ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం ఏదంటే.. ఎవ్వరైనా వెంటనే చెప్పే పేరు చైనా.. అయితే.. ఆ మాటకు కాలం చెల్లింది.. ఇప్పటి వరకు అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న చైనాకు ఓ దేశం చెక్ పెట్టింది.. చైనాను జనాభాలో అధిగమించిన దేశం ఏది..?
ప్రపంచంలోనే భారత్ నెంబర్ వన్ గా నిలిచింది. అదేంటి.. భారత్ నెంబర్ వన్ గా ఎందులో నిలిచింది అనుకుంటున్నారా..? ఇప్పటి వరకు అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనా ఉండగా.. ఇటీవలే భారత్ ఆ రికార్డ్ ను బ్రేక్ చేసింది.. చైనా జనాభాను అధిగమించి.. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా రికార్డ్‌కెక్కింది.
జనాభా విషయంలో చైనా రికార్డును భారత్ అధిగమించిందని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశమేది అంటే వెంటనే చైనా అని సమాధానం చెప్పేస్తాం. కానీ ఇకపై ఈ సమాధానం చెప్పే వాళ్లందరూ పప్పులే కాలేసినట్టే. ఎందుకంటే…చైనా రికార్డు బద్దలైంది. జనాభాలో చైనాను మించి భారత్ దూసుకుపోయింది. ఇది స్వయంగా ఐక్యరాజ్య సమితి వెల్లడించిన విషయం. చైనా కన్నా ఎక్కువ జనాభా ఉన్న దేశంగా భారత్ అవతరించిందని స్పష్టం చేసింది యూఎన్. చైనా జనాభాతో పోల్చి చూస్తే…ఎక్కువగానే భారత జనాభా 30 లక్షల మేర పెరిగిందని వెల్లడించింది. ఈ మేరకు
అధికారికంగా ఓ రిపోర్ట్ కూడా విడుదల చేసింది.
స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ 2023 పేరిట యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ ఈ లెక్కలు వెల్లడించింది.. ప్రస్తుతానికి చైనాలో 142 కోట్ల 57 లక్షల జనాభా ఉంది. భారత్‌లో ఈ సంఖ్య 142 కోట్ల 86 లక్షలకు పెరిగిందని తెలిపింది. అంటే…ఇకపై జనాభా విషయంలో భారత్ మొదటి స్థానంలో, చైనా రెండో స్థానంలో నిలవనున్నాయి. అగ్రరాజ్యం అమెరికా మూడో స్థానంలో నిలవనుంది. అమెరికా జనాభా ప్రస్తుతానికి 34 కోట్లుగా ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి జనాభాను లెక్కించి ఈ వివరాలు తెలిపింది ఐక్యరాజ్య సమితి. నిజానికి గతంలోనూ యూఎన్ త్వరలోనే చైనా రికార్డుని భారత్ అధిగమిస్తుందని చెప్పింది. ఇప్పుడు అధికారికంగా ప్రకటించింది. భారత్‌లో చివరిసారి 2011లో జనాభా లెక్కల ప్రక్రియ చేపట్టారు. మూడేళ్ల క్రితం జరగాల్సి ఉన్నా…కరోనా సంక్షోభం కారణంగా అది ఆగిపోయింది. ప్రపంచ జనాభాలో మూడింట ఓ వంతు వాటా భారత్, చైనాదే ఉంది.
పాపులేషన్‌కి అంత పాపులారిటీ సంపాదించిన చైనా… ఇప్పుడు ఆ విషయంలో వెనకబడుతోంది. గత ఆరు దశాబ్దాల్లో ఎప్పుడూ లేని విధంగా గతేడాది జనాభా తగ్గిపోయింది. చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ వెల్లడించిన లెక్కల ప్రకారం చూస్తే…సుమారు 142 కోట్లుగా ఉన్న జనాభాలో 8 లక్షల 50 వేల మేర తగ్గింది. 1961 తరవాత ఈ స్థాయిలో జనాభా తగ్గడం ఇదే తొలిసారి. ఈ కారణంగా…భారత్ ఖాతాలో ఓ రికార్డు చేరనుంది. ఇప్పటి వరకూ జనాభా విషయంలో చైనా ముందంజలో ఉండగా… ఇప్పుడా స్థానాన్ని భారత్ భర్తీ చేసేంది.
ఐక్యరాజ్య సమితి నిపుణులు 2022లోనే ఇండియా జనాభాను అంచనా వేశారు. 141కోట్ల జనాభా ఉన్నట్టు తెలిపారు. అయితే.. చైనాను దాటేసి మరీ భారత్ ముందు వరసలో నిలబడుతుందని వాళ్లు ఊహించలేదు. ఇప్పుడు చైనా జనాభా తగ్గడం వల్ల త్వరలోనే భారత్ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా ఉన్న దేశంగా రికార్డు సృష్టించింది. చైనా విషయానికొస్తే…జనాభాలో ఈ తగ్గుదల 2050 వరకూ కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2050 నాటికి కనీసం 11 కోట్ల మేర జనాభా తగ్గుతుందని చెబుతున్నారు. “చైనా ఆర్థిక, సామాజిక స్థితిగతుల్లో అంతరాలు ఏర్పడుతున్నాయి. అందుకు తగ్గట్టుగా విధానాల్లో మార్పు చేసుకోక తప్పదు” అని స్పష్టం చేస్తున్నారు.
జనాభా అంచనాలకు సంబంధించి స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్టు-2023 పేరుతో యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్స్ తాజా నివేదికను విడుదల చేసింది. భారత్‌లో అత్యధికంగా 142.86 కోట్ల జనాభా ఉన్నట్లు లెక్కకట్టింది. భారత్ తో పోలిస్తే చైనాలో 29 లక్షల మంది తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం చైనా జనాభా 142.57కోట్లుగా అంచనా వేసింది. ఇక ప్రపంచంలో మూడోస్థానంలో ఉన్న అమెరికాలో 34కోట్ల మంది ఉన్నట్లు అంచనా వేసింది. ఫిబ్రవరి 2023 వరకు ఉన్న సమాచారాన్ని బట్టి ఈ అంచనాలు రూపొందించినట్లు తెలిపింది.
ప్రపంచంలోనే అత్యధిక యువత జనాభా కూడా భారత్‌లోనే ఉంది. UNFPA నివేదిక ప్రకారం.. భారతదేశ జనాభాలో 0-14 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు 25% మంది. 10-19 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు 18% మంది. 10-24 సంవత్సరాల వయస్సు గలవారు 26% మంది. 15-64 సంవత్సరాల వయస్సు గల వారు 68% మంది.. 65 ఏళ్లు పైబడిన వ్యక్తులు 7% మంది ఉన్నట్టు నివేదికల సమాచారం. అయితే.. ఆయుర్దాయం పరంగా భారతదేశం కంటే చైనా మెరుగ్గా ఉంది. ఇక్కడ ఆడవారికి 82 ఏండ్లు కాగా.. పురుషుల ఆయుర్దాయం 76 సంవత్సరాలు. భారతదేశ ఆయుర్దాయం విషయానికి వస్తే.. ఆడవారి ఆయుర్దాయం 74 ఏండ్లు కాగా.. మగవారి ఆయుర్దాయం 71 ఏండ్లుగా ఉన్నట్టు నివేదిక తెలిపింది.
ఐక్యరాజ్యసమితి జనాభా డేటా రికార్డులో 1950 నుండి భారతదేశ జనాభా చైనా కంటే ఎక్కువగా నమోదు కావడం ఇదే మొదటిసారి. వాస్తవానికి 1945లో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఐక్యరాజ్యసమితి స్థాపించబడింది. 1950 ఐక్యరాజ్యసమితి జనాభా డేటా సేకరించి జారీ చేయడం ప్రారంభించింది. 1950 నుండి 2023 వరకు ఐక్యరాజ్యసమితి యొక్క జనాభా యొక్క చార్ట్, పట్టికను పరిశీలిస్తే, భారతదేశ జనాభా ఈ విధంగా పెరిగింది.. 2023లో భారతదేశ జనాభా 142,86,27,663 కోట్లు, ఇది 2022 కంటే 0.81% ఎక్కువ. 2022లో భారతదేశ జనాభా 1417,173,173.. ఇది 2021 కంటే 0.68% ఎక్కువ. 2021లో భారతదేశ జనాభా 140,75,63,842.. ఇది 2020 కంటే 0.8% ఎక్కువ. 2020లో భారతదేశ జనాభా 139,63,87,127. ఇది 2019 కంటే 0.96% ఎక్కువ.
మరోవైపు చైనాను పరిశీలిస్తే.. 65 ఏళ్లు పైబడిన వారు దాదాపు 200 మిలియన్లుగా ఉన్నట్టు తెలుస్తోంది. కొన్ని దశాబ్దాల క్రితం.. చైనా ప్రభుత్వం 1-చైల్డ్ విధానాన్ని అమలు చేసింది. దీని కారణంగా ప్రజలు పిల్లలను కనడం మానేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ పాలసీ ప్రభావం.. చైనాపై పడింది. దీంతో జనాభా పెరుగుదల క్రమంగా తగ్గింది. తాజాగా చైనా ప్రభుత్వం దేశ జనాభా పెరగడానికి పలు పాలసీలను అమలు చేస్తుంది. ఇప్పుడు ఇద్దరూ లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు పుట్టే దంపతులకు అనేక సౌకర్యాలు కల్పిస్తామని చైనా ప్రభుత్వం చెప్పే పరిస్థితి నెలకొంది. అక్కడ కాలేజీల్లో
విద్యార్థులకు ప్రెగ్నేస్సీ హాలీ డేను ప్రకటించడం ప్రారంభించాయంటే.. ఆ దేశంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది ప్రారంభంలో.. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన నగరం, చైనా రాజధాని బీజింగ్ లో జనాభా పెరగడానికి బదులు తగ్గింది అనే షాకింగ్ న్యూస్ కూడా వచ్చింది. దీనికి కరోనా మహమ్మారి కూడా ప్రధాన కారణంగా భావిస్తున్నారు.
ప్రస్తుతం చైనా జనాభా 142.57 కోట్లుగా ఉంది. దీన్ని భారత్ అధిగమించినట్లు ఐక్యరాజ్య సమితి అధికారికంగా కీలక ప్రకటన చేసింది. మరోవైపు చైనాలో జననాల రేటు పడిపోవడం, దాని శ్రామిక శక్తి వయస్సు తగ్గిపోవడం కూడా జనాభా క్షీణతకు కారణమైందని చెబుతున్నారు. దీంతో చైనాలో అనేక ప్రాంతాలు జననాల రేటును పెంచే ప్రణాళికలను కూడా ప్రకటించాయి. కానీ.. ఈ ప్రయత్నాలతో జనాభా పెరుగుదల మాత్రం చేయలేకపోయారు. మరోవైపు భారత్ లో 2011 నుంచి జనాభా లెక్కలు గణించకపోవడంతో భారత జనాభా ఎంత అనేది అధికారికంగా లెక్కించలేదు. వాస్తవానికి పదేళ్లకోసారి చేసే జనగణనకు ఈసారి కరోనా కారణంగా అవాంతరాలు ఎదురయ్యాయి. కరోనా తగ్గినా ఇంకా జనాభా లెక్కల ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఈ ఏడాది మధ్యలో దాదాపు 3 మిలియన్ల మందితో చైనాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించిందని ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన డేటా వెల్లడించింది. దీంతో భారత్ ఇకపై ప్రపంచంలో బలమైన శక్తితో పాటు జనాభాలోనూ టాప్ లో నిలిచినట్లయింది.
భారత్ కేవలం జనాభా పరంగా ప్రపంచంలోనే అగ్రగామిగా ఉండటంతో పాటు.. అత్యంత యువశక్తి కలిగిన దేశంగా ఉండటం భారత్ కు కలిసివచ్చే అంశమే.. ఇక ప్రపంచంలోనే ఇప్పటి వరకు అత్యధిక జనాభా కలిగిన చైనాను అధిగమించి.. మొదటి స్థానాన్ని ఆక్రమించింది భారత్… మరోవైపు.. చైనాలో జనాభా తగ్గిపోతుండటం, భారత్ లో పెరుగుతుండటం బట్టి పరిశీలిస్తే.. చైనా జనాభా కంటే భారత్ లో జనాభా భారీ సంఖ్యలో పెరగనుంది.. నిన్నమొన్నటి వరకు జానాభా అంటే చైనానే గుర్తుకొచ్చే ప్రపంచదేశాలకు ఇక ఇప్పటి నుంచి జనాభా అంటే భారత్.. అని గుర్తుకు వస్తుందనడంలో ఎలాంటి సందేహం ప్రపంచంలోనే అత్యధిక జనాభా దేశంగా భారత్‌లేదు. అత్యధిక మానవ వనరులు కలిగిన దేశం అన్ని రంగాలలో దూసుకెళ్లేందుకు ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ప్రపంచంలోనే అగ్రదేశంగా భారత్ ఎదిగేందుకు దేశ జనాభా ఎంతో కీలకం కానుంది..
జనాభాలో అగ్రస్థానంలో ఉన్న చైనాను భారత్ అధిగమించింది.. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి అధికారికంగా వెల్లడించింది.. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా భారత్ రికార్డ్క్రి యేట్ చేసింది..