కేజీఎఫ్…ఇండియాలో మాస్ సినిమాలకు బ్రాండ్ అంబాసిటర్ లాంటి సినిమా. యష్ క్యారెక్టర్ కు ఇచ్చిన ఎలివేషన్స్ ఓవర్ గా అనిపించినా అవే సినిమాకు ప్రధాన బలంగా నిలిచి హైలైట్ అయ్యాయి. ప్రేక్షకులని థియేటర్లకు మళ్లీ మళ్లీ రిపీటెడ్ గా రప్పించాయి. ఇప్పుడు ఇదే ఫీవర్ టాలీవుడ్ కు పట్టుకుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
మాస్ సినిమాలు అంటే.. ప్రస్తుతం టాలీవుడ్ లో బాలయ్యనే గుర్తుకు వస్తాడు. ఆ తర్వాత చిరంజీవి, ఎన్టీఆర్, రవితేజ ముందు వరుసలో ఉన్నాయి. ఈ సంక్రాంతికి విడుదలైన సినిమయాలు ‘వాల్తేరు వీరయ్య’, వీర సింహారెడ్డి. డైరెక్టర్ గోపిచంద్…స్వతహాగా బాలయ్యకు వీరాభిమాని కావడంతో ఎక్కడా లేపాలో అక్కడ లేపుతూ బాలయ్య కనిపించిన ప్రతీ సీన్ లోనూ వీర ఎలివేషన్స్ ఇచ్చాడు.
యాక్షన్ ఘట్టాల్లో ఈ ఎలివేషన్స్ పీక్స్ కి చేరుకుని ఎలివేషన్ కి పరాకాష్టగా మారాయి. ఓ దశలో ఏం ఎలివేషన్ లు రా బాబూ అని అనుకునేంతగా వున్నాయనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.ఇక చిరు నటించిన ‘వాల్తేరు వీరయ్య’ జనవరి 13న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘ఆచార్య’తో డిజాస్టర్ ని దక్కించుకున్న చిరు ఆ తరువాత ‘గాడ్ ఫాదర్’తో ఫరవాలేదనిపించారు.
అయితే ఈ సారి బాక్సాఫీస్ ని రప్ఫాడించాలని గట్టిగా నిర్ణయించుకున్న చిరు తనకు వీరాభిమాని అయిన బాబి డైరెక్షన్ లో ఈ మూవీ చేశాడు. ఇంకే ముందు ఓ అభిమాని చిరుతో సినిమా చేస్తే ఎలా వుంటుంది?.. ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా వుంటుంది. సరిగ్గా బాబి ‘వాల్తేరు వీరయ్య’ సీన్స్ ని యాక్షన్ ఘట్టాలని చిరు ఎంట్రీని అదే స్థాయిలో డిజైన్ చేశాడు.
చిరు క్యారెక్టర్ కు ప్రతీ సీన్ లోనూ ఓ రేంజ్ ఎలివేషన్స్ ఇస్తూ పోయాడు. ఫ్యాన్స్ కి ఓకే కానీ సాధారణ ప్రేక్షకుడికి మాత్రం ఈ ఎలివేషన్ లు ఈజీగా తెలిసిపోతూ కొంత ఇబ్బందికరంగా.. మరీ ఓవర్ గా లేదూ అనే విధంగా మారుతాయి. సరిగ్గా సాధారణ ప్రేక్షకుడు కూడా ‘వాల్తేరు లోని ఎలివేషన్స్ చూసి ఇలాగే పీలవుతున్నాడట. ‘కేజీఎఫ్’లో ఎలివేషన్స్ వున్నాయి. కానీ అతిగా ఎక్కడా కనిపించలేదు.
కొన్ని చోట్ల అనిపించే లోపే సీన్ అయిపోవడం.. అందుకు తగ్గ లీడ్ ని దర్శకుడు బలంగా చూపించడంతో సినిమాలో ఒకటి అర వంటివి అతిగా అనిపించి వుండొచ్చు. కానీ వాల్తేరు వీరయ్య ,వీర సింహారెడ్డి సినిమాల్లో ఎలివేషన్స్ చాలా వరకు అతిగానే అనిపించి సాధారణ ప్రేక్షకుడికి విసుగు తెప్పించాయనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.
ఒక విధంగా చెప్పాలంటే ఈ రెండు సినిమాల డైరెక్టర్లు ఎలివేషన్స్ విషయంలో ‘కేజీఎఫ్’ని ఫాలో అయినట్టుగానే కనిపించిందనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. బాహుబలి, RRRలో హీరోల ఎలివేషన్స్ వున్నా అవి ఆ కథలకు నచ్చాయి. అందుకే ఎవరూ వాటిని అతిగా ఫీలవ్వలేదు. కానీ వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాల్లో ఎలివేషన్స్ చాలా వరకు అతిగా వుండటం గమనార్హం. అయితే ఇవన్నీ పక్కన పెడితే ఈ రెండు సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచి భారీ వసూళ్ల దిశగా పయనిస్తుండటం విశేషం.