Homeఅంతర్జాతీయంటర్కీ పరిస్థితి భారత్ కి వస్తే..తట్టుకుంటుందా..?

టర్కీ పరిస్థితి భారత్ కి వస్తే..తట్టుకుంటుందా..?

టర్కీ భూకంప వేళ .. భారత్ లోనూ ఎర్త్ క్వేక్ వస్తే, తట్టుకోగలమా అన్న ప్రశ్న భారతీయుల్ని టెన్షన్ పెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా సాగుతోన్న భూకంపాలు.. భారత్ లోనూ రావచ్చన్న నివేదికలు.. చర్చనీయాంశమవుతున్నాయి. ఒకవేళ అదే పరిస్థితి వస్తే, భారత్ ఎంతమేరకు ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉందన్న చర్చ నిపుణుల్లో వెల్లువెత్తుతోంది.

భారత్ లో మరీ ముఖ్యంగా నార్త్ ఇండియాలో సాగుతోన్న కంపనాలు.. యావత్ దేశాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఈ తరుణంలో భారత్ కు భూకంపాల ముప్పు పొంచి ఉందన్న నిపుణుల అంచనాలు సర్వత్రా చర్చనీయాంశంగా మారుతున్నాయి. టర్కీ పరిస్థితి భారత్ కు వస్తే, ఏమేరకు తట్టుకోగలదన్న చర్చ కీలకంగా మారింది.

టర్కీ భూకంపాలను చూసిన భారత దేశ ప్రజలకు.. ఇండియా సేఫేనా అనే డౌట్ వస్తోంది. దీనిపై భూగర్భ నిపుణులు… సౌత్ ఇండియా సేఫే గానీ..నార్త్ ఇండియా మాత్రం సేఫ్ కాదు అంటున్నారు. అందుకు ప్రత్యేక కారణాన్ని వారు చెబుతున్నారు. వీరి అంచనా ప్రకారం ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలో దాదాపు ప్రతి పదేళ్లకు ఓసారి చిన్నదో, పెద్దదో భూకంపం వస్తుంది. అలా వచ్చినప్పుడు భూమి లోపల ఏళ్లుగా పోగై ఉన్న పీడనం బయటకు పోతుంది. ఈ పీడనమే సిస్మిక్ తరంగాలుగా చెబుతారు. మన దేశంలోని హిమాలయాల్లో గత 50 ఏళ్లుగా భారీ భూకంపం ఏదీ రాలేదు.

కానీ భూమి లోపల ఫలకాల కదలిక జరుగుతూనే ఉంది. దీనివల్ల ఉత్పన్నమైన పీడనం బయటకు రాకుండా లోపలే ఉంది. అది వచ్చే పదేళ్లలో ఎప్పుడైనా వచ్చే ప్రమాదం ఉందని భూకంప పరిశోధకులు అంటున్నారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్ లోని జ్యోషిమఠ్ కుంగిపోతోంది కాబట్టి.. అక్కడ భూకంపం వచ్చే ఛాన్స్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. హిమాలయ పరిసర ప్రాంతాల్లో పీడనం బయటకు వచ్చే ప్రమాదం పొంచి ఉందన్నది గతంలోనే శాస్త్రవేత్తలు చెప్పారు.

అయితే 1897, 1905, 1934, 1950లో హిమాలయాల చుట్టుపక్కల ప్రాంతంలో తీవ్ర భూకంపాలు సంభవించాయి. 1934 తర్వాత నేపాల్‌, ఉత్తరాఖండ్‌ ప్రాంతాల్లో పెద్ద భూకంపం ఏదీ రాలేదు. అందువల్ల భూమి లోపల ఉన్న పీడనం ఏదో ఒక రోజు పైకి రాక తప్పదు. అప్పుడు భారీ భూకంపం వచ్చే ప్రమాదం ఉంది. టెక్నాలజీ వల్ల.. భూకంపాలు ఉత్తరాదిన ఎక్కువగా వస్తున్న విషయం తెలుస్తోంది. కానీ రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం.. భూకంపాలను తట్టుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలేవీ తీసుకోవడంలేదు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఇళ్లన్నీ.. భూకంపం వస్తే కూలిపోయేవే తప్ప.. తట్టుకునే టెక్నాలజీతో వాటిని నిర్మించలేదు.

  • ఇండియాలో భారీ భూకంపం వస్తే.. ప్రాణ, ఆస్తి నష్టం కూడా అంతేస్థాయిలో ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు..

మరి ఇలాంటి భారీ భూకంపం భారత్ లో వస్తే! దాన్ని ఎదుర్కోవడానకి దేశం సిద్ధంగా ఉందా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే భారత ఉపఖండంలో ఇప్పటికే భూకంపాలు వచ్చిన చరిత్ర ఉంది. భవిష్యత్తులోనూ ఈ విపత్తు సంభవించే అవకాశం ఉందని నిపుణులు గుర్తించారు. మరి
టర్కీలో సంభవించిన లాంటి భారీ విపత్తు మనకూ వస్తే దాన్ని ఎంతవరకు ఎదుర్కోగలమన్నదే ఇప్పుడు సర్వత్రా చర్చకు దారి తీస్తోంది.

ఇదిలా ఉంటే, టిబెట్ పీఠభూమి ఎత్తును కొనసాగిస్తూ.. భారత ప్లేట్ సుమారుగా ఏడాదికి 47 మి.మీ చొప్పున ఆసియాలోకి వెళ్తోంది. ఇది హిమాలయ, ఆల్టిన్ టాగ్, టియన్ షాన్ పర్వతాలను విచ్ఛిన్నం చేస్తుంది. దీన్ని బట్టి భారతదేశం భూకంపాలను ఎదుర్కోనుందని ఓ నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం ఆసియా, ఇంకా భారత్ లోని కొన్ని ప్రాంతాల్లో స్థిరమైన, అనూహ్యమైన భూకంపాలు వచ్చే అవకాశం ఉంది. ఇక గతంలోనే హిమాలయ రీజియన్ లో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని, దీనికోసం భారత్ సిద్ధంగా ఉండాలని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.

భారత్, యురేషియన్ ప్లేట్ ల మధ్య ఘర్షణ ఫలితంగా హిమాలయాల్లో భూకంపాలు సంభవించవచ్చని వీరు వెల్లడించారు. అయితే భూకంపం ఎప్పుడు వస్తుందో అంచనా వేయలేమని, తదుపరి క్షణం, వచ్చే నెల, లేదా 100 తర్వాతైనా భూకంపాలు రావచ్చని వీరంతా స్పష్టం చేస్తున్నారు. ఇక భారతదేశంలో గత 150 ఏళ్లలో హిమాలయ ప్రాంతంలో 4 భారీ భూకంపాలు వచ్చాయి. 1897లో షిల్లాంగ్‌లో, 1905లో కాంగ్రాలో, 1934లో బీహార్-నేపాల్‌లో, 1950లో అస్సాంలో భూకంపాలు వచ్చాయి.

భారతదేశం అనేక శక్తివంతమైన భూకంపాలను చూసింది. కానీ వాటిలో అత్యంత ఘోరమైన వాటిలో ఒకటి 2001 నాటి భుజ్ భూకంపం, ఇది భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో, పాకిస్తాన్ సరిహద్దులో సంభవించింది. దీని వల్ల 20వేల మందికి పైగా మరణించారు. 150,000 మందికి పైగా గాయపడ్డారు, వేల మంది నిరాశ్రయులయ్యారు. అయితే దీన్నుంచి భారత్ గుణపాఠం నేర్చుకుందా? అన్నదే కీలకంగా మారింది. భారత్ భూకంప ప్రూఫ్ బిల్డింగ్ పాలసీని కలిగిఉంది. భూకంప శాస్త్రవేత్తలు భారతదేశంలోని 59 శాతం భూభాగాన్ని వివిధ పరిమాణాలలో భూకంపాలకు గురయ్యే అవకాశం ఉందని వర్గీకరించారు.

అత్యంత అధిక-రిస్క్ జోన్ లో 11 శాతం, హై-రిస్క్ జోన్ లో 18 శాతం, మోడరేట్-రిస్క్ జోన్‌లో 30 శాతం భూకంప ప్రభావిత ప్రాంతం ఉంది. భారీ భూకంపాలు ఆస్తి, ప్రాణాలకు అధిక స్థాయిలో విధ్వంసం కలిగిస్తాయి. అందువల్ల, భవనాలు, ఇళ్లు, ఇతర మౌలిక సదుపాయాలను నిర్మించేటప్పుడు కొన్ని మార్గదర్శకాలను అనుసరించాలని ప్రభుత్వం సూచిస్తోంది. నిర్మాణాల రూపకల్పన, భవనాల నిర్మాణం, మట్టి భవనాల భూకంప నిరోధకతను మెరుగుపరచడం, భవనాల మరమ్మతు, భూకంప పటిష్టతపై సూచనలు చేస్తుంది.

భారత్ లో చాలావరకు ఈ మార్గదర్శకాలను అనుసరించే నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే వందశాతం జరుగుతున్నాయా లేదా అనేది తెలియదు.
జనాభా ఎక్కువగా ఉండే ముంబయి, దిల్లీ లాంటి నగరాల్లో ఈ మార్గదర్శకాలను ఎంతవరకు పాటిస్తున్నారో అన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకమేనని వీరంతా అంటున్నారు. అయితే ప్రభుత్వం ప్రమాణాలను కొందరు పట్టించుకోవడం లేదు. భూకంపాలను తట్టుకునేలా రెట్రోఫిట్టింగ్‌ ద్వారా పాత భవనాలను మరింత దృఢంగా చేసే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

  • భారత్‌లోనూ భూప్రకపంనల లెక్కలు ఇటీవలి కాలంలో పెరుగుతూనే ఉన్నాయి..

అన్నింటికీమించి హిమాలయాలు ఎప్పుడైనా కదిలిపోవచ్చనే అంచనాలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. హిమాలయాలు కంపిస్తే 8లక్షల మంది ప్రాణాలు కోల్పోవాల్సిందేనా? అన్నది సర్వత్రా భయాందోళనల్ని కలిగిస్తున్నాయి. 2020 నుంచి ఎదురవుతున్న పరిస్థితులు మాత్రం కాస్త ఆందోళన కలిగించేవిగానే కనిపిస్తున్నాయి. ఇండోనేషియా, టర్కీ, నేపాల్, సోలొమన్ ఐలాండ్స్, మెక్సికో అంటూ రోజుకో చోట వచ్చే భూ ప్రకంపనలు లెక్కకుమించిన ప్రాణాలను
మింగేస్తున్నాయి. ఈ ప్రకంపనలన్నీ ఎక్కడో జరుగుతున్నవే అనుకోడాని లేదు. ఎందుకంటే భారత్‌లోనూ ఇటీవలి కాలంలో భూమి కంపిస్తోంది.

దేశ రాజధాని సహా మేఘాలయా లాంటి ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో మనమంతా ప్రమాదంలో ఉన్నామనే అనుమానాలకు
బలం చేకూరుతోంది. మరోవైపు ఇటీవలి కాలంలో భారత్‌లో కూడా వరుస భూప్రకంపనలు చోటుచేసు కుంటున్నాయి. ఇవి కూడా తక్కువ తీవ్రతతోనే నమోదవుతున్నప్పటికీ రిలాక్స్ అవ్వడానికి లేదని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే భవిష్యత్‌లో మరిన్ని భూకంపాలు సంభవించడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రధానంగా హిమాలయాల్లో భారీ భూకంపం వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఒకవేళ హిమాలయ పర్వత శిఖరాల్లో సంభవించే భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్ పై 8 పాయింట్లు నమోదైతే కనుక సుమారు ఎనిమిది లక్షల మంది ప్రాణాలకు
ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని ఎక్స్‌పర్ట్స్‌ అంచనా. హిమాలయ పర్వశ్రేణులకు ఆనుకుని ఉండే రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణచల్ ప్రదేశ్
రాష్ట్రాల్లో గత 53ఏళ్లలో భూకంప తీవ్రత చాలా ఉధృతంగా ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా భూకంపాల విషయంలో మరింత అలర్ట్‌గా ఉండాల్సిన టైం
వచ్చినట్టే కనిపిస్తోంది.

రానున్న కాలంలో భారత్ లో భూకంపం రావచ్చని, అదీ తీవ్రస్థాయిలో ఉండవచ్చని శాస్త్ర్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా హిమాలయ రీజియన్ లో భూ కుంగుబాటు వేళ మరింత ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు.

Must Read

spot_img