ప్రంపచ క్రికెట్ అభిమానులు ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న వుమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం మొదలైంది. ముంబై లోని జియో కన్వెన్షన్ సెంటర్ లో వేలం కొనసాగుతుంది. స్మృతి మంధాన కోసం.. ముంబయి- ఆర్సీబీ జట్లు పోటీపడ్డాయి.చివరికి 3.40 కోట్లకు ఆర్సీబీ దక్కించుకుంది. మొత్తం 409 మంది క్రికెటర్లు వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో భారత్ నుంచి 246 మంది ప్లేయర్లు ఉండగా.. విదేశీ జట్ల నుంచి 163 మంది ఉన్నారు. మెుత్తం 90 మంది కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్‌సీబీ, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ జట్లు పోటీ పడుతున్నాయి. రు.18 కోట్ల రూపాయలకు భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అమ్ముడైనారు. భారత్ మహిళా జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌ను ముంబై ఇండియన్స్ టీమ్ రు.1.80 కోట్లు దక్కించుకుంది. 2016 నుంచి భారత మహిళా జట్టుకు నాయకత్వం వహిస్తున్న హర్మన్ ప్రీత్ కౌర్ కోసం అన్ని ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. చివరికీ ముంబై ఇండియన్స్ తమ సొంతం చేసుకుంది.
భారత క్రికెట్ నియంత్రణ మండలి మహిళల ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను ప్రకటించింది. లీగ్‌లోని 5 ఫ్రాంచైజీలను ఈరోజు బోర్డు ప్రకటించింది. ఇందులో అహ్మదాబాద్ పేరు మీద అత్యధిక బిడ్ వచ్చింది. అదానీ స్పోర్ట్స్‌లైన్ అహ్మదాబాద్ ఫ్రాంచైజీని రూ.1289 కోట్లకు కొనుగోలు చేసింది. పురుషుల ఐపీఎల్‌లోని 7 ఫ్రాంచైజీలలో, ముంబై ఇండియన్స్ జట్టు 919.22కోట్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 901కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్టు రూ.810కోట్లు, లక్నో రూ.757కోట్లకు కొనుగోలు చేశాయి. మొత్తంగా ఈ వేలం ద్వారా బీసీసీఐ రూ.4669.99 కోట్లు ఆర్జించింది.