ఆన్ లైన్ జాబ్స్ అవకాశాలను అన్వేషించి, వాటిని సొంతం చేసుకునేలా అడుగులు వేయాలి. పలు జాబ్పో ర్టల్స్, సంస్థల వెబ్ సైట్స్ లో అవకాశాల వివరాలు తెలుసుకోవచ్చు. సంస్థలు, వేతనాల గురించి పట్టించుకోకుండా కొలువులో చేరి, మెరుగైన అవకాశం లభించే దిశగా కొనసాగాలి. కొన్ని సందర్భాల్లో చిన్న స్టార్టప్ కంపెనీల్లో సంపాదించిన అనుభవంతో మంచి సంస్థల్లో అవకాశాలు అందిపుచ్చుకునేందుకు దోహదపడుతాయని గుర్తించాలి. సంస్థలు తొలగిస్తున్నాయంటే, మార్కెట్ పరిస్థితులకు అనుగణంగా నాలెడ్జ్ ను అప్ డేట్చే సుకోకపోవడం కూడా ఒక కారణమై ఉంటుందని వాదన వినిపిస్తోంది.

సీనియర్ ఉద్యోగులు తాము ఇప్పటివరకు బాధ్యతలు నిర్వర్తించిన విభాగాలు, వాటికి సంబంధించిన మార్కెట్లు, వాటిలో ఆవిష్కృతమైన కొత్త నైపుణ్యాలను తెలుసుకుని, వాటిని సొంతం చేసుకునే దిశగా అడుగులు వేయాలి. ఉద్యోగాలు కోల్పోయినవారు .. నూతన ఉద్యోగాల సాధనలో సోషల్ నెట్ వర్కింగ్ సైట్లను సైతం విస్తృతంగా వినియోగించుకోవాలి. సదరు నెట్ వర్కింగ్ ద్వారా ఆయా రంగాల్లో నిపుణులైన వారితో సంప్రదింపులు చేయాలి. ఇప్పటివరకు తమ ఉద్యోగ జీవితంలో సాధించిన విజయాలు, అవిసంస్థ అభివృద్ధికి తోడ్పడిన తీరు వంటి వాటిని మెప్పించే రీతిలో వివరించాలి.

కొత్త ఉద్యోగాలకు తమను సిఫార్స్ చేసేవిధంగా ఆయా రంగాల్లోని నిపుణులను ఒప్పించాలి. ప్రస్తుతం పనితీరు ఆధారంగా తొలగింపులని ప్రకటిస్తోన్న సంస్థలు ఉద్యోగుల్లో ఉన్న సాఫ్ట్ స్కిల్స్ ను కూడా మదింపు చేసుకుంటున్నాయి. కాబట్టి సాఫ్ట్ స్కిల్స్ లో కీలకంగా భావించే కమ్యూనికేషన్ స్కిల్స్, బిహేవియర్ స్కిల్స్, ఒరల్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లంసాల్వింగ్ వంటి నైపుణ్యాలను పెంచుకునే దిశగా అడుగులు వేయాలి. అదేవిధంగా వీలైతే, తమను తొలగించడానికి గల నిర్దిష్ట కారణాన్ని తమ టీం హెడ్, లేదా ప్రాజెక్టు హెడ్ ద్వారా తెలుసుకుని, వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. ఉద్యోగుల తొలగింపుకు గురైనవారు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా .. ధైర్యంగా ఉండాలి. ఆందోళన నుంచి బయటపడి, సాధించగలమనే మనో ధైర్యంతో కొత్త అవకాశాల్ని దక్కించుకోవాలి.

ఈ పరిణామం ఐఐటీల వంటి ప్రముఖ విద్యా సంస్థల ప్రాంగణ నియామకాల పైన ప్రతికూల ప్రభావం చూపుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. క్యాంపస్ ప్లేస్మెంట్స్ సందర్భంగా వారికి ఆఫర్ చేసే ప్యాకేజీ కూడా తగ్గించే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఐఐటి విద్యార్థులకే డిమాండ్ తగ్గితే మిగతా ఇంజనీరింగ్ కాలేజీల్లో అసలు ప్లేస్మెంట్స్ అనే అవకాశమే ఉండదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఏ రోజు ఏ కంపెనీ పింక్‌ స్లిప్‌ ఇస్తుందో తెలియని కంగారు పుట్టిస్తోంది. మనదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా నేడు ఆర్థిక మాంద్యం ముంచుకొస్తున్న సంకేతాలు స్పష్టంగా కనబడుతున్నాయి.

మొన్నటిదాకా ఉద్యోగులతో కళకళలాడిన ఐటీ కంపెనీలు.. ఇప్పుడు మాంద్యం వల్ల ఉద్వాసనలు పలుకుతున్నాయి. కరోనా కారణంగా 2020లో ప్రపంచవ్యాప్తంగా అన్నిరంగాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. చాలామంది అనాథలుగా మారారు, అంతటి క్లిష్ట సమయంలోనూ ఒక వెలుగు వెలిగింది ఐటీ రంగం మాత్రమే. ఈ సమయంలో ఐటీ రంగం ఎన్నో కొత్త నియామకాలు చేపట్టి దేశంలో ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందించింది.

ప్రాంగణ నియామకాలతోనూ కొత్తవారికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఇంతటి ప్రగతి సాధించిన ఐటీ రంగం నేడు తీవ్ర సంక్షోభంతో అతలాకుతలమయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం కారణంగా అమెరికా, యూరప్‌ దేశాల్లో ఆర్థిక మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. ఆ ప్రభావం ఇతర దేశాలపై చూపిస్తోంది. ఇలా ఫేస్‌బుక్‌, అమెజాన్‌, ట్విటర్‌ వంటి కంపెనీల్లో పనిచేస్తూ ఉద్వాసనకు గురైనవారి పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా ఉంది. ఫలితంగా వారి కుటుంబాలపైన, వారి వ్యయ సామర్థ్యంపైనా.. పరోక్షంగా దేశ ఆర్థికవ్యవస్థపైనా ప్రభావం పడుతోంది. ఈ పరిస్థితులు ఇలానేకొనసాగితే మున్ముందు ఐటీ రంగంలో 2008 నాటి గడ్డు పరిస్థితి పునరావృతం అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కొత్త నైపుణ్యాల దిశగా ఉద్యోగులు దృష్టి సారించాలని వీరంతా సూచిస్తున్నారు.

ఐటీ రంగంలో టెక్నాలజీ .. వాయు వేగంతో మారిపోతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే, లేఆఫ్ లకు భయపడాల్సిన పనిలేదని నిపుణులు
సూచిస్తున్నారు. ఇదీ ఇవాల్టి ఫోకస్.. రేపటి ఫోకస్ లో మళ్లీ కలుద్దాం..

Must Read

spot_img