Homeఅంతర్జాతీయంచైనా తన వక్రబుద్దిని పదేపదే ప్రదర్శిస్తూనే ఉంది..

చైనా తన వక్రబుద్దిని పదేపదే ప్రదర్శిస్తూనే ఉంది..

చైనా తన వక్రబుద్దిని పదేపదే ప్రదర్శిస్తూనే ఉంది.. పొరుగున ఉన్న దేశాలను సర్వనాశనం చేస్తోంది చైనా.. ఇటీవలే ఇండోనేషియా నుంచి జీ 20 ఆతిధ్య బాధ్యతలు భారత్ కు వచ్చాయి.. ఈ క్రమంలోనే మరో కుట్రకు తెరలేపింది డ్రాగన్ కంట్రీ..

జీ20 సమావేశాన్ని కాశ్మీర్ లో నిర్వహించాలని భారత్ ప్రయత్నాలు మొదలుపెట్టింది.. ఇదే జరిగితే.. చైనా ఆటలకు అడ్డుకట్ట వేయవచ్చును.. సరిహద్దుల వద్ద కాలుదువ్వుతోన్న చైనాకు భారత్ తన వ్యూహంతో అడ్డుకట్ట వేయనుందా..?

ఇండోనేషియా నుంచి భారతదేశానికి జీ20 అధ్యక్ష బాధ్యత వచ్చింది. దీని ద్వారా భారత్… కాశ్మీర్ విషయంలో చైనా, పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టాలని ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా జీ20 సమావేశాన్ని కాశ్మీర్లో నిర్వహించాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది.. ఇదే జరిగితే… చైనా పప్పులు ఉడకవు. పాకిస్తాన్ కల్లబొల్లి మాటలకు సానుభూతి పవనాలు ఉండవు. అందుకే కదా… భారత్తన వ్యూహాన్ని అమలు చేసేందుకు సిద్దమైంది..

చైనా.. పొరుగున ఉన్న హాంకాంగ్ ను చెరబట్టింది. టిబెట్ ను సర్వనాశనం చేసింది. శ్రీలంకను అప్పుల మయం చేసింది. పాకిస్తాన్ ను కోలుకోకుండా చేసింది. ఇంకా ఎన్ని దేశాలను ముంచుతుందో..? చైనా జాతీయ జంతువు డ్రాగన్. అది పరాన్నజీవి. దాని లక్షణాలు పుణికి పుచ్చుకుందేమో.. చైనా కూడా అంతే.. ఇతర దేశాల మీద పడి తినడమే దానికి తెలుసు. దేశంలో ఒకవైపు కోవిడ్ తీవ్రస్థాయిలో ప్రబడుతుంటే దాని నివారణకు చర్యలు తీసుకోవాల్సింది పోయి… ఇతర దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు దారి తీయడమేమిటో ఆ దేశానికి తెలియాలి. వాస్తవానికి పాంగాంగ్ ప్రాంతం లో బలగాలను ఉపసంహరించుకుందామని చెబుతూనే తన దారిలో తాను ఇక్కడ నిర్మాణాలు చేపడుతోంది.

మొదటి నుంచి భారత్ అనుమానిస్తున్నట్టుగానే పాంగాంగ్ లో చైనా రహస్యంగా కొన్ని నిర్మాణాలలో చేపడుతోంది.

తాజాగా పాంగాంగ్ ‘త్సో’ సరస్సు ఉత్తర తీరం… ఇది లడాఖ్ తూర్పు ప్రాంతంలో ఉంటుంది . ఇక్కడ చైనా కొత్తగా డివిజన్ స్థాయి హెడ్ క్వార్టర్స్ నిర్మిస్తోంది.. బలగాలను మోహరించేందుకు, ఆయుధాలను దాచేందుకు సరస్సు వెంబడి గగనతీర పరిరక్షణకు వీటిని ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి, 2021 ఫిబ్రవరిలో భారత్, చైనాలో సంయుక్త ఒప్పందానికి వచ్చాయి. ‘త్సో ‘ సరస్సు వెంట ఇరుదేశాల బలగాలను ఉపసంహరించుకున్నట్టు ప్రకటించాయి. ఎక్కడి నుంచి అయితే బలగాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించారో.. అదే పాయింట్ వద్ద ఇప్పుడు చైనా డివిజన్ స్థాయి హెడ్ క్వార్టర్స్ నిర్మిస్తున్నట్టు అమెరికాలోని వాషింగ్టన్ డిసికి చెందిన సెంటర్ ఫర్ స్టార్ట జిక్ అండ్ఇం టర్నేషనల్ స్టడీస్ సంస్థ చెబుతోంది. శాటిలైట్ చిత్రాల్లో సరస్సు ఉత్తర తీరం వెంట గత నెలలో ప్రారంభించిన నిర్మాణాలు, మౌలిక వసతుల విస్తరణ వంటివి స్పష్టంగా కనిపిస్తున్నట్టు తెలుస్తోంది.. 40 మీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పుతో ఇంటిని తలపించే నిర్మాణం ఉందని, అదేవిధంగా దక్షిణ భాగంలో ఆయుధ నిల్వ కేంద్రాలు, పశ్చిమ భాగాన కందకాలు కూడా ఉన్నట్టు ఆ సంస్థ తెలిపింది.

చైనాకు మొదటి నుంచి కూడా భారత్ అంటే అక్కసు. ఆసియా ప్రాంతంలో తనతో పాటు సమాంతరంగా ఆర్థిక అభివృద్ధి సాధిస్తున్న భారతదేశం పట్ల చైనా చేయని కుట్రలు అంటూ లేవు.. వాస్తవాధీన రేఖల వద్ద తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడటం చైనాకు పరిపాటి అయింది. గాల్వాన్ లోయలో ఉద్రిక్తతలు కూడా ఇందులో భాగమే. ప్రస్తుతం భారత్ జీ_20 అధ్యక్ష బాధ్యతలు రావటం, కాశ్మీర్ సమస్యను అంతర్జాతీయంగా లేవనెత్తేందుకు మోదీ సమాయత్తమవుతుండడంతో చైనా ఈ కుట్రలకు పాల్పడింది. అయితే పాంగాంగ్ వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో భారత వాయు సైన్యం గగనతలం నుంచి ఆ ప్రాంతాన్ని పరిశీలించింది.

సైనికులు కూడా ఆ సరిహద్దు చుట్టూ భారీగా మోహరించారు. మరోవైపు ఈరోజు జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో మోదీ ఉన్నంత వరకు భారత దేశంలో సెంటీమీటర్ భూ భాగాన్ని కూడా ఎవరూ ఆక్రమించలేరని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు.

చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాలు… ఇప్పుడు కూడా అలాంటి దుందుడుకు చర్యలకు తెగబడ్డాయి.. అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టర్‌ సరిహద్దుల్లో భారత జవాన్లపై దాడికి పాల్పడిన సంఘటన సృష్టించిన ప్రకంపనలు తగ్గకముందే మళ్లీ పంజా విసిరింది.

ఇప్పుడు తాజాగా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల వద్ద ఇలాంటి ఘర్షణే భారత్-చైనా జవాన్ల మధ్య చోటు చేసుకుంది. ఈ నెల 9వ తేదీన
తవాంగ్ సెక్టర్ సమీపంలో గల వాస్తవాధీన రేఖ వద్ద రెండు దేశాల జవాన్లు పరస్పరం ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో రెండు దేశాల జవాన్లు గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆర్మీ అధికారులు ధృవీకరించారు. భారత భూభాగంపైకి చొచ్చుకుని రావడానికి ప్రయత్నించిన చైనా పీఎల్ఏ బలగాలను భారత్ సరిహద్దు జవాన్లు నిలువరించే ప్రయత్నంలో ఈ ఘర్షణన చోటు చేసుకుంది.. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘర్షణల్లో 30 మందికి పైగా భారత జవాన్లు గాయపడినట్లు తెలుస్తోంది.

వారిలో ఆరుమందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఆ ఆరుమందిని అత్యవసర చికిత్స కోసం ఎయిర్ అంబులెన్స్ ద్వారా గువాహటికి తరలించాల్సి
వచ్చింది. తవాంగ్‌ సెక్టార్ సమీపంలోని వాస్తవాధీన రేఖ పొడవునా సుమారు 300 మంది చైనా సైనికులు భారత భూభాగంపైకి చొచ్చుకుని రావడానికి ప్రయత్నించగా భారత జవాన్లు సమర్థవంతంగా తిప్పి కొట్టారు.

ఇదిలా ఉండగా… తాజాగా చైనా – మరోసారి అలాంటి తెంపరితనాన్ని ప్రదర్శించింది.

భారత జలాల్లోకి దూసుకొచ్చింది. హిందూ మహాసముద్రంలో భారత జలాల్లోకి ప్రవేశించింది.. చైనాకు చెందిన పరిశోధక నౌక యాంగ్ వాంగ్-5.. ఇప్పుడా షిప్- భారత జలాల్లో లేదని, వెనక్కి వెళ్లిపోయినట్లు నౌకాదళ వర్గాలు తెలిపాయి. ఈ నౌక కార్యకలాపాలను లాంగ్ రేంజ్ విజిలెన్స్ డ్రోన్లు, సముద్ర గస్తీ విమానాలు,
భారత నౌకా దళ విభాగాలన్నీ నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని పేర్కొన్నాయి. కొద్ది రోజుల క్రితం హిందూ మహాసముద్ర రీజియన్‌లోకి చైనా గూఢచర్య నౌక యాంగ్ వాంగ్-5 ప్రవేశించిందని నావికాదళం పేర్కొంది.

ఇందులో బాలిస్టిక్ క్షిపణులు, ఉపగ్రహ ట్రాకింగ్ పరికరాలు ఉన్నాయని తాము భావిస్తున్నట్లు చెప్పాయి. ఈ ఏడాది ఆగస్టులో శ్రీలంకలోని హంబన్‌టోట పోర్ట్ వద్ద ఈ నౌకను నిలపడానికి శ్రీలంక అనుమతి ఇవ్వడాన్ని భారత్ తప్పుపట్టింది.. ఈ వ్యవహారం భారత్-శ్రీలంక మధ్య దౌత్యపరమైన వివాదానికి దారి తీసింది.

వచ్చే ఏడాది జీ 20 సదస్సును కాశ్మీర్ లో నిర్వహించేందుకు భారత్ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది.. చైనా వక్రబుద్దిని ఎండగట్టడంతో పాటు, కాశ్మీర్ అంశంలో భారత్ కు జరిగే అన్యాయాన్ని ప్రపంచదేశాలకు తెలియపర్చి.. పాక్, చైనాలకు బుద్ది చెప్పనుంది భారత్.. ……………………………….

Must Read

spot_img