Homeఅంతర్జాతీయంఅమెరికాలో మహిళలు చట్టబద్ధంగా అబార్షన్ చేయించుకునే హక్కును కోల్పోయారు..!

అమెరికాలో మహిళలు చట్టబద్ధంగా అబార్షన్ చేయించుకునే హక్కును కోల్పోయారు..!

అమెరికాలో అబార్షన్ హక్కును అక్కడి సుప్రీం కోర్టు వెనక్కి తీసుకుంది.. అబార్షన్ ను చట్ట విరుద్దంగా పరిగణించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.. తాజాగా.. అన్ని రిటైల్ ఫార్మసీల్లో అబార్షన్ పిల్స్ విక్రయించేందుకు అనుమతి లభించింది. అమెరికాలోని అన్ని రిటైల్ ఫార్మసీల్లో ఇకపై అధికారికంగా అబార్షన్ పిల్స్‌ అందుబాటులోకి రానున్నాయా..? ప్రిస్క్రిప్షన్ చూపించి ఆ పిల్స్‌ కొనుగోలు చేయవచ్చా…? ఎప్పటి నుంచి ఫార్మసీలోఅబార్షన్ పిల్స్ అందుబాటులోకి రానున్నాయి..?

అమెరికాలో అన్ని రిటైల్ ఫార్మసీల్లో అబార్షన్ పిల్స్ విక్రయించేందుకు అనుమతి లభించింది. అమెరికాలోని ఫార్మసీల్లో ఇకపై అధికారికంగా అబార్షన్ పిల్స్‌ అందుబాటులోకి రానున్నాయి. ప్రిస్క్రిప్షన్ చూపించి ఆ పిల్స్‌ కొనుగోలు చేయవచ్చు. ఈ వారం నుంచే ఇది అమల్లోకి రానుంది. గతేడాది అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో అబార్షన్ చేయించుకోడాన్ని నిషేధించారు.

మరి కొన్ని రాష్ట్రాల్లో మాత్రం దీనిపై నిషేధం లేదు. ఫలితంగా…ప్రభుత్వం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంది. అబార్షన్ పిల్స్‌ విక్రయించేందుకు అనుమతినిచ్చింది. గతేడాది అమెరికా సుప్రీం కోర్టు అబార్షన్ రాజ్యాంగ హక్కు కాదని సంచలన తీర్పునిచ్చింది. అప్పటి నుంచి ఆ దేశంలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రస్తుతానికి రూల్స్‌లో మార్పులు చేర్పులు చేసి… రిటైల్ ఫార్మసీలు అబార్షన్ పిల్స్ విక్రయించేలా పర్మిషన్ ఇచ్చింది. మిఫెప్రిస్టోన్ పిల్‌ అమ్మేందుకు అనుమతినిచ్చింది. ఈ ట్యాబ్లెట్… గర్భం దాల్చకుండా అడ్డుకుంటుంది. అయితే.. గర్భం దాల్చిన 10వ వారంలో ఈ పిల్‌ వాడాలని సూచించింది. సుప్రీం కోర్టు తీర్పునిచ్చినప్పటి నుంచి బైడెన్ యంత్రాంగం ఈ హక్కుని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

గర్భం తొలగించుకోవాలని చూస్తున్న మహిళలకు ప్రస్తుత నిర్ణయం కాస్త ఊరటనిచ్చింది. అయితే..మెడికల్ కన్సల్టేషన్ లేకుండా మాత్రం ఈ పిల్స్‌ విక్రయించరు. కచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండాల్సిందే. గతంలో కేవలం కొన్ని స్పెషల్ డ్రగ్ స్టోర్స్‌లో మాత్రమే ఈ పిల్స్ అందుబాటులో ఉండేవి. ఇప్పుడు అన్ని రిటైల్ స్టోర్స్‌లోనూ ఉంటాయి. కనీసం రెండు రోజుల పాటు ఇవి వేసుకుంటేనే అబార్షన్ అవుతుందని వైద్యులు చెబుతున్నారు.

అమెరికా సుప్రీంకోర్టు గతేడాది జులైలో సంచలన తీర్పు ఇచ్చింది. ఇప్పటి వరకూ రాజ్యాంగ హక్కుగా ఉన్న అబార్షన్స్ చారిత్రక తీర్పు వెలువరించింది. చరిత్రాత్మక రో వర్సెస్ వేడ్ రూలింగ్ ను అమెరికా సుప్రీంకోర్టు ఉపసంహరించుకుంది. దీని ఫలితంగా అమెరికాలో ఇప్పటి వరకూ రాజ్యాంగ హక్కుగా ఉన్న అబార్షన్స్ ను సుప్రీంకోర్టు వెనక్కి తీసుకున్నట్లైంది.

అమెరికాలో అబార్షన్స్ ను రాజ్యాంగ హక్కుగా తొలగించాలన్న తీర్పుకు అనుకూలంగా ఆరుగురు న్యాయమూర్తులు ఓటు వేశారు. ముగ్గురు వ్యతిరేకంగా తీర్పు చెప్పారు. దీంతో అబార్షన్స్ పై అమెరికాలో నిషేధం పడింది. అమెరికా మహిళలు ఇప్పటి వరకూ రాజ్యాంగ హక్కుగా ఉన్న అబార్షన్స్ చట్టవిరుద్ధంగా పరిగణిస్తారు. ప్రత్యేకించి తెలుగు వాళ్లు ఎక్కువగా ఉండే టెక్సాస్ సహా పదమూడు రాష్ట్రాల్లో తక్షణమే లేదా నెలరోజుల్లో ఈ నిషేధం అమలు కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

  • అమెరికాలో లక్షలాది మంది మహిళలు చట్టబద్ధంగా అబార్షన్ చేయించుకునే హక్కును కోల్పోయారు… దాదాపు 50 ఏళ్ళ కిందట అబార్షన్‌ను దేశవ్యాప్తంగా చట్టబద్ధం చేస్తూ వెలువడిన తీర్పును అమెరికా సుప్రీం కోర్టు కొట్టి వేసింది.

రో వర్సెస్ వేడ్ కేసులో మహిళలకు అబార్షన్ హక్కును అనుమతిస్తూ వెలువడిన చరిత్రాత్మక తీర్పును సుప్రీం కోర్టు కొట్టివేసింది. దీనికి సంబంధించిన ఒక అధికార పత్రం లీక్ అయిన కొన్ని వారాల తరువాత ఈ నిర్ణయం వెలుగు చూసింది. ఈ తీర్పు అమెరికాలో అబార్షన్ హక్కులను పూర్తిగా మార్చేస్తుంది. ఈ తీర్పుతో అమెరికాలోని రాష్ట్రాలు తమ పరిధిలో అబార్షన్ పద్ధతులను నిషేధించగలుగుతాయి.

సగానికి పైగా రాష్ట్రాలు త్వరలోనే అబార్షన్‌ అనుమతులను కఠినతరం చేయడమో, నిషేధించడమో చేసే అవకాశం ఉంది.. ఇప్పటికే 13 రాష్ట్రాలు సుప్రీం కోర్టు తీర్పునకు ప్రతిస్పందనంగా అబార్షన్‌ను రద్దు చేసే చట్టాలను అమల్లోకి తెచ్చేందుకు నిర్ణయించాయి. మరికొన్ని రాష్ట్రాలు కూడా త్వరలోనే అబార్షన్‌లకు ప్రతికూలంగా నిర్ణయాలు ప్రకటించనున్నాయి.. మొత్తం 36 మిలియన్ల మహిళలు ఈ నిర్ణయంతో ప్రభావితం అవుతారని ప్లాన్డ్ పేరేంట్‌హుడ్ అనే సంస్థ పరిశోధనలో వెల్లడించింది.

15 వారాల గర్భం తర్వాత అబార్షన్‌‌పై మిసిసిపి విధించిన నిషేధాన్ని సవాలు చేసిన డాబ్స్ వర్సెస్ జాక్సన్ వుమెన్స్ హెల్త్ ఆర్గనైజేషన్ కేసును సుప్రీం కోర్టు పరిశీలిస్తోంది. ”గర్భస్రావం చేసే హక్కును రాజ్యాంగం ఇవ్వలేదని మేం భావిస్తున్నాం.

కాబట్టి అబార్షన్లను నియంత్రించే అధికారం ప్రజలకు, వారు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను తిరిగి అప్పగించాలి” అని తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించారు.

అరుదైన ఈ తీర్పు దేశాన్ని విభజించే రాజకీయ పోరాటాలకు అవకాశం కల్పించవచ్చు. పెన్సిల్వేనియా, మిచిగన్, విస్కాన్సిన్ వంటి రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ చట్టబద్ధత ఎన్నికలపై ఆధారపడి ఉంటుంది. మెయిళ్ల ద్వారా అబార్షన్ మందులను ఆర్డర్ చేయవచ్చా అనే అంశాల్లో కొత్త చట్టపరమైన పోరాటాలకు దారి తీయవచ్చు. ఒకవేళ రో వర్సెస్ వేడ్ కేసు రద్దు అయితే, రాజ్యాంగంలో అబార్షన్ హక్కును పొందుపరచాలని కాలిఫోర్నియా, న్యూ మెక్సికో, విచిగన్ రాష్ట్రాల గవర్నర్లు ఇప్పటికే ప్రణాళికలు రచించారు.

6వాయిస్: అమెరికన్ సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై మిశ్రమ స్పందన వినిపిస్తోంది. ప్రతీ ప్రాణానికి ఈ భూమిపై బతికే హక్కు ఉందని ఈ తీర్పు తమ విజయంగా రిపబ్లికన్లు ప్రకటించుకున్నారు. డెమొక్రాట్లు మాత్రం ఈ తీర్పుతో వ్యక్తిగత స్వేచ్ఛను హరించినట్లవుతుందని అభిప్రాయపడుతున్నారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సైతం ఈ తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అబార్షన్ అనేది మానవ హక్కుగానే ఉండాలని ట్వీట్ చేసిన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ దీనిపై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రకటించింది.

అమెరికాలో లక్షలాది మంది మహిళలు చట్టబద్ధంగా అబార్షన్ చేయించుకునే హక్కును కోల్పోయారు… దాదాపు 50 ఏళ్ళ కిందట అబార్షన్‌ను దేశవ్యాప్తంగా చట్టబద్ధం చేస్తూ వెలువడిన తీర్పును అమెరికా సుప్రీం కోర్టు కొట్టి వేసినప్పటి నుంచి మహిళల్లో కొత్త ఆందోళనలు మొదలయ్యాయి.. తాజాగా రిటైల్ ఫార్మసీల్లో ఇకపై అధికారికంగా అబార్షన్ పిల్స్‌ అందుబాటులోకి రానుండటం వారికి ఊరటనిస్తోంది..

Must Read

spot_img