HomePoliticsతెలంగాణలో టీఆర్ఎస్ కు, ఎంఐఎంకు విడదీయలేనంత సంబంధ బాంధవ్యాలున్నాయి..!

తెలంగాణలో టీఆర్ఎస్ కు, ఎంఐఎంకు విడదీయలేనంత సంబంధ బాంధవ్యాలున్నాయి..!

అయితే ఇప్పుడు కారుపార్టీ కాస్తా బీఆర్ఎస్ గా మారింది. ఈ తరుణంలో ఈ రెండు పార్టీల మధ్య స్నేహం పరిస్థితి ఏమిటన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందట. భారత రాష్ట్ర సమితి అధికారికంగా రిజిస్టర్ అయింది. జాతీయ స్థాయిలో రాజకీయాలు చేయాలని కేసీఆర్ డిసైడయ్యారు. కలసి వచ్చే వారినందర్నీ కలుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. కర్ణాటకలో జేడీఎస్ రూపంలో మిత్రపక్షం రెడీగా ఉంది.

ఇతర రాష్ట్రాల్లోని పార్టీలు కూడా బీఆర్ఎస్‌తో కలుస్తాయని కేసీఆర్ నమ్మకంగా ఉన్నారు. అయితే ఆయన సన్నిహిత మిత్రుడు, గతంలో కేసీఆర్ జాతీయ రాజకీయాల కూటమికి సహకారం అందించిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాత్రం ఈ కీలక పరిణామాల్లో ఎక్కడా కేసీఆర్ వెనుక కనిపించం లేదు. ఇదే అందరిలోనూ చర్చకు కారణం అవుతోంది.

ఇంతకూ బీఆర్ఎస్ కు ఓవైసీపీ మద్దతు ఉందా ? లేదా ?

భారత రాష్ట్ర సమితి విషయంలో మజ్లిస్ విధానం ఏమిటో ఇంకా స్పష్టత లేదు. తమిళనాడు నుంచి.. కర్ణాటక నుంచి.. పంజాబ్ నుంచి కూడా భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ కార్యక్రమానికి ప్రతినిధులు వచ్చారు కానీ..సొంత రాష్ట్రంలో అనధికారిక మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న మజ్లిస్ నుంచి మాత్రం ఎవరూ రాలేదు. దీంతో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ రాష్ట్రంలో ఎలా సహకరించినా జాతీయ స్థాయిలో మాత్రం తన దారిలో తాను నడవాలనుకుంటున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మజ్లిస్ అధినేత అధికారికంగా తెలంగాణలో ఎవరితోనూ పొత్తులు పెట్టుకోరు కానీ.. ఇతర రాష్ట్రాల్లో మాత్రం పొత్తులు పెట్టుకునే పోటీ చేస్తున్నారు. అలాంటప్పుడు బీఆర్ఎస్‌తో కలవడానికి ఆయనకు ఇబ్బందేమిటన్నది టీఆర్ఎస్ నేతలకూ అంతుబట్టని విషయం. హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతాన్ని పెట్టని కోటగా మార్చుకున్న మజ్లిస్ అధినేత అసదుద్దీన్కొ న్నాళ్లుగా ఇతర రాష్ట్రాలపై దృష్టి పెట్టారు. ఓట్లు చీల్చి బీజేపీకి మేలు చేస్తున్నారని ఎన్ని విమర్సలు వచ్చినా వెనక్కి తగ్గకుండా తనదైన శైలిలో ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి ఓటమి రుచి చూపించడంలో మజ్లిస్ ఓట్లే కీలకమయ్యాయి. అక్కడ మజ్లిస్ తరపున ఎమ్మెల్యేలు కూడా గెలిచారు.

బీహార్‌లోనూ గెలిచారు. అలా మజ్లిస్ ముద్ర ఇతర రాష్ట్రాల్లో కనబడుతున్న సమయంలో బీఆర్ఎస్ నీడలో ఎందుకని ఓవైసీ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే ఓవైసీకి కొన్ని మెరుగైన ఫలితాలతోపాటు చాలా చోట్ల కనీస ఓట్లు రాని పరిస్థితి కూడా ఉంది. అయినప్పటికీ ఓవైసీ ఏ మాత్రం నిరాశపడకుండా జాతీయ స్థాయిలో తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు.

అయితే మజ్లిస్ మద్దతు బీఆర్ఎస్ అధినేతకు ఖచ్చితంగా ఉంటుందని ఆ పార్టీ నేతలు నమ్మకంతో ఉన్నారు. వ్యూహాత్మకంగానే మజ్లిస్ ప్రజెన్స్ ఎక్కువగా బీఆర్ఎస్కా ర్యక్రమాల్లో కనబడకుండా చేస్తున్నారని చెబుతున్నారు. మజ్లిస్ అంటే పూర్తిగా ముస్లింలకే పరిమితమైన పార్టీ. హిందూత్వ రాజకీయాలు ఇప్పుడు జోరుగా నడుస్తున్నాయి. పొరపాటున మజ్లిస్ స్నేహ పార్టీగా ముద్ర పడితే.. బీఆర్ఎస్‌కు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని అంటున్నారు. అందుకే కేసీఆర్ దూరంగా ఉంచుతున్నారని.. అవసరమనప్పుడు కలుపుకుంటారని చెబుతున్నారు. మజ్లిస్ అధినేత తన పార్టీకి తెలంగాణలో నమ్మకంగా వచ్చే ఏడు సీట్లను కాకుండా ఈ సారి మరో మూడు, నాలుగు సీట్లను పెంచుకోవాలనుకుంటున్నారు.

ఇందు కోసం కొన్ని స్థానాలను ఎంపిక చేసుకుని కసరత్తు కూడా చేస్తున్నారు. ఇలాంటి సమయంలో.. బీఆర్ఎస్‌తో సన్నిహితంగా
ఉండటం కన్నా.. వీలైనంత దూరం మెయిన్ టెయిన్ చేయడం ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందవచ్చన్న వ్యూహం అమలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. దీంతో బీఆర్ఎస్ తో కలిసి మజ్లిస్ నడుస్తుందా అన్న సందేహాలు ఎక్కువగా వస్తున్నాయి. మజ్లిస్ అధినేత అధికారికంగా తెలంగాణలో ఎవరితోనూ పొత్తులు పెట్టుకోరు కానీ.. ఇతర రాష్ట్రాల్లో మాత్రం పొత్తులు పెట్టుకునే పోటీ చేస్తున్నారు.

అయినా బీఆర్ఎస్‌లో కలిసేందుకు అసదుద్దీన్ ఆసక్తి చూపించడం లేదు. పోటీచేసిన అన్ని సీట్లలో ఎంఐఎం అతి తక్కువ సంఖ్యలోనే సీట్లను గెలుచుకోగలుగుతుంది అనేకన్నా వేళ్లమీద లెక్కపెట్ట కలిగిన సీట్లనే గెలుచుకోగలుగుతోంది. గెలుపోటములకన్నా ఓట్ల చీలికపైనే ఆ పార్టీ దృష్టి పెడుతుండటంతో భారతీయ జనతాపార్టీకి లబ్ధి చేకూరుతోంది. వాస్తవానికి ఏపీలో పోటీకి అసదుద్దీన్ దూరంగా ఉంటూ వస్తున్నారు. అధికారంలో ఉన్న జగన్ తో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. మైనారిటీలంతా అసదుద్దీన్ కు మద్దతు పలికితే జగన్ నష్టం చేకూరుతుంది.

ముస్లిం, ఎస్సీ, ఎస్టీ ఓట్లు సాధించడానికి అసదుద్దీన్ తో కలిసి కేసీఆర్ భారత రాష్ట్ర సమితి తరఫున రాజకీయం చేయడానికి సిద్ధమవుతున్నారు..!

అయితే ఈ వర్గాలన్నీ ఏపీలో జగన్ కు మద్దతు తెలియజేస్తున్నారు. కేసీఆర్ కు, అసదుద్దీన్కు జగన్ సన్నిహితుడే కావడంతో వీరి రాజకీయం ఎలా ఉండనుందన్న ఉత్కంఠపై మున్ముందు ఒక స్పష్టత రాబోతోంది. అదే సమయంలో తెలంగాణలో మిత్రుడిగా ఉన్న ఎంఐఎంతో మాత్రం ఎక్కడా బహిరంగంగా పొత్తు పెట్టుకునే అవకాశాలు లేకపోవచ్చని కూడా టాక్ వెల్లువెత్తుతోంది.

టీఆర్ఎస్ తెలంగాణ దాటింది. బీఆర్ఎస్‌గా మారి దేశమంతా తిరగనుంది.మజ్లిస్ పాతబస్తీని దాటబోతోంది. ఇదే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కోపం తెప్పించదట. మజ్లిస్ పై గులాబీ బాస్ గుస్సా అయ్యారని ప్రచారం నడుస్తోంది. ఓల్డ్ సిటీ నుంచి ఎలా బయటకొస్తారు ఓవైసీ సాబ్ అని ప్రశ్నించారని టాక్ వినిపిస్తోంది. ఎంఐఎం పక్కా పాతబస్తీ పార్టీ. ఓల్డ్ సిటీలో ఈ పార్టీకి మంచి పట్టు ఉంది. చాలా నియోజకవర్గాల్లో ఈ పార్టీకి తిరుగులేదు. కొన్ని సెగ్మెంట్లలో బీజేపీ గట్టి పోటీనిచ్చినా చివరకు ఎంఐఎంనే విజయం వరిస్తుంది. ఉమ్మడి రాష్ట్రమైనా, తెలంగాణ వచ్చాక అయినా ఇదే దూకుడు కొనసాగిస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌కు మంచిస్నేహం ఉంది. ఎన్నికల్లో దోస్తీ కొనసాగుతూ వస్తుంది.

ఎంఐఎం నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ లైట్ తీసుకుంటుంది. ఒక వేళ పోటీ చేసినా నామమాత్రంగానే. అటు అసద్ కూడా ఓల్డ్ సిటీ దాటి ఎప్పుడు
తెలంగాణ జిల్లాలవైపు చూడలేదు. అక్కడక్కడ కార్పొరేషన్లలో పోటీ చేశారంతే..తెలంగాణలో అసెంబ్లీ స్థానాల్లో పోటీచేయలేదు.అన్నిచోట్ల టీఆర్ఎస్‌కే సహకరిస్తూ వచ్చారు. కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ , ఆదిలాబాద్ , వరంగల్ , మహబూబ్ నగర్ లాంటి జిల్లాల్లో పోటీ చేయాలని చూస్తుందట. ముస్లింలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపై ఎంఐఎం నజర్ పెట్టింది.

ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేయాలని డిసైడిందని టాక్. ఇదే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కోపం తెప్పించిందట. మజ్లిస్ పై గులాబీ బాస్ గుస్సాగా ఉన్నారట. కేసీఆర్‌ని కాదని ఎంఐఎం ఓల్డ్ నుంచి బయటకు వస్తుందా?పట్టున్న స్థానాల్లో పోటీ చేస్తుందా? అంటే చెప్పలేని పరిస్థితి. ఒకవేళ మజ్లిస్ ఆ జిల్లాల్లో పోటీ చేస్తే హిందూ సెంటిమెంట్ రగలుతుంది. బీజేపీకి ఆటోమేటిగ్గా లాభం కలుగుతుంది. టీఆర్ఎస్ ఓట్లు చీలే అవకాశమూ ఉంది. అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుంది.

ఇందులోనూ కమలానికి ప్లస్ అవుతుంది. అసలే తెలంగాణలో కమలం కాక మీద ఉంది. సందు దొరికితే దూసుకుపోతుంది. ఎంఐఎం తెలంగాణ జిల్లాల్లో పోటీ చేస్తే ఆ పార్టీకి కలిసి వస్తుంది. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంఐఎంపై గుస్సా అవుతున్నారట. ఇప్పటిదాకా ఎంఐఎం తెలంగాణలో అంతా ఫోకస్ చేయలేదు. మహారాష్ట్ర, యూపీ, బీహార్లాం టి రాష్ట్రాల్లో పోటీ చేసింది. పరోక్షంగా బీజేపీకి లాభం చేసింది. మొన్న గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో ఎంఐఎంకు తీవ్ర నిరాశే ఎదురైంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటుకు మాత్రం భారీగా గండి కొండి కొట్టింది. ఫలితంగా చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కొంప ముంచింది. తెలంగాణలో ఇలా జరగకూడదని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే ప్రస్తుతం మజ్లిస్ తో దూరం పాటిస్తున్నారన్న టాక్ చాప కింద నీరులా వినిపిస్తోంది.

మరి మజ్లిస్, బీఆర్ఎస్ కలిసి నడుస్తాయో లేదో తేలాలంటే, వేచి చూడాల్సిందే…

Must Read

spot_img