Homeఅంతర్జాతీయంమనుషుల మధ్య పెరుగుతున్న దూరం వల్ల జబ్బులకు కారణం అవుతున్నారు !!!

మనుషుల మధ్య పెరుగుతున్న దూరం వల్ల జబ్బులకు కారణం అవుతున్నారు !!!

నానాటికీ మనుషుల మధ్య పెరుగుతున్న దూరం..మనిషి మట్టి నుంచి విడిపోయిన జీవితం మానవాళికి సోకుతున్న అనేక జబ్బులకు కారణమౌతోందని అంటున్నారు శాస్త్రవేత్తలు. భూమికి ఆనుకుని ఉండే జీవితం ఇప్పుడు ఆకాశాన్నంటే అంతస్థుల్లో కొనసాగుతోంది. సహజసిద్ధంగా భూమ్యాకర్షణ శక్తి ద్వారా శరీరానికి లభించే శక్తిని కూడా మనిషి కోల్పోయాడు. అంతెందుకు మన చరిత్ర ఏంటో మనం ఎక్కడి నుంచి వచ్చామో ఒకసారి తెలుసకుంటే ఆ రహస్యం అర్థం చేసుకోవచ్చు. బహుషా మీరు, మీ నాన్నగారు, మీ తాతగారు..ఆపై చాలా తక్కువ మందికి ముత్తాత గురించి తెలిసి ఉంటుంది.

కానీ మనిషి జీవితం అక్కడితో మొదలవలేదు..మీతో ఆగిపోనూ లేదు..భూమిపై మనిషి జన్మించి నలబై లక్షల సంవత్సరాలు పూర్తయిందని పరిశోధనలు చెబుతున్నాయి. ఉదాహరణకు వందేళ్లకు మూడు తరాలు అనుకుంటే..మీకు ఒక కోటీ ఇరవై లక్షల మంది పూర్వీకులు లేదా వంశస్తులు ఉండి తీరాలి. ఎందుకంటే మీరు జీవించే ఉన్నారు కాబట్టి అంతటి ఘన చరిత్ర మీకు ఉందన్నట్టే.. అంత గొప్ప చరిత్ర మీది.. ఎక్కడైనా పూజలు జరుగుతున్నప్పుడు పూజారి మీనాన్న, తాత, ముత్తాత వరకు మాత్రమే పేర్లడుగుతారు. కానీ ఆ ముత్తాతకో నాన్న, ముత్తాతకు తాత, ముత్తాతకో ముత్తాత కూడా తప్పక ఉండేవారన్నది నిజం.. అంటే మన చరిత్ర అంత మామూలుది కాదని అంగీకరించాలి.

నిజానికి మనిషి గత అయిదు వేల సంవత్సరాల క్రితం దాకా అడవుల్లోనే జీవించాడు. అంటే మన పూర్వీకుల్లో ఒక కోటి 19 లక్షలా ఎనబై అయిదు వేల మంది అడవిలోనే జీవించారు. చివరి 15 వేల తరాల వారు మాత్రమే గ్రామాల్లో గుడిసెలు వేసుకుని బతికారు. అడవుల్లో నివాసం అంటే ప్రక్రుతితో సహవాసం అన్నమాట..అంటే చెట్లు చేమలు జంతువులతో పాటు జీవించడం..అయితే మనిషి ఎప్పుడైతే గ్రామాల్లో జీవించడం మొదలుపెట్టాడో చెట్టు, పుట్ట, పురుగు, పక్షులు, జంతువులకు దూరం అయ్యాడు. ఈ నేపథ్యంలో మరోసారి ప్రస్తుత స్థితికి వద్దాం.. మీరు మీనాన్న కోటి ఇరవై లక్ష తరాలలో చివరి ఒకటి లేదా రెండవ తరాలుగానే చెబుతున్నారు పరిశోధకులు.

మరి మన లాగే మన భూమిపై పుట్టినవారికి ఉన్న ఆరోగ్యం మనకెందుకు లేదు..? దానికో సిద్ధాంతం రూపొందించారు ఆధ్యయనం చేసిన పరిశోధకులు. నాడు జంతువులు, చెట్ల మధ్య అడవుల్లో బతుకుతున్నప్పుడు వేలాది సూక్ష్మజీవులు మనిషి శరీరాన్ని తాకేవి. ఆ జీవుల్లో మనిషి దేహానికి మంచి చేసేవి, చెడు చేసేవి కూడా ఉంటాయి. ఇప్పుడు మనం ఆధునిక విజ్నానం ఆధారంగా, పరికరాల కారణంగా అవేంటో తెలుసుకుంటున్నాం. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అందుబాటులోకి వచ్చిన తర్వాత బాక్టీరియా, వైరస్ ల గురించి తెలుసుకుంటున్నాం….

మరి మొదటి ఒక కోటి పందొమ్మిది లక్షా తొంబై తొమ్మిది వేల తొంబై ఎనిమిది తరాల సంగతి ఏంటి..? ఆనాటి కాలంలో ఇవి మంచి బాక్టీరియా, దేహానికి కీడు చేసేవని ఎవరు నేర్పించారు..?

నిజానికి ఈ విషయం ఎవరూ చెప్పనక్కర్లేదు. మానవాళిని స్రుష్టించిన ప్రక్రుతి ఆ ఏర్పాటు చేసింది. ప్రతీ మనిషి దేహంలో రక్షణ వ్యవస్థ లేదా ఇమ్యూనిటీ సిస్టం డెవలప్ అయ్యేలా చేసింది. కాల గమనంలో మ్యుటేషన్, డైరెక్షనల్ నాచురల్ సెలక్షన్ అనే విధానాలు, పరస్పర చర్యల ద్వారా బలమైన ఇమ్యూనిటీ వ్యవస్థ ఏర్పడింది. బలమైన ఇమ్యూనిటీ ఉంటే బతుకుతారు..లేదంటే చచ్చిపోతారు. మనమంతా అలా బతికిబట్ట కట్టినవాళ్లమే..మనం ఇంత ఆరోగ్యంగా ఉన్నామంటే అది ప్రక్రుతి ప్రసాదించిన వరంగానే అనుకోవాలి.

మనలోని ఇమ్యూనిటీ సిస్టం చుట్టు పక్కల సూక్ష్మజీవులతో కలసి జీవించేలా ఏర్పడింది. సూక్ష్మజీవుల్లో మనకు మంచి చేసేవిగా కూడా ఉంటాయి. మన దేహంలో ముప్పై ట్రిలియన్ల కణాలు ఉంటాయనీ, శరీరంలో అందుకు పది రెట్లు అదనంగా.. అంటే.. మూడు వందల ట్రిలియన్ల బాక్టీరియాలు ఉన్నాయని సైంటిస్టులు చెబుతున్నారు. అవి మన దేహం ఆరోగ్యంగా ఉండేందుకు అవసరం. అవి లేకుండా మనం బతకలేం.. ఒక వంతు మనమైతే పది వంతులు ఈ సూక్ష్మజీవులుగానే ఉంటాయి.. అలాగని అన్ని సూక్ష్మజీవులు మంచి చేసేవి కావు..మనిషికి నష్టం చేసే సూక్ష్మజీవులు కూడా ఉంటాయి వాటిని మనలో ఉండే సహజసిద్ధమైన రక్షణ వ్యవస్థ నిర్మూలిస్తుంది.

అయితే ఆ వ్యవస్థ పనిచేయాలంటే దానికి పుట్టినప్పటి నుంచే శిక్షణ జరగాలి.. మన శరీరంలోకి వైరస్ వస్తే టీకాలు వేయడం ద్వారా శరీరానికి దాన్నెలా నిర్మూలించాలో నేర్పించినట్టే ఇది కూడా జరుగుతుంది. అసలు తల్లి గర్భం నుంచి జననద్వారం నుంచి బయటకు వస్తుంటే తల్లి ప్రసవ వేదన పడుతుంది. ఆ సమయంలో జననద్వారం వద్దే హానికారక సూక్ష్మ జీవులు బిడ్డపై దాడికి దిగుతాయి. బిడ్డ ఇంకా భూమిపై పడకముందే సూక్ష్మజీవులతో పోరాటం అక్కడే మొదలవుతుంది. ఆ పోరాటం నుంచే శరీరంలో ఇమ్యూనిటీ వ్యవస్థ రూపొందుతుంది. అయితే ఇప్పుడు వైద్యవిజ్నానం వికసించింది. ఇప్పటి తల్లులకు ప్రసవవేదన, కాన్పు సమయంలో నొప్పుల గురించి తెలియదు. పైగా వాటిని ఓర్చుకోలేకపోతున్నారు. దాంతో వైద్యులు నేరుగా పొట్టను కోసి బిడ్డను బయటకు తీసేస్తున్నారు. దాన్నే సిజేరియన్ అంటున్నాం.. ఇదంతా నిముషాలలోనే జరిగిపోతోంది.

దీంతో బిడ్డకు సూక్ష్మజీవులతో అసలు పరిచయం ఉండటమే లేదు. బిడ్డకు ఇమ్యూనిటీ వ్యవస్థ లేకుండానే జన్మిస్తున్నారు. అంటే వారు ఇమ్యునిటీ లేని అంగవైకల్యంతో పుట్టినట్టు అనుకోవాలి. పుట్టిన వెంటనే బిడ్డకు తల్లి చనుపాలు ఇస్గుంది. ఆ పాలలో మంచి సూక్ష్మజీవులు, చెడు చేసే సూక్ష్మజీవులు కూడా ఉంటాయి. అక్కడే బిడ్డకు మరో ఇమ్యూనిటీ వ్యవస్థ ఏర్పడుతుంది.

ఆ సమయంలో తల్లి ఇచ్చి మొర్రిపాలు రెండు దశాబ్దాల దాకా గట్టి శక్తినిచ్చేవిగా ఉంటాయి. కానీ పుట్టగానే డబ్బా పాలు పట్టే ఈ వ్యవస్థలో వారికి సూక్ష్మజీవులు లేని పాలను అందిస్తున్నాం. అంటే ఇక్కడ కూడా ఇమ్యునిటీ వ్యవస్థతో సంబంధం లేకుండా చేసేస్తున్నాం. ఆపై వారిపై రోగాల దాడి మొదలవగానే శిశువులు తేలికగానే ఓడిపోతారు. ఎందుకంటే వారి శరీరానికి చిన్నప్పుడే ఎదుర్కునేందుకు అవసరమయ్యే శిక్షణ లోపించింది. దేహం పోరాటానికి రెడీగా ఉండదు. ఇదే అసలైన వాస్తవం.. మరోసారి మన ముందు తరాలకు వెళితే..మనం పుట్టింది మట్టిలో, పెరిగింది మట్టిలో, బతుకంతా మట్టితోనే గడచిపోయింది. మనం నిజంగా మట్టి మనుషులం.. అలా మట్టితో మమేకపైనప్పుడు ప్రతీ నిముషం ప్రతీరోజు సూక్ష్మజీవులు మన శరీరంలోకి వెళ్లాయి. దాంతో శరీరం గట్టిపడింది. ఎవరు అవునన్నా కాదన్నా మానవాళి చరిత్రలో ఇదే జరిగింది.

మరి ఇప్పుడేం జరుగుతోంది..ఆపరేషన్ థియేటర్లలో ఎక్కడా సూక్ష్మజీవి అన్నదే లేకుండా రసాయనాలు ఉపయోగించి క్లీన్ చేస్తున్నారు. వైద్యసిబ్బంది మాస్కులుపెట్టుకుని గ్లౌజులు వేసుకుని స్టెరిలైజ్ చేయబడిన పరికరాలతో సిజేరియన్లు చేసేస్తున్నారు. బిడ్డలను నిముషాలలోనే బయటకు తీసి రసాయనాలతో శుభ్రం చేసేస్తున్నారు. ఆపై డబ్బా పాలు, బిడ్డకు సంవత్సరం నిండేదాకా చాలా శుభ్రమైన ఆహార నియమాలు, పరిశుభ్రమైన నీరు తాగిస్తున్నారు.. బిడ్డను ససేమిరా బయటకు పంపించడం లేదు. వారికి సూర్యరశ్మి పడనీయడం లేదు.. ఫ్రిజ్ నుంచి తీసిన ఆహారం తినిపిస్తున్నారు. స్టెరిలైజ్ చేసిన పాలు తాగిస్తున్నారు..మట్టితో ఆడే ఆటలకు దూరం పెడుతున్నారు. వెనకటి ఇసుక గూళ్ల కట్టడాలు నేర్పించడం లేదు.

అంతా 21వ సెంచరీలో జీవిస్తున్నారు. ఇదే మోడర్న్ వరల్డ్ గా భావిస్తున్నాం..మన శతాబ్దాల క్రితం చరిత్రంతా సూక్ష్మజీవులతోనే గడచిపోయింది. కానీ ఇప్పుడు మాత్రం నిత్యం మనం తిరిగే అన్ని ప్రాంతాలు కాంక్రీటు జంగిల్ గా మారిపోయాయి. దుమ్ము, ధూళి, గడ్డి, బంకమట్టి, తోటలో పుప్పొడి రేణువులు, పాలు, వేరుశెనగ కాయలు దూరమైపోయాయి. ఇవి కూడా మంచివని మన శరీరానికి తెలియాలి. తెలియాలంటే వాటితో ఇంటరాక్ట్ కావాలి. లేదంటే శరీరం అయోమయంలో పడుతుంది. దేంతో పోరాడాలో దేన్ని ఆహ్వానించాలో తెలియకుండా పోయి అనారోగ్యం బారిన పడుతుంది. అందువల్లే శరీరంలో జబ్బులు వస్తున్నాయి.. ఎలర్జీ, ఫుడ్ ఎలర్జీ, స్కిన్ ఎలర్జీల్లాంటివి వస్తే తప్పెవరిది..మనదే అవుతుంది. వాటిని శరీరానికి పరిచయం చేయనందుకు తప్పు మనదే అవుతుంది.

అంటే నాగరికత మనకు నేర్పించిన శుభ్రతే మనకు హానికరం అవుతోందని తాజా పరిశోధనలు తేల్చి చెబుతున్నాయి. అంటే మనం మళ్లీ అడువుల్లోకి వెళ్లాలని, పచ్చి మాంసం తినాలని ఇండెప్త్ సలహా ఇవ్వడం లేదు..మనం ఏం చేయడం ద్వారా ఏం కోల్పోతున్నామో గుర్తు చేస్తోంది. దాన్ని ఎలా అన్వయించుకోవాలన్నది మీ విజ్నతే మీకు చెబుతుంది..

Must Read

spot_img