Homeఅంతర్జాతీయంపాకిస్థాన్‌కు సహాయం చేస్తున్న భారత్..

పాకిస్థాన్‌కు సహాయం చేస్తున్న భారత్..

మన దేశం విదేశీ పాలసీ మేరకు పొరుగు దేశాలు కష్టాలలో ఉంటే ఆదుకోవడం ప్రధానంగా ఉంటుంది. మొన్న శ్రీలంక, నిన్న బంగ్లాదేశ్, ఆపై నేపాల్ దేశాలకు భారత్ అన్ని విదాలుగా ఆదుకుంది. మరి ఇప్పుడు మరో పొరుగుదేశం కూడా కష్టాల సుడిగుండంలో చిక్కుకుని అన్నమో రామచంద్రా అంటోంది. ఈ విషయంలో భారత్ ఏమనుకుంటోంది.. ఇంత వరకూ సాయం అర్థించలేదు కానీ ఒకవేళ చేయి చాచి సహాయం చేయమని అడిగితే భారత్ ఎలా స్పందించనుందన్న విషయం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈ విషయంపై చర్చ మొదలైంది. పాము లాంటి పాకిస్తాన్ కు సాయం కాదు కదా దగ్గరకు కూడా రానీయవద్దని చెప్పేవాళ్లే ఎక్కువయ్యారు. కానీ పొరుగుదేశాలు దారిద్ర స్థితిలో ఉంటే ఆ ప్రభావం పక్క దేశాలపైన కూడా పడుతుంది.

అందుకే తోచిన సహాయం చేయడం మన దేశానికి మొదటి నుంచి అలవాటు. ఇప్పటికే పాకిస్తాన్ లో జర్నలిస్టులు మీడియాలు ఈ విషయంపై షెహబాజ్ షరీఫ్ కు ఈ విధమైన సూచనలు చేస్తున్నాయి. యూట్యూబ్ జర్నలిస్టులైతే ‘భారతదేశాన్ని సహాయం అడగండి ప్రస్తుతం పాకిస్తాన్ కు సహాయం అందించగల ఏకైక దేశం భారత్ మాత్రమేనని ప్రధానికి సలహాలనిస్తూ స్టోరీలు చేస్తున్నాయి.

హబాజ్ షరీఫ్ ప్రపంచంలోని అన్ని దేశాలకు పర్యటనలకు వెళుతున్నారు కానీ పక్కనే ఉన్న భారతదేశానికి ఎందుకు వెళ్లలేకపోతున్నారని పాక్ మీడియా ప్రశ్నిస్తోంది. ఇన్నాళ్లూ సాయం అందించిన అమెరికా చైనాలు ఆర్థికపరంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటున్నాయి కాబట్టి ఈ దేశాలు పాకిస్తాన్ కు అప్పు ఇచ్చే స్థితిలో లేవు. కనీసం భారత ప్రధాని నరేంద్రమోదీని అభ్యర్థించవచ్చు కదా అంటూ ప్రముఖ పాకిస్తాన్ జర్నలిస్టు ఆర్జూ కాజ్మీ సూటిగా తన న్యూస్ చానెల్ లో షెహబాజ్ ని ప్రశ్నించారు. ఆర్జూ కాజ్మీ అనే ఈ మహిళా జర్నలిస్టు ఇస్లామాబాద్ కేంద్రంగా యూట్యూబ్ న్యూస్ చానెల్ నడిపిస్తున్నారు. చాలా సూటిగా పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితుల మీద రోజూ విశ్లేషణలు చేస్తుంటారు.

గోధుమ పిండి మైదా పిండి పది కిలోల బస్తాకు 3వేల 100 రూ.లు పలుకుతోంది. అది కూడా బ్లాక్ మార్కెట్ లో మాత్రమే లభిస్తోంది. మరోవైపు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అయితే నేరుగా ప్రధాని షెహబాజ్ షరీఫ్ పై విమర్షల వర్షం కురిపిస్తున్నారు. కటోరా తీసుకుని దేశాలకు బిక్షాటనకు వెళుతున్నారని విమర్షిస్తున్నారు. పాకిస్తాన్ లో ఇంతటి స్థితికి మరో కారణం అక్కడి సైన్యం అని చెబుతున్నారు.

ఎందుకంటే పాకిస్తాన్ దేశపు బడ్జెట్ లో 17శాతం నేరుగా సైన్యానికి కేటాయించబడుతుంది. రూపాయి ఆదాయం వస్తే అందులో 17 పైసలు సైన్యం జేబులోకి వెళితే ఆ దేశం ఎప్పుడు నిలదొక్కుకుంటుంది..? అని ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు. దానికి తోడు సంవత్సరం మధ్యలో ఏదో కారణం చూపి మూడు నుంచి నాలుగు శాతం అదనంగా బలవంతంగా లాక్కుంటుంది సైన్యం. అక్కడ సైన్యం దాదాగిరి నెక్స్ట్ లెవెల్లో సాగుతోంది.

ఒకవేల తమ మాట వినని ప్రధాని ఎవరన్నా ఉంటే వాళ్లను బెదిరించి మరీ రాజీనామా చేయిస్తుంది. అదనపు బడ్జెట్ ఇవ్వడానికి ఇమ్రాన్ ఖాన్ నిరాకరించడానే కారణంతో గద్దె దించారని సమాచారం. సైన్యానికి 17 శాతం పోను మిగిలింది అధికారంలో ఎవరు ఉన్నా అడ్డు అదుపు లేని అవినీతి చేస్తూ తినేస్తుంటారు. చివరకు ఇమ్రాన్ ఖాన్ పైన కూడా అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి.

పాకిస్తాన్ లో సైనిక జనరల్స్ అయినా మాజీ ప్రధానులైనా అందరికీ బ్రిటన్ గల్ఫ్ దేశాల బ్యాంకులలో అకౌంట్లు ఉన్నాయి. అపారమైన ఆస్థులున్నాయి. ఓ మోస్తరు సంపాదన చేతికందగానే వారంతా పాకిస్తాన్ వీడి లండన్, దుబాయ్ లలో స్థిరపడిపోతున్నారు. వీళ్లు చేసిన అప్పులు చెల్లించాల్సింది మాత్రం ఎటూ వెళ్లలేని దేశ ప్రజలు మాత్రమే. చైనా తప్ప పాకిస్తాన్ లో పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేసేందుకు ఏ దేశమూ ముందుకు రాదు. కారణం అక్కడ మతపరమైన ఉగ్రవాదం రాజ్యమేలుతోంది.అందుకే విదేశీ పెట్టుబడులు దాదాపు శూన్యమనే చెప్పాలి.

  • ఇప్పటికైనా మించిపోయింది లేదు భారత్ తో చేతులు కలపండని ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు యూఏఈ కూడా సలహా ఇస్తోంది..

ఇంతకీ పాకిస్తాన్ కు ఎవరు సహాయం చేస్తారు..? అందరికీ వెంటనే వచ్చే అనుమానం..ఓ శత్రుదేశానికి సాయం ఎలా చేయడం..? మరి ఇజ్రాయెల్ చేయనుందా అంటే దానికీ ఓ ఫిటింగ్ ఇదివరకే ఉంది. పాకిస్తాన్ ద్రుష్టిలో ఇన్నాళ్లూ అసలు ఇజ్రాయెల్ అనే దేశమే లేదు. కాబట్టి సాయం అటు నుంచి రాదు. మరి ఫ్రాన్స్ చేస్తుందా అంటే..ఫ్రాన్స్ లో ఎవరో మతపరమైన కార్టూన్ వేసారని ఆ దేశపు జండాను తగలబెట్టడంతో పాటు ఫ్రాన్స్ రాయబారిని తన్ని తరిమినంత పనిచేసారు పాకిస్తాన్ ప్రజలు.

మరి అమెరికా ఎందుకు ముందుకు రావడం లేదు అనే అనుమానం రావచ్చు..కానీ పోయిన ప్రభుత్వం అమెరికా మీద నిందలు వేసి తమ దేశం మీద కుట్రలు చేస్తోందని పాక్ ప్రజలకు విద్వేషం నూరిపోసింది. అలాంటప్పుడు అమెరికా కూడా ఇప్పుడు సాయానికి ముఖం చాటేస్తోంది. గల్ఫ్ దేశాలు ఇప్పటికే సాయం చేసీ చేసీ అలసిపోయాయి. ఇక మా వల్ల కాదని చెబుతున్నాయి. పెట్టుబడులు పెట్టడానికి సిధ్దంగా ఉన్నాయి తప్ప అప్పు ఇవ్వడానికి కుదరదని ముందే చెప్పేసాయి. ఇకపోతే మిగిలింది ఐఎంఎఫ్..అప్ప ఇవ్వడానికి ఐఎంఎఫ్ రెడీగా ఉంది. కానీ షరతులు మాత్రం కఠినంగా భారీగా ఉంటాయి.

ఇప్పటికే పెంచిన పన్నులు కాకుండా ఇంకా పెంచితేనే అప్పు ఇస్తానంటోంది. అది కూడా స్పెషల్ పర్పస్ వెహికిల్ మీద మాత్రమే అంటోంది..అంటే ఒక పనికి ఎంత ఖర్చయింది..ఖర్చు చేసింది వాస్తవమేనా..? అని ప్రతీసారి పరిశీలించి వాయిదాలతో మాత్రమే ఇవ్వనుంది. ఎందుకంటే దేనికోసం అప్పు తీసుకుంటున్నదో దాని కోసమే ఖర్చు చేయాలి. ఇది పాకిస్తాన్ కు ఏ మాత్రం నచ్చడం లేదు. అప్పు ఇలా పుట్టగానే అలా విదేశాలకు తరలించడం అక్కడి నాయకులకు చాలా పాత అలవాటు. అంతే కానీ ఇతర దేశాల పాతబాకీలు తీర్చడానికి అప్పు ఇవ్వను గాక ఇవ్వనని భీష్మించుకుని కూర్చుంది. అందుకే ఇప్పుడు షెహబాజ్ షరీఫ్ పన్నులు పెంచుతూ ధరలు ఆకాశాన్నంటేలా పెంచుతున్నారు.

ఇక అన్ని సమయాలలో వెంట ఉండి సమర్థించే తుర్కియే తానే ఫాటాఫ్ బ్లాక్ లిస్టులో ఉంది. కానీ భారత్ కు వ్యతిరేకంగా కశ్మీరు గురించిన స్టేట్మెంట్లు చేయడానికి మాత్రమే సాయం అందిస్తోంది. కశ్మీరు విషయంలో పాకిస్తాన్ యుధ్దం చేయాల్సి వస్తే తన కిరాయ సైనికులను పంపించే విషయంలో పాకిస్తాన్ కు మాట ఇచ్చింది. అయితే పాకిస్తాన్ లో ఉన్న స్థితిని బట్టి చూస్తే అక్కడి రాజకీయనాయకులు సాయం అడిగితే అందే అవకాశం లేదు.

ఉండదు.. అడిగితే పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు అడగాలి. అప్పుడు సాయం చేయాలా వద్దా అని ప్రధాని మోదీ ఆలోచించాలి. భారత్ తో ద్వైపాక్షిక వాణిజ్యం మీద నిషేధం విధించింది పేరుకు ఇమ్రాన్ ఖానే అయినా వెనుక ఉండి చేయించింది సైన్యాధిపతి జనరల్ బజ్వా మాత్రమే. మరి ఇప్పుడు ఈ స్థితిలో పాకిస్తాన్ కు ఎవరు సాయం చేయాలని అంటే శత్రువైనా కష్టాల్లో ఉంటే గేలి చేయక ఆదుకొనే స్వభావం భారతీయుల రక్తంలోనే ఉంది.

మన వివాదం పాలకులతోనే కానీ… ఆ దేశ సామాన్య ప్రజలతో కానే కాదు. ఉభయ దేశాల్లో ఉన్న వివిధ రంగాల నిపుణులను, కార్మికులను, వెరసి మానవవనరులను ఉభయతారకంగా సద్వినియోగం చేసుకుందామని, తద్వారా తమ దేశానికి ఎక్కువ మేలు కలుగుతుందని ఆ దేశ ప్రధాని మన ముందు ఉంచుతున్నారు. ఆ దేశంతో ఎప్పుడు ఎలా నడవాలో ఈపాటికే మనకు అర్ధమైంది.

మానవత్వాన్ని చాటుకుంటూనే ఆ దేశంతో పరమ వివేక శోభితంగా, రాజనీతి, యుద్ధనీతితో నడవాల్సి వుంది. పాలకుల అకృత్యాలు ఎలా ఉన్నా మానవీయ కోణంలో తోటి మనిషి పట్ల సానుభూతి, ప్రేమ ఎవరికైనా ఉండాలి. శాంతికాముక దేశమైన భారత్ కు ఎప్పుడూ ఉంటాయి. అప్పుడు హెపటైటిస్ వ్యాధి ప్రబలినప్పుడు, నిన్న కరోనా కబళిoచిన వేళ కూడా మన దేశం సాయం అందించి పెద్దమనసు చాటుకుంది.

Must Read

spot_img