ప్రిడేటర్ డ్రోన్ .. వింటేనే, ఓ హైప్ వినిపిస్తోంది కదా.. వీటిద్వారా అత్యంత కచ్ఛితత్వంతో లక్ష్యాన్ని చేధించవచ్చు.. అంతేగాక .. సుమారు 34 గంటలపాటు ఏకబిగిన గస్తీ నిర్వహించవచ్చు.. ఇప్పుడు ఇదే కీలకంగా .. భారత్ వీటి కొనుగోలుకు సిద్ధమైంది. అమెరికా రూపొందించిన ఈ డ్రోన్లు ..ఇప్పటివరకు ఉన్న వాటిలో అత్యంత పవర్ ఫుల్ అని నిపుణులు సైతం చెబుతున్నారు.
సరిహద్దుల్లో, హిందూమహా సముద్రంలో ఆగమాగం చేస్తోన్న చైనాకు చుక్కలు చూపించాలని భారత్ సిద్ధమైంది. అందుకే చైనాకు చెక్ పెట్టేలా ..అమెరికా ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలుకు సై అంటోంది. దీంతో గస్తీనే కాక .. ఆశించిన లక్ష్యాన్ని చేధించేందుకు ముందడుగు వేస్తోంది. ఏకంగా 30 డ్రోన్లను కొనుగోలు చేసేందుకు సైన్యం కీలక నిర్ణయం తీసుకుంది.
- అమెరికాకు చెందిన ఎంక్యూ-9 రీపర్ డ్రోన్‌ను భారత్‌ను కొనుగోలు చేయనుందా..?
అవుననే అంటున్నాయి రక్షణ శాఖ అంతర్గత వర్గాలు. లేజర్ గైడెడ్ హెల్‌ఫైర్ క్షిపణులను అత్యంత కచ్చితత్వంగా ప్రయోగించడం ఈ డ్రోన్ల ప్రత్యేకత. అల్‌ఖైదా చీఫ్ ఐమాన్ అల్-జవహిరిని అంతం చేసేందుకు అమెరికా ఈ డ్రోన్‌నే వినియోగించిందని అంటారు. త్రివిధ దళాలు ఒక్కోదానికి పదేసి చొప్పున మొత్తం 30 రీపర్ డ్రోన్లను భారత్ కొనుగోలు చేయవచ్చని తెలుస్తోంది. అయితే.. అధికారికంగా ప్రభుత్వం నుంచి ఇంకా ప్రకటన రావాల్సి ఉంది.
కొనుగోలుపై గురువారం రక్షణ సముపార్జన మండలి భేటీలో ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, అల్‌ఖైదా చీఫ్ అల్‌జవహరీని హతమార్చడంలో ”ఎంక్యూ-9 రీపర్” అనే సరికొత్త డ్రోన్ ప్రధాన పాత్ర పోషించింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఇప్పుడు ఈ వాహనంపై దృష్టిసారించాయి. జవహరీని నుజ్జు నుజ్జు చేసి చంపేందుకు అగ్రరాజ్యానికి చెందిన అధికారులు అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించే ఆర్ఎక్స్ 9 క్షిపణులను ప్రయోగించింది. దాన్ని ప్రిడేటర్ బి డ్రోన్‌గా పిలుస్తారు.
ఎంక్యూ 9 రీపర్, మనీవెల్ టీపీసీ 331-10 టర్బో ప్రొప్ అనే ఇంజన్ సాయంతో ఇది పనిచేస్తుంది. దీనికి డిజిటల్ ఎలక్ట్రానిక్ ఇంజన్ కంట్రోల్ వ్యవస్థను జతచేర్చారు. దీంతో దీనిలో ఇంజన్ సామర్థ్యం గణనీయంగా ఉంటుంది. తక్కువ ఎత్తులో ప్రయాణించేటప్పుడు ఇంధనం వృథా కాకుండా ఉంటుంది. రీపర్ లో పేలోడ్ లను మోసుకెళ్లేందుకు 7 ఎక్స్ టర్నల్ స్టేషన్లు ఉంటాయి. ఏకధాటిగా 27 గంటల పాటు ఆకాశంలో ఉండగలదు. దాడులతోపాటు నిఘాకు కూడా ఉపయోగపడుతుంది. దీన్ని ఆపరేట్ చేయడం చాలా సులువు. ప్రిడేటర్ బికి మరిన్ని హంగులు జోడించడంద్వారా అత్యాధునిక ప్రిడేటర్ బీ ఈఆర్ డ్రోన్లను ఇప్పటికే తయారు చేశారు. ఇవి ఆకాశంలో ఏకధాటిగా 34 గంటలపాటు ఉంటాయి.
36 అడుగుల పొడవు, 12.5 అడుగుల ఎత్తు, 66 అడుగుల వెడల్పు, 2వేల 223 కిలోల బరువుతో 240 నాట్ల వేగంతో 1150 మైళ్ల పరిధిలో ప్రయాణిస్తాయి. సుమారు 50వేల అడుగుల ఎత్తుకు వెళ్లడమే కాక .. ఏకంగా 1746 కిలోల పేలోడ్‌ను మోసుకెళ్లగలగడం దీని ప్రత్యేకతగా నిపుణులు చెబుతున్నారు. అయితే అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, స్పెయిన్, ఇటలీ దగ్గరే ఈ తరహా ఆయుధాలున్నాయి. భారత్ కూడా వీటి కొనుగోలుకు ఆసక్తిగా ఉంది.
60 నుంచి 80 మిలియన్ డాలర్ల ఖరీదైన ఈ రీపర్ కొనుగోలుకు ఇప్పటికే భారత్-అమెరికా మధ్య చర్చలు జరిగాయి. ధర విషయంలో స్పష్టత రాగానే ఒప్పందానికి సంతకాలు జరుగుతాయని విదేశీ వ్యవహారాలశాఖ నిపుణులు వెల్లడించారు. త్రివిధ దళాల నిఘా వ్యవస్థను పటిష్టం చేసేందుకు అమెరికా నుంచి 30 ప్రిడేటర్ డ్రోన్లను కొనుగోలు చేసేందుకు భారత్ నిర్ణయించింది.
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ అమెరికా పర్యటనలో ఈ ఒప్పందానికి తుదిరూపు ఇచ్చేందుకు అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. ఆయన అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్‌ను కలిసి పలు అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. అత్యాధునిక సాంకేతికత రంగాల్లో సహకారానికి భారత్ అమెరికాల మధ్య కుదిరిన ఐసీఈటీ ఒప్పందాన్ని ఇరు దేశాల సంబంధాల్లో మరో మైలురాయిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభివర్ణించినట్లు శ్వేతసౌధం ప్రకటించింది.
దీంతో సముద్రంలో ఇండియన్ నేవీని శత్రుదుర్భేద్యంగా మార్చేందుకు.. మానవరహిత విమానాలే కాదు.. నీటి అడుగుల ఉండే నౌకలను కూడా సైన్యం పరిశీలిస్తోంది. ఈ అన్‌మ్యాన్డ్ అండర్ వాటర్ వెహికిల్స్.. నీటి లోపల నిఘా పెట్టడం మాత్రమే కాదు.. అవసరమైతే దాడి చేసేందుకు కూడా సిద్ధంగా ఉంటాయి.
- దీంతో హిందూమహాసముద్రంలో చైనాకు చెక్ పెట్టేందుకు.. అమెరికా నుంచి ఫ్లీట్ ప్రిడేటర్ డ్రోన్లు కొనుగోలు చేయాలని.. ఇండియన్ నేవి భావిస్తోంది..
ఇండియన్ నేవీకి.. ఇప్పుడు అండర్ వాటర్ డొమైన్ అవేర్‌నెస్ అనేది అత్యంత కీలకంగా మారింది. ఇందుకోసం.. అన్‌మ్యాన్డ్ రోడ్ మ్యాప్‌ని భారత నావికాదళం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా.. మానవరహిత టెక్నాలజీ, వ్యవస్థలకు సంబంధించిన కెపాసిటీని పెంచుకోవాలన్నదే ముఖ్య ఉద్దేశం. భవిష్యత్తులో.. మానవరహిత వ్యవస్థలకు సంబంధించిన అవసరాలను.. కూడా ఇండియన్ నేవీ ఇటీవలే ఆవిష్కరించింది. ఇందులో..అండర్ వాటర్ డ్రోన్లు కూడా ఉన్నాయి. ఇవి.. మనిషి జోక్యం అవసరం లేకుండానే నీటి లోపల పనిచేస్తాయి. వీటిని.. రిమోట్ ద్వారా ఆపరేట్ చేయగల అండర్ వాటర్ వెహికిల్స్‌గా చెప్పొచ్చు.
అటానమస్ అండర్ వాటర్ వెహికిల్స్ అయితే.. పూర్తిగా ఆటోమేటెడ్‌గానూ, స్వతంత్రంగానూ పనిచేస్తాయి. కానీ.. రిమోట్లీ ఆపరేటెడ్ అండర్ వాటర్ వెహికిల్స్ మాత్రం.. మనుషులు ఆపరేటింగ్ చేయడం ద్వారా పనిచేస్తాయి. మానవరహిత వాహనాల్లో.. వీటిని సెకండ్ కేటగిరీగా చెప్పొచ్చు. ఈ మానవరహిత అండర్ వాటర్ డ్రోన్లు.. మైన్‌స్వీపర్ల అవసరాలను తగ్గిస్తాయి. ప్రధానంగా ఐఎస్ఆర్ కార్యకలాపాలు, రియల్ టైమ్ టార్గెట్ ట్రాకింగ్, బీచ్ నిఘా, స్పెషల్ ఆపరేషన్స్, సముద్ర డొమైన్ అవేర్‌నెస్ కోసం వాడనుంది ఇండియన్ నేవీ.
ఓవరాల్‌గా చూసుకుంటే.. సముద్రంలో దేశ భద్రతను భంగం వాటిల్లకుండా ఇండియన్ నేవీ ఆధునిక వ్యవస్థలను సమకూర్చుకోవాలని చూస్తోంది.వాస్తవానికి.. భారత్‌కు హిందూ మహాసముద్రం చాలా కీలకమైన ప్రాంతం. దాని మీదుగానే.. పెద్ద ఎత్తున వాణిజ్యం, రవాణా లాంటి కార్యకలాపాలు సాగుతుంటాయి. అందువల్ల.. ఇండియన్ ఓషియన్ రీజియన్‌లో.. భారత ప్రయోజనాలను కాపాడుకోవడమే ఇండియన్ నేవీకి ప్రధాన విధి.
సరిహద్దుల్లో ముప్పును దీటుగా ఎదుర్కొనే క్రమంలో చైనా, పాకిస్థాన్ లకు చెక్ పెట్టేలా అమెరికా సాయుధ డ్రోన్లను భారత్ కొనుగోలు చేయనుంది. సముద్ర, భూ రక్షణ వ్యవస్థలను పటిష్ఠం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. శాన్ డయీగోకు చెందిన జనరల్ ఆటమిక్స్ తయారు చేసిన ఎంక్యూ 9బీ ప్రిడేటర్ డ్రోన్లను కొనుగోలు చేయనుంది. 30 డ్రోన్ల కొనుగోళ్లకు సంబంధించి 300 కోట్ల డాలర్లతో భారత్ ఒప్పందం చేసుకోనుంది. ఇక, గత ఏడాది ఆయుధాల్లేని రెండు ఎంకూ 9 ప్రిడేటర్ డ్రోన్లను భారత్ లీజుకు తీసుకుంది. ఇప్పుడు సాయుధ డ్రోన్లను కొనుగోలు చేస్తోంది.
కాగా, 1,700 కిలోల పేలోడ్ లను మోసుకెళ్లే ఈ డ్రోన్లు 48 గంటల పాటు గస్తీ కాయగలవని నిపుణులు చెబుతున్నారు. హిందూ మహా సముద్రం దక్షిణ
ప్రాంతంలో చైనా నౌకలపై నిఘా వేసేందుకు మన నౌకాదళానికి ఇవి బలంగా మారుతాయని అంటున్నారు. అంతేగాక హిమాలయ పర్వత సానువుల్లోని సరిహద్దుల వద్ద పాక్ లక్ష్యాలనూ వీటితో టార్గెట్ చేసుకోవడానికి వీలుంటుందని చెబుతున్నారు. చైనాతో ఉద్రిక్తతలు ఎంతకీ వీడని నేపథ్యంలో భారత్ తన అస్త్రశస్త్రాలను బలోపేతం చేసుకునే దిశగా చర్యలు చేపట్టింది.
ఇప్పటికే ఫ్రాన్స్ నుంచి రఫేల్ యుద్ధ విమానాలను తీసుకొచ్చే ప్రక్రియను వేగవంతం చేసిన కేంద్ర ప్రభుత్వం.. రష్యా నుంచి క్షిపణి నిరోధక వ్యవస్థను కూడా సాధ్యమైనంత త్వరగా తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా అమెరికా నుంచి అధునాతన పోసిడాన్ 8ఐ విమానాలతోపాటు ప్రిడేటర్ బి ఆర్మ్ డ్ డ్రోన్లను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ డ్రోన్లను గగనతల నిఘాకు వినియోగించడంతోపాటు దాని నుంచి ఆయుధాలను సైతం ప్రయోగించొచ్చు. ఎంక్యూ 9 రీపర్ గా పేరున్న ఈ డ్రోన్ ను భూమి పై నుంచి ఆపరేట్ చేస్తారు. ఇవి మన అమ్ములపొదిలోకి వస్తే సరిహద్దు భద్రత మరింత బలోపేతం కానుంది.
భారత సరిహద్దు భద్రతను బలోపేతం చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇందుకోసం .. ప్రిడేటర్ డ్రోన్లను కొనుగోలు చేసేందుకు సై అంటోంది. దీంతో ఇకడ్రాగన్ కంట్రీకి చుక్కలేనని సైనిక నిపుణులు సైతం స్పష్టం చేస్తున్నారు.