Homeసినిమాఆకట్టుకుంటున్న ‘సోల్ ఆఫ్ వారసుడు’..!

ఆకట్టుకుంటున్న ‘సోల్ ఆఫ్ వారసుడు’..!

దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ల భారీ అంచనాల చిత్రం వారసుడు సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌లో విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌తో దూసుకుపోతోంది.తాజాగా సోల్ ఆఫ్ వారసుడు పేరుతో థర్డ్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్.

టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దళపతి విజయ్ హీరోగా తెరకెక్కి సినిమా వారసుడు. ఈ బైలింగువల్ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించగా.. సంక్రాంతి కానుగా రిలీజ్ కానుంది. థమన్ మ్యూజిక్ అందించిన మూవీ నుంచి విడుదలైన రెండు పాటలు వైరల్ కాగా.. తాజాగా సోల్ ఆఫ్ వారసుడు పేరుతో థర్డ్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ లిరికల్ వీడియోకు వర్ణించలేని ఆప్యాయత, వెలకట్టలేని ప్రేమ కలిగిన తల్లులందరికీ అని క్యాప్షన్ కూడా యాడ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా సీనియర్ గాయని చిత్ర పాడారు. నిజంగా ఆమె గొంతు నుంచి ఈ పాట వింటుంటే ఎవరికైనా ఖచ్చితంగా తమ తల్లి పాడిన ఫీలింగ్ వస్తుందనడంలో సందేహం లేదు.

అమ్మమ్మో నేనేమి వింటినమ్మా.. వాకిళ్ల నిలిచింది వాస్తవమా అంటూ సాగింది పాట. అయితే ఎన్నాళ్లుగానో కొడుకు కోసం ఎదురుచూస్తున్న తల్లికి ఒక్కసారిగా కొడుకు ఎదురపడితే పలికే భావాలకు ఈ లిరిక్స్ అద్దం పట్టినట్లుగా ఉన్నాయి. పైగా ఈ లిరికల్ వీడియోలో చూపించిన విజువల్స్‌లో విజయ్ సిటీ నుంచి ఊరికి తిరిగొచ్చి తల్లిని కలుసుకున్నట్లు చూపించగా.. ఆమె ఆనందంతో తన భావాలను పాట రూపంలో వెల్లడించినట్లు తెలుస్తోంది. అమ్మ పాటకు ఎప్పుడు
సినిమాలో ప్రత్యేకమే. నాటి విఐపీ సినిమాలోని సాంగ్ అయినా…. ఇటివల వచ్చిన శర్వానంద్ సినిమాలోని సాంగ్స్ కి మంచి గుర్తింపు తెచ్చాయి.

సంక్రాంతి కానుకగా జనవరి 12న వారసుడు చిత్రం తమిళ్, తెలుగు భాషల్లో విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు తెలుగులో బాలకృష్ణ వీరసింహారెడ్డి, చిరంజీవి వాల్తేర్ వీరయ్య చిత్రాల నుంచి పోటీ ఎదురుకానుంది. ఇదిలా ఉంటే.. టాలీవుడ్ స్టార్ హీరోలను కాదని తమిళ హీరో విజయ్‌ర మూవీకి ఎక్కువ థియేటర్లు కేటాయించడంపై ఇండస్ట్రీ వర్గాలు ప్రొడ్యూసర్ దిల్ రాజుపై గుర్రుగా ఉన్నారు. కాగా.. బిజినెస్ టైకూన్ కొడుకు అయిన ఓ యువకుడి జీవితం చుట్టూ ఈ చిత్ర కథ తిరుగుతుంది. కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో అతను తండ్రి వ్యాపార సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటాడని తెలుస్తోంది.

Must Read

spot_img