దీనికి .. నంబి నారాయణ్ పై పెట్టిన కేసే కారణమా..? అసలు ఎవరీ నంబి నారాయణ్.. ఆయనపై కేసు కథేంటి..?
నంబి నారాయణ్.. ఇస్రో శాస్త్రవేత్త అయిన ఈయనపై నమోదైన కేసు ఏమిటి..? దీనిపై సుప్రీం ఇచ్చిన తాజా తీర్పు ఎందుకు చర్చనీయాంశం అవుతోంది..? భారత రాకెట్ చరిత్రలో ఈ కేసు కీలకంగా మారింది.
ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇస్రోలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న సమయంలో క్రయోజనిక్ ఇంజన్లను అభివృద్ధి చేస్తున్న ప్రఖ్యాత శాస్త్రవేత్త నంబి నారాయణ్ విదేశాలకు దేశ రహస్యాలు అమ్మేశారంటూ పోలీసులు ఆయనపై కేసు పెట్టారు. ఈ తప్పుడు కేసు కారణంగా ఆయన కెరీర్ నాశనం కావడంతో పాటు భారత దేశం రెండు దశాబ్దాల పాటు క్రయోజనిక్ ఇంజన్లను తయారు చేసే వీల్లేకుండాపోయింది. ఆ తర్వాత ఇది తప్పుడు కేసని తేలడంతో ఆయనకు క్లీన్ చిట్ లభించింది.
అయితే ఈ కేసులో కుట్రకు పాల్పడ్డ నలుగురు పోలీసు అధికారులపై సీబీఐ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తోంది. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ కేసులో అప్పట్లో కుట్రకు పాల్పడ్డ గుజరాత్ మాజీ డీజీపీ ఆర్బీ శ్రీకుమార్, రిటైర్డ్ ఇంటెలిజెన్స్ అధికారి జయప్రకాష్, మరో ఇద్దరు పోలీసు అధికారులు విజయన్, దుర్గాదత్ లు .. భారత్ కు క్రయోజనిక్ప రిజ్ఞానం అందకుండా చేయాలన్న విదేశీ కుట్రలో భాగస్వాములయ్యారని సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతోంది. దీంతో ఈ నలుగురుకేరళ హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు.
ఈ ముందస్తు బెయిల్ ను రద్దు చేసిన సుప్రీంకోర్టు ఈ కేసును తిరిగి కేరళ హైకోర్టుకే బదిలీ చేసింది.
నంబి నారాయణ్ కేసులో ఆయనపై కుట్రకు పాల్పడ్డ నలుగురు పోలీసు అధికారులు .. దేశానికి క్రయోజనిక్ పరిజ్ఞానం రెండు దశాబ్దాలు అందకుండా జరిగిన కుట్రలో భాగస్వాములైనట్లు సీబీఐ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులోనూ ఇదే వాదన వినిపించింది. సీబీఐ వాదనతో ఏకీభవించిన సుప్రీంకోర్టు..ఈ నలుగురు అధికారుల ముందస్తు బెయిల్ రద్దు చేసి నాలుగు వారాల్లోగా ఈ కేసును తేల్చాలని హైకోర్టుకు గడువిచ్చింది. మళ్లీ వీరి బెయిల్ దరఖాస్తులపై విచారణ జరపాలని, అయితే ఆ లోపు మాత్రం అరెస్టు చేయొద్దని సీబీఐకి సూచించింది.
1994లో క్రయోజనిక్ ఇంజిన్ తయారీకి సంబంధించిన కీలక పత్రాలను శాస్త్రవేత్త నంబి నారాయణ్ విదేశీయులకు అప్పగించారంటూ కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం న్యాయస్థానం ఈ కేసును కొట్టివేసింది. క్రయోజనిక్ ఇంజిన్ పనులు ఆలస్యం కావాలన్న విదేశీ కుట్రలో భాగంగానే కేరళ పోలీసులు నంబి నారాయణ్‌పై ఈ ఆరోపణలు చేశారంటూ సీబీఐ కేసు నమోదు చేసింది. అప్పటి పోలీసు అధికారులైన గుజరాత్ మాజీ డీజీపీ ఆర్.బి.శ్రీకుమార్, విశ్రాంత నిఘా అధికారి పి.ఎస్.జయ్‌ప్రకాశ్, ఇద్దరు పోలీసు అధికారులు ఎస్.విజయన్, థంపి ఎస్ దుర్గా దత్‌పై కేసులు పెట్టింది. అయితే వారికి కేరళ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
నంబి నారాయణ్‌పై కేసు పెట్టడం ద్వారా క్రయోజనిక్ ప్రాజెక్టు పనులు ఆగిపోయాయని, రోదసీ కార్యక్రమాలు ఒకటి, రెండు దశాబ్దాల పాటు వెనకబడ్డాయని సీబీఐ వాదించింది.
దీంతో హైకోర్టు తీర్పుపై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇది చాలా త్రీవమైన అంశమని, విదేశీ కుట్రలో భాగస్థులయి పోలీసులు ఇలా చేసి ఉండవచ్చని తెలిపింది. నిందితులకు బెయిల్ ఇస్తే.. విచారణకు ఆటంకం కలుగుతుందని పేర్కొంది. సీబీఐ అప్పీళ్లను అంగీకరించిన ధర్మాసనం ఈ కేసులో నిందితులకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తున్న్టట్లు పేర్కొంది. అయితే ముందస్తు బెయిల్ దరఖాస్తులపై కోర్టు తీర్పు వెలువరించేదాకా నిందితులను అరెస్టు చేయకుండా వారికి రక్షణ కల్పించింది. 1994లో నంబి నారాయణ్ .. ఇస్రోలో క్రయోజనిక్ రాకెట్ఇం జిన్ తయారీ ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తున్నారు. ఆ ఇంజిన్ తయారీకి సంబంధించిన సాంకేతికతను రష్యా నుంచి తీసుకురావడానికి ఆయన బాధ్యులుగా ఉన్నారు.
అయితే ఆయన పాకిస్తాన్‌కు రాకెట్ సాంకేతికతను అమ్మారని, మాల్దీవులకు చెందిన ఇద్దరు మహిళలు వేసిన హనీ ట్రాప్‌లో పడిపోయిన ఆయన్ను
పోలీసులు అరెస్టు చేశారని కథనాలు వెల్లువెత్తాయి. నంబి నారాయణ్ .. ఇస్రోలో విక్రమ్ సారాబాయి, సతీష్ ధావన్, అబ్దుల్ కలాం లాంటి ప్రఖ్యాత
శాస్త్రవేత్తలతో కలిసి పనిచేశారు. ఆయన ఇస్రోలో పనిచేయడం ప్రారంభించినప్పుడు, ఆ సంస్థ ఆరంభ దశలో ఉంది. అప్పట్లో సొంత రాకెట్ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ఎలాంటి ప్రణాళికలూ వేసుకోలేదు.
మన ఉపగ్రహాలను పంపేందుకు అమెరికా, ఫ్రాన్స్‌ల నుంచి రాకెట్లను దిగుమతి చేసుకునేవాళ్లం. కానీ, స్వదేశీ రాకెట్లను అభివృద్ధి చేసే ప్రాజెక్టులో నారాయణన్ కీలక బాధ్యతలు తీసుకున్నాక ప్రణాళిక అంతా మారిపోయింది. 1994లో తన జీవితం తలకిందులయ్యే వరకూ స్వదేశీ రాకెట్ల తయారీ కోసం ఆయన ఎనలేని కృషి చేశారు. ఇదిలా ఉంటే, వీసా గడువు ముగిసిన తర్వాత కూడా భారత్‌లోనే ఉన్నారంటూ మాల్దీవులకు చెందిన మహిళ మరియమ్ రషీదాను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కొన్ని వారాల తర్వాత ఆమె స్నేహితురాలు ఫయూజియ్యా హసన్‌ను కూడా అరెస్టు చేశారు. మాల్దీవులకు చెందిన ఆ మహిళలు గూఢచారులని, భారత రాకెట్ రహస్యాలను తస్కరించి దొంగచాటుగా పాకిస్తాన్‌కు అమ్ముతున్నారని, వారికి ఇస్రోలో పనిచేసే శాస్త్రవేత్తలు సహకరిస్తున్నారని పోలీసులుచెప్పినట్లు స్థానిక పత్రికలు రాశాయి. ఆ మహిళలు వేసిన వలలో పడిన శాస్త్రవేత్తల్లో నంబి నారాయణన్ కూడా ఉన్నారని అప్పుడు పోలీసులు ఆరోపించారు. భారత అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించారని, అవినీతికి పాల్పడ్డారని ఆయన మీద అభియోగాలు నమోదు చేశారు.
అక్రమ అరెస్టు వల్ల రాకెట్ ప్రాజెక్టుకు నష్టం జరిగిందని నంబి నారాయణన్ అంటున్నారు.
ఆ రాకెట్ రహస్యాలను ‘పేపర్ ద్వారా బదిలీ చేయడం సాధ్యం కాదని పోలీసులకు నారాయణన్ చెప్పారు. అదే విషయాన్ని ఆయన ఎప్పుడూ చెబుతూ వచ్చారు. వాస్తవానికి, అప్పటికి శక్తిమంతమైన రాకెట్ ఇంజిన్ల తయారీ కోసం క్రయోజెనిక్ టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు ఇంకా భారత్ తంటాలు పడుతోంది. అభియోగాలతో నారాయణన్ దాదాపు నెల రోజులు జైలుతో కలిపి 50 రోజుల పాటు బందీగా గడిపారు. ఆయన్ను పోలీసులు కోర్టుకు తీసుకెళ్లిన ప్రతిసారీ అనేక మంది జనాలు ఆయన గూఢచారి, దేశద్రోహి అంటూ పెద్దఎత్తున నినాదాలు చేస్తుండేవారు. కానీ, ఆయన అరెస్టు అయ్యాక నెల రోజుల తర్వాత ఆ కేసు కేరళ ఇంటలిజెన్స్ బ్యూరో నుంచి సీబీఐకు బదిలీ అయ్యింది.
ఇస్రోలో తాను చూస్తున్న వ్యవహరాలకు సంబంధించి ఎలాంటి సమాచారమూ బయటకు ఇవ్వలేదని నారాయణన్ సీబీఐ అధికారులకు స్పష్టం చేశారు. మీ మీద ఎందుకు కేసు పెట్టారో, పరిస్థితి ఇందాక ఎందుకు వచ్చిందో తెలియదని, మమ్మల్ని క్షమించండని ఓ విచారణాధికారి నారాయణ్ కు తెలిపారు. చివరికి, 1995 జనవరి 19న రాత్రి ఆయనకు బెయిల్వ చ్చింది. అనంతరం 1996లో సీబీఐ ఈ కేసులో డాక్టర్ నారాయణన్ నిర్దోషి అని ప్రకటించింది. కేరళ ప్రభుత్వ అప్పీల్ ను 1998లో సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆయనకు పరిహారం చెల్లించాలని 2001లో కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తప్పుడు కేసు బనాయించడంపైనా సమగ్ర విచారణ జరపాలని 2018లో సుప్రీంకోర్టు ఆదేశించింది. 2019లో నంబి నారాయణన్ భారత ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. నంబి నారాయణన్‌తో పాటు మరో ఐదుగురి మీద కూడా అభియోగాలు నమోదు చేశారు.వారందరూ నిర్దోషులేనని 1996లో సీబీఐ ప్రకటించింది. ఇస్రోకు చెందిన రహస్య పత్రాలను తస్కరించి పాకిస్తాన్‌కు చేరవేసినట్లు ఎలాంటి ఆధారాలు లేవని సీబీఐ అధికారులు స్పష్టం చేశారు.
క్రయోజెనిక్ ఇంజిన్లకు సంబంధించిన డ్రాయింగులేవీ చోరీకి గురికాలేదని ఇస్రో చేపట్టిన అంతర్గత దర్యాప్తులోనూ తేలింది. 1998లో నిర్దోషిగా తేలిన తరువాత డాక్టర్ నారాయణన్ మళ్లీ ఇస్రోలో చేరారు. అయినా, ఆయనకు ఇబ్బందులు తప్పలేదు. తనపై అక్రమంగా కేసును బనాయించి, వేధించిన కేరళ ప్రభుత్వంపై డాక్టర్ నారాయణన్ కేసు వేశారు. ఆయనకు రూ.50 లక్షల రూపాయలు పరిహారంగా చెల్లించాలని సుప్రీంకోర్టు 2018లో ఆదేశించింది. అయితే, తాను అనుభవించిన ‘బాధ’.. నగదు పరిహారంతో తీరిపోయేది కాదని, 50 లక్షలు కాదు.. ఐదు కోట్ల రూపాయలైనా ఆ గాయం మానిపోదు’ అని నారాయణన్ అన్నారు. ఆయనపై అక్రమ కేసు పెట్టడంలో కేరళ పోలీసుల పాత్రపై విచారణ జరపాలని 2018లో సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ విచారణలో ఏం తేలుతుందో చూసేందుకు నారాయణన్ ఆసక్తిగా ఉన్నారు. ఆయనపై తప్పుడు కేసు పెట్టడం వెనకున్న కారణమేంటన్నది ఇంకా మిస్టరీగానే ఉండిపోయింది.
క్రయోజెనిక్ రాకెట్ సాంకేతికత అభివృద్ధితో భారత్ ముందుకెళ్తుందన్న అక్కసుతో మరే శక్తి అయినా తనపై కుట్ర పన్నిందేమో అని డాక్టర్ నారాయణన్ అనుమానిస్తున్నారు.ఏదేమైనా, నా జీవితం, నాకున్న గౌరవం, ప్రతిష్ట, ఆనందాలు పోయాయి. అందుకు బాధ్యులైన వారు ఇంకా బయట తిరుగుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1994లో డాక్టర్ నారాయణన్‌ను కేరళ పోలీసులు అరెస్ట్ చేయటం వల్ల, రాకెట్లలో ఉపయోగించే క్రయోజనిక్
ఇంజన్లను దేశీయంగా అభివృద్ధి చేసే ప్రక్రియ రెండు దశాబ్దాల కాలం వెనుకబడిందని అంతరిక్ష శాస్త్రవేత్తలు చెబుతారు.
క్రయోజనిక్ ఇంజన్ల తయారీలో కీలక పాత్ర పోషించిన .. నంబి నారాయణ్ పై సుప్రీంకోర్టు .. కీలక తీర్పు వెలువరించింది. కానీ .. ఈ తీర్పు .. ఆయనకు కలిగిన మానసిక వేదనకు మాత్రం సమాధానం కాదన్నది విశ్లేషకుల వాదన. ఇదీ ఇవాల్టి ఫోకస్.. రేపటి ఫోకస్ లో మళ్లీ కలుద్దాం..