HomeUncategorizedరోహింగ్యా ముస్లింలను కాపాడిన భారత సైన్యం..!

రోహింగ్యా ముస్లింలను కాపాడిన భారత సైన్యం..!

మయన్మార్ సైన్యాన్నించి తప్పించుకుని పిల్లా పాపలతో పొరుగుదేశాలకు వలసలు పోతున్న వంద మంది రోహింగ్యాలను భారత నౌకాదళం రక్షించింది. గతంలో మయన్మార్ లో బౌద్ద బిక్షుకులు, జుంటా సైనికులు వీరిపై జరిపిన ఊచకోత నుంచి తప్పించుకునేందుకు లక్షలాదిగా రోహింగ్యాలు వలసలు పోయారు. ఆ వలసలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

నడి సముద్రంలో చిక్కుకున్న 100 మందికి పైగా రోహింగ్యాలను భారత నౌకాదళం కాపాడింది.

అండమాన్‌ దీవుల సమీపంలో ఓ పడవలో 100 మంది రోహింగ్యాలు చిక్కుకుపోయారని.. దాదాపు 16 నుంచి 20 మంది దాహం, ఆకలి లేదా నీటిలో మునిగి చనిపోయి ఉండొచ్చని మయన్మార్ రోహింగ్యా ఉద్యమకారులు అందించిన సమాచారంతో అధికారులు స్పందించారు.

సముద్రంలో చిక్కుకుపోయిన పడవను చేరుకోవడానికి ఐదు భారతీయ నౌకలు మంగళవారం ఆలస్యంగా చేరుకున్నాయని ఓ నివేదిక వెల్లడించింది. తన వద్ద పంచుకోవడానికి ఎలాంటి వివరాలు లేవని భారత నౌకాదళ ప్రతినిధి వెల్లడించారు. “బహుశా 20 మంది చనిపోయారని అంచనా వేస్తున్నాము, కొంతమంది ఆకలి, దాహంతో, మరికొందరు నిరాశతో సముద్రంలోకి దూకారు.

ఆసియా పసిఫిక్ రెఫ్యూజీ రైట్స్ నెట్‌వర్క్‌కు చెందిన రోహింగ్యా వర్కింగ్ గ్రూప్ రెండు వారాలకు పైగా కొట్టుమిట్టాడుతోంది. మయన్మార్‌లో హింస నుండి తప్పించుకోవడానికి రోహింగ్యా ముస్లింలు ప్రమాదకరమైన పడవల్లోకి ఎక్కి ప్రాణాలను పణంగా పెడుతున్నారని ఓ రోహింగ్యా ప్రతినిధి వెల్లడించారు.

ప్రతి సంవత్సరం చాలా మంది రోహింగ్యాలు, ముస్లిం మైనారిటీ సభ్యులు మయన్మార్‌లో హింస, బంగ్లాదేశ్ శరణార్థి శిబిరాల్లోని ఆక్రమణల నుంచి తప్పించుకోవడానికి తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. దుర్భరమైన నౌకల్లోకి ఎక్కుతున్నారు. చాలామంది మలేషియా చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

ఇది చాలా భయంకరమైనది, దారుణమైనది,” అని మయన్మార్ రోహింగ్యాలకు మద్దతుగా పనిచేసే అరకాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ క్రిస్ లెవా అన్నారు.

గతంలో వంద మందికి పైగా రోహింగ్యాలతో ఉన్న మరో పడవను వారాంతంలో శ్రీలంక నావికాదళం రక్షించింది. 2018లో మయన్మార్‌లో సైనిక అణిచివేత తర్వాత 7లక్షల ా30 వేల మందికి పైగా రోహింగ్యా ముస్లింలు పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌కు పారిపోయారు. మయన్మార్‌ సైనిక అణిచివేత అనంతరం సామూహిక హత్యలు, అత్యాచారాలు జరిగాయి. జర్నలిస్టుల హత్యలతో పాటు గ్రామాలు తగులబెట్టబడ్డాయని హక్కుల సంఘాలు నమోదు చేశాయి.

అయితే రోహింగ్యాలకు ఆశ్రయం ఇవ్వడం అన్న విషయంలో ఏ దేశమూ బాధ్యత తీసుకోవడం లేదు. వారితో సమస్యలు తలెత్తుతున్నాయనీ, వారికి ఆశ్రయం ఇవ్వడం వల్ల జాతీయ బధ్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని భయపడుతున్నారు.

ఈ ఏడాది ఆగస్టులో దిల్లీలోని బక్కర్‌వల ప్రాంతంలో రోహింగ్యాల కోసం ప్రత్యేకంగా అపార్ట్‌మెంట్‌లు కడతామని, వారికి రక్షణ కూడా కల్పిస్తామని కేంద్రమంత్రి హర్‌దీప్ సింగ్ పురి ప్రకటించారు. అయితే మరి కాసేపటికే…కేంద్రం ఈ ప్రకటనను ఖండించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ..ఇలాంటి నిర్ణయమేమీ తీసుకోలేదని స్పష్టం చేసింది. “అక్రమంగా దేశంలోకి వచ్చిన వాళ్లను డిటెన్షన్ సెంటర్స్‌లోనే ఉంచుతాం.

వారు మన దేశం వదిలి వెళ్లేంత వరకూ ఆ కేంద్రాల్లోనే ఉంటారు” అని వెల్లడించింది. అంతే కాదు. ప్రస్తుతం బక్కర్‌వల ప్రాంతంలో ఉన్న శరణార్థుల్ని వేరే ప్రాంతానికి తరలించాలని దిల్లీ ప్రభుత్వానికి సూచించింది. ప్రస్తుతం వాళ్లు ఉంటున్న ప్రాంతాన్ని డిటెన్షన్ సెంటర్‌గా ప్రకటించకూడదని తేల్చి చెప్పింది.

ఈ భూ ప్రపంచంలో తమకంటూ మాతృభూమి లేనివారు ఎవరన్నా ఉన్నారంటే వారు రోహింగ్యాలే అని చెప్పాలి. ఇప్పటివరకు పాలస్తీనియన్లు తమదంటూ చెప్పుకోవడానికి సొంతగడ్డ లేక అల్లాడిపోయారు. ఇప్పుడు ఆ పరిస్థితి మయన్మార్‌లో నివసిస్తున్న రోహింగ్యాలు అనుభవిస్తున్నారు.

నిజానికి రోహింగ్యాలకు ఒకప్పుడు సొంత రాజ్యం ఉండేది. కొన్ని అనివార్య కారణాల వల్ల తమ మాతృభూమిలోనే పరాయివారుగా జీవించవలసిన దుస్థితి దాపురించింది. వందల ఏండ్లుగా స్వదేశంలోనే కాందిశీకులుగా జీవిస్తున్న రోహింగ్యాలు సైన్యాధికారుల దాడులతో చెల్లాచెదురయ్యారు.

లక్షల సంఖ్యలో తరలిపోయి బంగ్లాదేశ్ పంచన చేరారు. ఇప్పటికీ మయన్మార్‌ సైన్యం రోహింగ్యాలను ఏదో విధంగా రఖైన్‌ రాష్ట్రం నుంచి వెళ్ళ గొట్టాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

Must Read

spot_img