ఇండియాలో రేసింగ్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు ఫార్ములా ఈ రేస్ ముగిసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్లో రేసర్లు అదరగొట్టారు. భాగ్యనగరంలోని హుస్సేన్ సాగర్ తీరాన జరుగుతున్న ఈ రేసింగ్ ను చూడటానికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు వచ్చారు. ఫార్ములా-ఈ రేస్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ విజేతగా జీన్ ఎరిక్ వెర్గ్‌నే నిలిచాడు. ఆ తర్వాత రెండో స్థానంలో నిక్ క్యాసిడీ, మూడో స్థానంలో సెబాస్టియన్ బ్యూమి ఉన్నారు. గంటకు 322 కిలోమీటర్ల వేగంతో రేసర్లు దూసుకెళ్లారు. కాగా జీన్ ఎరిక్ ఇప్పటికే రెండుసార్లు ఫార్ములా- ఈ ఛాంపియన్ కావడం విశేషం. తాజా విజయంతో అతను మూడోసారి ఛాంపియన్‌గా అవతరించాడు.
అయితే ఈ పోటీలను వీక్షీంచేందుకు పలువురు క్రికెటర్లు కూడా వచ్చారు. రేసింగ్ జరుగే ప్రాంతానికి చేరుకుని సందడి చేశారు. ప్రముఖ క్రికెటర్స్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, మంత్రి కేటీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రికెటర్ శిఖర్ ధావన్, మహేశ్ తనయుడు గౌతమ్‌లతో పాలు పలువురు రేసింగ్ ను చూసేందుకు హాజరైయ్యారు. వారిని చూసేందుకు ఫ్యాన్స్ పోటీపడ్డారు. రేస్ కోసం హుస్సేన్ సాగర్ నడిబొడ్డున ఉన్న ఎన్టీఆర్ మార్గ్ లో సుమారు 2.8 కి.మీ. పొడవైన ట్రాక్ ని రెడీ చేసారు. సుమారు 20 వేల మంది ప్రేక్షకులు ఈ రేస్ ను కూర్చుని వీక్షించేలా నిర్వాహుకులు ఏర్పాట్లు చేశారు.