Homeఅంతర్జాతీయంభారత్, పాక్ ల మధ్య యుద్దాలు !!!

భారత్, పాక్ ల మధ్య యుద్దాలు !!!

భారత్, పాక్ లు అణుయుద్దానికి సిద్దమైంది ఎప్పుడు..?

మైక్ పాంపియో తాను రాసిన పుస్తకంలో ఏ ఘటన తర్వాత భారత్, పాక్ లు అణుయుద్దానికి సిద్దమయ్యాయని పేర్కొన్నారు..?

ఆ పుస్తకంలోని సంచలన విషయాలు ఏంటి…?

భారత్, పాకిస్తాన్ ఒక దశలో అణుయుద్ధానికి దిగేందుకు సిద్ధమయ్యాయని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తాను రాసిన పుస్తకంలో వెల్లడించారు.. 2019లో పుల్వామాలో జరిగిన దాడిలో సుమారు 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు చనిపోయారు. దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ భూభాగంలోని మిలిటెంట్ స్థావరాల మీద భారత్ వైమానిక దాడులు చేసింది. ఆ సందర్భంగా భారత సైన్యానికి చెందిన రెండు యుద్ధ విమానాలను కూల్చి వేసినట్లు పాకిస్తాన్ తెలిపింది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్తమాన్‌ నాడు పాకిస్తాన్ బలగాలకు బంధీగా చిక్కారు. ఈ ఘర్షణల నేపథ్యంలో రెండు దేశాలు అణుదాడులు చేసేందుకు సిద్ధమయ్యాయని పాంపియో అభిప్రాయపడ్డారు..

భారత్, పాకిస్తాన్‌ ల మధ్య కశ్మీర్ వివాదం ఎన్నో దశాబ్దాల నుంచి నడుస్తోంది.కశ్మీర్ లోయలో వేర్పాటు వాద మిలిటెంట్లను పాకిస్తాన్ పోషిస్తుందని భారత్ ఎంతో కాలంగా ఆరోపిస్తుంది. ఈ ఆరోపణలను ఇస్లామాబాద్ ఖండిస్తోంది. 1947 నుంచి ఈ రెండు అణు దేశాలు మూడు సార్లు యుద్ధానికి దిగాయి. ఈ యుద్ధాలన్ని కశ్మీర్‌ ప్రాంతం గురించే జరిగాయి. ‘నెవర్ గీవ్ ఆన్ ఇంచ్: ఫైటింగ్ ఫర్ ది అమెరికా ఐ లవ్’ పేరుతో పాంపియో ఈ పుస్తకం రాశారు.

భారత్ – పాకిస్తాన్ దేశాలు ఫిబ్రవరి 2019లో అణు యుద్ధానికి ఎంత చేరువలోకి వచ్చాయన్న విషయం ప్రపంచానికి సరిగ్గా తెలియదని తానుఅనుకుంటున్నట్టు పాంపియో తన పుస్తకంలో చెప్పారు. ఇదే నిజం, కానీ, నాకు దీనిపై సరైన సమాధానం తెలియదు. నాకు తెలిసిందల్లా రెండు దేశాలు అణు యుద్ధానికి చాలా దగ్గరగా వచ్చాయి’’ అని రాశారు.

హనోయ్ సదస్సులో ఉన్నప్పుడు రాత్రి పూట జరిగిన ఆ చర్చలను తానసలు మర్చిపోనని పాంపియో తెలిపారు. ఆ సమయంలో కశ్మీర్‌ విషయంలో భారత్, పాకిస్తాన్‌ లు తీవ్ర హెచ్చరికలు చేసుకోవడం ప్రారంభించాయని, మరోవైపు అణు ఆయుధాలపై ఉత్తర కొరియన్లతో చర్చలు జరుగుతున్నాయని పాంపియో వెల్లడించారు..‘ఇస్లామిస్ట్ ఉగ్ర దాడిలో భారతీయ సైనికులు 40 మందికి పైగా చనిపోయిన తర్వాత పాకిస్తాన్‌ ‌కు వైమానిక దాడులతో భారత్ సమాధానం చెప్పిందని పాంపియో తను రాసిన పుస్తకంలో అభిప్రాయపడ్డారు.. ఆ తర్వాత పాకిస్తానీలు భారత యుద్ధ విమానాన్ని కూల్చేసి, పైలట్‌ను బంధించారు’ అని ఆయన రాశారు.

పేరు చెప్పని భారత ప్రతినిధితో హనోయ్ నుంచే తాను మాట్లాడినట్టు పాంపియో తెలిపారు. యుద్ధం చేసేందుకు అణు ఆయుధాలను పాకిస్తాన్ సిద్ధం చేయడం
ప్రారంభించిందని ఆయన చెప్పారని…. పాకిస్తాన్ అణ్వాయుధాలను తట్టుకునేందుకు వారు కూడా సిద్ధమవుతున్నట్టు తెలిపారు’’ అని పాంపియో వెల్లడించారు.. తొందరపడకండి…. పరిస్థితిని చక్క దిద్దేందుకు ఒక నిమిషం సమయం ఇవ్వాలని కోరాను’’ అని పాంపియో తన పుస్తకంలో పేర్కొన్నారు. ఆ తర్వాత అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్‌ తో కలిసి ఆ విషయం మీద పనిచేసినట్టు వెల్లడించారు..

‘ఆ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావెద్ బజ్వాకు ఫోన్ చేశాను. కానీ అది అబద్ధమని ఆయన అన్నారు.భారత్ అణు ఆయుధాలను సిద్ధం చేస్తూ ఉండొచ్చని ఆయన వెల్లడించారు.. కొన్ని గంటలు పని చేసిన మా బృందం, అణు ఆయుధాలను వాడకుండా రెండు దేశాలను ఒప్పించగలిగాయి. ఆ రాత్రి అత్యంత ప్రమాదకర ఘటన జరగకుండా ఆపేందుకు మేం చేసిన పనిని, మరే దేశం చేసేది కాదు’ అని పాంపియో రాశారు.పాంపియో వ్యాఖ్యలను ఇటు భారత్‌ కానీ, అటు పాకిస్తాన్ కానీ ఖండించలేదు. 2019లో భారత సైనికులపై జరిపిన దాడిని పాకిస్తాన్‌లోని జైష్-ఈ-మహమ్మద్ జరిపినట్టు ప్రకటించుకుంది. దానికి ప్రతీకారంగా పాకిస్తాన్‌లోని మిలిటెంట్ల మీద దాడులు చేసినట్లు భారత్ ప్రకటించింది..

1947 లో దేశ విభజన తరువాత భారతదేశం, పాకిస్తాన్‌ల మధ్య అనేక యుద్ధాలు ఘర్షణలూ జరిగాయి. 1971 యుద్ధాన్ని మినహాయించి మిగిలిన ప్రధాన ఘర్షణలన్నిటికీ కాశ్మీర్ సమస్య, సరిహద్దు దాటి వస్తున్న ఉగ్రవాదమే ప్రధాన కారణాలు. 1971 యుద్ధం ఆనాటి తూర్పు పాకిస్తాన్‌ను విముక్తి చేసేందుకు భారత్ చేసిన ప్రయత్నం వల్ల జరిగింది. 2016 సెప్టెంబరు 29 న పాక్ ఆక్రమిత కాశ్మీరులోని ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లపై వ్యతిరేకంగా భారత్ జరిపిన “సర్జికల్ స్ట్రైక్స్” తో ఇరుదేశాల మధ్య సరిహద్దు ఘర్షణ మొదలైంది.

దాడి జరిగిందనే భారత ప్రకటనను పాకిస్తాన్ తోసిపుచ్చింది. భారత దళాలు నియంత్రణ రేఖను దాటలేదని, సరిహద్దు వద్ద పాకిస్తాన్ దళాలతో ఘర్షణలు మాత్రమే జరిగాయని, దీని ఫలితంగా ఇద్దరు పాకిస్తాన్ సైనికులు మరణించారని, తొమ్మిది మంది గాయపడ్డారనీ పాకిస్తాన్ ప్రకటించింది. భారతదేశం ప్రకటించిన ఇతర మరణాలను పాక్ తోసిపుచ్చింది. ఈ ఘర్షణల్లో కనీసం 8 మంది భారతీయ సైనికులు మరణించారని, ఒకరు పట్టుబడ్డారని పాకిస్తాన్ వర్గాలు నివేదించాయి.భారతదేశం తన సైనికులలో ఒకరు పాకిస్తాన్ అదుపులో ఉన్నట్లు ధృవీకరించారు, కాని అతడికి ఈ సంఘటనతో సంబంధం లేదని చెప్పింది.

తమ సైనికులలో ఎవరూ మరణించలేదని కూడా భారత్ చెప్పింది. యురి వద్ద భారత సైన్యంపై సెప్టెంబరు 18 న జరిపిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ ఈ సర్జికల్ స్ట్రైక్స్ జరిపింది. ఆ ఉగ్రవాద దాడిలో 19 మంది సైనికులు మరణించారు. ఆ తరువాత కొన్ని నెలల పాటు సరిహద్దులో కాల్పులు కొనసాగాయి. రెండు వైపులా డజన్ల కొద్దీ సైనికులు, పౌరులూ మరణించారు.

2019 ఫిబ్రవరి 14 న, పుల్వామాలో భారత సైనిక కాన్వాయ్‌ పై జరిగిన పుల్వామా దాడిలో, 40 మంది భారతీయ సైనికులు మరణించారు. పాకిస్తాన్ ఆధారిత, ఉగ్రవాద సంస్థ జైష్-ఇ-మొహమ్మద్ తామే ఈ దాడి చేసామని ప్రకటించింది. దీనికి ప్రతీకారంగా, 2019 ఫిబ్రవరి 26 న భారత మిరాజ్ 2000 యుద్ధవిమానాలు నిర్వహించిన ఖైబర్ ఫక్తూన్వా ప్రాంతం లోని బాలకోట్‌ లోని తీవ్రవాద శిక్షణ శిబిరంపై వైమానిక దాడులు జరిపింది.

జైషె మొహమ్మద్‌కు చెందిన చాలా మంది ఉగ్రవాదులను చంపినట్లు భారతదేశం పేర్కొంది.. అయితే, పాకిస్తాన్ మాత్రం, తమ వైమానిక దళం భారత విమానాలను అడ్డగించిందని, దీనితో దాడి చేసే విమానాలు హడావుడిగా తమ బాంబులను బాలకోట్ సమీపంలో ఒక చెట్ల ప్రాంతంలో జారవిడిచాయనీ, అక్కడ నాలుగు పేలుళ్లు జరిగి కొన్ని కోనిఫర్‌ చెట్లకు నష్టం కలిగిందనీ వెల్లడించింది.. ఈ సంఘటనలు భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతను పెంచాయి. మరుసటి రోజు, పాకిస్తాన్ అధికారులు ప్రకటించారు.

పాకిస్తాన్ వాయుసేన కాశ్మీరులో వాయు దాడులు జరిపి, కనీసం ఒక భారతీయ విమానాన్ని కూల్చివేసి ఒక పైలట్‌ ను పట్టుకున్నట్లూ పేర్కొంది. పాకిస్తాన్ఆ క్రమిత కాశ్మీర్‌లో ఒక భారతీయ విమానం శిధిలాలు పడిపోయాయని, మరొకటి భారత భూభాగంలో కాశ్మీర్‌లో పడిందనీ పాకిస్తాన్ సైనిక అధికారులుపేర్కొన్నారు. కాశ్మీర్‌లో పాకిస్తాన్ వైమానిక దళం దాడులు జరిపినట్లు భారత అధికారులు ధృవీకరించారు. భారతదేశం ఒక పాకిస్తానీ F-16 విమానన్ని కూల్చివేసినట్లు పేర్కొన్నారు. F-16 ఉపయోగించే AIM-120 అమరాం క్షిపణి యొక్క అవశేషాలను కూడా ప్రదర్శించారు. ఇలా గతంలో అనేక దాడులు, ఘర్షణలు చోటుచేసుకోగా.. భారత్, పాకిస్తాన్ ఒక దశలో అణుయుద్ధానికి దిగేందుకు సిద్ధమయ్యాయని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తాను రాసిన పుస్తకంలో వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది.

Must Read

spot_img