ఒకసారి సైన్యం తలచుకుంటే ఎందుకూ పనికిరాని వ్యక్తి ప్రధాని అవుతాడు. సైన్యానికి నచ్చకపోతే అత్యంత దారుణంగా ఆ వ్యక్తి దిగిపోయి భ్రష్టుపట్టి పోతాడు. ఇది ఎక్కడో కాదు..దాయాది దేశం పాకిస్తాన్ లో జరుగుతుంది. నిజంగానే సైన్యం నిలిబెట్టిన బొమ్మ ప్రధాని మరెవరో కాదు..ఇమ్రాన్ ఖాన్. సైన్యం చెప్పినట్టు విన్నంత కాలం పదవిలో ఉన్నారు. జనాకర్షణ కాస్త పెరగడంతో సైన్యానికి వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టారు. అంతే..అంతా ఉల్టా ఫల్టా అయిపోయింది..
పాకిస్తాన్ 75 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ ఓ ప్రధాని తన పదవీకాలం సంపూర్ణంగా నిర్వహించింది లేదు. ఎప్పటికప్పుడు అర్ధాంతరంగా ఏదో కారణంతో దిగిపోయిన ప్రధానుల లిస్టు చాంతాడంత ఉంటుంది. ఆ లిస్టులో చివరివాడుగా ఇమ్రాన్ ఖాన్ నిలిచిపోతారు. సైన్యానికి వ్యతిరేకంగా వ్యవహరించిన కారణంగా పదవీచ్యుతుడయ్యారు. చివరకు తన వెంట జనం ఉన్నారని విర్రవీగడం మొదలుపెట్టారు ఖాన్.
దేశవ్యాప్తంగా జల్సాలు..అంటే ర్యాలీలతో హోరెత్తించారు. నిజంగానే పెద్ద ఎత్తున జనం ఆయన వెంట నడిచారు. తిరిగి ఎన్నికలు నిర్వహిస్తే తనదే గెలుపని ధీమాగా ముందుకు సాగారు ఇమ్రాన్ ఖాన్.. కానీ సైన్యం అనుమతి లేకుండా పాకిస్తాన్ లో రాజకీయ పావురాలు రెట్ట కూడా వేయలేవని మరోసారి రుజువైంది.
ఆయనను అష్టదిగ్బంధనం చేసిన సైన్యం ఇప్పుడు తనకు సంబంధించినవని చెబుతున్న అశ్లీల ఆడియోలను లీక్ చేయించింది. అంటే డైరెక్టుగా సైన్యం బయటకు రాకుండా అన్ని పనులు తెరవెనుక నుంచే నడిపిస్తోంది. ప్రస్తుతం ఇమ్రాన్ తన మిత్రురాళ్లతో జరిపిన ప్రైవేటు ఫోన్ కాల్స్ ను వరుసగా లీక్ అవడం మొదలైంది. ఇప్పటికి మూడు సార్లు ఇలా వచ్చిన ఆడియో లీకులు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.
ఒక్కసారిగా ఇమ్రాన్ ఖాన్ ప్రతిష్ట సోషల్ మీడియా పాలైపోయింది. అవి ఆయన గొంతుతో మార్ఫింగ్ చేసారని ఆయన పార్టీ సభ్యులు వాదించినా ఆ వాదనలకు పసలేకుండా పోతోంది. ఇప్పటికే ఆయన అధికారంలో ఉన్నప్పుడు అధికారిక పర్యటనల సందర్భంగా వచ్చిన బహుమతులను అమ్ముకున్నారు.
అలా డబ్బులు వెనకేసుకున్నారన్న ఆరోపణ కేసులతో ఇకపై ఎన్నికలలో పోటీ చేసే అర్హత కోల్పోయారు ఇమ్రాన్ ఖాన్. ఇప్పుడు మరింత దారుణంగా క్యారెక్టర్ అసాసినేషన్ కూడా నిర్విఘ్నంగా జరిగిపోయింది. పాకిస్తాన్ లో ఏ నలుగురు కలసినా ఇమ్రాన్ ఖాన్ ఆడియో లీకుల గురించే చర్చించుకుంటున్నారు. లీకైన ఆడియో క్లిప్‌లో ఇమ్రాన్ ఉద్దేశపూర్వకంగా ఒక మహిళను తన వద్దకు రమ్మని అడిగాడు.
మహిళ నిరాకరించగా, ఇమ్రాన్ తాను చెప్పినట్లే చేయాలని పట్టుబట్టాడు. దానికి ఆ మహిళ స్పందిస్తూ, మాట్లాడిన మాటలు అశ్లీలంగా ఉన్నాయి. తానో ప్లేబాయ్ నని ఎప్పుడూ భావించే ఇమ్రాన్ ఖాన్ కు పాకిస్తాన్ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. దానికి తోడు పాకిస్తాన్ కు క్రికెట్ లో వరల్డ్ కప్ సాధించిపెట్టిన ఘనత ఉంది.
అయితే ఆయన పార్టీ అయిన పిటిఐ నేతలు మాత్రం అవి ఫేక్ వీడియోలని కొట్టి పడేస్తున్నారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై సైనిక వ్యవస్థ కుట్ర పన్నిందని, దానిలో భాగమే ఈ ఆడియో క్లిప్పులని ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నంగా అభివర్ణించారు. ఇమ్రాన్ ను ఎదుర్కొవడానికి ఇటువంటి నకిలీ ఆడియో టేపులు మరియు వీడియోలను స్పష్టించడం మినహా మరింకేమీ చేయలేరని వారు విమర్శిస్తున్నారు.
ఆ ఆడియో క్లిప్ లను రెండు పార్ట్ లుగా పాక్ జర్నలిస్ట్ సయ్యద్ అలీ హైదర్ తన యూట్యూబ్ చానెల్ లో షేర్ చేశారు. ఆ క్లిప్స్ కొద్ది సేపట్లోనే వైరల్ అయి, పాకిస్తాన్ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాయి. మహిళతో అసభ్యంగా, అసహ్యంగా మాట్లాడుతున్నట్లుగా ఆ క్లిప్స్ లో ఉంది.
ఆ వ్యక్తి గొంతు ఇమ్రాన్ ఖాన్ దేనని అంతా భావిస్తున్నారు. ఈ రెండు ఆడియో క్లిప్స్ లో ఒకటి పాతదేనని, మరొకటి ఇటీవలి ఆడియో అని చెబుతున్నారు. రెండో ఆడియోలో, ఆ యువతిని తనకు దగ్గరగా రావాలని ఇమ్రాన్ కోరుతున్నట్లు, అందుకు ఆ యువతి నిరాకరిస్తున్నట్లుగా, దాంతో, ఇమ్రాన్ ఆమెను దగ్గరకు రావడానికి ఒత్తిడి చేసినట్లుగా ఉంది.
ఆ తరువాత కాసేపటికి, ఆరోగ్యం బాగాలేదని, ఆరోగ్యం సహకరిస్తే మర్నాడు వస్తానని ఇమ్రాన్ తో ఆమె చెప్పడం వినిపిస్తుంది. ఆమె వస్తానంటే తన ష్కెడ్యూల్ ను మార్చుకుంటానని అనడం అందులో స్పష్టంగా ఉంది. ఆయనపై వరుసగా ఆడియో క్లిప్ లు విడుదల అవుతున్నాయి. ఇమ్రాన్ పై అధికార పార్టీ, ఆర్మీ కలిసి చేస్తున్న కుట్రలో భాగమే ఈ ఆడియో క్లిప్ లని పీటీఐ, ఇమ్రాన్ ఖాన్ ఆరోపిస్తున్నారు.